Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మా ప్రథమ ప్రాధాన్యం రైతులే

-అందుకే రైతు సంక్షేమానికి వేల కోట్లు -అన్నదాతలకు జీవిత బీమా దండుగైతే.. కాంగ్రెస్ నేతలకు బీమా ఎందుకు? -పేద రైతులకు భరోసా.. కాంగ్రెస్‌కు ఇష్టంలేదు -రైతుకు ఇప్పుడు న్యాయం జరుగకపోతే ఇంకెప్పుడూ జరుగదు.. -వ్యవసాయశాఖ మంత్రి శ్రీ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

రైతుల చేతులకున్న పదివేళ్లు భూమిలోకి పోతేనే.. ప్రజల నోళ్లలోకి ఐదు వేళ్లు వెళ్తాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. సమాజంలో రైతులు తలెత్తుకొని బతుకాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమన్నారు. ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం రైతులేననని, అందుకే రైతు సంక్షేమానికి వేలకోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు సామూహిక జీవిత బీమా పథకంపై అవగాహన సదస్సులకు సోమవారం కరీంనగర్‌లో శ్రీకారంచుట్టిన సందర్భంగా ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడారు. రాష్ట్రంలో చేపడుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని మరే రాష్ట్రంలో అమలుకావడంలేదని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా రైతులు తెలంగాణవైపు చూస్తున్నారని, వ్యవసాయరంగంలో ఇక్కడ అమలవుతున్న పథకాలను తెలుసుకోవడానికి వస్తున్నారని తెలిపారు. ఇదీ ఇంటర్వ్యూ సారాంశం.. కేంద్ర మంత్రులూ మెచ్చుకున్నారు..

రైతుబంధు పథకం గురించి కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్, రాధామోహన్‌సింగ్ తదితరులకు వివరించినపుడు ఆశ్చర్యపోయారు. ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఎన్నిరోజుల్లో తిరిగి కట్టించుకుంటారని అడిగారు. రూపాయి కూడా ప్రభుత్వం వెనక్కు తీసుకోదని, మొత్తం గ్రాంట్‌గా ఇస్తామని, ఏడాదికి రూ. 12వేల కోట్లు ఇస్తామని చెప్పాం. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోణంలో తీసుకుంటున్న చర్యలను వారు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. దేశంలోని డజనుకుపైగా రాష్ట్రాలు తెలంగాణ ప్రభుత్వం రైతులకోసం చేపడుతున్న అనేక కార్యక్రమాలను అధ్యయనం చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని అమలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ప్రతిపక్షనేతలు నోటికి వచ్చింది మాట్లాడటం మానేయాలి. మా సీఎం, మా ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకిస్తే రైతులు ఊరుకోరు. కాంగ్రెస్ నేతలు ఇలాగే మాట్లాడితే ఆ పార్టీని ఎన్నికల్లో బండకేసి కొట్టడం ఖాయం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్లే రైతులకు న్యాయం

రైతులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉండటంవల్లే న్యాయం జరుగుతున్నది. రైతులకు ఇప్పుడు న్యాయం జరుగకపోతే ఇంకెప్పటికీ జరుగదు. ఒక రైతు బిడ్డగా ఇది చెప్తున్నా. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు. ఆయనకు రైతుల కష్టాలు తెలుసు. తెలంగాణ వచ్చాక ఏనాడైనా రైతులు కరంటు కోతలు ఎదుర్కొన్నారా? ఎండిపోయిన పంటలతో రైతులు లేదా ప్రతిపక్షాల ప్రదర్శనలు చూశామా? కరంటుకోసం సబ్‌స్టేషన్ల ముట్టడిని చూ శామా? ఎరువులు, విత్తనాల కోసం పోలీస్‌స్టేషన్ల ముం దు క్యూలైన్లను చూశామా? మద్దతు ధర కోసం రైతులు ఎక్కడైనా రోడ్లెక్కారా? రూ.17వేల కోట్ల రుణాలను మాఫీచేశాం. రైతుబంధు ద్వారా రూ.12 వేల కోట్ల మేర పెట్టుబడి సాయం ఇస్తున్నాం. వెయ్యి కోట్లకుపైగా వెచ్చిం చి రైతుబీమా తెస్తున్నాం. ఇన్నిచేసిన వాళ్లను ఓట్లకోసం, సీట్లకోసం చేశారంటారా? ఇదెక్కడి దగుల్బాజీ రాజకీయం? ఎన్నికలొచ్చినపుడు ఎన్నికల గురించి మాట్లాడుకుందాం. పేద రైతులకు మంచి జరుగుతున్నపుడు ప్రతిపక్షాలు ఆహ్వానించాలి. సహకరించాలి. వృథాప్రేలాపనలు మానాలి. రైతుల చేతికి ఉన్న పదివేళ్లు భూమిలోకి పోతేనే మన చేతి ఐదు వేళ్లతో ఏమైనా తినగలం. అర్హులైన రైతులందరికీ బీమా కల్పిస్తాం..

మా ప్రభుత్వం రైతుల జీవితాల్లో భరోసా నింపాలని సంకల్పించింది. అందుకే బీమా పథకం కూడా తీసుకువచ్చాం. రాష్ట్రం మొత్తంగా ఏటా ఎల్‌ఐసీకి వెయ్యికోట్లను ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాం. ప్రతీ రైతుకు ప్రభుత్వమే ప్రతిఏటా రూ.2271 ప్రీమియం కడుతుంది. 18 నుంచి 59 ఏండ్ల మధ్య వయసున్నవారు అర్హులు. పాస్‌పుస్తకాల ఆధారంగా ఇప్పటికే గ్రామాలకు 2638 మంది ఏఈవోలకు బాధ్యతలు అప్పగించాం. వారు ఈ నెలాఖరువరకు క్లస్టర్లవారీగా సర్వే చేస్తారు. జూలై 15 లోపు సేకరించిన సమాచారాన్ని కంప్యూటర్లలో నమోదుచేస్తారు. ఆగస్టు 15 నుంచి బీమా బాండ్ల జారీ ప్రక్రియను మొదలుపెడుతాం. 50 లక్షల మంది రైతులు దీనివల్ల లబ్ధిపొందుతారు. రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు..

రైతుబీమాపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నాం. సోమవారం కరీంనగర్, ఆదిలాబాద్‌లో ఏర్పాటుచేశాం. మంగళవారం ఖమ్మం, వరంగల్‌లో నిర్వహిస్తున్నాం. తదుపరి అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సదస్సులు ఏర్పాటుచేస్తున్నాం. ఇదో చారిత్రక సందర్భం. అందుకే రైతు సమన్వయసమితుల గ్రామ, మండల, జిల్లా సమన్వయకర్తలకు, వ్యవసాయాధికారులకు అవగాహన కల్పిస్తున్నాం. మాకు సెంటిమెంట్‌గా ఉండే కరీంనగర్ నుంచే అవగాహన సదస్సులు కూడా మొదలుపెట్టాం. కాంగ్రెస్ నేతలకు జీవిత బీమాలెందుకు?

రైతుబీమా పథకాన్ని దండుగ అంటూ విమర్శిస్తున్న కాంగ్రెస్‌నేతలు వారెందుకు వ్యక్తిగత బీమా తీసుకున్నారో చెప్పాలి. ఇప్పుడు విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులు తమ కుటుంబసభ్యులకు కూడా బీమా చేయిస్తున్నారు. రైతులకు బీమా వద్దంటున్నవారు తమకు, తమ కుటుంబీకులకు ఉన్న బీమా పత్రాలను చించివేస్తారా?

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.