-తెలంగాణ ద్రోహులకు ఓటు ద్వారా బుద్ధిచెప్పాలి -కొల్లాపూర్ యువగర్జన సభలో మంత్రి జూపల్లి
స్వరాష్ట్ర ఏర్పాటుకోసం 14ఏండ్లు అకుంఠిత దీక్షతో అలుపెరుగని పోరాటం చేసిన సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ను ఓడించడానికి మాయమాటలతో ముందుకువస్తున్న మహాకూటమిని రాజకీయంగా బొందపెట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు యువతకు పిలుపునిచ్చారు. మంగళవారం టీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గస్థాయి యువగర్జన సభలో మంత్రి జూపల్లితోపాటు పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రిమోట్ ఆంధ్రాబాబు చేతిలో ఉన్నదని, తెచ్చుకున్న తెలంగాణ ఆంధ్రాపార్టీల నాయకుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజానీకంపై ఉన్నదన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణపై పెత్తనం ఆంధ్రబాబు చేతిలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీఆర్ఎస్కు ఓటు వేసి తెలంగాణ ద్రోహులకు బుద్ధి చెప్పాలని కోరారు.
విస్తృతంగా పర్యటిస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులు సంపూర్ణ మద్దతునిస్తున్న కులసంఘాలు, ప్రజలు.. గులాబీ పార్టీలోకి భారీగా చేరికలు టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమ నియోజకవర్గాల్లోని గ్రామాలను కలియదిరుగుతూ ప్రజల ను కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మంగళ వారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిన్నకోడెపాక, రాజక్కపల్లె, విజ్జయ్యపల్లె, బాలయ్యపల్లె, రూపిరెడ్డిపల్లె, చెన్నాపురం, దామరంచపల్లె గ్రామాల్లో భూపాలపల్లి అభ్యర్థి, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రచారం చేశారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే విపక్షాలు కూటమిగా ఏర్పడ్డాయని విమర్శించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం జంగాం అంగడిలో ఆసిఫాబాద్ అభ్యర్థి కోవలక్ష్మి కూరగాయలు విక్రయిస్తూ వినూత్న ప్రచారం చేశారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన ప్రైవేట్ లెక్చరర్లు, యాజమాన్యాల ఆశీర్వాద సభలో నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ను బలపరచాలని కోరారు. స్టేషన్‌ఘన్‌పూర్ అభ్యర్థి తాటికొండ రాజయ్య నెల్లుట్ల, వడిచర్ల, కొత్తపెల్లి, వనపర్తి, నేలపోగుల, చీటూరు, కిష్టగూడెం, కుందారంలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి బిగాల గణేశ్ నగరంలోని 3వ డివిజన్లో, ఆర్మూర్ అభ్యర్థి జీవన్‌రెడ్డి అరుంధతీనగర్‌లో , కామారెడ్డి జిల్లా పెద్దకోడప్గల్ మండలంలో జుక్కల్ అభ్యర్థి హన్మంత్ షిండే, ప్రచారం చేపట్టారు. బాల్కొండ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి కమ్మర్పల్లి మండలం లక్కోరలో క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరై మద్దతివ్వాలని కోరారు.

ఉమ్మడి నల్లగొండలో.. నల్లగొండ జిల్లా మునుగోడులో గొల్లకుర్మల ఆశీర్వాద సభకు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి హాజరై టీఆర్ఎస్కు మద్దతు తెలుపాలని కోరారు. నల్లగొండలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. తుంగతుర్తి అభ్యర్థి గాదరి కిశోర్ శాలిగౌరారం మండలం వల్లాల గ్రామం లో, దేవరకొండ అభ్యర్థి రవీంద్రకుమార్ కొండమల్లేపల్లి మండలం గాజీనగర్‌లో, నకిరేకల్ అభ్యర్థి వేముల వీరేశం కట్టంగూర్, కేతేపల్లి మండలాల్లో, నాగార్జునసాగర్ పెద్దవూర మండ లం రామన్నగూడెంలో నోముల నర్సింహయ్య ప్రచారంలో పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మంలో..
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మధిర అభ్యర్థి లింగాల కమల్‌రాజ్, వైరాలో అభ్యర్థి బానోతు మదన్‌లాల్, లింగసాలెంలో సత్తుపల్లి అభ్యర్థి పిడమర్తి రవి ప్రచారం చేపట్టారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో.. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం చిన్నధరపల్లిలో అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్, దేవరకద్రలో ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కోయిలకొండ మండలం మల్కాపురంలో నారాయణపేట అభ్యర్థి రాజేందర్‌రెడ్డి, కొడంగల్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి మద్దూరు మండలం నాగిరెడ్డిపల్లి, దంగాన్‌పూర్, పర్సాపూర్, దోరేపల్లి, పల్లెగడ్డతండా, దేవునిగుట్ట తండా, లక్ష్మణ్ తండాల్లో, వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలో అభ్యర్థి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
కరీంనగర్లో టీఆర్ఎస్ ప్రచారం. కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ నగరంతోపాటు పద్మానగర్, చింతకుంట గ్రామాల్లో, గన్నేరువరం మండలం పారువెల్లలో టీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగాల నాయకులు మానకొండూరు అభ్యర్థి రసమయి బాలకిషన్‌కు మద్దతుగా, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ అభ్యర్థి కేపీ వివేకానంద్‌కు మద్దతుగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సూరారం డివిజన్ పరిధిలో ప్రచారం నిర్వహించారు.వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలకుంట్ల ఎల్లయ్య హన్మకొండలో మీడియాతో మాట్లా డుతూ సమావేశంలో టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు.

కొల్లాపూర్‌లో గర్జించిన యువత కొల్లాపూర్, నమస్తే తెలంగాణ: టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో నిర్వహించిన యువగర్జన సభ సక్సెస్ అయింది. నియోజకవర్గం నుంచి దాదాపు పది వేలకుపైగా తరలివచ్చి సభను విజయవంతం చేశారు. టీఆర్ఎస్ యువ నాయకుడు జూపల్లి అరుణ్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు మంత్రి జూపల్లి కృష్ణారావు, పెద్దపల్లి ఎంపీ బాల్కసమన్, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తదితరులు హాజరయ్యారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ను ఓడించడానికి మాయమాటల తో ముందుకొస్తున్న మహాకూటమిని భూస్థాపితం చేయాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ రాష్ట్రంపై పెత్తనం ఆంధ్రానాయకుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకోవాలని సూచించారు. ఎంపీ బాల్కసుమన్ మాట్లాడుతూ.. ఉద్యోగ నియామకాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు 56 కేసులు వేశారని ఆరోపించారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, యువ నాయకుడు జూపల్లి అరుణ్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చంద్రబాబు ఎదుట చేతులు కట్టుకొని చెప్రాపి పనులు చేస్తున్నారని ఎద్దేవాచేశారు.
టీఆర్ఎస్కు భారీ మెజార్టీ ఖాయం మంత్రి జోగురామన్న తెలంగాణ చౌక్: త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని మంత్రి జోగు రామన్న ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలుకాలనీల్లో మంగళవారం ఆయన ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. మహాకూటమి నాయకులకు ఎన్నికలకు ముందే ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే అభ్యర్థులను ప్రకటించలేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనకు ప్రజలందరూ స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారన్నారు. కూటమి అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు కుట్రలు ఇక్కడ పనిచేయవని.. ఆయనను ప్రజలు తరిమికొడతారని పేర్కొన్నారు.
కూసుకుంట్లపై తప్పుడు వార్తలు రాయండి మీడియా ప్రతినిధులకు సూచించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చండూరు, నమస్తే తెలంగాణ : మీడియా సోదరులు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై తప్పుడు వార్తలు రాయండి.. నాకు మద్దతుగా కథనాలు రాయండి అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మీడియా ప్రతినిధులకు సూచించడం వివాదాస్పదమైంది. మంగళవారం నల్లగొండ జిల్లా చండూరులో రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మునుగోడు నియోజకవర్గంలో యువత తప్పుడు దారిలో నడుస్తున్నదని. తనను గెలిపిస్తే బాగుచేస్తానని చెప్పుకొచ్చారు. కాగా రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు తప్పుపట్టారు. కోమటిరెడ్డి సోదరుల దురంహకారానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

ముస్లింలను మోసగించిన కాంగ్రెస్: డిప్యూటీ సీఎం మహమూద్ అలీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ ముస్లింలను మోసగించిందని డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎప్పటికీ బీజేపీతో కలువదన్నారు. ఎన్నికల ప్రచారంలో భా గంగా మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో, పాల్వంచలోని వరలక్ష్మీ ఫంక్షన్హాల్లో నిర్వహించిన ఆత్మీయసమ్మేళనంలో కొత్తగూడెం అభ్యర్థి జలగం వెంకటరావుతో కలిసి మైనార్టీల ఆత్మీయసమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే బాబ్రీమసీదును కూల్చివేశారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల, మౌలిక అభివృద్ధి సంస్థ చైర్మన్ బుడాన్ బేగ్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్తోనే పేదలకు ఉజ్వల భవిష్యత్: మంత్రి ఈటల హుజూరాబాద్, నమస్తే తెలంగాణ: టీఆర్ఎస్తోనే పేదలకు ఉజ్వల భవిష్యత్ ఉందని, ఇప్పటికే వారి అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టామని హుజూరాబాద్ అభ్యర్థి, మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని వె ంకటసాయి గార్డెన్లో ఎస్సీ ఉపకులాల ఆశీర్వాదసభలో, నాగార్జున డెయిరీ చైర్మన్ పుల్లూరి ప్రభాకర్‌రావు వెయ్యిమందితో కలిసి టీఆర్ఎస్లో చేరిక సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో హుస్నాబాద్ అభ్యర్థి సతీశ్‌కుమార్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఐదేండ్లసారి చుట్టపు చూపుగా వచ్చే వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి సూచించారు. కార్యక్రమంలో కరీంనగర్ జెడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.
కూటమికి ఓటేస్తే దోచేస్తారు: మంత్రి లకా్ష్మరెడ్డి జడ్చర్ల, నమస్తే తెలంగాణ: మహా కూటమికి ఓటేస్తే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ర్టాన్ని దోచుకుంటాయని మంత్రి సీ లకా్ష్మరెడ్డి విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని నవాబ్‌పేట మండలం గురుకుంట, అమ్మపల్లి గ్రామాలతోపాటు పలుగిరిజన తండాల్లో లకా్ష్మరెడ్డి మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ఆస్తులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నేసి రాజకీయం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కేసులు ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు. ఎన్ని కూటములు వచ్చినా టీఆర్ఎస్ గెలుపు అడ్డుకోలేరని స్పష్టం చేశారు.