Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మహాదొంగకు శాశ్వత జైలే

-దమ్ముంటే హుజూరాబాద్‌లో పోటీ చేయాలి
-రేవంత్‌పై పీయూసీ చైర్మన్‌ జీవన్‌రెడ్డి ఫైర్‌
-కేసీఆర్‌ తెలంగాణ కాటన్‌ దొర: భాస్కర్‌రావు

రేవంత్‌రెడ్డికి దమ్ముంటే హుజూరాబాద్‌లో పోటీచేసి గెలవాలని పీయూసీ చైర్మన్‌ ఏ జీవన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఆయన జన్మలో సీఎం కాదు కదా.. కనీసం చప్రాసీ కూడా కాలేడని ఎద్దేవాచేశారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే భాస్కర్‌రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంచల్‌గూడ ఖైదీ నంబర్‌ 1779, చర్లపల్లి ఖైదీనంబర్‌ 4170 అయిన రేవంత్‌ మరోసారి జైలుకెళ్లడం ఖాయమన్నారు. ఫిట్టింగ్‌లు, కట్టింగ్‌లు, సెట్టింగ్‌లతో కోట్లు సంపాందించిన మహాదొంగకు శాశ్వత జైలు తప్పదని చెప్పారు. రేవంత్‌ది మంకీ మెదడు అయి తే సీఎం కేసీఆర్‌ది మాంక్‌ (రుషితత్వం) మైండ్‌ అని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ తన మేథోశక్తితో రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మారుస్తున్నారని చెప్పారు. రేవంత్‌ ఐరన్‌లెగ్‌ అని.. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఖతమైపోతుందని తెలిపారు. దళితబంధు పథకాన్ని ప్రకటించగానే రేవంత్‌కు ఏం చేయాలో తోచక ఇంద్రవెల్లి సభ పెట్టి నోరు పారేసుకున్నాడని.. ఆయన మాటలు నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ సమాజం లేదని చెప్పారు.

119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు లీడర్‌, క్యాడర్‌, అభ్యర్థులు లేరని తెలిపారు. ఇంద్రవెల్లిలో అలీబాబా అరడజను దొంగలముఠాగా సభపెట్టి ప్రతాపాన్ని చూపాలనుకుని బొక్కబొర్లా పడ్డారని ఎద్దేవా చేశారు. రేవంత్‌ని కాంగ్రెస్‌ పార్టీయే భూ స్థాపితం చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణకు కాటన్‌దొర అని ఎమ్మెల్యే ఎన్‌ భాస్కర్‌రావు కొనియాడారు. మరో 25 ఏండ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని పేర్కొన్నారు. ము ఖ్యమంత్రిని తిడితే పెద్దోళ్లం అయిపోతామనుకోవడం మూర్ఖత్వమేనని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో హుందాగా వ్య వహరించాలి. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు హర్షించరని అన్నారు. అధికారం గురించి రేవంత్‌ కలలు కనడం మానుకోవాలని హితవుపలికారు. చంద్రబాబు పుణ్యాన ఎంపీ అయ్యాడని, వచ్చే ఎన్నికల్లో ఎక్కడా గెలవడని జోస్యంచెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.