Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మళ్లీ ఆయన వెంటే

-యువనేత విజయాల బాట సిరిసిల్ల
-ఉద్యమాల ఖిల్లాలో చరిత్ర తిరగరాసిన కేటీఆర్
-2009 నుంచి అజేయుడిగా ప్రత్యర్థులకు ఎప్పుడూ ఓటమే
-సిరిసిల్ల తలరాతను మార్చిన మంత్రి కేటీఆర్

సిరిసిల్ల.. చేనేతల ఖిల్లా. లక్షల మందికి ఉపాధి కల్పించిన గడ్డ. ఇక్కడి నేతన్నలు తమ నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు చిన్నచూపు చూడటంతో క్రమంగా వారి వైభవం మసకబారుతూ వచ్చింది. నైపుణ్యం ఉన్నా.. పనిలేక నేతన్నలు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొన్నది. ఆకలి చావుల కన్నా ఆత్మహత్యలు మేలనుకునే స్థితికి దిగజారింది. గత ప్రభుత్వాలు ఇక్కడి ప్రజలను కేవలం ఓటుబ్యాంకుగా వాడుకున్నాయి. హామీలిచ్చి.. అమలు మరిచిపోయాయి. ఫలితంగా సిరిసిల్లలో సాంచల సవ్వడి కనుమరుగయ్యే దుస్థితి దాపురించింది. కానీ స్వరాష్ట్రంలో నేతన్నల తలరాతలు మారాయి. సీఎం కే చంద్రశేఖర్‌రావు, సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రత్యేక దృష్టిసారించి నేతన్నల వెతలను దూరం చేశారు. కలగానే మిగిలిపోతుందనుకున్న ఆత్మహత్యలు లేని సిరిసిల్లను సాకారం చేశారు. అందుకే నియోజకవర్గ ప్రజలంతా మంత్రి కేటీఆర్‌ను కొడుకుగా భావిస్తున్నారు.. ఆయన వెనుకే ఉన్నారు.

రాపెల్లి సంతోష్‌కుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఉద్యమాల ఖిల్లాగా పేరు గాంచిన సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల తీర్పు ప్రత్యేకం. తెలంగాణ ఉద్యమకాలం నుంచి నేటి దాకా ప్రతి ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కేటీఆర్‌ను గెలిపించారు. స్వరాష్ట్రంలో ఆయనను మంత్రిని చేశారు. తనను ఎన్నుకున్న ప్రజల నమ్మకాన్ని కేటీఆర్ వందశాతం నిలబెట్టారు. నేతన్నల తలరాతను మార్చారు. ప్రభుత్వం నుంచి కరంటు, నూలు సబ్సిడీలు, యంత్రాల పంపిణీ వంటి చర్యలతో ఉపాధి పెరిగింది. ఒకప్పుడు ఆకలితో అలమటించిన నేతన్నలు ఇప్పుడు కడుపునిండా తినగలుగుతున్నారు. ఆ అభిమానాన్ని ఈసారి ఎన్నికల్లోనూ ఓట్ల రూపంలో.. భారీ మెజార్టీ అందించడంలో చూపించడానికి సిద్ధంగా ఉన్నారు.

జనశక్తి పురిటి గడ్డగా చెప్పుకునే సిరిసిల్ల పాత తాలూకాలోని ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, ఇల్లంతకుంట మండలాలు కలుపుకొని నేరెళ్ల నియోజకవర్గం (ఎస్సీ) రిజర్వుడు స్థానంగా ఉండేది. సిరిసిల్ల పట్టణంతో పాటు మండలంలోని 5 గ్రామాలు వేములవాడ , కొనరావుపేట చందుర్తి, బోయినిపల్లి మండలాలు కలుపుకొని సిరిసిల్ల నియోజవర్గంగా జనరల్ స్థానంగా ఉండేది. నియోజకవర్గ పునర్విభజనలో ఎస్సీ రిజర్వుడు స్థానంగా ఉన్న నేరెళ్లలోని గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల మండలం, పట్టణాలను కలుపుకొని సిరిసిల్ల నియోజకవర్గంగా ఏర్పడింది. కోనరావుపేట, చందుర్తి, వేములవాడ, కథలాపూర్, మేడిపల్లి మండలాలను కలిపి వేములవాడ నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. గతంలో వేములవాడ నియోజకవర్గంలో ఉన్న బోయినిపల్లిని చొప్పదండి, నేరెల్ల నియోజకవర్గంలో ఉన్న ఇల్లంతకుంట మండలాన్ని మానకొండూరు నియోజకవర్గాలలో కలిపారు. సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా చెన్నమనేని రాజేశ్వర్‌రావు నాలుగు సార్లు సీపీఐ పార్టీ పక్షాన గెలిచారు. తర్వాత సీపీఐ పార్టీకి రాజీనామా చేసిన తెలుగుదేశం పార్టీ నుంచి పోటి చేసి 5వ సారి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు సార్లు జువ్వాడి నర్సింగరావు గెలిచారు.


సిరిసిల్లకే సిరి వచ్చింది

వస్త్ర పరిశ్రమ సంక్షోభంతో మరమగ్గాల కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలతో పత్రికల్లో పతాక శీర్షికన కనపడేది సిరిసిల్లనే. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా నేత కార్మికుల చావు లేని రోజు లేదు. కాడె మోయని పూట లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్ మంత్రి కావడంతో సిరిసిల్లకే సిరివచ్చింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన మొదటగా సిరిసిల్ల కార్మికుల భవిష్యత్‌ను మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. శాశ్వత ఉపాధి కల్పించి ఉరిసిల్ల ను సిరిసిల్లగా మార్చేందుకు తీవ్రంగా కృషి చేశా రు. బతుకమ్మ చీరెలు, రంజాన్, క్రిస్మస్, ఆర్‌వీఎం వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు సిరిసిల్లకే ఇవ్వడంతో చేతినిండా పని, పనికి తగ్గ వేతనం పొందుతున్న నేతన్నలు సంతోషంగా బతుకుతున్నారు. ప్రజల కోరిక మేరకు జిల్లాను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రతి మండలం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్‌రోడ్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను చేపట్టారు. మానేరు ఒడ్డున మధ్యమానేరులో ముంపునకు గురవుతున్న రూ. కోట్ల విలువైన ఆస్తులను కాపాడేందుకు కరకట్ట నిర్మాణం చేపడుతున్నారు. కార్మికులనే యజమానులుగా మార్చేందుకు వర్క్‌టు ఓనర్ పథకాన్ని అమలు చేస్తున్నారు. అపెరల్‌పార్కు, ఫుడ్ పార్కులను మంజూరు చేశారు. ఇలా అనేక అభివృద్ధి పనులు చేపట్టి జిల్లాను 20 ఏండ్ల ముందుకు తీసుకెళ్లిన ఘనత కేటీఆర్‌కే దక్కింది.


సిరిసిల్లకు కలిసొచ్చిన అదృష్టం

కల్వకుంట్ల తారకరామారావు 2009 నుంచి సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వస్తున్నారు. గతంలో ఒకసారి గెలిచిన అభ్యర్థిని మరోసారి ఓడించిన సిరిసిల్ల ప్రజలు కేటీఆర్‌ను మాత్రం వరుసగా మూడుసార్లు గెలిపించారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆయన భారీ మెజార్టీతో గెలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ మళ్లీ సిరిసిల్లలో నిలబడగా.. ప్రజలు ఆశీర్వదించారు. ఏడు దశాబ్దాల చరిత్రలో సిరిసిల్ల నుంచి గెలిచిన అభ్యర్థులంతా ప్రతిపక్ష నేతలుగా ఉండిపోగా.. తెలంగాణ రాష్ట్రంలో వారికి అదృష్టం మారింది. 2014లో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాగా.. కేటీఆర్ ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి అయ్యారు. సిరిసిల్ల తలరాతను పూర్తిగా మార్చారు. 1.2009లో కొత్తగా ఏర్పడిన సిరిసిల్ల నియోజకర్గం నుంచి టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా మొదటిసారి కల్వకుంట్ల తారకరామారావు గెలుపొందారు. కొత్త నియోజకవర్గంగా సిరిసిల్ల తెలంగాణకే కొత్త యువ నేతను అందించింది. 2.2010లో జరిగిన ఉప ఎన్నికలో కేటీఆర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. 3.స్వరాష్ట్రం ఏర్పడ్డాక కేటీఆర్ మరింత జనాదరణతో మూడోసారి గెలుపొందారు. ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి అయ్యారు.


కేటీఆర్‌తో అన్ని విధాలా అభివృద్ధి

ఏడు దశాబ్దాల చరిత్రలో అవిభక్త వేములవాడ (సిరిసిల్ల) నియోజకవర్గం నుంచి గెలిచిన అభ్యర్థులంతా ప్రతిపక్ష నేతలుగా ఉండిపోయారు. తెలంగాణ రాష్ట్రం లో సిరిసిల్ల అభ్యర్థి అధికారపార్టీలో మంత్రిగా కావడం సిరిసిల్లకు అదృష్టం కలిసివచ్చింది. నియోజకవర్గాన్ని మంత్రి కేటీఆర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు.


మా ఓటు కేటీఆర్‌కే

అభివృద్ధిలో రాష్ట్రంలోనే నంబర్ వన్ జిల్లాగా మారుస్తున్న మంత్రి కేటీఆర్‌కే మా ఓటు వేస్తామంటూ పలు గ్రామాల్లో ప్రజలు ప్రతిజ్ఞలు చేస్తున్నారు. సిరిసిల్ల మండలం రగుడు, చిన్నబోనాల, వీర్నపల్లి మండలం మద్దిమల్ల, ఎర్ర గడ్డతండా, ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామాల్లో ఇప్పటికే ప్రజలు మద్దతు తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీకే స్వచ్ఛందంగా ఓటు వేస్తామంటూ ముందుకు వస్తున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.