Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

Manifesto

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హృదయ పూర్వక నమస్కారాలు.

తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలో ప్రజలు చేసిన సుదీర్ఘ పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. పద్నాలుగేళ్లు అనేక కష్టనష్టాలకోర్చి, నిర్భంధాలను తట్టుకుని నిలిచి, పదవీ త్యాగాలు చేసి, తెలంగాణ ప్రజలందరినీ ఒక్కతాటిపై నడిపించింది టిఆర్ఎస్ పార్టీ. ఉద్యమ నాయకుడిగా శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రదర్శించిన నిబద్ధతను, పోరాట పటిమను, ప్రాణాలను సైతం పణంగా పెట్టిన త్యాగనిరతిని తెలంగాణ ప్రజలు ఉన్నతంగా గౌరవించారు. నూతన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే బాధ్యతను కేసీఆర్ భుజస్కంధాల మీద మోపుతూ 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఘన విజయాన్ని అందించారు. మీ ఆశీస్సులతో ఏర్పడిన టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా పునర్నిర్మాణ యజ్ఞాన్ని ప్రారంభించింది. ఈ నాలుగున్నరేళ్ల ప్రస్థానంలో దేశం దృష్టిని ఆకర్షించే విధంగా అనితర సాధ్యమైన ప్రగతిని సాధించింది. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం మిగిల్చిన అనేక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ప్రజలలో నూతన విశ్వాసం నింపింది.

విఫలరాష్ట్రంగా మార్చే కుట్రలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుపడిన శక్తులే, నూతన రాష్ట్రం నిలదొక్కుకోకుండా కుట్రలు పన్నినాయి. బాలారిష్టాలు కూడా దాటకమునుపే ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలకు తెగబడ్డాయి. పునర్విభజన చట్టం నిర్దేశించిన విధంగా మన కరెంటు మనకు ఇవ్వలేదు. ప్రభుత్వ రంగ సంస్థల విభజన, హైకోర్టు విభజన జరగనివ్వలేదు. ఈ విషయం ఎన్నిసార్లు విన్నవించినా, కేంద్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరిని ప్రదర్శించింది తప్ప సహకరించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక విఫల ప్రయోగం అనే భావన కలిగించడానికి అనేక కుటిల యత్నాలకు పాల్పడ్డాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ చూపిన దార్శనికత, పాలనా సామర్థ్యం, వ్యూహ చతురతల వల్ల రాష్ట్రం అవరోధాలన్నింటినీ అధిగమిస్తూ ప్రగతిపథంలో పురోగమించింది. ఆదర్శవంతమైన రాష్ట్రంగా దేశం ముందు నిలిచింది.

అవరోధాలు అధిగమిస్తూ అభివృద్ధి దిశలో…
నేడున్న తెలంగాణ రాష్ట్రం గతంలో ఒక రాష్ట్రంగా ఉండి ఉండలేదు. అందువల్ల రాష్ట్ర ఆర్థిక ధోరణులపై సరైన ప్రాతిపదిక అందుబాటులో లేదు. ఈ సంక్లిష్టస్థితిలో టిఆర్ఎస్ ప్రభుత్వం తన వ్యూహ చతురతతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించింది. మరోవైపు అధికారుల కేటాయింపులో విపరీతమైన జాప్యం జరిగింది. ఇన్ని ప్రతికూలతల నడుమ, ఇన్ని పరిమితుల నడుమ కేసీఆర్ తన పరిపాలనా పటిమతో, చాకచక్యంతో రాష్ట్రాన్ని ప్రగతి దిశగా నడిపించారు. ఒకవైపు ప్రజలకు కావాల్సిన తక్షణ ఉపశమన, సంక్షేమ చర్యలు చేపడుతూనే, మరోవైపు అన్ని రంగాలలో దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రభుత్వం ముందడుగు వేసింది.

ప్రభుత్వం అనుసరించిన వ్యూహం విజయవంతమైంది. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందినాయి. తొలి అడుగులోనే తీవ్రమైన విద్యుత్ సంక్షోభం సవాల్ గా నిలిచింది. సమైక్య పాలనలో మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోవడం, అర్థరాత్రి మోటారు పెట్టడానికి పోయి రైతులు ప్రాణాలు కోల్పోవడం, పంట చేతికొచ్చే సమయానికి నీరందించేందుకు కరెంటు లేక పంట నష్టపోవడం వంటి పరిణామాలు వ్యవసాయ రంగాన్నిపూర్తిగా దిగజార్చినాయి. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే విద్యుత్ సమస్యను విజయవంతంగా పరిష్కరించింది. రైతాంగంలో కొత్త ఆశలు చిగురింప చేసింది. నిరంతరాయ విద్యుత్ వల్ల పారిశ్రామిక రంగం పుంజుకుంది. కార్మికులకు చేతినిండా పనిదొరుకుతున్నది. నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారికి భరోసా కలిగింది.

సంక్షేమంలో స్వర్ణయుగం
టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి పెద్ద పీట వేసింది. సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు వంటి 40 లక్షల మంది పేదలకు ఆసరా పింఛన్లతో జీవన భద్రత లభిస్తున్నది. ఆడపిల్ల పెండ్లి కారణంగా అప్పుల పాలై చితికి పోతున్న కుటుంబాలను ఆదుకునే సదుద్దేశ్యంతో ప్రారంభించిన కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకం సత్ఫలితాలనిస్తున్నది. 18 సంవత్సరాలు నిండిన వారికే ఆర్థిక సహాయం చేయడం వల్ల బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం ఈ పథకం సాధించిన మరో విజయం. ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించడం కోసం ప్రభుత్వం రూపాయికి కిలో చొప్పున ఒక్కొక్కరికీ నెలకు ఆరు కిలోల బియ్యం అందిస్తున్నది. విద్యార్థులందరికీ సన్నబియ్యంతో వండిన అన్నం పెడుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజనుల జీవితాలలో కల్లోలం సృష్టిస్తున్న గుడుంబాను అరికట్టడంలో ప్రభుత్వం విజయం సాధించింది. వారి జీవితాల్లో శాంతి నెలకొన్నది.

పేద ప్రజలకు ఇళ్లు కట్టించడంలో గత ప్రభుత్వాలు సంకుచిత విధానాన్ని అవలంభించాయి. పేదలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా ఇండ్లు ఉండాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణానికి పూనుకున్నది. రెండు తరాలకు ఉపయోగ పడే విధంగా వంద శాతం సబ్సీడీతో ఇండ్ల నిర్మాణం సాగిస్తున్నది.

ఎస్సీ, ఎస్టీల జనాభా నిష్పత్తికి తగిన స్థాయిలో నిధుల కేటాయింపు జరగడం కోసం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధి చట్టం అమలులోకి తెచ్చింది. మైనారిటీల సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రం కేటాయించని స్థాయిలో ఏడాదికి రెండు వేల కోట్లను కేటాయించింది.

కుదుటపడిన వ్యవసాయం
సమైక్య రాష్ట్రంలో కుప్పకూలిన వ్యవసాయ రంగాన్ని నిలబెట్టడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయి. రైతాంగానికి గొప్ప ఊరటనిచ్చాయి. 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తుతో పాటు, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తున్నది. కల్తీ విత్తనాలు, ఎరువుల అమ్మకాలను నిరోధించడానికి కఠినమైన చర్యలు చేపట్టింది.

పంట కాలంలో పెట్టుబడి కోసం రైతాంగం అక్కడా ఇక్కడా అప్పులు చేయాల్సిన అగత్యం ఉండకూడదని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది. రైతులకు పెట్టుబడి కోసం ఎకరానికి 4వేల చొప్పున రెండు పంటలకు 8వేల రూపాయలు దక్కుతుండంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. ఈ పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించడం మనందరికీ గర్వకారణం. వ్యవసాయ భూముల వివరాలలో స్పష్టత కోసం ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ రికార్డుల ప్రక్షాళన దేశ చరిత్రలోనే గొప్ప సంస్కరణ. ఈ ప్రక్షాళనతో భూ యాజమాన్య హక్కుల మీద స్పష్టత వచ్చింది. రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగే అవసరం లేకుండానే పట్టాదారు పాసు పుస్తకాలు వారి చేతికి అందినాయి.

దురదృష్టవశాత్తు ఏ రైతైనా మరణిస్తే అతని కుటుంబం వీధిన పడొద్దనే మానవీయమైన ఆలోచనతో ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రైతు ఏ కారణాల వల్ల మరణించినా 5 లక్షల రూపాయలను కేవలం పది రోజుల వ్యవధిలో ప్రభుత్వం ఆ కుటుంబానికి అందిస్తున్నది. వ్యవసాయ శాఖను బలోపేతం చేసేందుకు ప్రతీ ఐదువేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను ప్రభుత్వం నియమించింది. రైతులు పరస్పరం చర్చించుకోవడం కోసం రైతు వేదికలు నిర్మిస్తున్నది.

ప్రభుత్వం రాష్ట్రాన్ని వివిధ క్రాప్ కాలనీలుగా విభజిస్తున్నది. ఆయా ప్రాంతాల భూ భౌతిక పరిస్థితులను అనుసరించి రైతులు పంటలు వేసే విధంగా అవగాహన కల్పిస్తున్నది. రాష్ట్రంలోని రైతులందరినీ సంఘటితం చేసేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసింది. దుక్కిదున్నింది మొదలు గిట్టుబాటు ధర దాకా అన్ని దశల్లో రైతుకు అండగా నిలవడమే లక్ష్యంగా రైతు సమన్వయ సమితులు పనిచేస్తున్నాయి. రైతులకు గిట్టుబాటు ధర లభించడం కోసం మరో నూతన విధానాన్ని రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలులోకి తెస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతుంది. ఐకెపి ఉద్యోగులను పర్మినెంటు చేసి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలతో కలిపి ఐకెపి ఉద్యోగులకు అప్పగించడం జరుగుతుంది. ఈ యూనిట్లు తయారు చేసే కల్తీ లేని ఆహార పదార్థాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది.

శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం
కోటి ఎకరాలకు సాగు నీరు అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామ, డిండి వంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన సాగిస్తున్నది. మరోవైపు పెండింగ్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి 12లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందిస్తున్నది. రాష్ట్రానికి శాశ్వత ప్రయోజనం చేకూరే విధంగా మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించింది. ప్రజల త్రాగు నీటి అవసరాలు తీర్చడం కోసం మిషన్ భగీరథ అనే బృహత్తర పథకాన్ని చేపట్టింది. స్వచ్ఛమైన నదీ జలాలను ఇంటింటికీ నల్లాల ద్వారా అందించే ఈ పథకం దాదాపుగా పూర్తయ్యింది. మిషన్ భగీరథ పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం వ్యవసాయ అనుబంధ వృత్తులకు పెద్దయెత్తున ప్రోత్సాహం అందిస్తున్నది. మాంసం ఉత్పత్తిలో రాష్ట్రం స్వయం సమృద్ధిని సాధించేందుకు, రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల కుర్మలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు పెద్దయెత్తున గొర్రెల పంపిణీ చేస్తున్నది. మత్సకారుల ఉపాధి పెరిగే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జలాశయాలలో ప్రభుత్వమే చేపలు పోసి వాటిని పట్టుకునే హక్కును మత్సకారులకు అందిస్తున్నది. చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం వారికి పెద్దయెత్తున పని కల్పించడంతో పాటు నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నది.

హైదరాబాద్ లో కల్లు దుకాణాలను పునరుద్ధరించి గౌడ సోదరుల హక్కును కాపాడింది. చెట్ల పన్నును శాశ్వతంగా రద్దు చేసి గొప్ప ఊరట కలిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దయెత్తున తాటి ఈత వనాల పెంపకం చేపట్టింది.

విశ్వకర్మలు, రజకులు, నాయీ బ్రాహ్మణులు తదితర వెనుకబడిన కుల వృత్తులకు ఆర్థిక ప్రేరణ ఇస్తున్నది. సంచార కులాల సంక్షేమం కోసం ఏటా వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఎంబీసీ కార్పోరేష్ ఏర్పాటు చేసింది. బలహీన వర్గాలలోని యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రుణ సదుపాయం కల్పిస్తున్నది.

విద్యా విధానం
కేజీ టు పీజీ ఉచిత నిర్భంద విద్య ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా, ఉన్నత ప్రమాణాలతో కూడిన 663 కొత్త రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం ఏర్పాటు చేసిన ఈ విద్యాలయాలలో ప్రతీ విద్యార్థిపై ఏటా లక్షా ఇరవైఐదు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నది. ఈ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు గొప్ప విజయాలను సాధిస్తున్నారు. పేద విద్యార్థులు విదేశాలలో చదువుకోవడం కోసం 20 లక్షల రూపాయల ఓవర్సీస్ స్కాలర్ షిప్ అందిస్తున్నది. వివిధ పోటీ పరీక్షలకు శిక్షణను ఇచ్చేందుకు స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసింది.

ఆరోగ్య తెలంగాణ
టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వైద్యాన్ని గణనీయంగా అభివృద్ధి చేసింది. ప్రభుత్వ ఆస్పత్రులలో వసతులను మెరుగుపరిచింది. రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ సెంటర్లను, డయాగ్నస్టిక్ సెంటర్లను, క్యాన్సర్ పరీక్షా కేంద్రాలను పెద్దసంఖ్యలో ఏర్పాటు చేసింది. నగరంలోని పేదల కోసం బస్తీ దవాఖానాలను నిర్వహిస్తున్నది. సురక్షిత ప్రసవాలను ప్రోత్సహించేందుకు కేసీఆర్ కిట్స్ పథకం ప్రవేశపెట్టింది. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు రూ.12వేల ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఆడపిల్లపుడితే మరో వెయ్యి రూపాయలు అదనంగా అందిస్తున్నది. తల్లీ బిడ్డలకు ఉపయోగపడే విధంగా 16 రకాల వస్తువులతో కూడిన హెల్త్ కిట్ ను అందిస్తున్నది. దృష్టిలోపంతో బాధపడే వారికి కంటి వైద్యాన్ని చేరువలోకి తీసుకురావడం కోసం కంటి వెలుగు పథకం ప్రవేశ పెట్టింది. ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు,అద్దాలు అందిస్తున్నది. శస్త్ర చికిత్సలు జరిపిస్తున్నది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణించిన వారి మృతదేహాలను ఉచితంగా ఇంటికి చేర్చడానికి పరమపద వాహనాలను ఏర్పాటు చేసింది.

ఉద్యోగుల సంక్షేమం
టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలను 43 శాతం పెంచింది. తెలంగాణ ఇంక్రిమెంటు అందించింది. హెల్త్ కార్డుల ద్వారా ఉద్యోగుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఉద్యోగాల నియామకాల్లో స్థానికుల హక్కులను కాపాడుతూ ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ విధానం ద్వారా కొత్త ఉద్యోగాల నియామకం కోసం కసరత్తు ప్రారంభించింది. అంగన్ వాడీ, ఆశా వర్కర్లు, హోంగార్డులు, ఐకెపి ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఉపాధి హామీ పథకం ఉద్యోగులు, విఏవోలు, విఆర్వోలు, పారిశుధ్య కార్మికులు తదితర అల్పాదాయ ఉద్యోగుల వేతనాలను టిఆర్ఎస్ ప్రభుత్వం భారీగా పెంచింది.

భారీ పరిపాలనా సంస్కరణలు
ప్రజలకు పరిపాలనను చేరువ చేయడం కోసం ప్రభుత్వం సాహసోపేతంగా భారీ పరిపాలనా సంస్కరణలు చేపట్టింది. 21 కొత్త జిల్లాలు, 26 కొత్త డివిజన్లు, 125 కొత్త మండలాలు, 71 కొత్త మున్సిపాలిటీలు, 4,383 కొత్త గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసింది. తండాలు, గూడెంలను గ్రామ పంచాయితీలుగా గుర్తించాలనే ఎస్టీ ప్రజల చిరకాల వాంఛను ప్రభుత్వం నెరవేర్చింది. దీనివల్ల రాష్ట్రంలో 3,042 గ్రామ పంచాయితీల్లో ఎస్టీ సోదరులే సర్పంచులు అయ్యే అవకాశం కలిగింది. పోలీస్ శాఖలో కూడా పరిపాలనా సంస్కరణలు అమలు చేసింది. 7 కొత్త పోలీస్ కమీషనరేట్లను, 24 కొత్త సబ్ డివిజన్లను, 29 కొత్త సర్కిళ్లను, 102 కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది.

పారిశ్రామికాభివృద్ధి
రిశ్రామికాభివృద్ధి కోసం టిఎస్ ఐపాస్ అనే నూతన చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం వల్ల పరిశ్రమల స్థాపనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా కేవలం 15 రోజుల్లోనే అనుమతులు లభిస్తున్నాయి. ఈ సంస్కరణ వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తెలంగాణకు తరలి వస్తున్నాయి. ఇప్పటి వరకు 8,220 పరిశ్రమలకు అనుమతులు లభించాయి. 1.32 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 2.50 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. ఐటి హబ్ గా హైదరాబాద్ ఎదగడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పిస్తున్నది. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు నెలకొల్పిన టిహబ్ ఇతర రాష్ట్రాలకు మోడల్ గా నిలిచింది.

శాంతి భద్రతలు
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న సమర్థత ప్రశంసలు పొందుతున్నది. షిటీమ్స్ వల్ల మహిళలకు భద్రత కల్పించడంలో సమర్థవంతమైన పాత్ర నిర్వహిస్తున్నాయి.

భాషా సాంస్కృతిక రంగాలు
తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. బతుకమ్మ, బోనాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నది. మత సామరస్యానికి సంకేతంగా రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగల సందర్భంగా ప్రజలకు కొత్త బట్టలు పంపిణీ చేస్తున్నది. తెలంగాణ భాషా,సాహిత్యాల కీర్తిని విశ్వవ్యాప్తం చేసే విధంగా ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్ వేదికగా అంగరంగవైభవంగా నిర్వహించింది. సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీలను ఏర్పాటు చేసింది. తెలుగు భాషా పరిరక్షణ కోసం పదో తరగతి వరకు తెలుగు భాషా బోధనను తప్పనిసరి చేసింది.

ఐక్యరాజ్యసమితి నుంచి నీతి ఆయోగ్ వరకు సర్వత్రా ప్రశంసలు
రైతుల సంక్షేమం కోసం అమలవుతున్న 20 వినూత్న పథకాలతో ఐక్యరాజ్యసమితి రూపొందిచిన జాబితాలో రైతుబంధు, రైతుబీమా పథకాలకు చోటుదక్కడం తెలంగాణ రాష్ట్రానికి లభించిన అరుదైన ప్రపంచ గుర్తింపు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని నీతి ఆయోగ్ సిఫారసు చేయడం తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా నిలిపింది.ప్రధాన మంత్రి, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల బృందాలు తెలంగాణలో పర్యటించి, మన పథకాలను అధ్యయనం చేసి, వాళ్ల రాష్ట్రాలలో అమలుచేసేందుకు పూనుకోవడం తెలంగాణ బిడ్డలుగా మనందరికీ గర్వకారణం. వ్యవసాయ నిపుణుడైన స్వామినాథన్, నోబుల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ లాంటి వారు తెలంగాణ ప్రభుత్వ పథకాలను ప్రశంసించడం మనకు దక్కిన గుర్తింపు. 200కు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు రావడం మన పనితీరుకులభించిన ఫలితం.

మేనిఫెస్టోలో చెప్పని హామీలు కూడా అమలు
2014 ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతో పాటు, మేనిఫెస్టోలో ప్రకటించకున్నా సరే, ప్రజలకు అవసరమని భావించిన ప్రభుత్వం అనేక కొత్త పథకాలను ప్రవేశ పెట్టింది. రైతు బంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, కేసీఆర్ కిట్స్, కంటి వెలుగు లాంటి 76 కొత్త పథకాలను టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నది.

దేశంలో మరెక్కడా లేని పథకాలు
దేశంలో మరెక్కడా లేని పథకాలు అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడింది. రైతులకు ప్రభుత్వమే పెట్టుబడి ఇవ్వడం, రైతులకు ప్రభుత్వ ఖర్చుతో బీమా కల్పించడం, వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా కరెంటు ఇవ్వడం, పేదింటి అమ్మాయిల పెళ్లికి ప్రభుత్వమే ఖర్చులు భరించడం, పూర్తి ప్రభుత్వ ఖర్చుతో పేదలకు ఇండ్లు కట్టించడం, ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం లాంటి 64 కార్యక్రమాలు తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా అమలు కావడం లేదు.

అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ
కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ, తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలో అనేక విషయాల్లో అగ్రగామిగా నిలబడింది. ఆదాయాభివృద్ధి వృద్ధిరేటులో, తలసరి విద్యుత్ వినియోగం వృద్ధిరేటులో, వ్యవసాయానికి ఎక్కువ విద్యుత్ ఇచ్చే విషయంలో, సంక్షేమ పథకాల అమలులో, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో, విద్య, వైద్య రంగాలకు ఎక్కువ నిధులు ఖర్చు పెట్టడంలో, మొక్కల పెంపకంలో, ప్రతీ ఇంటికి సురక్షిత మంచినీరు ఇచ్చే విషయంతో పాటు 20అంశాల్లో తెలంగాణ ఇవాళ దేశంలోనే మొదటి స్థానం ఆక్రమించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సోలార్ విద్యుదుత్పత్తి లాంటి విషయాల్లో అగ్రరాష్ట్రాలలో ఒకటిగా నిలబడింది.

ప్రస్తుత పథకాలన్నీ కొనసాగింపు
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు సత్ఫలితాలనిచ్చాయి. ప్రజలకు నేరుగా మేలు చేకూరుస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేసిన ప్రతీ పథకం ప్రజల అనుభవంలో ఉంది. ఆ పథకాలన్నీ ప్రజల ఆశీర్వాదం పొందాయి.

ప్రజల్లో మనోధైర్యాన్ని కలిగస్తూ, నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా నేడు తెలంగాణ యావత్ ప్రపంచం ముందు సగర్వంగా నిలబడింది. 2018 ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తిరిగి అధికారంలోకి వచ్చే టిఆర్ఎస్ పార్టీ, ప్రస్తుత పథకాలన్నింటినీ మరింత విస్తృత పరుస్తూ, కొనసాగిస్తుంది.

సంపద పెంచుతున్నాం – ప్రజలకు పంచుతున్నాం
రాష్ట్రంలో స్థిరమైన పరిపాలన అందిస్తూ రాజకీయ అవినీతిని తుద ముట్టించడం ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వం ఆదాయ వృద్ధిరేటును గణనీయంగా పెంచింది. కేసీఆర్ దార్శనికతతో పాటు, అవినీతికి ఆస్కారం ఇవ్వని అచంచలమైన నిబద్ధత వల్ల సంపద పెరిగింది. మొదటి నాలుగేళ్లలో రాష్ట్రం 17.17 శాతం సగటు వార్షిక ఆదాయ వృద్ధిరేటు సాధించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇప్పటి వరకు 19.83 వృద్ధిరేటు సాధించింది. పెరిగిన సంపదను పేదలకు పంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పథకాలను రూపొందించింది. ఆదాయ వృద్ధిరేటు ఇలాగే కొనసాగాలంటే రాజకీయ స్థిరత్వాన్ని అందించే టిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావల్సిన ఆవశ్యకత ఉంది.

భవిష్యత్ ప్రణాళిక
టిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే తీసుకోదల్చిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లోని కొన్ని ప్రముఖ అంశాలను ఈ మేనిఫెస్టోలో పొందు పరచడం జరిగింది. టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు గౌరవ శ్రీ కె.కేశవరావు గారి నాయకత్వంలోని మేనిఫెస్టో కమిటీ వివిధ వర్గాల నుంచి తమకు అందిన వందలాది విజ్ఞాపనలు కూలంకశంగా పరిశీలించింది. తెలంగాణ సమగ్రాభివృద్ధి దిశగా టిఆర్ఎస్ దృక్పథాన్ని ప్రతిబింబించే విధంగా ప్రతిపాదనలు చేసింది. వాటిలోంచి కొన్ని ప్రముఖ అంశాలను మేనిఫెస్టోలో ప్రస్తావిస్తున్నాం. సాధ్యాసాధ్యాలను పూర్తి స్థాయిలో పరిశీలించి, మిగతా ప్రతిపాదనలను అధికారంలోకి రాగానే అమలు చేయడం జరగుతుంది.

గడిచిన నాలుగున్నరేళ్లలో 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను టిఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చింది. వీటితో పాటు మేనిఫెస్టోలో పేర్కొనకపోయినా ప్రజల అవసరాల ప్రాతిపదికగా 76 కొత్త పథకాలను అమలు చేసింది. అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రస్తుతం ప్రకటిస్తున్న హామీల అమలుకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజల అవసరాలు, ఆకాంక్షలు, వివిధ వర్గాల డిమాండ్లు ఎప్పటికప్పుడు పరిగణలోకి తీసుకుంటూ నూతన పథకాలను అమల్లోకి తెస్తాం. టిఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ కేవలం ఈ హామీలు నెరవేర్చడంతో ముగిసిపోయేది కాదని, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రజా ప్రయోజనాలే పరమావధిగా నిత్యనూతనంగా, నిరంతరంగా కొనసాగుతుందని వినమ్రంగా తెలియ చేస్తున్నాము.

2018 మేనిఫెస్టో – ముఖ్యమైన హామీలు
1. అన్నిరకాల ఆసరా పెన్షన్లు రూ.1,000 నుంచి రూ.2,016 వరకు పెంచడం జరుగుతుంది. వికలాంగుల పెన్షన్లను రూ.1500 నుంచి రూ.3,016 వరకు పెంచడం బీడి కార్మికుల‌ పీఎఫ్‌ క‌టాఫ్‌ డేట్ ను 2018 వరకు పొడిగించడం జరుగుతుంది.
2. వృద్దాప్య పెన్షన్ అర్హత వయసును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించడం జరుగుతుంది.
3. నిరుద్యోగ సోదరులకు నెలకు రూ.3016 భృతి అందించడం జరుగుతుంది.
4. ప్రస్తుత పద్ధతిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కొనసాగిస్తూనే, సొంతస్థలం ఉన్నఅర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అందించడం జరుగుతుంది.
5. రైతుబంధు కింద ఏడాదికి ఎకరాకు అందిస్తున్న సాయాన్ని 8వేల నుంచి 10వేల రూపాయలకు పెంచడం జరుగుతుంది.
6. రైతులకు రూ. 1 లక్ష వరకున్న పంట రుణాలను మాఫీ చేయడం జరుగుతుంది.
7. రైతు స‌మ‌న్వ‌య స‌మితి స‌భ్యుల‌కు గౌర‌వ భృతి అందించడం జరుగుతుంది.
8. ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అమలు చేస్తుంది.
9. చట్టసభల్లో బిసిలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కోసం ప్రభుత్వం పోరాడుతుంది.
10. ఎస్టీలకు 12 శాతం, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ రిజర్వేషన్లు అమలు చేయడం కోసం కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తుంది.
11. ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి, కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్రం నుంచి ఆమోదం రావడం కోసం టిఆర్ఎస్ పోరాటం చేస్తుంది.
12. వివిధ కులాల కేటగిరీ మార్పు కోసం వచ్చిన విజ్ఞాపనలను సానుభూతితో పరిశీలిస్తుంది.
13. రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ తో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
14. వివిధ సామాజిక వర్గాల నుంచి కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని వచ్చిన డిమాండ్లను రాబోయే టిఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుంది.
15. అగ్ర కులాల్లోని పేదల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశ పెట్టడం జరుగుతుంది.
16. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతుంది. ఐకెపి ఉద్యోగులను పర్మినెంటు చేసి, ఈ యూనిట్ల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలతో కలిపి ఐకెపి ఉద్యోగులకు అప్పగించడం జరుగుతుంది. ఈ యూనిట్లు తయారు చేసే కల్తీ లేని ఆహార పదార్థాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది.
17. కంటి వెలుగు పథకం తరహాలోనే ప్రజలందరికీ ఇతర ఆరోగ్య పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. ప్రతీ వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేసి, తెలంగాణ రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తుంది.
18. ప్రభుత్వ ఉద్యోగుల‌కు సబబైన, సముచితమైన రీతిలో వేతన సవరణ చేస్తుంది.
19. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వ‌య‌సును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచడం జరుగుతుంది. దీనికి సమాంతరంగా నిరుద్యోగులకు ఎక్కువ అవకాశాలు కల్పించడం కోసం ఉద్యోగాల నియామక వయో పరిమితిని మూడేళ్లు పెంచడం జరుగుతుంది.
20. పెన్ష‌న‌ర్ల‌ కోసం ప్ర‌త్యేక డైరెక్ట‌రేట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
21. అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూ వివాదాలను పరిష్కరించి యాజమాన్య హక్కులు కల్పిస్తుంది. పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరిస్తుంది. వారికి ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాలను వర్తింపచేస్తుంది.
22. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
23. సింగరేణి భూముల్లో ఇండ్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇస్తుంది.
24. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వీటిని మరింత ముమ్మరం చేయడం జరుగుతుంది.

టిఆర్ఎస్ ను ఆశీర్వదించండి – అభివృద్ధి యజ్ఞానికి అండగా నిలవండి
ఉద్యమ కార్యాచరణలో, ప్రభుత్వ నిర్వహణలో టిఆర్ఎస్ ప్రదర్శించిన చిత్తశుద్ధి ప్రజల మన్ననలు పొందింది. నిన్నటి దాకా అస్తిత్వానికే నోచుకోని తెలంగాణ నేడొక ఆదర్శ రాష్ట్రంగా ప్రశంసలు పొందుతున్నది. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు అడుగడుగునా అవరోధాలు కల్పించాయి. తమ అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించాయి. అబద్ధపు ప్రచారాలతో, నిరాధారమైన విమర్శలతో అధికార యంత్రాంగంలో ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు ప్రయత్నించాయి. కోర్టుల్లో కేసులు వేసి, ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కుట్రలు చేశాయి. ప్రగతి నిరోధకుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడం కోసం వారిని ప్రజా న్యాయస్థానంలో నెలబెట్టాలని టిఆర్ఎస్ నిర్ణయించింది. ఎన్నికల సమరంలో దూకింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. మీ తీర్పే శిరోధార్యం.

తెలంగాణ ప్రజలే అధిష్టానంగా ఎవరికీ తలవంచకుండా, ఏ వత్తిడిలకు లొంగకుండా తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీలేని వైఖరి అవలంభించే ఒకే ఒక పార్టీ టిఆర్ఎస్ మాత్రమే. చిత్తశుద్ధితో కేసీఆర్ తలపెట్టిన అభివృద్ధి యజ్ఞం కొనసాగేందుకు మరోసారి మద్దతుగా నిలవాలని తెలంగాణ ప్రజలను సవినయంగా కోరుతున్నాం. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన న్యాయం, సమాన అభివృద్ధి లభించడం కోసం, తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ ను గెలిపించమని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజల బతుకులు పండించే బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సాగుతున్న మహోన్నత కృషికి అండదండలు ఇవ్వవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాము.

జై తెలంగాణ !! జైజై తెలంగాణ !!

తెలంగాణ రాష్ట్ర సమితి

TRS Manifesto, 2018 Elections


My Whole hearted Salutations to the Telangana People

The state of Telangana was formed following a relentless struggle by its people under the leadership of Telangana Rashtra Samithi. The TRS party united all the Telangana People and sustained the separate statehood movement for fourteen long years. In the process, they faced several hardships and made innumerable sacrifices. The people of Telangana always held in high esteem, the commitment and fighting spirit exhibited by the leader of the movement Kalvakuntla Chandrashekar Rao. His sacrifice included even risking his life. Entrusting the responsibility of governing and developing the state to KCR, the people gave a decisive mandate to TRS in the 2014 general elections. The TRS Government that was formed with all your blessings, commenced the reconstruction process of the state reflecting the aspirations of people at large. During a four and a half years journey an unprecedented progress and development has been registered in the state, attracting the attention of the entire country. The untold misery and destruction of resources and culture during the erstwhile united state leaving behind many a issues were tackled one after another. In the process, the Party gained the renewed confidence of people.

Conspiracies to make it a failed state

The same forces that endeavoured to stop the formation of Telangana State, conspired even after its formation in its sustenance. Before the state could overcome its teething troubles, conspiracies were hatched to overthrow the newly formed government. The electricity power quota which was our right in accordance with the provisions of State Reorganization Act was denied to us. The bifurcation of public sector undertakings and that of High Court was stalled. In spite of several requests and reminders to the central government on this issue, the centre did not cooperate. Desperate attempts were made to prove that the formation of Telangana was a disastrous experiment. Against this background and circumstances, the vision and direction exhibited by KCR as Chief Minister of Telangana, as well as his strategic approach to issues and determination of Governance, the state by overcoming all the hurdles marched and surged forward in the development direction. As a state, Telangana stands now as a role model in the entire country.

Towards developmental journey, while overcoming impediments…

Historically, the present Telangana was never a state before. And hence, there was no possibility of having a clear-cut understanding about the state finances. Additionally, there was inordinate delay in allocation of All India Service Officers. Despite being engrossed with so many un-favourable hitches and glitches, KCR with his capacity of governance and strategic approach heralded the state towards progress on developmental trajectory. While on hand action was initiated for immediate and urgent needs of people, on the other, the Government, had set before it the long term goals and accordingly moved forward.

The strategy adopted by the Government was successful. The fruits of development and welfare have reached people. In the very first step , the severe power crisis was a big challenge. During the erstwhile united rule, the  electric motors,  transformers have been burnt, threat of life to farmers when they go for switching the power during mid nights, non-availability of power when required at the time of harvest resulting in loss of crops and the  like had totally destroyed the agricultural sector beyond repair. Immediately after TRS Government was formed, the power crisis was successfully handled and successfully tackled. The farmer have become very happy. The industrial sector, due to uninterrupted power supply gas got re-energized. The industrial labour has handful of work. For those who wanted to establish new industries have gained confidence.

Golden era in welfare

TRS Government gave top priority for comprehensive welfare measures. A golden era has dawned in welfare. Livelihood and security has been provided to over 40 lakh poor through Aasara Pensions which included old aged people, single women, beedi workers, filarial patients etc. Kalyana Laxmi and Shaadi Mubarak schemes which have been initiated and implemented to financially help the families of those who sink in severe debts due to marriage of their girl child, have been yielding excellent results. For providing food security to all the people, the Government, at the rate of one Rupee a kilogram, has been providing six kgs of rice to each person in the family without any ceiling on family size. All the students are provided food with fine rice. The brewing and marketing of illicit country liquor (Gudumba) that brought untold miseries among the lives of rural people in general and Tribals in particular, has been completely stopped by the Government successfully. Now peace prevails in their family lives. In provision of housing for poor the previous governments exhibited callousness. With a view to protect and enable poor to live with dignity and self-respect, the TRS Government has initiated and implementing the construction of two-bed room houses. The design and construction of these houses is  such that they will sustain for use for at least two generations. The SC, ST special development Act was enacted to allocate funds to them in proportion to SC and ST population. For the welfare of minorities, in a manner in which no other state did, the TRS government has allocated Rs. 2000 crores per annum.

Restoration of Agriculture sector

Several steps initiated by TRS Government to restore and revitalize agriculture sector which was totally subjected to destruction during the erstwhile rule yielded very good results. All the farmers experienced great relief. Government in addition to providing round the clock 24 hour free and quality power supply has also been supplying on time fertilizers, pesticides and seed. To arrest sale of spurious seeds and fertilizers, stringent measures have been taken by government.

The Rythu Bandhu Scheme introduced by the TRS Government aimed at investment support for each farmer for agriculture with a view that the he need not approach anyone for loans has won  the praise from all over the world. The farmers are  happy as they are getting Rs 8000 per acre for two crops, at the rate of Rs 4000 per acre per crop. The rectification and purification of land records with an objective to cleanse the entire land records is a great reform in the country. With this a clarity regarding the  ownership of land could be arrived at. The Pattaadar Passbooks of the land owner has reached the farmer without his being going around the government offices.

The Government has introduced the Rythu Bhima Life Insurance Scheme to come to the rescue of the farmer’s family in the event of his death, for whatever reason it might be. Under this scheme, the farmer’s family gets Rs 5 Lakhs from LIC within 10 days of his death. For strengthening the department of agriculture for every 5000 acres, one agriculture extension officer has been appointed. For providing a platform for farmers to discuss among themselves the Rythu Vedikas are being established.

The Government has decided to divide the state into various crop colonies. The farmer is educated to prefer a particular crop in accordance with the geo climatic  and soil conditions of the land. Rythu Samanvaya Samithis (Farmer Coordination Committees) have been formed to bring farmer into an organized sector. From initial ploughing till the farmer gets crop on hand and markets them for a minimum support price, the Samithis help the farmer and assist him in all aspects.

TRS Government will be implementing yet another initiative for provision of support price to the farmer for his crop. All over the state, food processing units will be established and the responsibility to administer and manage them will be entrusted to women self-help groups. The food products that are produced by these units will be supplied through public distribution system.

Projects on fast-track

For provision of irrigated water to one crore acres of land, TRS Government has constructed on war footing  Palamoor-Rangareddy, Kaleshwaram, Seetarama, Dindi etc. Projects. Parallelly, all the pending projects were expedited on fast track and they are providing irrigated water for 12 lakh acres of fresh ayacut. Thousands of chain of Tanks were rejuvenated as part of Mission Kakatiya. To permanently solve the drinking water problem, the Mission Bhagiratha Scheme has been taken-up. The scheme aims at providing pure and quality drinking water to each and every household through pipes and has nearly been completed. The Mission Bhagiratha scheme has become a role model to other states.

Revitalization of Rural Economy

Revitalization and strengthening of rural economy as well as encouragement of allied sectors of agriculture has also been taken up by TRS Government. Sheep distribution on a large scale to Yadavas and Kurumas has been going on to strengthen them financially and also to register self-sufficiency in meat production. To enhance the livelihood opportunities of fishermen, the Government has taken-up large scale fish seeding in all water bodies in the state and the rights on fishing there have been given to fishermen. To help and assist the handloom workers, they are provided with continuous work, besides subsidizing on wool and chemicals.

The Toddy Shops in Hyderabad City have been revived and thereby the rights of Gouda Brethren are protected. The tax on Toddy trees has been permanently done away with, giving a great relief to Goudas. The Toddy and palm trees are being grown on a large scale all over the state.

The hereditary and traditional professions of Vishwakarma, Rajakas, Nayee Brahmins are encouraged financially and incentives are given. MBC Corporation was established with Rs 1000 Crores seed capital for the welfare of nomad and most backward castes. Direct loan facility delinking with banks is provided to youth of backward communities for their self-employment.

Education Policy

663 New Residential Schools have been established in the state as part of KG to PG free and compulsory education policy. In these institutions, which are meant for SC, ST, BC and Minorities, the Government spends annually on an average Rs. 1,25,000 on every student. The students receiving education in these institutions have been achieving tremendous results and success in many areas. TRS Government provides overseas scholarship of Rs 20 lakhs per student to those poor students who pursue education abroad. Study circles are established for the benefit of poor to prepare them for various competitive examinations.

Healthy Telangana

TRS Government has significantly developed the Public Health Organization. Facilities were improved in Government Hospitals. Dialysis Diagnostic and Cancer screening centres have been established on a large scale throughout the state. For the benefit of poor patients in the city, Basti Davakhanas are established. For encouraging safe delivery, KCR Kits scheme has been introduced, additionally, Rs 12000 financial assistance is provided to women delivering in government hospitals to encourage institutional deliveries. If the new born baby happens to be a girl child, an additional Rs. 1000 is given as incentive. For use of mother and child, the KCR health kit with 16 items is given. Kanti-Velugu program has been introduced and being organized successfully, to bring eye screening facility to each and every one suffering from eye related problems in the state. After, free eye screening, medicines and free spectacles are being provided to whoever may require them. Surgical treatment is also provided, when necessary. Free transport vehicles are provided for the last journey of those who expire in government hospitals to take the dead bodies to their respective homes.

Welfare of Employees

TRS Government has enhanced the salaries of government employees by 43%. Telangana increment was also given. The medical expenses of employees are also born by government through introducing health cards. The new zonal system has been created to safeguard the interests and rights of locals in recruitment to government jobs. Exercise is on for fresh recruitment to jobs through the new zonal system. Emoluments of Anganwadi, Asha workers, Home guards, IKP employees, contract employees, Outsourcing employees, VAOs, VROs, sanitary staff and other small wage earners were enhanced substantially.

Comprehensive Administrative Reforms

Comprehensive Administrative Reforms were initiated to bring administration closer to people. 21 New Districts, 26 New Divisions, 126 New Mandals, 75 New Municipalities and 4388 New Gram Panchayats have been created. The long standing desire of Tribals to recognise their Thandas and Gudems as Gram Panchayats have also been realised by the Government. By this act,  in 3042 Gram Panchayats, ST brothers will become sarpanches. In Police department also reforms were implemented and 7 new police Commissionerates, 24 new divisions and 102 new police stations were created.

Industrial Development

For rapid industrial development of the state, the Government has enacted a new policy called TS IPass. This act enables to establish new industries by investors in a hassle-free manner for which the required clearances are given within 15 days of application. Due to TS IPass, industries and investments on a large-scale are being attracted,  in Telangana State. As on date, 8220 industries were given clearances with an investment of Rs 1.32 Lakhs crores while providing employment opportunities to 2.50 lakhs of individuals. Largescale facilities are provided to develop the state as an IT Hub. Entrepreneurs and seed IT industries are encouraged. The IT Hub has become a role model to other states.

Law and Order

The Law and order situation in the state is being commended by one and all. The SHE Teams provide the much needed security to women on 24X7 basis and have been playing key role towards this.

Literary and cultural Fields

Several measures were initiated and implemented by the TRS Government to spread the culture of Telangana and the world-over. The important festivals of Batukamma and Bonalu are organized officially. New cloths are distributed to the poor on the occasion of Ramzan and Christmas as a symbol of communal harmony. World Telugu Conference was organized in a unique style, with Hyderabad as a platform for focussing upon the importance of Telangana culture, Telugu language and literature globally. Sahitya Academy and Sangeeta Nataka Academy were created. Telugu language teaching has been made compulsory in all educational institutions, up to Tenth Class in the state.

All-round  praise and complements from all corners

right from UNO to NITI Ayog

Inclusion of Rythu Bandhu and Rythu Bhima Schemes in the list of 10 great unique schemes of United Nations is indeed a rare international appreciation to Telangana State. The recommendation of NITI Ayog that the Mission Kakatiya and Mission Bhagiratha Schemes should be implemented in all the states is yet another appreciation. This has placed Telangana as a model state. Prime Minister of India, several Union Ministers, Ministers from other states and high level official teams have visited Telangana. After studying our schemes, they are planning them to be implemented in their respective arenas. This again is a proud moment for Telangana. Agriculture Expert Swaminathan, Nobel Laurette Kailash Satyarthi, Water Man of India Rajendra Singh etc., praising Telangana Schemes and that gives immense pleasure to us. Receiving more than 200 awards and rewards nationally and internationally is surely the result of our hard work.

Implementation of new schemes beyond the

 2014 election Manifesto

The TRS Government, after implementing all the promises made in its 2014 election manifesto, have implemented several new schemes which were not mentioned in the manifesto. The TRS Party felt that, they were needed by the people, and therefore, were initiated and implanted successfully. These included among others, the Rythu Bandhu, the Rythu Bhima, 24X7 uninterrupted power supply for agriculture, Mission Bhagiratha, Kalyana Lakshmi, Shaadi Mubarak, KCR Kits, Kanti-Velugu etc., all numbering 76 schemes.

Schemes implemented like nowhere in the country

The Telangana State, by implementing several schemes which are not implemented anywhere in the country has become a role model to other states. Investment Support to Farmer, Providing Insurance to farmer with Government support, 24 hour power supply for agriculture, financial assistance for poor girl child marriage, construction of two-bed room house to poor with total government support and free eye-screening are some of them. All the schemes numbering 64 are unique to Telangana and are taken-up nowhere in the country.

Telangana as Number One State

Notwithstanding the fact that Telangana is a new state, it has quickly become number one state in the country in several aspects. In the revenue growth, per capita power consumption, providing more power for agriculture, implementing welfare schemes, construction of irrigation projects, spending more funds for health and education, plantation program, supplying safe drinking water to every household and similar other 20 aspects, Telangana stands first in the country.  It is on the very top position in ease of doing business and solar power generation.

Continuation of all the existing schemes

All the schemes that are being implemented in the state have yielded tremendous results. They are directly helping the people. Every scheme that is under implementation is leaving a rich experience among people. All these schemes have the blessings of all the people. The Telangana State hold its head high with pride before the whole world as a progressive state. TRS Government that came to power after winning the 2018 elections shall continue to implement all the existing schemes extensively, benefiting the people at large.

Multiplying the wealth and distributing amongst people

The Revenue Growth Rate has been substantially increased by TRS Government by due to steady governance and by way of putting an end to corruption. Due to the vision and direction of KCR coupled with corruption free commitment in the system, the wealth has been multiplying. During the first four years, the state has achieved 17.17% annual revenue growth rate. During, 2018-19 financial year, also the growth rate so far stands has grown to 19.83%. Schemes are conceived and implemented keeping in view the growing wealth and need to distribute it amongst people. For sustenance and continuance of this revenue growth it is indispensable that the TRS government comes to power after 2018 elections yet again.

Future Plan

Significant development and welfare schemes that the TRS Government proposes to initiate and implement soon after it comes to power must form a part of this Manifesto. The Manifesto Committee headed by TRS Parliamentary Party Leader Sri K Keshava Rao has considered and scrutinised meticulous care hundreds of proposals that came before it from different sections of people. The committee on that basis, made recommendations, keeping in view the all-round and comprehensive development of Telangana as well as reflecting upon the TRS view point at large. From among them, only the prominent, important and significant proposals are included in the manifesto now. All the other proposals, after studying the pros and cons will be taken-up for implementation.

During the past four and a half years, all the election promises made in the 2014 manifesto were implemented. Though not mentioned in the manifesto, 76 schemes, that were felt necessary in accordance with needs of the people, were also implemented. Similarly, in the coming days, rather than limiting to the promises made now in this manifesto, the government will go beyond and take into consideration the demands of people for implementation, as per their needs. The TRS future action plan is just not limited to the manifesto promises only. We sincerely make it clear that, in accordance with the aspirations of people, as the time demands, keeping in view the larger interests of people, implementation of new schemes will become a continuous process.

2018 Manifesto…. Important Promises

 1. All types of Aasara pensions will be enhanced from Rs 1000/- to Rs 2016. The pensions of differently abled persons will be enhanced from Rs 1500/- to Rs 3016/-. The cut-off date for beedi workers PF will be extended to 2018.

 2. The age eligibility for old age pension will be reduced from 65 to 57 years completed.

 3. The unemployment allowance of Rs 3016/- will be given.

 4. While continuing the construction of double bed room houses as per the existing norms, those a poor persons who have own plot and desirous of constructing a house on their own will be provided financial assistance, ranging from Rs 5 lakhs to Rs 6 Lakhs.

 5. The investment support of Rs 8000 per acre for agriculture to farmer under Rythu Bandhu will be increased to Rs 10000/- per acre.

 6. Loan waiver to farmers up to Rs 1 lakh will be done.

 7. Honorarium to members of Rythu Samanvaya Samithis will be given.

 8. The report of the committee appointed for drafting schemes for the integrated development of SCs and STS will be implemented by the Government.

 9. Government will continue to press and fight for implementation of 33% reservation to BCs and 33% reservation to women in legislatures.

 10. The Telangana State Assembly has passed resolution for provision of 12% reservation to STs and 12% reservation to Minorities. For implementing these reservations the Government will continue to fight for their cause with the centre.

 11. The SC categorization resolution of the Assembly was forwarded to centre. For obtaining centre’s nor for this TRS government will continue to fight.

 12. For change of categories of different castes, all the appeals will be taken into consideration.
 13. In addition to Reddy and Vaisya Corporation, corporations for the welfare of even other financially backward communities will be established.

 14. The future TRS Government will sympathetically consider proposals for establishing corporations, based on the demands received from various sections of people.

 15. Special schemes will be conceived for the welfare and development of poor amongst the forward castes.

 16. Food processing units will be established across the state. The responsibility of management of these units will be entrusted to IKP employees by making them permanent employees along with women groups. Food products that are totally non-spurious will be marketed through public distribution system.

 17. On the line of Kanti-Velugu large scale health camps will be organized across the state for rest of diagnostic tests. The health profile of every individual, as well as that of state will be developed.
 18. Pay scales for government employees will be given appropriately.

 19. The retirement age of the Government employees will be enhanced from the present 58 to 61. Parallelly, the unemployed youth will be provided with ample opportunities by increasing the recruitment age limit by three more years.

 20. Special Directorate will be created for pensioners.

 21. Land disputes of tribal and non-tribal lands in forest areas will be amicably addressed and ownership rights will be conferred. Disputes with reference to Podu Lands will also be addressed as early as possible. They will be given benefits on par with other farmers.

 22. Steps will be initiated to establish a steel factory in Bayyaram.

 23. Pattas will be given to those who have constructed houses in Singareni Plots.

 24. Efforts are in on to transform Hyderabad as a global city. This will be accelerated with more initiatives.

 Bless the TRS…Join us in our efforts
Both, during the struggle as wells as in governance, the commitment of TRS has been praised by one and all. Telangana having no existence till four and half years ago, has now become a role model state today. Unable to digest this progress, the opposition is making unnecessary hue and cry and attempting to create hurdles at every stage. For their mean political interests, they blocked the larger interests, of people. With false propaganda and baseless criticism.  They made attempts to disrupt the self confidence of official machinery. By way of approaching courts, they attempted to stall the construction of irrigation projects. TRS has decided to go before the people to expose them in people’s courts, with a view to ensure that their anti-progressive activities are put to an end. It has therefore, decided for a fresh mandate. In a democracy, people are ultimate judges and their judgement is the final word.

TRS is the one and the only party which treats the people as its high command and in the process, does not buckle under any sort of pressure from any direction. Without compromising their interests, it has been in the service of people. In order to continue the development process that was begun by KCR with commitment, we sincerely appeal the people to stand by the TRS Party once again. Towards achieving equal opportunity and justice to all people and all areas in the state and for equal development as well as for sustained and eternal existence of Telangana, we appeal to vote for TRS in this elections. For creation of ‘Bangaru Telangana’, that aims at improving the living standards of all its people, we appeal for extending your support

Jai Telangana

Jai jai Telangana

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.