Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మన్ననలు పొందుతున్న పాలన

ప్రజా సంక్షేమం పట్ల ఏ ప్రభుత్వానికైనా స్పష్టమైన నియమ నిబద్ధత, చిత్తశుద్ధి ఉండాలి. రాజకీయ కోణాన్ని ఎన్నికల వరకేపరిమితం చేసి అధికారంలో ఉన్నప్పుడు తన, మన భేదం లేకుండా కుల వర్గ, రాజకీయ తారతమ్యం లేకుండా పాలన చేసేనేతలే అసలు సిసలైన ప్రజాస్వామ్యవాదులుగా చరిత్రలో నిలిచిపోతారు. నిజానికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు గడిచినప్పటికీ ప్రజల బతుకుబండి సాగడానికి ఇంకా సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి రావడం దురదృష్టకరం.

గత ప్రభుత్వాల ముందుచూపు లేని పాలన, ఓట్లు, సీట్ల మీద ఉన్న శ్రద్ధ పేదరిక నిర్మూలనపై లేకపోవడం, నిరక్షరాస్యతను తగ్గించడం, రోడ్లు, విద్యుత్, విద్య, వైద్యం వంటి కనీస మౌలిక వసతులు కలిపించకపోవడం, దాదాపు 80 శాతం మందికి పైగా ప్రజలు నమ్ముకున్న వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేయడం, ఉపాధి అవకాశాలను సృష్టించకపోవడం వంటి ఒక లక్ష్యం లేకుండా పనిచేసిన ఫలితంగా జనజీవనం కుదేలైంది. ఉమ్మడి పాలకుల హయాంలో తెలం గాణ కరువు కాటకాలకు, నిత్య దరిద్రానికి చిరునామాగా మారింది. ఇప్పుడు పరిస్థితి మారింది. తెలంగాణ ప్రభుత్వం రాజకీయాల జోలికి పోకుండా రాష్ర్టాభివృద్ధి, ప్రజా సంక్షేమంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఓవైపు దీర్ఘకా లిక అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తూనే మరోవైపు ప్రజల జీవనం సాఫీగా సాగడానికి పెద్ద ఎతున్త సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తు న్నది. రాష్ట్రంలో దాదాపు 90 శాతానికి పైగా ఉన్న బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం ఓ ఘనతగా కాకుండా ఓ బాధ్యతగా భావిస్తున్నది. స్వాతం త్య్రం వచ్చిన తర్వాత దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించిన ప్రభుత్వాలు సరైన రీతిలో వాస్తవిక దృక్పథంతో పనిచేసి ఉంటే ఇప్పటికీ 90 శాతం మంది ప్రజలు ఇంకా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ఆధారపడాల్సిన పరిస్థి తి ఉత్పన్నమై ఉండేది కాదు. ఓట్ల కోసం సమస్యలు సృష్టించేవారు నిజ మైన పాలకులు కారు. సమస్యను చూసిన వెంటనే స్పందించే వారే అస లు సిసలైన పాలకులు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ఆయా వర్గా ల బతుకులు నిలబెట్టే విధంగా ఉండాలి. దేశంలోని అనేక రాష్ర్టాల్లో సం క్షేమం పేరుతో ఓట్ల కోసం విన్యాసం చేస్తున్నారే తప్ప, అసలు నిజంగా ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలేమిటి? వాటిని తొలిగించడాని కి తీసుకోవాల్సిన చర్యలేమిటి? అన్న అంశాన్నే పట్టించుకోవడం లేదు. అనవసరమైన వాగ్దానాలు ఇవ్వడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడుతాయనుకోవడం వట్టి భ్రమ. కానీ తెలంగాణ రాష్ట్రం అలా కాదు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో తెలంగాణ భిన్నమైన రాష్ట్రం.

ఉమ్మడి పాలకుల మోసాల వల్ల సడుగులిరిగిన అట్టడుగువర్గాల జనా భా అధికం. ఓవైపు సాగు, తాగునీరు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో నూ వెనుకబడి వ్యవసాయంతో సహా అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయి న విధ్వంసకర పరిస్థితులకు తెలంగాణ నిలయం. అలాంటిది రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుడే పాలకుడై సాగిస్తున్న పారదర్శక పాలన తో క్రమంగా అన్నివర్గాల ప్రజలు కుదుటపడుతున్నారు. ఉద్యమ సమ యంలో 14 ఏండ్ల పాటు ఊరూరా తిరిగి ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలను అవగతం చేసుకున్న కేసీఆర్‌కు ఏ వర్గ ప్రజలు ఏం కోరు కుంటున్నారో తెలుసు. అందుకే ఎవరూ అడుగకపోయినా, ఎలాంటి ఉద్యమాలు చేయకపోయినా కేసీఆరే స్వయంగా సంక్షేమ కార్యక్రమా లకు రూపకల్పన చేస్తున్నారు. టీఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తర్వాత రూ.40 వేల కోట్లకు పైగా నిధులు వెచ్చిస్తూ షాదీముబారక్, కల్యాణ లక్ష్మీ, హాస్టళ్లకు, అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం, ఒక రూపాయికే కిలో బియ్యం పథకం, గొర్రెల పంపిణీ, చేపల పెంపకం వంటి దాదాపు 40 సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయి. కాంగ్రెస్ హయాం లో 29,21,828 మంది మాత్రమే పింఛన్‌దారులు ఉండి వారికి కేవ లం రూ.835.63 కోట్లను మాత్రమే ఇస్తే ఈ ప్రభుత్వం దాదాపు 40 లక్షల మంది లబ్ధిదారులకు సుమారు రూ.6000 కోట్లను పంపిణీ చేస్తు న్నది. అయితే ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమం, అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ కార్యక్రమ ఫలాలు ప్రతి గ్రామానికి చేరాలి, ప్రతి గడపను తాకాలన్న సంకల్పంతో కేసీఆర్ నిష్టతో కష్టపడుతున్నారు.

అది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గమా?, లేక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గమా?, అది సీఎం కేసీఆర్ నియోజకవర్గమా, లేక సీఎల్‌పీ నేత జానారెడ్డి, ఉపనేత జీవన్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కు మార్‌రెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలా?, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ నియోజకవర్గమా?, లేక సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య నియోజకవర్గమా?, సండ్ర వెంకటవీరయ్య నియోజక వర్గమా? అన్న విషయాన్ని ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదు. నేను పైన పేర్కొన్న ప్రజాప్రతినిధులు ఏ పార్టీకి చెందిన వారన్న వివక్ష లేకుండా వారికే నిధులిస్తూ సీఎం కేసీఆర్ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. గతంలో ఏ పథకం వచ్చినా అది అధికారంలో ఉన్న పార్టీ చుట్టే తిరిగేది.

కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ రాజకీయ రంగు పులుముకొని ఎంతటి అవినీతి పుట్టగా మారిందో దానిపై తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపించిన సమయంలో బయటపడిన విస్తుపోయే రీతిలో వెలుగు చూసిన వాస్తవాలే నిదర్శనం. ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లా లో ఒక గ్రామంలో తాతల కాలం నుంచి 300 ఇండ్లు ఉండగా వాటిని ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిర్మించామని రికార్డులకెక్కించి ప్రభు త్వ సొమ్మును దిగమింగిన వ్యవహారం విచారణాధికారులే ముక్కున వేలేసుకునేలా చేసింది. అదే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తలపెట్టిన డబు ల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం కేటాయింపులనే చూడండి. 2 లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను నిర్దేశించిన గడువులోగా పూర్తిచేయాలని నిర్ణ యించడమే కాకుండా ఇప్పటికే సగానికిపైగా ఇండ్లను పూర్తిచేసి మిగిలి నవి కూడా పూర్తయి వాటిని లబ్ధిదారులకు కేటాయించే ప్రక్రియ జరు గుతున్న నేపథ్యంలో ఒక్క ఇంటిని కూడా ప్రజాప్రతినిధులో, టీఆర్‌ఎస్ నాయకులో సిఫారస్ చేస్తే ఇవ్వడానికి వీల్లేని విధంగా తీసుకున్న చర్యలు తెలంగాణ ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనం. గొర్రెల పంపిణీ విషయం లోనూ లబ్ధిదారుడు ఏ పార్టీకి చెందిన వారన్నది చూడకుండా రాష్ట్రంలో నివసించే గొల్ల, కురుమలు అయితే చాలు వారికి లాటరీ పద్ధతిలో చిన్న విమర్శ కూడా లేకుండా 70 లక్షల గొర్రెలను పంపిణీ చేయడమే కాకుం డా మరో 70 లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం సమాయ త్తమవుతున్నది.

తాజాగా ప్రకటించిన గేదెల పంపిణీలో కూడా పాడి పరిశ్రమ మీద ఆధారపడిన ప్రతి రైతుకు 50 శాతం సబ్సిడీతో రూ.80 వేల వ్యయం కాగల రెండు గేదెలను ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్నది. రైతుల కు రాజకీయ పార్టీలను ఆపాదించకుండా రాష్ట్రంలో ఉన్న మొత్తం 52 లక్షల మంది రైతులకు వారు కాంగ్రెస్ వారా?, టీడీపీ వారా, బీజేపీ వారా అన్నది చూడకుండా రైతుబంధు చెక్కులివ్వడం, రైతుల జీవితాల ను దృష్టిలో పెట్టుకొని వారికి రైతు బీమా సౌకర్యం కలిపించడం తెలంగా ణ ప్రభుత్వం గత ప్రభుత్వాల తీరుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదన డానికి నిలువెత్తు నిదర్శనం. వీటన్నిటికన్నా మనుషులను మనుషులుగా చూసే సీఎం కేసీఆర్ 60 ఏండ్ల ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యానికి గురైన తెలంగాణలో ప్రతి అభాగ్యుడికి మేలు జరుగాలి. కులాలు, మతాలు, పార్టీలనే తేడా లేకుండా రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో విరాజి ల్లాలన్న సంకల్పం సాగిస్తున్న పాలనగా మన్ననలు అందుకోవడం చూస్తున్నాం. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పథకం ప్రగతిభవన్‌లోనే రూపుదిద్దుకుంటున్నది. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల జోక్యం, సిఫారస్‌లు లేకుండానే పల్లెల్లో ఉన్న ప్రతి లబ్ధిదారుడికి అందేలా స్పష్ట మైన విధానాన్ని అమలుచేస్తుండటం ప్రభుత్వ పారదర్శకతకు అద్దం పడుతున్నది.

ఈ విధానం గతంలోనే జరిగి ఉంటే ఇప్పుడు కూడా సంక్షే మ రంగానికి ఇంత పెద్దపీట వేయాల్సిన అవసరం ఉండేది కాదేమో. పథకాల అమలు సందర్భంగా గత ప్రభుత్వాల హయాంలో కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల మాదిరిగా ఈ ప్రభుత్వంలో తమను పరిగణించడం లేదన్న అభిప్రాయం అక్కడక్కడా టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉండి ఉండవ చ్చు. అయినా ఏ ఒక్క పథకం అమల్లో లోపాలున్నాయని వేలెత్తి చూపించే పరిస్థితిని ప్రభుత్వం తెచ్చుకోవడానికి సుముఖంగా లేదు. పథ కాల అమలులో భూతద్దాలు పెట్టి వెతికినా చిన్న లోపం కూడా కనిపిం చకపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఏవో విమర్శలు చేయా లి కాబట్టి టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో మిగిలిపోయిన అరకొర అంశాలను పట్టుకొని అవీ నిరంతర ప్రక్రియగా అమలవుతున్నప్పటికీ వాటినే పదేప దే ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అంతే కానీ లోపా లను నిర్మాణాత్మకంగా చూపలేకపోతున్నాయి. ఎలాంటి రాజకీయ వాస నలు లేకుండా ప్రతిపౌరుడికి లబ్ధి చేసే పథకాలతో ప్రజా సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తూ ముఖ్యమంత్రి కేసీఆ ర్ దార్శనికత కలిగిన నేతగా అభినందనలు అందుకుంటున్నారు. (వ్యాసకర్త: శాసనమండలి సభ్యులు) కర్నే ప్రభాకర్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.