Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మారుతున్న నేతన్నల తలరాత

వ్యవసాయం తర్వాత భారతీయ జీవన సంస్కృతిని చాటి చెప్పే అతిపెద్ద రంగం చేనేత జౌళి రంగం. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చేయూతనిచ్చే ఈ రంగం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కొన్ని దశాబ్దాలుగా తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నది. తగినంత ముడిసరుకు దొరుకకపోవడం, సరైన మార్కెట్ సదుపాయం లేకపోవడం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో వెనుకబడి మిల్లుల నుంచి వస్తున్న తీవ్రమైన పోటీని ఎదుర్కోలేక చేనేతరంగం కుదేలైంది. కష్టాల్లో ఉన్న నేతన్నలు తమను ఆదుకోవాలని ప్రాధేయపడాల్సిన పరిస్థితి. అయినా అప్పటి పాలకుల మనసు కరగక మరమగ్గాలే ఉరికంభాలయ్యాయి.ప్రతి సోమవారం ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి సెలబ్రిటీల వరకూ చేనేత దుస్తులను ధరించాలని మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పం దన లభించింది. ప్రపంచ అగ్రశ్రేణి సినీతారలు, మొదలుకొని సామాన్యుడి వరకూ చేనేత వస్ర్తాలు ధరించాలన్న ఆసక్తి పెరుగడం ఈ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.

ఇప్పుడు పరిస్థితి మారింది. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మీకేం కావాలో మీరే చెప్పండని పాలకులే ముందుకు రావ డం చూస్తుంటే చేనేత కార్మికులకు మంచిరోజులు వచ్చా యని చెప్పక తప్పదు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీ ఆరే చేనేత ప్రతినిధులను పిలిచి మీకేం కావాలో, ఏం చేస్తే మీ బతుకు లు కుదుటపడుతాయో మీరే నిర్ణయించుకొని రండి అనడం బహుశా దేశ చరిత్రలోనే అరుదైన సందర్భం. నిజానికి చేనేత బతుకులే కడు దుర్భరం. నేత వృత్తిలో ఉండటం మాకు శాపమా అని మదనపడే పరి స్థితి నుంచి నేడు ప్రభుత్వ చర్యల వల్ల నేతన్నల గౌరవం పెరుగుతూ వారు ఆర్థిక పరిపుష్టి చెందుతున్నారు. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత తొలిసారి మా స్వగ్రామం సంస్థాన్‌నారాయణపురం వెళ్తుండగా మార్గ మధ్యలో గల కొయ్యలగూడెంలో పలువురు నేతన్నలు నన్ను అక్కడి చేనేత సహకార సంఘం ఆఫీస్‌లోకి తీసుకెళ్లి సత్కరించిన సందర్భంగా వారు నన్నడిగిన మొదటి కోర్కె తమ వద్ద పేరుకుపోయిన ఉత్పత్తులను కొనుగోలు చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించి తమ కష్టాలు తీర్చమని అడిగినప్పుడు బాధనిపించింది.

ఉమ్మడి రాష్ట్రంలో రూ.కోటి 50 లక్షల విలువైన ఉత్పత్తులను కొన మని ఎన్నిసార్లు విన్నవించుకున్నా పాలకులు స్పందించిన దాఖలా ల్లేవు. ఆగస్టు 7 చేనేత దినోత్సవం సందర్భంగా పీపుల్స్‌ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో నల్లగొండ జిల్లా నుంచి వచ్చిన చేనేత సంఘాల ప్రతి నిధులు తమ వద్ద రూ.50 కోట్ల విలువైన ఉత్పత్తులు పేరుకుపోయాయ ని, వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేస్తే బాగుంటుందని నాతో అన్న ప్పుడు వెంటనే నేనీ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తెచ్చాను. దీనిపై స్పందించిన మంత్రి ఉత్పత్తుల జాబితా ఇస్తే వెంటనే కొనుగోలు చేస్తామ నడం చేనేత కార్మికుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తు న్నది. పుట్టపాక చెందిన గజం అంజయ్య పనితనానికి పద్మశ్రీ అవార్డు రాగా ఆయన నేచిన వస్ర్తానికి ఇక్కడ ఆదరణ లేకపోవడం దురదృష్టక రం. మన నేతన్నలు అగ్గిపెట్టెలో పట్టేంత చీరను, దేశ నాయకుల చిత్ర పటాలు, గొల్లభామల చీరెలు ఆద్భుతంగా నేస్తున్నారు. అయినా ఇంత టి అద్భుత నైపుణ్యం ఆదరణకు నోచుకోక గతంలో చేనేత కార్మికులకు ఉపాధి కరువైంది. నాగరికత పుట్టక ముందే ఈ ప్రపంచానికి దుస్తులు ధరించాలని నూలుపోగుతో నాగరికత నేర్పిన ఘనత నేతన్నది. కాలక్ర మేణా ప్రపంచీకరణలో భాగంగా నేతన్నల తలరాత మారి చితికిపోయి నవారి బతుకులు ఆత్మహత్యల వైపు సాగిన దుర్భర పరిస్థితి తలెత్తింది. ప్రపంచీకరణ మనిషి జీవితాన్ని నిలబెట్టాలి. కానీ విచిత్రమేమంటే ప్రపంచీకరణ వల్ల నేతన్న వృత్తి మరుగునపడింది.

చేనేతలు నేచిన వస్ర్తా లను ప్రజలు ఆదరించే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేనేత కుటుంబాల బతుకు చిత్రం మారడానికి ప్రభుత్వం వారి పట్ల కన బరుస్తున్న ప్రత్యేక శ్రద్ధ, సీఎం కేసీఆర్ ఆ వర్గాల పట్ల చూపిస్తున్న ప్రేమ ప్రధాన కారణం. సీం కేసీఆర్‌కు రాష్ట్రంలోని చేనేతల బతుకులపై సంపూ ర్ణ అవగాహన ఉన్నది. కేసీఆర్ చదువుకునే రోజుల్లోనే దుబ్బాక గ్రామం లో చేనేత కుటుంబాలతో ఆయనకున్న అనుబంధం ఈనాటి సమూల మార్పులకు కారణం. చిటికెలు తిప్పడం, కండెలు పట్టడం, రంగులద్ద డం లాంటి పనులు చేస్తూ చేనేత కుటుంబంలోని అందరూ నేత వృత్తిపై ఎలా ఆధారపడి జీవిస్తున్నారో కళ్లారా చూసిన అనుభవం కేసీఆర్‌ది. 2002 ఉద్యమ సమయంలో ఏడుగురు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోగా అప్పటి పాలకులు ఏ మాత్రం స్పందించలేదు. ఆదుకోవాల ని టీఆర్‌ఎస్ పక్షాన ఎన్ని వినతులు చేసినా పాలకులు కరుణించలేదు. దీంతో స్పందించిన కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ పార్టీ నేతలు భిక్షా టన చేసి రూ.ఏడున్నర లక్షలు సమీకరించి ఆ కుటుంబాలను ఆదుకోవ డం ద్వారా వారిలో నైతిక ైస్థెర్యం కలిపించారు. సిరిసిల్ల, దుబ్బాక చేనేత సహకార సంఘాలకు రూ.50 లక్షల చొప్పున టీఆర్‌ఎస్ ద్వారా విరాళం ఇచ్చి వారిలోనూ మనోనిబ్బరం కలిగించారు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్య మంత్రి అయిన తర్వాత శ్రమకు తగిన ఫలితం ఉండాలన్న భావనతో చేనేతల బతుకులు బాగుచేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఉమ్మడి పాలకులు చేనేతల పట్ల ఎంత అగౌరవంగా వ్యవహ రించారంటే మంత్రివర్గంలో చేనేత శాఖను ఒక అప్రధానమైన శాఖగా మార్చారు. బడ్జెట్‌లో కేటాయించిన అరకొర నిధులు నేతన్నల గడపను కూడా తాకలేదు.

నేడు ఐటీరంగంలో తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటుతున్న మంత్రి కేటీఆర్‌కు చేనేత శాఖను అప్పగించారు కేసీఆర్. కేటీ ఆర్ కూడా ఈ శాఖను సవాల్‌గా తీసుకున్నారు. ప్రస్తుతం కేటీఆర్ ఎమ్మె ల్యేగా ఉన్న సిరిసిల్ల ప్రాంతం గతంలో పాలకుల పాపాల వల్ల ఉరిసిల్లగా మారిన విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకున్నారు. అందుకే చేనేత రం గానికి జవసత్వాలిచ్చే కృషికి సిరిసిల్లలోనే అంకురార్పణ చేశారు. ఓ వైపు ఐటీ రంగాన్ని పరుగులు పెట్టిస్తూనే మరోవైపు ప్రత్యేక కృషితో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపడానికి శాస్త్రీయ దృక్పథంతో ప్రణాళికాబద్ధం గా వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం 2017-18బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ.1270 కోట్లు కేటాయించిం ది. మంత్రి కేటీఆర్ గతేడాది నేతన్నకు చేయూత అనే పొదుపు పథకా న్ని ప్రారంభించారు. నేతన్నల నుంచి ఒక్క పైసా వసూలు చేయకుండా వారికి జీవితాంతం అమలయ్యేలా ప్రభుత్వం బీమా పథకాన్ని తీసుకువ చ్చింది. సిరిసిల్లలో మరమగ్గాల ఆధునీకరణకు వంద శాతం సబ్సిడీ అం దిస్తున్నారు. వచ్చే ఐదేండ్లలో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయన్న అంచనాతో వరంగల్ రూరల్ జిల్లాలోని శాయంపేట హవేలీలో 1190 ఎకరాల విస్తీర్ణంలో రూ.1075 కోట్ల వ్యయంతో దేశంలోనే అతిపెద్ద వస్త్రనగరి (మెగా టెక్స్‌టైల్ పార్క్)ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వస్త్రనగరి పూర్తయితే గత పాలకుల నిర్లక్ష్యానికి బలై సూరత్‌కో, ఔరంగాబాద్‌కో, ముంబైకో వలస వెళ్లిన నేతన్నలంతా వాపస్ వచ్చే అవకాశం ఉన్నది. ప్రధానంగా నేతన్నలు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య అప్పుల బాధ. వారు ఆత్మహత్యలు చేసుకోవడానికి ముఖ్య కారణం తెచ్చిన అప్పులను తీర్చే మార్గమే కనిపించకపోగా కనీసం వడ్డీలూ చెల్లించలేని దుర్భర స్థితి. దీన్ని గ్రహించిన ప్రభుత్వం చేనేతలను రుణవిముక్తులను చేయడానికి తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడటానికి పూర్వం ఉన్న రుణాలతో పాటు ఈ నాలుగేండ్లలో చేసిన అప్పులను కూడా మాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్త ర్వులు జారీచేసింది. దీనివల్ల చేనేత కుటుంబాలు సంపూర్ణంగా కుదుట పడ్డాయని చెప్పవచ్చు. ఇంకా నూలు, యార్న్‌కు, రసాయనాలు, సిల్క్, ఉన్ని, డై తదితర ముడిసరుకును 50 శాతం సబ్సిడీ ఇవ్వాలనే ప్రభు త్వ నిర్ణయం నేతన్నల పాలిట వరం. ముఖ్యంగా థ్రిప్టు పథకం గురించి మనం చర్చించుకోవాలె.

ఈ పథకం గతంలో కేవలం సహకార సంఘా ల్లో ఉన్న నేతన్నలకే వర్తించేది. కానీ ఇప్పుడు సహకార సంఘాల్లో సభ్యు లుగా లేనివారు కూడా థిప్ట్ ప్రయోజనాలు పొందవచ్చు. వీళ్లతోపాటు డైయింగ్, డిజైనింగ్, వార్ఫింగ్, వైండింగ్, సైజింగ్, వంటి నేత అనుబం ధ కార్మికులూ ఈ పథకానికి అర్హులు. మొదటిసారిగా మరమగ్గాల కార్మి కులకు కూడా థ్రిప్ట్ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించ డం వంటివన్నీ నేతన్నల సామాజిక, ఆర్థిక, వృత్తి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడానికే. నేచిన వస్ర్తాలకు మార్కెట్లో సరైన ధరలు కలిపించడం, జియో ట్యాగింగ్ ద్వారా చేనేత కుటుంబాలను గుర్తించడం వంటి చర్య లతో ప్రభుత్వం నేతన్నల్లో మనోనిబ్బరం కలిగించింది. చేనేతల తలరా త మార్చడానికి ప్రభుత్వం తీసుకున్న మరో అతి ముఖ్య నిర్ణయం వస్ర్తా ల కొనుగోలు పథకం. బతుకుమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్‌కార్డ్ ఉన్న మహిళలందరికీ చీరలను పండుగ కానుకగా అం దించడానికి, ఏటా కుల, మతాలకతీతంగా అన్నివర్గాల వారికి వారివారి పండుగల సందర్భంగా దుస్తులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చేనేత వస్ర్తాలను కొనుగోలు చేయడం వల్ల తమ కష్టానికి తగిన ఫలితం వస్తున్నదన్న భరోసా కలిగింది. ముఖ్యంగా ప్రతి సోమవారం ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి సెలబ్రిటీల వరకూ చేనేత దుస్తు లను ధరించాలని మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పం దన లభించింది. ప్రపంచ అగ్రశ్రేణి సినీతారలు, మొదలుకొని సామా న్యుడి వరకూ చేనేత వస్ర్తాలు ధరించాలన్న ఆసక్తి పెరుగడం ఈ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. గత ప్రభుత్వాలు ఈ రకమైన చర్యలు తీసుకొని ఉంటే చేనేత కార్మికుల ఆత్మహత్యల పరంపర కొనసాగి ఉండేది కాదు. సిరిసిల్ల, దుబ్బాక, పోచంపల్లి, సంస్థాన్‌నారాయణపురం, పుట్టపాక, చండూరు తదితర గ్రామాల చేనేత కుటుంబాల్లో విషాదం నెలకొని ఉం డేదికాదు. ఇప్పుడు చేనేత కార్మికులు కూడా శాస్త్రీయంగా ఆలోచించాలె. ప్రభుత్వ సహకారంతో వస్ర్తాల తయారీలో సృజనాత్మకత పాటించి తెలంగాణ చేనేతరంగం ప్రపంచానికే పాఠాలు నేర్పాలె. -(వ్యాసకర్త: రాష్ట్ర శాసనమండలి సభ్యులు) కర్నే ప్రభాకర్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.