Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మేముసైతం..టీఆర్‌ఎస్ సభ్యత్వాలకు జన నీరాజనం

-వాడవాడలా బ్రహ్మరథం -సభ్యత్వం కోసం క్యూ కడుతున్న ప్రజలు -మించిపోయిన అంచనాలు..కొత్త పుస్తకాల కోసం ఆర్డర్లు -వరంగల్‌లో రికార్డుస్థాయిలో నాలుగు లక్షల సభ్యత్వాలు

Membership-drive-in-warangal ఉదయం తొమ్మిది దాటిందంటే ఊరూరా గులాబీ పరిమళం! పది మంది కార్యకర్తలు.. చేతిలో ఒక సభ్యత్వ నమోదు పుస్తకం. ఇంటింటికి వెళ్లినవారికి ఆత్మీయస్వాగతం! రెండు వాడలు తిరిగేటప్పటికి కొత్త పుస్తకం తీయాల్సిందే! ఇదీ సూక్ష్మంగా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కొనసాగుతున్న తీరు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకు చేరువుతుండడంతో సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన వస్తున్నది. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటామంటూ అనేక వర్గాలు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వం నమోదు చేసుకుంటున్నాయి. విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళలు, అన్నివర్గాల సభ్యత్వం కోసం ముందుకొస్తున్నారు. అనూహ్య స్పందన వస్తుండడంతో అన్ని జిల్లాల్లో అంచనాలను మించి సభ్యత్వాలు నమోదవుతున్నాయి. గడువు ముగిసేలోగా లక్ష్యాన్ని మించి అదనంగా సభ్యత్వాలు నమోదు చేస్తామని పార్టీ వర్గాలు ఉత్సాహంగా చెబుతున్నాయి. నియోజకవర్గానికి 25వేల సాధారణ, 5వేల క్రియాశీలక సభ్యత్వాలను లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ గడువు(ఈనెల20)లోగా లక్ష్యాన్ని దాటి ఒక్కో నియోజకవర్గంలో 40నుంచి 45వేల సభ్యత్వాలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఏకైక రాజకీయశక్తిగా టీఆర్‌ఎస్: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలంగాణలో టీఆర్‌ఎస్ ఏకైక రాజకీయశక్తిగా ఎదుగుతుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం హన్మకొండలోని టీఆర్‌ఎస్ అర్బన్‌పార్టీ కార్యాలయంలో పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయ్‌భాస్కర్, పార్టీ పరిశీలకుడు బాలమల్లు నుంచి ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులవుతూ పార్టీ సభ్యత్వ నమోదుకు పోటీ పడుతున్నారన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ప్రజలు ముందుకొస్తున్నారని చెప్పారు. జిల్లా టార్గెట్ మూడు లక్షల 60వేలని, శుక్రవారం సాయంత్రం వరకు సభ్యత్వ నమోదు నాలుగులక్షలకు చేరుకుందని తెలిపారు. 20వ తేదీ నాటికి ఐదులక్షలు మించిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుకుగా సాగుతున్నది. తూర్పులో అర్బన్ పార్టీ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పాలకుర్తిలో నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఎన్ సుధాకర్‌రావు, డోర్నకల్‌లో ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, పరకాలలో చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతున్నది.

కరీంనగర్‌లో ఉత్సాహంగా సభ్యత్వ నమోదు కరీంనగర్ జిల్లాలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ఉద్యమస్ఫూర్తితో సాగుతున్నది. శుక్రవారం నాటికి జిల్లాలో 2లక్షల80 వేల సభ్యత్వం పూర్తయింది. కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ కరీంనగర్ ప్రతిమా మల్టీప్లెక్స్‌లో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు సభ్యత్వం అందించారు. వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఎంపీ బాల్క సుమన్ ఓయూ హాస్టల్ నుంచి పార్లమెంట్‌కు వచ్చిన విద్యార్థి నాయకుడని కొనియాడారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాల ఫలితంగా పార్టీలో చేరేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని, తామంతా తలలు ఎత్తుకుని ముందుకు సాగుతున్నామన్నారు. ఎంపీ వినోద్‌కుమార్‌తోపాటు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పార్టీ కన్వీనర్ ఈద శంకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు. బోయినపల్లి మండలంలో జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే బొడిగశోభ సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణాకాలనీలో తెలంగాణ సాంస్కృతిక సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మల్హర్‌లో ఎమ్మెల్యే పుట్ట మధు, గోదావరిఖనిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, ధర్మపురి మండలంలో చీప్‌విఫ్ కొప్పుల ఈశ్వర్, హుస్నాబాద్‌లో పార్లమెంటరీ కార్యదర్శి వొడితల సతీష్‌కుమార్, కోరుట్ల మండలంలో ఎమ్మెల్యే కే విద్యాసాగర్‌రావు సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌లో దాటిన అంచనాలు అంచనాలకు మించి ఆదిలాబాద్ జిల్లాలో సభ్యత్వ నమోదు జరుగుతుండటంపై పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఆనందం వ్యక్తంచేశారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల పలువురు ఆకర్షితులవుతున్నారని, అందుకే మిగతా పార్టీలకంటే ఊహించని విధంగా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోందన్నారు. బోథ్ మండలం పాట్నాపూర్‌లో ఎంపీ గెడం నగేశ్ సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. జిల్లాలో ఇప్పటికే 2.30 లక్షల సభ్యత్వ నమోదు పూర్తయింది.

ప్రథమస్థానం దిశగా పాలమూరు పరుగు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదులో వరంగల్ జిల్లా తరువాత రెండో స్థానంలో నిలిచిన పాలమూరు జిల్లా ప్రథమ స్థానం దిశగా పరుగు తీస్తుంది. కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తూ గడువులోగా నిర్ణీత లక్ష్యాన్ని అధిగమించాలని కృషి చేస్తున్నారు. శుక్రవారం నారాయణపేటలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఎంపీ కవిత హాజరుకావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. జిల్లాలో మొత్తం 4.2లక్షల మందిని పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జి జల్లా మార్కండేయ, జిల్లా కన్వీనర్ విఠల్‌రావు ఆర్యా పర్యవేక్షణలో మంత్రులు లకా్ష్మరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి, పార్లమెంటరీ సెక్రటరీ శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

బర్త్‌డే కానుకగా భారీ సభ్యత్వాలు ఇవ్వాలి: జలగం బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు కానుకగా ఈ నెల 17నాటికి ఖమ్మం జిల్లా నుంచి అత్యధిక సభ్యత్వాలను చేసి ఇవ్వాలని శ్రేణులకు పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకటరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో చుంచుపల్లి పంచాయతీ కేంద్రంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యురాలు, సభ్యత్వ నమోదు ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్ సత్యవతి రాథోడ్ నుంచి జలగం వెంకటరావు సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఏ పనిచేసినా కరెక్టుగా చేస్తారని, పట్టుదల కలిగిన వ్యక్తి కాబట్టే అన్ని ప్రభుత్వశాఖలపై నిత్యం సమీక్ష జరుపుతున్నారన్నారు. సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ జిల్లాలో రెండు లక్షల 50 వేల సాధారణ సభ్యత్వాలు, 50 వేల క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయించాలని లక్ష్యం గా పెట్టుకున్నామన్నారు.

మెదక్‌లో మూడు లక్షలకు చేరువలో సభ్యత్వాలు మెదక్ జిల్లాలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు జోరందుకున్నది. లక్ష్యానికి మించి సభ్యత్వాలు నమోదుకావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నది. జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 3లక్షల సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. శుక్రవారం నాటికి సభ్యత్వ నమోదు 2.75 లక్షలకు చేరుకున్నది. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్, మంత్రి హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గాల్లో సభ్యత్వనమోదు లక్ష్యాన్ని మించిపోతున్నది. ప్రతి నియోజకవర్గంలో 2.5 లక్షల సాధారణ, 50వేల క్రియాశీల సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకోగా సిద్దిపేటలో 65వేలు, గజ్వేల్‌లో 60వేలు సభ్యత్వాలు నమోదయ్యాయి. పటాన్‌చెరు, మెదక్, సంగారెడ్డి, దుబ్బాక నియోజకవర్గాల్లో కూడా సభ్యత్వాలు జోరుగా సాగుతున్నాయి. సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జి మందుల సామెల్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

ఇందూరులో అనూహ్య స్పందన టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం డిచ్‌పల్లి మండలం ఇందల్వాయి స్టేషన్‌లో సభ్యత్వ నమోదులో ఆయన పాల్గొని ముగ్గురికి సభ్యత్వం అందించారు. బోధన్ మండలం భవానీపేట్‌లో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు వినూత్న తరహాలో కొనసాగింది. పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ రజాక్ నాయకత్వంలో గులాబీ రంగు గొడుగులతో గ్రామంలో యువకులు ర్యాలీ నిర్వహించారు. తర్వాత గులాబీ గొడుగుల నీడలో సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి ఆన్‌లైన్‌లో సభ్యత్వాన్ని నమోదు చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే నిజాంసాగర్, జుక్కల్ మండల కేంద్రాల్లో, కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ భిక్కనూరు మండల కేంద్రంలో సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. కామారెడ్డి రోటరీ క్లబ్ ఆడిటోరియంలో సభ్యత్వ నమోదు ఆన్‌లైన్ కేంద్రాన్ని జిల్లా సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి రూప్‌సింగ్ పరిశీలించారు. జిల్లా అడ్‌హక్ కమిటీ సభ్యుడు ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి ఆర్మూర్‌లో సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. ఎడపల్లి మండలం అంబం గ్రామంలో సభ్యత్వ నమోదు అడ్‌హక్ కమిటీ సభ్యుడు శరత్‌రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిచ్‌పల్లిలో సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలతో సమీక్ష నిర్వహించారు.

నల్లగొండలో గులాబీ దూకుడు సభ్యత్వ నమోదులో నల్లగొండజిల్లాలో టీఆర్‌ఎస్ దూకుడు రోజురోజుకూ పెరుగుతుంది. 3.60 లక్షల సభ్యత్వాలు లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో లక్ష్యం చేరుకున్నారు. శుక్రవారం మునుగోడు మండలంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సభ్యత్వాలు ఇచ్చారు. నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండలంలోగులాబీ శ్రేణులు భారీగా సభ్యత్వాలు చేయించాయి. సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జి శ్రవణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం పలుచోట్ల సభ్యత్వాలు అందజేశారు. దేవరకొండ, పీఏపల్లి మండలం అంగడిపేటలో జెడ్పీచైర్మన్ బాలునాయక్ సభ్యత్వాలు చేయించారు.

యాదగిరిగుట్టలో నియోకవర్గ యువజన విభాగం కన్వీనర్ రవీందర్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ సభ్యత్వం చేయించారు. మిర్యాలగూడ పట్టణంలోని 20, 36వ వార్డులతోపాటు వేములపల్లి మండల కేంద్రం, దామరచర్ల మండలంలోని నర్సాపురం,యడవెల్లి గ్రామాల్లో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి అల్గుబెల్లి అమరేందర్ సమక్షంలో సభ్యత్వాలు చేయించారు. హూజుర్‌నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండల పరిధిలోని పెద్దవీడు, హూజుర్‌నగర్ మండలంలోని లక్కవరం, హూజుర్‌నగర్ పట్టణాల్లో నియోజకవర్గ ఇన్‌చార్జి కాసోజు శంకరమ్మ ఆధ్వర్యంలో సభ్యత్వాలు చేర్పించారు. కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం, కోదాడలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు సమక్షంలో సభ్యత్వాలు అందజేశారు.

రంగారెడ్డిలో ఉద్ధృతంగా సభ్యత్వ నమోదు రంగారెడ్డి జిల్లాలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ఉద్ధృతంగా సాగుతోందని ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య వెల్లడించారు. శుక్రవారం శంకర్‌పల్లి,షాబాద్ మండలాల్లో పార్టీ సభ్యత్వ నమోదులో వారు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పార్టీ ఇన్‌చార్జీ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, మేడ్చల్‌లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వాలు చేయించారు.

గ్రేటర్‌లో బ్రహ్మరథం పడుతున్న జనం రాజధాని నగరంలో టీఆర్‌ఎస్ సభ్యత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గల్లీగల్లీలో పండగ వాతావరణం నెలకొంటున్నది. సభ్యత్వ సేకరణ కోసం ఎన్నికల ప్రచారం మాదిరిగా ఇంటింటికి వెలుతున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలకు మహిళలు ఎదురేగి స్వాగతం పలుకుతున్నారు. ఇండ్లల్లోకి ఆహ్వానించి సభ్యత్వం స్వీకరిస్తున్నారు. బోరబండలోనైతే ప్రజలు పోలింగ్ కేంద్రంలో నిల్చున్న మాదిరిగా బారులు తీరి సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వానికి వస్తున్న స్పందనతో క్యాడర్‌లో ఉత్సాహం పెరుగుతుంది. వందలాది మంది ద్వితీయశ్రేణి నాయకులు నిరంతరం సభ్యత్వ కార్యక్రమంలో నిమగ్నమై పనిచేస్తున్నారు.

ఈ సందర్భంలో ఇతర పార్టీలకు చెందిన రెండవశ్రేణి క్యాడర్ పెద్ద మొత్తంలో గులాబీ కండువాలను కప్పుకుని తెలంగాణ పునర్నిర్మాణంలో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. గ్రేటర్‌లో పార్టీ సభ్యత్వ ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, అడ్‌హాక్ కన్వీనర్ మైనంపల్లి హన్మంతరావు, మంత్రులు నాయిని, తలసాని, పద్మారావు, పట్నం మహేందర్‌రెడ్డి,తుమ్మల నాగేశ్వర్‌రావు సభ్యత్వ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జిలు అంతర్గతంగా ఉన్న అభిప్రాయభేదాలను వీడి పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.