తెలంగాణ భవన్లో సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు పలువురు టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి ప్రతిమకు, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు ఎం శ్రీనివాస్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బండి రమేశ్, రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి, సాట్స్ చైర్మన్ ఏ వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, కాజా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


