Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మిషన్ కాకతీయ వైపు ప్రపంచం చూపు

-నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరే లక్ష్యంగా ముందుకు -అమరుల కలలను నిజం చేసేలా ఆకుపచ్చని తెలంగాణ -భారీ నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

Harish Rao

ఇప్పుడు అందరి దృష్టి మిషన్ కాకతీయపైనే ఉందని, ఇప్పటికే అమెరికా విద్యార్థులు పరిశోధకోసం వచ్చారని, మధ్యప్రదేశ్‌లోనూ దీనిని అమలుచేయాలని కేంద్ర మంత్రి ఉమాభారతి యోచిస్తున్నారని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. కరీంనగర్ శివారు ఎల్‌ఎండీలోని నీటిపారుదల శాఖ కార్యాలయ ఆవరణలో ఆ శాఖ ఉద్యోగులు నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని శాసనమండలి చైర్మన్ కే.స్వామిగౌడ్‌తో కలసి మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మిషన్ కాకతీయపై ఏర్పాటుచేసిన సదస్సులో మంత్రి మాట్లాడారు. మిషన్ కాకతీయ ద్వారా ప్రతి శాసనసభ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు.

ఈ ఏడాది తొమ్మిది జిల్లాలో 9వేల చెరువులను పునరుద్ధరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 46వేల చెరువులుండగా, వాటిని పునరుద్ధరిస్తే 265 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని తద్వారా బోర్లలో నీరు ఉంటుందని చెప్పారు. చెరువులు ఊరికి ప్రాణాధారమని, చెరువుల పునరుద్ధరణకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రపంచ వ్యాప్తంగా దాతలు ముందుకొస్తున్నారని తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎక్కడా లేని విధంగా తెలంగాణలో చెరువులు ఉన్నాయని, నాటి కాకతీయుల నిర్మాణాన్ని ప్రజలు నేటికీ గుర్తుచేసుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణకు నడుంబిగించి ఒక యజ్ఞంలా ముందుకు తీసుకుపోతున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ను భవిషత్ తరాలు గుర్తుపెట్టుకుంటాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

ప్రాణహితకు జాతీయ హోదా సాధిస్తాం ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హరీశ్‌రావు అన్నారు. ఈ ప్రాజెక్టు విషయంపై కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలపై జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా రావాలంటే 16 అనుమతులు కావాలని, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం అటవీ శాఖ క్లియరెన్సు కూడా సాధించలేకపోయిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్రమోడీని కలిసి జాతీయ హోదా ఇవ్వాలని కోరారని, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని రెండు సార్లు కలిసి ప్రాజెక్టు గురించి చర్చించారని గుర్తుచేశారు.

2008లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి తెలంగాణ సిద్ధించిన జూన్ 2, 2014 వరకు కూడా అటవీ శాఖ అనుమతి సాధించలేదని విమర్శించారు. తాము అటవీశాఖకు ప్రత్యామ్నాయంగా ఎనిమిది వేల ఎకరాలివ్వడమే కాకుండా ఆ భూమిలో అటవీ సంపద పెంపొందిస్తామనే అంగీకారంతో ప్రాజెక్టు కోసం సాధనకు కృషిచేశామని గుర్తుచేశారు. గిరిజన భూములను గుర్తించి వాటిని సేకరించి వారికి ప్రత్యామ్నాయ కేటాయింపులు చేసేలా మోటా క్లియరెన్స్ కోసం ప్రయత్నిస్తున్నామని వివరించారు. అన్నీ తెలిసిన జీవన్‌రెడ్డి ఈ విధంగా మా ట్లాడడం విచిత్రంగా ఉందని, ఆది ఆయన విజ్ఞతకే వదలేస్తున్నట్లు చెప్పారు.

యుద్ధప్రాతిపదికన మధ్యమానేరు పూర్తి మధ్యమానేరు పనులను ఇప్పటికే వేగవంతం చే శామని, యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని మంత్రి హరీశ్ హామీ ఇచ్చారు. అలాగే ఎల్లంపల్లి భూ నిర్వాసితులకు పరిహారం అందించే ప్రక్రి య పూర్తిచేస్తామని, వచ్చే ఏడాది వరకు ప్రాజెక్టులో నీళ్లు నింపి వినియోగంలోకి తెస్తామని చెప్పారు. కృష్ణా బేసిన్ పరిధిలో డివిజన్ నీటి పారుదల కార్యాలయాన్ని నల్లగొండలో ఏర్పాటుచేశామని, గోదావరి బేసిన్‌కు సంబంధించి త్వరలో కరీంన గర్‌లో ఏర్పాటుచేస్తామని తెలిపారు. తెలంగాణ అమరుల స్ఫూర్తితో అందరూ పనిచేయాలని, ఇదొక బాధ్యతగా భావించి మిషన్ కాకతీయను ముందుకు నడిపించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. అమెరికా విశ్వవిద్యాలయ బృందం పరిశోధనకు వచ్చిందని, మధ్యప్రదేశ్ బృందం కూడా రానుందని చెప్పారు. ఇక్కడ విజయవంతమైతే తమ రాష్ట్రంలో ప్రా రంభించాలని కేంద్ర మంత్రి ఉమాభారతి ఆలోచిస్తున్నారు.

-ముందుకొస్తున్న దాతలు మిషన్ కాకతీయకు మంచి స్పందన వస్తోందని అమెరికాలో చాలామంది తమ తమ గ్రామాల్లోని చెరువుల పునరుద్ధరణకు ముందుకు వస్తున్నారన్నారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, నియోజకవర్గానికి చెందిన గట్టనర్సింగాపూర్‌కు చెందిన కావేరి సీడ్స్ యజమాని భాస్కర్‌రావు రెండు కోట్లు అందించి మూడు చెరువుల పునరుద్ధరణకు ముందుకొచ్చారని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణమే లక్ష్యంగా వీరంతా ముందుకొస్తున్నారని పేర్కొన్నారు.

-అమరుల స్ఫూర్తితో పనిచేద్దాం అమరవీరుల స్ఫూర్తితో బంగారు తెలంగాణలో భాగస్వాములమవుతూ ఆకుపచ్చ తెలంగాణను నిర్మిద్దామని మంత్రి పిలుపునిచ్చారు. అమరుల చిహ్నంగా ఉద్యోగులు నిర్మించిన మొదటి స్తూపం ఇదేనన్నారు. ఇళ్లే కార్యాలయంగా పనిచేసి లక్ష్యా న్ని సాధించాలన్నారు.

-ఉద్యోగులకు వరాలు నీటిపారుదల ఉద్యోగులు చేసిన విజ్ఞప్తులను ఓపికగా విన్న మంత్రి హరీశ్‌రావు కొన్ని వరాలిచ్చారు. ఆ శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగ దీశ్వర్ సూచనల మేరకు ఎల్‌ఎండీ కార్యాలయ ఆ వరణలో సంఘం కార్యాలయ భవన నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇళ్ల స్థలాల విషయంపై స్పందిస్తూ నాగార్జునసాగర్ స్థలంలో ఒక మాజీ అడ్వకేట్ జనరల్ నివాసముండడం చిత్రంగా ఉందని, ఇలాంటి వారిని పంపించి అందుబాటులో ఉన్నవారికి అనువైన చోట స్థలాలు, క్వార్టర్లు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోషన్ల విషయంలో సానుకూలంగా ఉన్నారని ఖాళీలను భర్తీచేస్తా రని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.