Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మిత్రులెవరు? శత్రువులెవరు?

కేసీఆర్ పద్నాలుగేండ్ల పాటు ఉద్యమంలో ప్రజలతో భాగస్వాములై తెలంగాణ ప్రజల పక్షాన నిలిచి రాష్ర్టాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించారు. ఆ విషయం యావత్ ప్రజానీకానికి తెలుసు. కానీ, అలాంటి వ్యక్తిపై కక్షగట్టిన విషనాగుల పార్టీలు తెలంగాణ ప్రాంతాన్ని వల్లకాడుగా చేయడానికి సిద్ధమయ్యారు.

భూమి కోసం, భుక్తి కోసం పీడితవర్గాల అభ్యున్నతి కోసం ఇప్పటికింకా మావోయిస్టు పార్టీలు పోరాడుతూనే ఉన్నాయి. దేశంలో ఎమర్జెన్సీ అనంతరం నాడు గ్రామాల్లో నక్సల్ ప్రభావం తీవ్రంగా ఉండేది. దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి. నక్సలైట్లకు అనుబంధంగా ఉన్నటువంటి జన నాట్యమండలి సాంస్కృతిక విప్లవానికి బీజం పోసింది. ప్రజా గొంతుగా పేరొందిన గద్దర్ సారథ్యంలో పాటలతో గ్రామాలన్ని మారుమోగాయి. వరంగల్ జిల్లాలో హన్మకొండ ప్రాంతంలోని జీవన్‌లాల్ మైదానంలో వేలాదిమంది ప్రజలతో జన నాట్యమండలి సభలు అనేకమంది యువతీ యువకులను, మేధావులను, ఆకర్షించాయి, అలా ఆకర్షింపబడిన వారిలో నేనొకడిని. ఆ ప్రభావం రాడికల్ విద్యార్థి సంఘంలో చురుకైన పాత్ర పోషింపజేశాయి. అంతేకాదు 1983-85 వరకు నేను ఎస్వీలో పీ.జీ చదువుతున్న రోజుల్లో రాడికల్ విద్యార్థి సంఘానికి బాధ్యతలు నిర్వర్తించాను. అలా గద్దర్‌తో పరిచయం పెరిగింది. ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలున్నాయి. నిజమే నాటిరోజుల్లో గద్దర్ పీడిత వర్గాల ప్రజల కోసం పోరాటం చేశా రు. అంతేకాదు తన జీవితాన్ని సైతం పేద ప్రజల కోసం వెచ్చించారు. నాటి టీడీపీ గద్దర్‌పై హత్యాయత్నం చేసింది. తన శరీరంలో బుల్లెట్ల వర్షం కురిపించారు. టీడీపీ వైఖరిని దేశం మొత్తం ముక్తకంఠంతో ఖండించింది. ఎందుకంటే గద్దర్ ఒక ప్రజా గొంతుక కాబట్టి. రోజులు మారిన తర్వాత గద్దర్ విప్లవోద్యమానికి వీడ్కోలు పలికి బహుజనుల పక్షాన నిల్చారు. లాల్ నీల్ జెండాలు కలిస్తే రాజ్యాధికారం బహుజనులదే అనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించారు. బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్‌తో కలిసి సీపీఎం పార్టీతో జత కలిసి వేదికలు పంచుకోవడమే కాకుండా ప్రజానీకాన్ని చైతన్యం చేశారు.

అందుకు గద్దర్‌ను అభినందించాల్సిందే! కానీ ఇప్పుడు కాంగ్రెస్‌తో జత కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్న తీరు చూస్తే ఆశ్చర్యం కల్గిస్తుంది. ఇన్నేండ్లు గుర్తుకురాని ప్రజాస్వామ్యం ఇప్పుడెందుకు గుర్తొచ్చిందో అనే అనుమానాలు కలుగుతున్నాయి. నాడు ఎంతోమంది యువకులు విప్లవోద్యమంలో చేరి పేద ప్రజల కోసం శక్తివంచన లేకుండా పోరాటాలు చేయడమే కాకుండా ప్రాణాలు సైతం కోల్పోయారు. ఉద్యమంలో పనిచేసిన వేలాదిమంది పేదలను పొట్టన పెట్టుకున్నాయి నాటి టీడీపీ, కాంగ్రెస్‌లు. నక్సలిజాన్ని అణిచివేసిం ది కూడా ఆ రెండు పార్టీలే! ఉద్యమాన్ని అణిచివేయడమే కాకుండా సానుభూతిపరులను కూడా హతం చేసింది కూడా టీడీపీ కాంగ్రెస్‌లే! 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ శాంతిచర్చల పేరిట మావోయిస్టులతో చర్చలకు సిద్ధమే అని చెప్పి చర్చలు విఫలమయ్యేలా చేసింది. మావోయిస్టుల మూలాలను, ఆచూకిని తెలుసుకున్న కాంగ్రెస్ అన్యాయంగా వేలాదిమంది మావోయిస్టులను హత్యచేసింది. అలాంటి పార్టీతో గద్దర్ చేతులు కలుపడం వెనుకున్న ఆంతర్యమేంటి? పేదలను చంపిన కాంగ్రెస్‌తోనే ప్రజాస్వామ్యం రక్షించబడుతుందని నీతులు వల్లిస్తున్నారు గద్దర్. కానీ గద్దర్ ద్వంద్వ వైఖరిని ప్రజలు ఎలా నమ్ముతారు. అందువ ల్ల నేడు ఉద్యమంలో పనిచేసిన వారంతా గద్దర్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రజాస్వామ్యం ఏ విధంగా కూనీ అయిందో గద్దర్ చెప్పగలడా! తెలంగాణ పోలీసు యంత్రాంగం ఇప్పుడు ప్రజలతో కలిసి అభివృద్ధిలో భాగస్వామ్యమవుతుంది. ఆ విషయం కూడా గద్దర్‌కు తెలియంది కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ కుయుక్తులకు, గద్ద ర్ మోసపోయారనడంలో సందేహం లేదు.

గద్దర్ రాజకీయ అరంగ్రేటం చేయడంలో తప్పులేదు. పదవులు ఆశిం చడం కూడా తప్పు కాదు. కానీ వేలాదిమంది మావోయిస్టులను పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్‌తో జత కలిసి పనిచేయడం క్షమించరాని నేరంగానే భావించాలి. గద్దర్ పాటలకు, మాటలకు ప్రేరేపితులై ఉద్యమంలో అసువులు బాసిన ఆ అమరుల కుటుంబాలకు గద్దర్ ఏమని సమాధానం చెబుతారు. కాంగ్రెస్‌ను బొంద పెట్టాలన్నవాడే నేడు ఆ గూటికి రక్షణగా నిలుస్తున్నాడంటే అమరుల త్యాగాలకు విలువ ఎక్కడుంది? అంటే గద్దర్ కేవ లం పదవుల కోసమే ఆరాటపడుతున్నట్లు కనబడుతుంది. నిజంగా గద్దర్ ప్రజల పక్షంగా పోరాటం చేయాలనుకుంటే ప్రజాస్వామ్యవాదులతో కలి సి ఒక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటుచేయాల్సింది. అప్పుడు ప్రజలు హర్షించేవారు, అలాగే ప్రజా మద్దతు తోడయ్యేది! కానీ కేవలం తన స్వలాభం కోసమో, లేదా తన కుమారుని రాజకీయ భవిష్యత్తు కోసమో కాంగ్రెస్‌తో అంటకాగుతున్నారు తప్ప ప్రజాస్వామ్యం కాపాడటానికి కాదనేది ప్రజలు గ్రహించాలి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుక ఉండాలి. పాలక పార్టీల తప్పొప్పులను వెలగెత్తి చూపాలి. కానీ ఆ గొంతుక కేవలం స్వప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌తో కలిసిపోవడమనేది పోరాటాల చరిత్రను అవహేళన చేయడమే అని భావించాలి. తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే దేశంలో అగ్రగామిగా నిలి చింది. ఆ విషయం గద్దర్‌కు కూడాతెలుసు. తెలంగాణలో నేడు అనేక వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి. అందులో నిమ్న వర్గాలు కూడా అభి వృద్ధి బాటలోకి పయనిస్తున్నాయి. ముఖ్యంగా విద్యారంగం ద్వారానే అనేక వర్గాలు అభివృద్ధి బాటలోకి వస్తాయి. కాబట్టి నేడు తెలంగాణలో విద్యారంగం పటిష్టమైంది.

కార్పొరేట్ మాయజాలంలో పడిన అనేకమంది పేదవర్గా ల ప్రజల తమ పిల్లల చదువు ల కోసం ఆస్తులను సైతం అమ్ముకుటున్నవంటి పరిస్థితి. కానీ నేడు తెలంగాణలో విద్యారంగ ఫలాలు ప్రతి పేదవారికి అందుతున్నాయి. కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ విద్యార్థుల ప్రగతికి బాటలు వేస్తుంది. అలాగే రైతన్న లు సల్లగుండాలనే తపనతో తెలంగాణ ప్రభుత్వం రైతులకు మేలుచేసే విధివిధానాలు అమలుచేస్తూ వారికున్న కష్టాలను అడ్డు తొలిగిస్తుంది. అలాగే వైద్య రంగాన్ని కూడా బలోపేతం చేస్తూ పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నది. పేద ప్రజలకు ఆసరా పథకంతో అండగా నిలుస్తున్నది. అందుకోసమే ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. కానీ, రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రజా వ్యతిరేక పార్టీలు మాత్రం కేవలం తమ వ్యక్తిగత కక్షలతో ప్రజలను పాలక పార్టీపై ఉసిగొల్పుతున్నారు. దొర ల పాలన అంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. టీడీపీ కాంగ్రెస్ పార్టీలు 58 ఏండ్ల పాటు పాలించారు. ఆ పార్టీలో ఉన్నది దొరలు కాదా! రాష్ర్టాన్ని పాలించింది దొరలు కాదా! వారి పాలనలో అణగారినవర్గాల ప్రజలు ఏ మేరకు అన్యాయానికి గురయ్యారో గద్దర్‌కు తెలువదా? తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ దొరలు తెలంగాణకు వ్యతిరేకంగా పోరాడిన వైనం తెలంగాణ ప్రజానీకానికి తెలయంది కాదు, కానీ, కేసీఆర్ పద్నాలుగేండ్ల పాటు ఉద్యమంలో ప్రజలతో భాగస్వాములై తెలంగాణ ప్రజల పక్షాన నిలిచి రాష్ర్టాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించారు.

ఆ విషయం యావత్ ప్రజానీకానికి తెలుసు. కానీ, అలాంటి వ్యక్తిపై కక్షగట్టిన విషనాగుల పార్టీలు తెలంగాణ ప్రాంతాన్ని వల్లకాడుగా చేయడానికి సిద్ధమయ్యా రు. ఆ దొరల పార్టీలను, దొంగల పార్టీలను అడ్డుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజానికంపై ఉంది.తస్మాత్ జాగ్రత్త!
(వ్యాసకర్త: కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.