Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఎమ్మెల్సీ అభ్యర్థిగా…దేవీప్రసాద్ నామినేషన్

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల శాసనమండలి స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తెలంగాణ ఎన్జీవోల సంఘం కేంద్ర కమిటీ మాజీ అధ్యక్షులు జీ దేవీప్రసాద్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.

-ధూం ధాంగా దేవీప్రసాద్ నామినేషన్ -గన్‌పార్క్‌లోని అమరుల స్తూపానికి నేతల నివాళి -పటాకులు, బ్యాండ్ మేళాలతో హోరెత్తిన ర్యాలీ -దేవీప్రసాద్‌కు వెల్లువెత్తుతున్న మద్దతు

Deviprasad filed  Nomination

ఆ సమయంలో ఆయన వెంట డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, సీ లక్ష్మారెడ్డి తదితరులున్నారు. దానికి ముందు గన్‌పార్క్‌లోని తెలంగాణ ఆమరవీరుల స్తూపంవద్ద దేవీప్రసాద్, మహమూద్‌అలీ, నాయిని, ఈటెల రాజేందర్, టీ.హరీశ్‌రావు, కే.తారకరామారావు, జూపల్లి కృష్ణారావు, సీ లక్ష్మా రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, టీ పద్మారావు, పట్నం మహేందర్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి వీ శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు కనకారెడ్డి, సుధీర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, జీ అంజయ్య, బాల్‌రాజ్, తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథం, టీఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ మైనంపల్లి హన్మంతరావు, తెలంగాణ ఎన్జీవోల సంఘం నేతలు కారం రవీందర్‌రెడ్డి, రాజేందర్, గైనీ గంగారాం, రేచల్, విజయలక్ష్మీ, రామినేని శ్రీనివాస్‌రావు, ముజీబ్ హుస్సేనీ, కస్తూరి వెంకటేశ్వర్లు, వనజారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్యాంరావు, టీజీవో నాయకులు ఓంప్రకాష్, మధుసూదన్‌గౌడ్, న్యాయవాదులు, ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి నేతలు, ప్రజా సంఘాల నేతలు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తప్ప మరే పార్టీకి విజయం దక్కే అవకాశమే లేదన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతు దేవీప్రసాద్‌రావు గెలుపు నల్లేరు మీద నడకేనని, ఇప్పటికే విజయం ఖాయమైందని అన్నారు. మెజారిటీకోసమే అందరం కృషిచేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉద్యోగుల సమస్యలు తెలిసిన దేవీప్రసాద్‌ను మండలికి పంపిస్తే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకోవడం సులభమవుతుందన్నారు. ఇప్పటికే స్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్‌లను ఉన్నతస్థానంలో నిలిపామని, దేవీప్రసాద్ గెలిస్తే ఆయన ఉన్నతస్థానంలో ఉంటారని ఆశాభావం వ్యక్తంచేశారు.

మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ దేవీప్రసాద్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ దేవీప్రసాద్ విజయం సాదాసీదాగా ఉండకూడదన్నారు. ప్రత్యర్థుల డిపాజిట్లను గల్లంతుచేసి సంపూర్ణ విజయాన్ని అందించాలన్నారు.

ధూంధాంగా నామినేషన్ దాఖలు.. దేవీప్రసాద్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కళాకారుల ఆటపాటలతో, బ్యాండ్ మేళాలతో, గులాబీ జెండాల నీడలో గన్‌పార్క్‌నుంచి ప్రారంభమైన ర్యాలీ.. పోలీస్ కమిషనరేట్, బషీర్‌బాగ్ ఫ్లై ఓవర్, లిబర్టీ మీదుగా జీహెచ్‌ఎంసీ వరకు సాగింది. దారి పొడవునా పటాకుల మోతతో దీపావళిని తలపించింది. తెలంగాణ నినాదాలతో నగరవీధులు హోరెత్తాయి. గన్‌పార్క్ ప్రాంగణమంతా గులాబీవనాన్ని తలపించింది. గంటసేపు సాగిన ర్యాలీ జీహెచ్‌ఎంసీ వద్దకు చేరిన తర్వాత టీఆర్‌ఎస్ అభ్యర్థిగా దేవీప్రసాద్ ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రం అందించారు.

ఈ ర్యాలీలో టీఆర్‌ఎస్ నాయకులు బద్దం పరశురాంరెడ్డి, ఆలకుంట హరి, మన్నె గోవర్ధన్‌రెడ్డి, బేతి సుభాష్‌రెడ్డి, ఆర్వీ మహేందర్‌కుమార్, శంభీపూర్ రాజు, రాంమోహన్‌గౌడ్, సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మురుగేష్, సతీష్‌రెడ్డి, గజ్జెల నగేష్, అజాంఅలీ, విజయారెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు ఓంప్రకాష్, లక్ష్మీనారాయణ, శైలజ, ప్రభాకర్, శివాజీ, స్వామిరెడ్డి, మోహన్‌రెడ్డి, జానయ్య, న్యాయవాదుల జేఏసీ ప్రతినిధులు రాజేందర్‌రెడ్డి, శ్రీ రంగారావు, పలువురు ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

దేవీప్రసాద్‌కు ఫోర్త్‌క్లాస్ ఉద్యోగుల మద్దతు దేవీప్రసాద్‌కు తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్ పూర్తి మద్దతు ప్రకటించారు. బుధవారం నాంపల్లిలో నాలుగో తరగతి భవన్‌లో సంఘం సమావేశం జరిగింది. దేవీప్రసాద్‌కు సమావేశం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమావేశంలో సంఘం నేతలు ఎం శంకర్, ఎం రాజకుమార్, నాగరాజ్, ఖాదరిబిన్ హసన్, రాంజీ, అజీజ్ మియా పాల్గొన్నారు.

దేవీప్రసాద్‌కు పెన్షనర్ల కేంద్ర సంఘం మద్దతు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి జీ దేవీప్రసాద్‌కు తెలంగాణ పెన్షనర్ల కేంద్ర సంఘం పూర్తి మద్దతు ప్రకటించింది. సుదీర్ఘకాలంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం, రాష్ట్ర విభజన ఉద్యమంలో ఉద్యోగులకు దిశా నిర్దేశం చేసిన దేవీప్రసాద్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు సంఘం ధన్యవాదాలు తెలిపింది. బుధవారం సాయంత్రం తెలంగాణ ఉద్యోగ భవన్‌లో జరిగిన తెలంగాణ పెన్షనర్ల కేంద్ర సంఘం అత్యవసర సమావేశంలో దేవీప్రసాద్ విజయానికి కృషి చేయాలని ఏకగీవ్రంగా తీర్మానం ఆమోదించినట్లు సంఘం నేతలు గాజుల నర్సయ్య, టీ ప్రేంకుమార్, నవనీతరావు, వెల్లడించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.