-ఎన్నడూ లేనంతగా రూపాయి పతనం
-దేశానికి సమర్థ నాయకత్వం అవసరం
-సిరిసిల్ల పర్యటనలో మంత్రి కేటీఆర్
నాలుగు వందలున్న సిలిండర్ వెయ్యి దాటింది. పెట్రోలు రూ.120కి పెరిగింది. ఎయిర్ ఇండియా, ఎల్ఐసీని అమ్మకానికి పెట్టిన బీజేపీ అంటేనే ‘బేచో జనతాకి ప్రాపర్టీ’ అని మున్సిపల్, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. నల్లధనం తెస్తానని గొప్పలు చెప్పుకున్న ప్రధాని మోదీ మాటలు బూటకమని విరుచుకుపడ్డారు. ‘ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్నారు.. ఎవరికైనా వచ్చా యా? సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.. ఇచ్చా రా?’ అని ప్రశ్నించారు. ఆచ్చేదిన్ ఆయేగా అన్న దానికి అర్థం ఇదేనా అంటూ మండిపడ్డారు.
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి పతనం చెం దిందని ఇది చేతకాని నాయకత్వం వల్లేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో మంగళవారం పర్యటించిన మం త్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా కరెంటు లేని, మంచినీటి సౌకర్యం లేని గ్రామాలు లక్షల్లో ఉన్నాయని తెలిపారు. అమెరికా తలసరి ఆదా యం 60 వేల డాలర్లు ఉంటే మన దేశ ఆదాయం 1800ల డాలర్లు మాత్రమేనని చెప్పారు. ప్రపంచ దేశాల సరసన మన దేశం ఇంకా పేద దేశంగా ఉండడం బాధాకరమన్నారు. కులం, మతం పేరిట పంచాయతీలు పెట్టుకుంటూ మన పిల్లలు కొట్లాడుకునే పరిస్థితి ఉండకూడదని హితవు చెప్పారు. భిన్న సంస్కృతులు, విభిన్న భాషలతో అందమైన వసుధైక కుటుంబంగా ఉన్న మన దేశానికి సమర్థవంతమైన నాయకత్వం అవసరమని చెప్పారు.