Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ముమ్మరంగా సభ్యత్వాలు

– టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు కదులుతున్న ఊరూవాడా
– ఉత్సాహంగా పాల్గొంటున్న గులాబీ శ్రేణులు

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఊరూవాడ అనే తేడా లేకుండా పండుగ వాతావరణంలో సభ్యత్వ నమోదును నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ పరిశీలకులు పా ల్గొంటుండగా నాయకులు, కార్యకర్తలు చురు గ్గా కదులుతున్నారు. ప్రజలు సైతం టీఆర్‌ఎస్ సభ్యత్వాలు తీసుకోవడానికి భారీగా ముందుకొస్తున్నారు. సూర్యాపేటలో శుక్రవారం విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తన సతీమణి, ఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు సునీతకు క్రియాశీల సభ్యత్వాన్ని అందజేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని 15వ వార్డులో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లిలో తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, ధర్మపురి, పెద్దపల్లి సభ్యత్వ నమోదు ఇంచార్జి కోలేటి దామోదర్‌గుప్తా ఆధ్వర్యంలో జరిగిన సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని డీ పోచంపల్లిలో శుక్రవారం ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు.

ఆయా జిల్లాల్లో..
సూర్యాపేట జిల్లా కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, తిరుమలగిరిలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్, హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు శానంపూడి సైదిరెడ్డి సభ్యత్వాలను అందజేశారు. కరీంనగర్‌లోని ఒకటో డివిజన్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. రామడుగు, సైదాపూర్, హుజూరాబాద్, తిమ్మాపూర్ మండలాల్లోనూ సభ్యత్వ నమోదు జోరుగా సాగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలంలో పార్టీ నియోజకవర్గ ఇంచార్జి తెల్లం వెంకట్రావ్, పినపాక మండలం జానంపేటలో ఎమ్మెల్యే రేగా కాం తారావు సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు.

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పిప్పర్‌వాడలో పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం ధారారం, లింగాల గ్రామా ల్లో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌యాదవ్, బల్మూరు మండలం పొలిశెట్టిపల్లిలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కల్వకుర్తి మున్సిపాలిటీలోని సిలార్‌పల్లి, గచ్చుబావి గ్రామాల్లో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, వరంగల్ నగరంలోని 7వ డివిజన్‌లో కార్పొరేటర్ పద్మ ఆధ్వర్యంలో, రంగశాయిపేటలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, వికారాబాద్ జిల్లా తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దెముల్ మండలాల్లో తాత్కాలిక కమిటీలను ఏర్పాటు చేసి వారికి సభ్యత్వ నమోదు పరిశీలకులు గట్టు రాంచందర్‌రావు సభ్యత్వ నమో దు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.