Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మురిసిన ఆడబిడ్డలు

-ముచ్చటగా మూడో ఏడాది..
-రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరెల పంపిణీ మొదలు
-నల్లగొండలో ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-వివిధ జిల్లాల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు
-పంపిణీకి వంద వెరైటీల్లో కోటికిపైగా చీరెలు
-అడబిడ్డలకు ప్రభుత్వ చిరుకానుక ఇది
-ఆప్తుడిగా, పెద్దన్నగా సీఎం కేసీఆర్ అందజేస్తున్నారు
-త్వరలో సింగరేణి, ఆర్టీసీ సహా అన్ని యూనిఫామ్‌లు నేతన్నలకే: కేటీఆర్

Minister KTR to Launch Bathukamma Sarees Distribution in Nalgonda

బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. ప్రతి మహిళ తాను అందుకున్న బతుకమ్మ చీరెను చూసుకుని మురిసిపోయింది. యువతులు మొదలు.. వృద్ధ మహిళల వరకు ప్రతి ఒక్కరు బతుకమ్మ చీరెను చూసి అనందపడ్డారు. పదిరకాల డిజైన్లు, పదిరకాల రంగుల్లో.. మొత్తంగా వంద వెరైటీల్లో ఉన్న చీరెలు ఎంతో బాగున్నాయంటూ సంతోషాన్ని వ్యక్తంచేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం తరఫున రాష్ట్రంలోని ఆడబిడ్డలకు 1.02 కోట్ల చీరెలను అందించనున్నారు. చీరెలను మరమగ్గాలపై తయారు చేయించారు. వరుసగా మూడో ఏట చీరెలను ప్రభుత్వం పంపిణీచేస్తున్నది. హుజూర్‌నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోని మహిళలకు చీరెల పంపిణీ తాత్కాలికంగా నిలిపివేశారు. ఎన్నికల అనంత రం పంపిణీ చేయనున్నారు. సోమవారం ఆయా నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచ్‌లు పంపిణీలో పాల్గొన్నారు.

ktr-bathukamma-sarees2

నల్లగొండలో జరిగిన కార్యక్రమంలో చేనేత, జౌళి, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ముఖ్య అతిథిగా హాజరై చీరెలను పంపిణీచేశారు. కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సిద్దిపేట, గజ్వేల్‌లో బతుకమ్మ చీరెలను ఆర్థికమంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పంపిణీచేశారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వనపర్తిలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అందించారు. ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క, సారలమ్మలకు మంత్రి సత్యవతి రాథోడ్ చీరెలను సమర్పించారు. అనంతరం ములుగులో పంపిణీచేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జనగామ జిల్లా దేవరుప్పల, కొడకండ్ల, పాలకుర్తిలో చీరెలను అందించారు. దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్ జిల్లా లక్ష్మణ్‌చాంద మండల కేంద్రంలో చీరెలను పంపిణీచేశారు.

మహిళలకు చిరు కానుక: కేటీఆర్
బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఒక పెద్దన్నలా, ఆప్తుడిలా అందిస్తున్న బతుకమ్మ చీరెల పంపిణీ మహిళలందరికీ చిరుకానుక మాత్రమేనని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం నల్లగొండలోని వ్యవసాయమార్కెట్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి చీరెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో కోటి చీరెల పంపిణీ కార్యక్రమం నల్లగొండ నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉన్నదన్నారు. గతంలో పోచంపల్లిలో ఏడుగురు నేత కార్మికులు బలవన్మరణానికి పాల్పడితే నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆనాడు ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్.. జోలెపట్టి భిక్షాటన చేసి ఒక్కొక్క కుటుంబానికి రూ.50వేల చొప్పున అందించారని గుర్తుచేశారు. కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో సిరిసిల్లలో ఎనిమిదిమంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే నేత కార్మికులకు జీవనోపాధి కల్పించి, ధైర్యం నింపాలని ఆనాడే నిర్ణయించుకున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ చీరెలు, బడిపిల్లల యూనిఫారాలు, కేసీఆర్ కిట్ ద్వారా అందిస్తున్న నేతవస్ర్తాలు స్వయంగా ప్రభుత్వమే కొనుగోలుచేసి నేత కార్మికులకు భరోసా కల్పిస్తున్నదని చెప్పారు. బతుకమ్మ చీరెల తయారీద్వారా చేనేత కార్మికులు మెరుగైన జీవనోపాధి పొందుతున్నారన్నారు. నెలకు ఏడెనిమిది వేల రూపాయలుగా ఉన్న ఆదాయం.. ఇప్పుడు 15-20 వేల రూపాయలకు పెరిగిందని చెప్పారు. భవిష్యత్తులో సింగరేణి, ఆర్టీసీ సంస్థలతో మాట్లాడి, వాటి యూనిఫారాలకు వస్త్రం తయారీ పనికూడా నేతన్నలకే అప్పజెప్తామన్నారు.

ktr-bathukamma-sarees6

నేత కార్మికులను ఆదుకునేందుకు 50% సబ్సిడీతో నూలు, రసాయనాలు, ఇతర ముడిసరుకులు అందిస్తున్నామని తెలిపారు. త్రిఫ్ట్ సొసైటీ పేరు తో చేనేత, టెక్స్‌టైల్స్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ను ప్రారంభించి నేతన్నలకు అండగా ఉన్నామని చెప్పారు. బతుకమ్మ చీరెలను నేతన్నలు చాలా కష్టపడి, మంచి డిజైన్లతో చక్కగా రూపొందించారని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్ర్తాలు ధరిస్తే నేతన్నలకు జీవనోపాధి కల్పించినవాళ్లం అవుతామని కేటీఆర్ అన్నారు. చేనేత కార్మికులు నేసిన వస్ర్తాలు కొనుగోలుచేసి, వారికి మరింత ఉపాధి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం అధికారులందరూ చేనేత వస్ర్తాలను ధరించాలని సూచించినట్లు తెలిపారు. ప్రభుత్వం సూచనలతో అధికారులతోపాటు నాయకులు సైతం చేనేత వస్ర్తాలను ధరించడం సంతోషకరమని మిగిలినవారంతా ఈ పద్ధతిని పాటించాలని కోరారు. త్వరలో రూ.35 కోట్లతో ఉదయ సముద్రం రిజర్వాయర్ మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణాన్ని చేపడుతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నల్లగొండ జిల్లాపై అమితమైన ప్రేమ ఉన్నదని, అందుకే నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కళాశాలలు, యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎయిమ్స్ వచ్చాయని, తిరుమల తిరుపతికి దీటుగా యాదాద్రి ఆలయాన్ని పునరుద్ధరిస్తున్నారని తెలిపారు.

ktr-bathukamma-sarees5

నల్లగొండ నుంచే బతుకమ్మ చీరె, మిషన్ భగీరథ: మంత్రి జగదీశ్‌రెడ్డి
బతుకమ్మ చీరెల పంపిణీ ఆలోచన ప్రారంభమైంది నల్లగొండలోనేనని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరందించాలనే ఆలోచన కూడా నల్లగొండ జిల్లాలోనే ప్రారంభమైందని గుర్తుచేశారు. బతుకమ్మ చీరెల పంపిణీ భూదాన్‌పోచంపల్లిలో పురుడు పోసుకున్నదని, కేసీఆర్ ఉద్యమనాయకుడిగా గ్రామగ్రామాన పర్యటించి నిద్రచేసినప్పుడు.. చేనేత కార్మికుల సమస్యలు స్వయంగా తెలుసుకుని వారిని ఆదుకునేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఫ్లోరైడ్ పీడి త ప్రాంతాలకు సురక్షిత మంచినీరు అందించేందుకు చౌటుప్పల్‌లో పైలాన్ నిర్మించి, ఇంటింటికీ నీరందించే కార్యక్రమం చేపట్టిందని చెప్పా రు. తెలంగాణ ప్రజల బాధలు తెలిసిన తండ్రి, కొడుకు నిత్యం తెలంగాణ అభివృద్ధి కోసం కృషిచేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి చెప్పారు.

ktr-bathukamma-sarees4

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ఎవరూ అడుగలేదని, హాస్టళ్లకు సన్నబియ్యం ఎన్నికల కోసం చేపట్టిందికాదని స్పష్టంచేశారు. ఎన్నికలు, రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజారామయ్యర్, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తేర చిన్నపరెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, రమావత్ రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్య, ఐసీడీఎస్ ఆర్వో మాలే శరణ్యరెడ్డి, నాయకులు తిప్పన విజయసింహారెడ్డి పాల్గొన్నారు.

చౌటుప్పల్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలి
-పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపు
-చౌటుప్పల్‌లో ఘనస్వాగతం పలికిన నాయకులు
చౌటుప్పల్ మున్సిపాలిటీని భారీ మెజారిటీతో కైవసం చేసుకోవాలని ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండకు వెళ్తున్న మంత్రి కేటీఆర్‌కు మార్గమధ్యంలో చౌటుప్పల్ వద్ద టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రజాసంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ అభ్యర్థులకు కొండంత బలమన్నారు. ప్రజాసంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు రాబాట్టాలని చెప్పారు. సమిష్టిగా పనిచేస్తే మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం నల్లేరుమీద నడకేనని అన్నారు. కేటీఆర్‌కు స్వాగతం పలికినవారిలో ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గిర్కంటి నిరంజన్‌గౌడ్, సర్పంచ్‌ల ఫోరం మాజీ మండలాధ్యక్షుడు ముటుకుల్లోజు దయాకరాచారి, మున్సిపాలిటీ కన్వీనర్ ఊడుగు శ్రీనివాస్‌గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు చింతల దామోదర్‌రెడ్డి, ముప్పిడి శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్‌పర్సన్ బొడ్డు రేవతి శ్రీనివాస్‌రెడ్డి, ఊడుగు మల్లేశ్‌గౌడ్, గుండబోయిన అయోధ్యయాదవ్, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎండీ ఇబ్రహీం, బొడిగె బాలకృష్ణగౌడ్, తాడూరి పరమేశ్ తదితరులు ఉన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.