Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నాడు అశోకుడు.. నేడు సీఎం కేసీఆర్

-230 కోట్ల మొక్కలతో చారిత్రక కార్యంగా హరితహారం -చైనా, బ్రెజిల్ తర్వాత తెలంగాణలోనే బృహత్కార్యం -అటవీశాఖ మంత్రి జోగురామన్న ధీమా -ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీస్థలం కనిపించవద్దు: హరీశ్‌రావు -మెదక్ జిల్లాలో హరితహారంపై సమీక్ష

Harish-Rao-and-Joguramanna-meeting-on-Harithaharam

ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే, మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ చరిత్ర సృష్టించాయి. వచ్చే నెల 3 నుంచి 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా చేపడుతున్న హరితహారం కూడా చరిత్రకెక్కుతుంది. ఇంత పెద్దమొత్తంలో మొక్కలు నాటే కార్యం దేశంలో మరెక్కడా నిర్వహించలేదు. అప్పుడెప్పుడో చైనా ఆ తర్వాత బ్రెజిల్ దేశాల్లో ఉద్యమంలా మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు తెలంగాణలోనే మహత్తర కార్యం జరుగుతున్నది. పూర్వం చక్రవర్తి అశోకుడు చెట్లు నాటించాడని ఇప్పటికీ చరిత్రలో చదువుతున్నాం. మొక్కలు నాటిన అశోకుడికి ఎంతో గుర్తింపు వచ్చిందో.. ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు అదే స్థాయిలో గుర్తింపు వస్తుంది అని అటవీశాఖ మంత్రి జోగురామన్న చెప్పారు. ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ఉత్సవంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. గురువారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో కలెక్టరేట్‌లో హరితహారంపై మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా అధికారులతో కలిసి జోగురామన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 24 శాతానికి పడిపోయిన అడవుల శాతాన్ని 33 శాతానికి పెంచుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, పల్లెల్లో ఇంటి వద్ద, చెరువు గట్లపైనే పెద్దసంఖ్యలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నాటుతున్న మొక్కలకు నెంబర్లు వేయాలని, ఏ జిల్లాలో ఎన్ని మొక్కలు నాటాం? ఏ జిల్లాలో ఏ రోజు కోటి మొక్క నాటుతున్నాం.. కోటి, రెండు కోట్లు మొక్కలు నాటే సందర్భాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని అధికారులకు సూచించారు.

అన్ని శాఖలు బాధ్యతగా మొక్కలు నాటాలి: మంత్రి హరీశ్‌రావు మాటలు చెప్పడం కాదు..అధికారులు చేతల్లో పనితనాన్ని చూపించాలని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. కాగితాల లెక్కలు చెప్పడం కాదని, శాఖల వారీగా బాధ్యతతో మొక్కలు నాటడంలో ప్రతి అధికారి ముందుండాలని కోరారు. కుంట, చెరువు కట్టలపై ఈతచెట్లు విరివిగా నాటడం ద్వారా గీత కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఈత చెట్లను కాపాడుకునేందుకు అవసరమైతే వేసవిలో నీటికొరత తీర్చడానికి కట్టలపై బోరుబావులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వార్డు సభ్యుడు, సర్పంచ్ మొదలుకుని ప్రజా ప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థలను అన్నివర్గాలను హరితహారంలో భాగస్వాములను చేయాలని కోరారు. మెదక్ జిల్లా పరిశ్రమలకు పెట్టింది పేరని, చాలా యాజమాన్యాలు పచ్చదనంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని పరిశ్రమల్లో విరివిగా మొక్కలు నాటేలా పీసీబీ, పరిశ్రమలశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మొక్కలు నాటడంలో తప్పుడు లెక్కలు చెప్పే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాల అమలులో జిల్లా మొదటి స్థానంలో ఉంటున్నదని, హరితహారంలో కూడా అదే స్ఫూర్తిని చాటాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ రాజమణి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, చింతా ప్రభాకర్, మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రాములునాయక్, పాతూరి సుధాకర్‌రెడ్డి, కలెక్టర్‌రాహూల్‌బొజ్జా, ఎస్పీ సుమతి, జేసీ వెంకట్రామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్రీ గాడ్స్ కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల విరాళం హరితహారంలో ట్రీగాడ్స్ కోసం ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు జిల్లా మంత్రి హరీశ్‌రావుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రకటించారు. సమావేశంలో ఈ ప్రతిపాదనను ఎమ్మెల్సీ రాములునాయక్ ముందుకు తేగా ప్రజాప్రతినిధులు ఆమోదం తెలిపారు. మంత్రి జోగురామన్న నెల వేతనాన్ని కూడా మెదక్ జిల్లాకే వినియోగించుకుంటామని ఎమ్మెల్సీ రాములు నాయక్ కోరడంతో ప్రజాప్రతినిధులు, అధికారుల్లో నవ్వులు విరిశాయి. సరే నాయక్, అలాగే కానివ్వండని జోగురామన్న పేర్కొన్నారు. నెల వేతనాన్ని అందించి మెదక్ జిల్లా నేతలు ఆదర్శంగా నిలిచారని మంత్రి జోగురామన్న అభినందించారు. ఇతర జిల్లాల నేతలు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్నిశాఖల ఉన్నతాధికారులు సైతం ఒకరోజు వేతనాన్ని అందిస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, వ్యసాయశాఖ జేడీఏ హుక్యానాయక్, పశు సంవర్ధకశాఖ జేడీ లక్ష్మారెడ్డి ప్రకటించారు. జిల్లా అధికారులను ప్రజాప్రతినిధులు అభినందించారు. జిల్లాలోని ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు పాఠశాలలను దత్తత తీసుకుని మొక్కలు నాటిస్తామని ఎస్పీ సుమతి ప్రకటించారు. తర్వాత మంత్రి హరీశ్‌రావు జిల్లాలోని పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. పారిశ్రామిక వేత్తలు రూ.రెండున్నర కోట్లు వెచ్చించి లక్షా 20 వేల ట్రీ గార్డులు అందజేసేందుకు అంగీకారం తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.