నాలుగేండ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి కృష్ణాజలాలతో మహబూబ్‌నగర్‌జిల్లా రైతుల పాదాలు కడుగుతానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కరివెనవద్ద గుట్టపై గెస్ట్‌హౌస్ కట్టుకుని 15 రోజులకోసారి వచ్చి పథకం పనులు స్వయంగా పరిశీలిస్తానని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెనలో గురువారం ఉదయం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైలాన్‌ను రైతులు, ప్రజల హర్షధ్వానాల మధ్య సీఎం ఆవిష్కరించారు.

-ఆంధ్రప్రదేశ్ కాదు.. ఇది సోయిగల్ల తెలంగాణ -మీ కడుపులు నింపినంకనే ప్రాజెక్టు పనులు మొదలుపెడతా -కరివెన రిజర్వాయర్ నిర్వాసితులకు సీఎం కేసీఆర్ భరోసా -అభిమానులు, రైతుల హర్షధ్వానాల మధ్య పైలాన్ ఆవిష్కరణ అనంతరం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలమూరు బాధలు ఎవరూ పట్టించుకోలేదని, కానీ ఇపుడు తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి పథకం చేపట్టిందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించగానే ఆలంపూర్ జోగులాంబకు మొక్కుకుని ఆర్డీఎస్ వరకు పాదయాత్ర చేశానని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకునే అదృష్టం అందరికీ దక్కదు కానీ ఆ అవకాశం తనకు దక్కిందని అన్నారు. ఇన్నాళ్లూ ఆర్డీఎస్ ఆగమైంది.. నెట్టెంపాడు ముందుకుపోలేదు..భీమా గురించి భగవంతునికి కూడా తెలియని పరిస్థితి ఉండేది. రంగారెడ్డిలో కరువు కోరల్లో చిక్కితే.. హైదరాబాద్‌లో నీటికోసం ఇబ్బందులు పడ్డాం అని వివరించారు. ఇకపై ఈ గోస ఉండదని అన్నారు. రూ.35,200 కోట్లతో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని తెలిపారు. ఈ పథకాన్ని రూపొందించేందుకు ఓఎస్డీ రంగారెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి, ఈఎంసీ మురళీధర్‌రెడ్డిలతో కలిసి నెలల తరబడి కష్టపడ్డామని చెప్పారు.

భోజనం కూడా చేయకుండా రాత్రి 2-3 గంటలవరకు ప్రణాళికలు రూపొందించేవారమని చెప్పారు. కరివెన రిజర్వాయర్ మూడో స్టేజీలో ఉందని ఇక్కడ రెండు రెండున్నర ఏండ్లలోనే 55 టీఎంసీల నీరు రప్పిస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడిని ప్రస్తావిస్తూ ఆయనది లక్ష్మీపాదం.. ఎమ్మెల్యే అయిన యేడాదికే నియోజకవర్గానికి 50 టీఎంసీల నీళ్లు తీసుకొస్తున్నాడని సీఎం ప్రశంసించారు. ఈ పథకంలో నిర్వాసితులను సంపూర్ణంగా ఆదుకున్న తర్వాతే పనులు చేపడతామని సీఎం భరోసా ఇచ్చారు. ముంపునకు గురయ్యే మూడు గిరిజన తండాల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తామని, రూ.5లక్షల 40వేల చొప్పన వ్యయం చేసి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. భూమి కావాలని వారు కోరుకుంటే ఎన్ని లక్షలు ఖర్చు చేసి అయినా భూములు కొనుగోలు చేసి ఇస్తామని భరోసా ఇచ్చారు. మీ కడుపులు నింపినంకనే ప్రాజెక్టు మొదలు పెడతాం అని ఆయన భరోసా ఇచ్చారు.

పాలమూరు ప్రజల అదృష్టం.. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ పాలమూరు ఎంపీగా ఉండి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌కు జిల్లా ప్రజల కష్టాలు బాగా తెలుసునన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం ప్రజల అదృష్టమన్నారు. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగానే కాకుండా ఆర్కిటెక్క్గా, ఇంజినీర్‌గా పాలమూరు ఎత్తిపోతల కోసం ఎంతో కృషి చేశారన్నారు. మూడు జిల్లాల్లో 10లక్షల ఎకరాలకు సాగునీరందించే ఈ పథకంతో జిల్లాపై ఉన్న కరువుజిల్లా అనే పేరుమాసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరివెన రిజర్వాయర్ కింద 102 గ్రామాల పరిధిలో 2.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు.