Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నాణ్యమైన విద్యకోసమే నిధులు, నియామకాలు

-త్వరలోనే టీచర్లు, వర్సిటీ అధ్యాపకుల పోస్టుల భర్తీ -భవనాలు, వసతుల కల్పనకు అవసరమైన నిధుల కేటాయింపు -విద్యా వలంటీర్ల భర్తీ కోసం కలెక్టర్లకు ఆదేశాలు జారీ -ఉచితంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ప్రవేశాలు -యూనివర్సిటీల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి -నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా పేదలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలన్న కృతనిశ్చయంతో పెద్దమొత్తంలో నిధులను కేటాయించడంతోపాటు వేలసంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌలిక వసతి సదుపాయాల కల్పనకు, నూతన భవన నిర్మాణాల కోసం అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయించామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడి మూడేండ్లు అవుతున్న సందర్భంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నమస్తే తెలంగాణ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు:

రాష్ట్రం ఏర్పడి మూడేండ్లు అవుతున్న తరుణంలో.. విద్యాశాఖ సాధించిన ప్రగతి ఏ విధంగా ఉన్నది?ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో గత మూడేండ్ల నుంచి పేదలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులందరికీ అందుబాటులో ఉండే విధంగా నూతన గురుకులాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నది. తెలంగాణ గురుకులాలను జూనియర్ కాలేజీలుగా హోదా పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కొత్తగా 84 కేజీబీవీలకు కేంద్రం అనుమతించేలా చర్యలు చేపట్టాం. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలను పటిష్ఠం చేయడం కోసం స్టేట్ ప్లాన్, ఆర్‌ఐడీఎఫ్ కింద అవసరమైన నిధులు సేకరిస్తున్నాం. అందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఉచిత ప్రవేశాలు నిర్వహిస్తున్నాం. ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందిస్తున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఇంటర్మీడియెట్ బోర్డులో 22 రకాల సేవలను ఆన్‌లైన్ పరిధిలోకి తీసుకువచ్చాం. దీనివల్ల మంచి ఫలితాలు నమోదవుతున్నాయి.

టీచర్ల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన చర్యలు? ప్రభుత్వ స్కూల్ టీచర్లకు సర్వీస్ రూల్స్ ఉన్నాయి. స్థానిక సంస్థల స్కూల్ టీచర్లకు సర్వీస్ రూల్స్ లేవు. వీరందరికీ ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధించేందుకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఆ సమస్యను ఓ కొలిక్కి తీసుకురాగలిగాం. ప్రస్తుతం ఏకీకృత సర్వీస్ రూల్స్‌కు సంబంధించిన ఫైల్ న్యాయశాఖ ఆమోదం పొందింది. త్వరలోనే రాష్ట్రపతి ఆమోదం కూడా పొందుతుందని భావిస్తున్నాం. కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలు పెంచడంతో పాటు వారి పోస్టులను రెగ్యులర్ చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

టీచర్ల నియామకం ఎప్పుడు చేపడుతారు? నియామక ప్రక్రియను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? పాఠశాల విద్యాశాఖలో 8,792 టీచర్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ త్వరలోనే టీఎస్‌పీఎస్సీకి ఉత్తర్వులు జారీ చేయనున్నాం. త్వరతిగతిన వీటిని భర్తీ చేయడానికి సమగ్ర ప్రణళికలు రూపొందిస్తున్నాం. గురుకుల పాఠశాలల్లో 7,300 టీచర్ పోస్టుల భర్తీ చేయడానికి టీఎస్‌పీఎస్సీ ద్వారా ఈ నెల 31న రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 84 కేజీబీవీలలో ఈ ఏడాది నుంచి అవుట్ సోర్సింగ్ ద్వారా 1,428 పోస్టులు భర్తీ చేస్తున్నాం. అదేవిధంగా 29 అర్బన్ గురుకుల పాఠశాలల్లో కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 174 టీచింగ్, 238 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నాం.

విద్యావలంటీర్ల నియామకం ఏ దశలో ఉన్నది? విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు 11,428 విద్యావలంటీర్ల నియామకానికి ప్రభుత్వం అనుమతించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా విద్యావలంటీర్ల వేతనాలు రూ.8 వేల నుంచి రూ.12 వేలకు పెంచుతూ ఇప్పటికే ఉత్తర్వులు విడుదల చేశాం. వీరి నియామక బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించాం.

అక్షరాస్యత పెంచేందుకు చేపడుతున్న చర్యలు? గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అక్షరాస్యత విషయంలో తెలంగాణ బాగా వెనకబడింది. దేశ సగటు కన్నా తెలంగాణలో అక్షరాస్యత ఎక్కువగా ఉండేలా చర్యలు కొనసాగిస్తున్నాం. ఇందు కోసం సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తున్నాం.

వర్సిటీల అభివృద్ధికి సర్కారు చేపడుతున్న చర్యలు ఏమిటి? గత ప్రభుత్వాల వైఖరి వల్ల నిర్లక్ష్యానికి గురైన 11 యూనివర్సిటీలను తిరిగి పటిష్ఠం చేయడానికి సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నారు. 11 యూనివర్సిటీలలో 1,061 అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయడానికి సంబంధించిన ఫైల్‌పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. యూనివర్సిటీలకు రూ.420 కోట్ల బడ్జెట్ కేటాయించాం. త్వరలోనే పాలక మండళ్లను కూడా నియమించాలని నిర్ణయించాం.

కేజీ టు పీజీ ఉచిత విద్యావిధానం అమలులో ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏమిటి? పేద బిడ్డలకు ఉచితంగా, నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ విద్యను అందుబాటులోకి తీసుకురావడం కోసం కేజీ టు పీజీ ఉచిత విద్యావిధానాన్ని అమలుచేస్తున్నాం. సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖల పరిధిలోని గురుకుల విద్యాసంస్థల సొసైటీల ఆధ్వర్యంలో 750 గురుకుల పాఠశాలలను ప్రారంభించడానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో గత విద్యాసంవత్సరంలోనే 240 గురుకుల పాఠశాలల్లో తరగతులు కొనసాగుతున్నాయి. మిగిలిన 510 గురుకులాల్లో 2017-18 విద్యాసంవత్సరం నుంచి ప్రవేశాలు నిర్వహించి, తరగతులు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.