Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నయనానందం

-విజయవంతంగా కొనసాగుతున్న కంటివెలుగు -సోమవారం 1,26,538 మందికి కంటి పరీక్షలు -ఎనిమిది రోజుల్లో 8,56,908 మందికి -కంటి పరీక్షలు పూర్తి -అప్రమత్తంగా వైద్య శిబిరాల నిర్వహణ -ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రజలు

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఎనిమిది రోజుల్లో 8,56,908 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. 1,63,341 మందికి కండ్లద్దాలను అందజేశారు. ప్రత్యేక దృష్టిలోపం ఉన్న 2,30,315 మందికి సంబంధిత అద్దాలను ఆయా శిబిరాల్లోని వైద్యులు ప్రతిపాదించారు. ఇప్పటివరకు కాటరాక్ట్ ఆపరేషన్ కోసం 95,864 మందిని ప్రతిపాదించగా.. 5,348 మందికి ఆపరేషన్లను పూర్తిచేశారు. ఇప్పటివరకు కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నవారిలో 2,68,829 మందికి ఎటువంటి కంటి సమస్యలులేవని వైద్యులు నిర్ధారించారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 114 దవాఖానల్లో కాటరాక్ట్ ఆపరేషన్లను నిర్వహించేందుకు వైద్యశాఖ ఏర్పాట్లుచేసింది. వైద్య శిబిరాల్లో వైద్యులు ప్రతిపాదించిన కాటరాక్ట్ ఆపరేషన్ల నిర్వహణపై వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కాటరాక్ట్‌తోపాటు ఇతర కంటి శస్త్ర చికిత్సలను ఆలస్యం కాకుండా నిర్వహించేలా ఏర్పాట్లుచేశారు. కాగా ఎనిమిదవ రోజైన సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 823 వైద్య శిబిరాలలో 1,26,538 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. 23,436 మందికి రీడింగ్ అద్దాలను, దృష్టి లోపం ఉన్న 29,824 మందికి ప్రత్యేక అద్దాలను వైద్యులు ప్రతిపాదించారు. కాటరాక్ట్ ఆపరేషన్ల కోసం 10,463 మందిని ప్రతిపాదించారు. వీరిలో ఇప్పటివరకు 731 మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు నిర్వహించారు.

వరంగల్‌లో జనం బారులు వరంగల్ రూరల్ జిల్లాలో కంటివెలుగు కేంద్రాల వద్ద ప్రజలు బారులుతీరారు. సోమవారంనాటికి జిల్లావ్యాప్తంగా 20,391 మందికి కంటిపరీక్షలు నిర్వహించి.. 4,849 మందికి కంటి అద్దాలను అందజేశారు. 2,963 మందిని శస్త్రచికిత్సల కోసం రిఫర్ చేశారు. ఇప్పటివరకు కాటరాక్ట్ ఆపరేషన్లు అవసరమైనవారు 2,732 మంది, కాంప్లికేటెడ్ కాటరాక్ట్ ఉన్నవారు 67 మంది, కార్నియాతో బాధపడుతున్నవారు 149 మంది, గ్లకోమా అనుమానితులు 23 మంది ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

వరంగల్ అర్బన్‌లో అపూర్వ ఆదరణ కంటివెలుగు కార్యక్రమానికి వరంగల్ అర్బన్ జిల్లాలో అపూర్వ ఆదరణ లభిస్తున్నది. జిల్లావ్యాప్తంగా సోమవారం నాటికి 25,691 మందికి కంటిపరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ హరీశ్‌రాజ్ తెలిపారు. వీరిలో 5,655 మందికి కంటి అద్దాలు పంపిణీచేశారు. మరో 8,377 మందికి ప్రత్యేక కంటి అద్దాలు అవసరమని గుర్తించారు. శస్త్రచికిత్సల కోసం 3,312 మందిని రిఫర్ చేశారు.

మహబూబ్‌నగర్‌లో ఉత్సాహంగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కంటివెలుగు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతున్నది. నాగర్‌కర్నూల్ జిల్లాలో సోమవారంనాటికి 17,386 మందికి కంటిపరీక్షలు చేశారు. 4,383 మందికి కంటిఅద్దాలు పంపిణీచేయగా, 2,060 మందికి శస్త్రచికిత్సలకు రిఫర్ చేశారు. వనపర్తి జిల్లాలో 13,057 మందికి కంటిపరీక్షలు నిర్వహించగా.. 1,825 మందికి అద్దాలు పంపిణీచేశారు. 1,456 మందిని శస్త్ర చికిత్సలకు రిఫర్ చేశారు. జోగుళాంబగద్వాల జిల్లాలో 14,710 మందికి కంటిపరీక్షలు నిర్వహించగా..1,786 మందికి కంటిఅద్దాలు పంపిణీచేశారు. 1,624 మందిని శస్త్రచికిత్సలకు రెఫర్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటివరకు 33,775 మందికి పరీక్షలు చేయగా.. 3,835 మందికి కంటిఅద్దాలు పంపిణీచేశారు. 7,034 మందికి శస్త్రచికిత్స అవసరమున్నట్లు గుర్తించారు.

భద్రాద్రి జిల్లాలో 29,232 మందికి కంటిపరీక్షలు సోమవారం ఒక్కరోజే 4,181 మందిహాజరు కంటివెలుగు కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనూహ్య స్పందన లభిస్తున్నది. సోమవారం జిల్లావ్యాప్తంగా 4,181 మందికి 27 కంటి వైద్య శిబిరాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 29,232 మంది కంటిపరీక్షలు చేయించుకోగా.. 7,012 మందికి కంటిఅద్దాలు అందజేశారు. 3,614 మందిని శస్త్రచికిత్సల కోసం రిఫర్ చేశారు. 12,696 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని గుర్తించారు.

గ్రేటర్‌లో పెరుగుతున్న రద్దీ గ్రేటర్ హైదరాబా ద్‌లో కంటి వెలుగు వైద్య శిబిరాలలో రోజురోజుకు రద్దీ పెరుగుతున్నది. నగరంలో మొదటిరోజు నాలుగువేల మంది కంటిపరీక్షలు చేయించుకోగా.. సోమవారం ఈ సంఖ్య పన్నెండువేలు దాటింది. సోమవారం ఒక్కరోజే నగరంలో 12,569 మంది, రంగారెడ్డిలో 7,175 మంది కంటిపరీక్షలు చేయించుకోవడం విశేషం. గ్రేటర్‌వ్యాప్తంగా మొత్తం 24,995 మందికి నేత్రపరీక్షలు నిర్వహించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. వీరిలో 6,165 మందికి కంటి అద్దాలను పంపిణీచేశారు. మరో 3,713 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. ఎనిమిదిరోజుల్లో హైదరాబాద్‌లో 80,219 మందికి కంటిపరీక్షలు నిర్వహించినట్లు హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి తెలిపారు.ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు శిబిరాలు: కంటివెలుగు శిబిరాల షెడ్యూల్‌లో స్వల్పమార్పులు చేసినట్లు హైదరాబాద్ కలెక్టర్ డాక్టర్ యోగితారాణా తెలిపారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు శిబిరాలు పనిచేస్తాయన్నారు. సోమవారంనాడు విజయ్‌నగర్‌కాలనీలోని కంటివెలుగు శిబిరాన్ని కలెక్టర్ సందర్శించి స్థానికులతో ముచ్చటించారు.

నిర్మల్‌లో 17,281 మందికి కంటిపరీక్షలు నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు 17,281 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. ఇందులో 4,012 మందికి ఉచితంగా కంటిఅద్దాలు అందజేశామని జిల్లా కంటివెలుగు ప్రత్యేకాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటివరకు 2,285 మందికి శస్త్ర చిక్సితలు అవసర మని గుర్తించినట్లు జిల్లా వైద్యధికారి డాక్టర్ జలపతినాయక్ చెప్పారు.

సూర్యాపేటలో 26,077 మందికి పరీక్షలు సూర్యాపేట జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 26,077 మందికి కంటిపరీక్షలు చేశారు. 5,375 మందికి కంటిఅద్దాలు అందజేశారు. 3,246 మందికి శుక్లాలు తొలిగించే ఆపరేషన్లు చేయాలని ప్రతిపాదించారు. ఆపరేషన్ అత్యవసరమైనవారు 266 మంది ఉన్నారు. 58 మందికి కనుగుడ్డు సమస్య, 325 మందికి నీటిచారలు, 1292 మందికి మెల్లకన్ను ఉన్నట్లు గుర్తించారు.

నిజామాబాద్‌లో 35,273 మందికి కంటిపరీక్షలు నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 35,273 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. వీరిలో 7,399 మందికి కంటిఅద్దాలు అందజేశారు. ఇప్పటివరకు మొత్తం 3,603 మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. త్వరలో వీరికి ఆపరేషన్లు ప్రారంభంకానున్నాయి.

ఖమ్మం జిల్లాలో బారులు తీరుతున్న జనం ఖమ్మం జిల్లాలో కంటివెలుగు శిబిరాల వద్ద జనం బారులు తీరుతున్నారు. సోమవారం ఒక్కరోజే 4,337 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. 828 మందికి కంటి అద్దాలు పంపిణీచేశారు. 423 మందిని శస్త్రచికిత్సలకు సిఫారసు చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 31,380 మందికి నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు.

కామారెడ్డిలో జోరుగా.. కామారెడ్డి జిల్లాలో కంటివెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 78 గ్రామాల్లో 26,392 మందికి కంటిపరీక్షలు చేసి.. 3,578 మందికి అద్దాలు పంపిణీచేశారు. దృష్టిలోపం ఎక్కువగా ఉన్న 4,601 మందికి ప్రత్యేక అద్దాల కోసం రిఫర్‌చేశారు. శస్త్ర చికిత్సల కోసం 3,323 మందిని గుర్తించారు.

జనగామలో జనం క్యూ -ఎనిమిది రోజుల్లో 19,302 మందికి వైద్య పరీక్షలు -3,836 మందికి కంటి అద్దాల పంపిణీ -శస్త్ర చికిత్సలకు 2,573 మంది రిఫర్ -39 మందికి ఆపరేషన్ల నిర్వహణ కంటివెలుగు కార్యక్రమానికి జనగామ జిల్లాలో విశేష స్పందన లభిస్తున్నది. శిబిరాల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. సోమవారం 3,175 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. వీరిలో 529 మందికి కంటిఅద్దాలను పంపిణీచేయగా, మరో 226 మందిని శస్త్ర చికిత్సల కోసం ప్రతిపాదించారు. జిల్లా కేంద్రంలోని ఉడుముల దవాఖానలో సోమవారం వరకు 39 మందికి ఆపరేషన్లు నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 19,302 మందికి పరీక్షలు నిర్వహించగా.. 3,836 మందికి అద్దాలను అందించారు. 2,573 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు.

ఉత్సాహంగా కంటివెలుగు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కంటివెలుగు శిబిరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన శస్త్రచికిత్సలను రేకుర్తి కంటి దవాఖాన, కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖాన, ప్రతిమా, చల్మెడ మెడికల్ కళాశాలల్లో చేస్తున్నారు. రేకుర్తి దవాఖానాలో రోజుకు 20 మందికి, ప్రభుత్వ దవాఖాన, ప్రతిమా, చల్మెడ మెడికల్ కళాశాలల్లో రోజుకు 10 మంది చొప్పున శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. కొత్త కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు 29,690 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. 8,872 మందికి కంటిఅద్దాలు పంపిణీచేశారు. 4,260 మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. పెద్దపల్లి జిల్లాలో 21,906 మందికి కంటి పరీక్షలు నిర్వహించి.. 5,155 మందికి అద్దాలు పంపిణీచేశారు. 5,738 అపరేషన్లు అవసరమని గుర్తించారు. జగిత్యాల జిల్లాలో 36,344 మందికి కంటి పరీక్షలు నిర్వహించి.. 6,004 మందికి అద్దాలు పంపిణీ చేశారు. 1,696 మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17,319 మందికి కంటిపరీక్షలు నిర్వహించి.. 4,214 అద్దాలు పంపిణీ చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.