Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నీ చదువు బాధ్యత ప్రభుత్వానిదే..

కన్న తండ్రి, సవతి తల్లి చేతుల్లో దారుణ హింసకు గురైన యువతి ప్రత్యూష భవిష్యత్తుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పూర్తి భరోసానిచ్చారు. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశీర్వదించారు. ఆమె బాగోగులు, చదువు కోసం సీఎం సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు కేటాయించారు. కొద్దిరోజులుగా గ్లోబల్ దవాఖానలో చికిత్స పొందుతున్న ప్రత్యూష ఆరోగ్యం కుదుట పడటంతో బుధవారం సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభలు ప్రత్యూషను ఆప్యాయంగా పలకరించి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ప్రత్యూషతో కలిసి సీఎం భోజనం చేశారు.

CM KCR invited pratyusha to his home

-బాగా చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలి -నిన్ను బాధపెట్టిన వారికి నువ్వు వేసే శిక్ష అదే -సీఎం సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు మంజూరు -ప్రత్యూషతో కలిసి భోజనం చేసిన సీఎం కేసీఆర్ జరిగిందేదో జరిగింది. ఇకనుంచి సపోర్ట్ దొరికింది. దీనిని ఉపయోగించుకోవాలి. పైకి రావాలి. నువ్వు కష్టపడి చదివి పైకి రావడమే.. నిన్ను బాధ పెట్టినవారికి వేసే శిక్ష. ఇక నీ తెరువు ఎవ్వరూ రారు. ధైర్యంగా ఉండు. అన్నింటికీ నేనున్నాను. ఎప్పుడైనా నా ఇంటికి రావచ్చు.. పోవచ్చు అని భరోసా ఇచ్చారు. ఎప్పుడైనా తనతో మాట్లాడాలనిపిస్తే ఫోన్లు చేయవచ్చంటూ సీఎం తన ఫోన్ నంబర్లు కూడా ఇచ్చారు.

సీఎం సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు మంజూరు దవాఖానలో కోలుకున్న ప్రత్యూషను బుధవారం డిశార్చ్ చేశారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆమెను పోలీసులు హైకోర్టులో హాజరు పరిచారు. అనంతరం ఆమెను సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకువెళ్లారు. గ్లోబల్ దవాఖానలో చికిత్స పొందిన ప్రత్యూషను ఇటీవల పరామర్శించిన సీఎం, ఆమెను కోలుకున్న తరువాత తన ఇంటికి రావాలని ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇంటికి వచ్చిన ప్రత్యూషతో కలిసి భోజనం చేసిన అనంతరం ఆయన సీఎం సహాయ నిధి నుంచి ఆమెకు రూ.5లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

CM KCR wife shoba with pratyusha

ప్రత్యూష చదువు బాధ్యతంతా ప్రభుత్వమే భరించాలని, దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కేసీఆర్ సూచించారు. ఆమె చదువు, వసతి, ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు తెలుసుకొని అండగా ఉండాలని కలెక్టర్ రఘునందన్‌రావు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనందర్‌లను ఆదేశించారు. అనంతరం ప్రత్యూషను అధికారులు హాస్టల్‌కు తీసుకువెళ్లారు.

భవిష్యత్తుపై ఆందోళన వద్దు -సవతి తల్లి బాధితురాలు ప్రత్యూషకు హైకోర్టు సూచన -సీఎం కేసీఆర్ గొప్ప మానవతావాది అని ప్రశంస సవితి తల్లి చేతిలో తీవ్ర వేధింపులకు గురైన యువతి ప్రత్యూషను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టులో హాజరు పర్చింది. ఆమె బాగోగులు, భవిష్యత్‌పై నిర్ణయం తీసుకొనేందుకు తమ ముందు హాజరపర్చాలంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బీ భోసలే నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించటంతో పోలీసులు ఆమెను ధర్మాసనం ముందు హాజరుపర్చారు. ప్రధాన న్యాయమూర్తి తన ఛాంబర్‌లోనే ప్రత్యూషతో మాట్లాడారు.

-భవిష్యత్తు గూర్చి ఆందోళన వద్దు: ధర్మాసనం భవిష్యత్తు గురించి ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని ప్రత్యూషకు న్యాయమూర్తులు సూచించినట్లు తెలిసింది. ఆమెకు ఇష్టమైన నర్సింగ్ కోర్సును పూర్తి చేయాలని సలహా ఇచ్చారు. ప్రత్యూష తండ్రి వేతనంలో కొంత మొత్తాన్ని ప్రత్యూషకు అందేలా చర్యలు చేపట్టాలని న్యాయవాది శరత్‌కుమార్‌కు సూచించినట్లు తెలిసింది. ప్రత్యూష బాగోగులను చూసేందుకు ఫెర్నాండెజ్ దవాఖాన ముందుకొచ్చిందని ధర్మాసనానికి శరత్‌కుమార్ తెలిపినట్లు తెలిసింది.

సీఎం కేసీఆర్‌కు ధర్మాసనం అభినందన: ప్రత్యూషతో న్యాయమూర్తులు ప్రత్యేకంగా మాట్లాడిన సమయంలో సీఎం కేసీఆర్‌ను ధర్మాసనం అభినందించినట్లు సమాచారం. తీరికలేకుండా ఉన్నప్పటికీ కుటుంబసమేతంగా దవాఖానకు వెళ్లి ప్రత్యూష బాగోగులను స్వయంగా ఆరా తీయడం గొప్ప విషయమని ధర్మాసనం పేర్కొనట్లు సమాచారం. కేసీఆర్ గొప్ప మానవతావాదిగా నిరూపించుకున్నారని పేర్కొన్నట్లు తెలిసింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.