Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నీళ్లు.. నాడు కండ్లల్లో నేడు ప్రాజెక్టుల్లో

-నిజాంసాగర్‌కు గోదావరి నీళ్లు చారిత్రక ఘట్టం
-నిజామాబాద్‌ జిల్లా తలరాత మారబోతున్నది
-భువి నుంచి దివికి నీటిని తెచ్చిన భగీరథుడు కేసీఆర్‌
-రోహిణిలో నార్లు పోసుకొనే పరిస్థితి మళ్లీ వచ్చింది
-అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

నిజాంసాగర్‌ కింద రెండు పంటలకు నీళ్లు తీసుకురావడానికి 30 ఏండ్లుగా నేను ఎన్నో కష్టాలు పడ్డా. ఆయకట్టు కింద వేసిన కొద్ది పంటనైనా కాపాడుకొ నేందుకు ఒక టీఎంసీ, అర టీఎంసీ నీళ్లకోసం ఆనాటి పాలకుల వద్ద బిక్షమెత్తుకునే పరిస్థితి ఉండేది. టీడీపీ హయాంలో నీళ్లు విడుదల చేయాలని పాలకుల ఇంటిముందు వారం పది రోజులు కూర్చోవాల్సి వచ్చేది. కాంగ్రెస్‌ హయాంలో ‘మేమే సింగూరు నుంచి నీళ్లు వదులుకుంటాం’ అని పోతే నాతోపాటు రైతులను అరెస్ట్‌చేశారు. సింగూరు నుంచి మాకు రావాల్సిన వాటాకోసం ప్రతిఏడాది పోరాడాల్సి వచ్చేది. ఓవైపు పంటలు ఎండుతున్నాయంటూ రైతులు ఏడుస్తుంటే.. తాగునీరు కావాలంటూ చెప్పి మమ్మల్ని మభ్యపెట్టేవారు. నీళ్ల కోసం ఇంత కష్టపడాలా? ఇదేం ఖర్మ వచ్చింది? అని ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో నీళ్ల కోసం మేము పడ్డ బాధలను జ్ఞాపకం తెచ్చుకుంటుంటే కండల్ల నీళ్లు వస్తున్నయి. ఇప్పుడు నిజాంసాగర్‌ల నీళ్లను చూస్తుంటే ఆనందంతో నీళ్లు దుంకుతున్నయి.

నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో స్పీకర్‌ పోచారం
-నీళ్లు.. నాడు కండ్లల్లో నేడు ప్రాజెక్టుల్లో
సాధారణంగా ఉప నదులు వెళ్లి మహానదిలో కలుస్తాయి. తెలంగాణలో మాత్రం బిడ్డ బాధ తీర్చేందుకు గోదారమ్మ స్వయంగా ఎగువకు ఎగిసింది. మేడిగడ్డ నుంచి కొండపోచమ్మసాగర్‌కు, అక్కడి నుంచి హల్దీవాగు ద్వారా మంజీరకు చేరింది. ‘ఈ చారిత్రక ఘట్టానికి కర్త, కర్మ, క్రియ అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌’ అని అంటున్నారు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి. నిజాంసాగర్‌కు గోదావరి జలాలు చేరిన సందర్భంగా గతంలో పడ్డ శ్రమ, ప్రస్తుత పరిస్థితులను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకొన్నారు. అప్పట్లో కండ్లల్లో నీళ్లు నిండితే.. ఇప్పుడు రిజర్వాయర్లలో నీళ్లు నిండుతున్నాయని ఆనందం వ్యక్తంచేశారు.

ఉద్యమ నినాదమైన.. ‘నీళ్లు’ సాకారం అవుతున్నది. మీకెలా అనిపిస్తున్నది?
రైతుకు పంచ భూతాలు సహకరించాలి. 1) భూమి- పంట పండాలంటే నేల కావాలి. 2) ఆకాశం- వాతావరణం అనుకూలించాలి. 3) నీరు- పంటకు సరిపడా నీరు అందాలి. 4) అగ్ని- తగిన మోతాదులో సూర్యరశ్మి ఉంటేనే పైరు ఎదుగుతుంది. 5) గాలి- మనిషైనా.. చెట్టయినా బతకాలంటే వాయువు కావాల్సిందే. ఇందులో గాలి, సూర్యరశ్మి, వాతావరణం మన చేతుల్లో లేదు. భూమి అందుబాటులో ఉంది. ఇక పాలకులు రైతులకు అందించగలిగేది నీరు మాత్రమే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇన్నేండ్లలో దీనిని గుర్తించిన ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్‌. నీళ్లు ఇస్తేనే రైతు బతుకుతడన్న తపన కలిగిన వ్యక్తి. నీళ్లను ఆయన ఉద్యమ నినాదంలో చేర్చారు. నదుల్లో వృథాగా పోతున్న వందల టీఎంసీల నీటిని మళ్లించాలంటే ఎత్తిపోతల పథకాలే శరణ్యమని గుర్తించి వాటికి శ్రీకారం చుట్టారు. గోదావరి నీళ్లను అర కిలోమీటర్‌ ఎత్తుకు తీసుకొచ్చారు. సాధారణంగా గంగమ్మ భువి నుంచి దివికి వచ్చిందంటాం.. కానీ తెలంగాణలో గోదావరి జలాలు దివి నుంచి భువివైపు ప్రయాణించాయి.

నిజాంసాగర్‌లోకి గోదావరి నీళ్లు చేరడం ఎలా అనిపిస్తున్నది?
నాతోపాటు మా జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. వాస్తవానికి ఉపనదులు వెళ్లి మహానదిలో కలుస్తాయి. కానీ ఇప్పుడు గోదావరి తల్లి ఉపనది అయిన మంజీరలో కలుస్తున్నది. బిడ్డ బాధ తీర్చడానికి తల్లే స్వయంగా వచ్చింది. నిజామాబాద్‌ జిల్లాలో ఎల్లారెడ్డి, కామారెడ్డి మినహాయిస్తే 7 నియోజకవర్గాలు నిజాంసాగర్‌ ఆయకట్టు కింద ఉన్నాయి. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో నదిపై 40 ప్రాజెక్టులు కట్టడం, కాంగ్రెస్‌ పాలకులు నిజాంసాగర్‌ను ఎండబెట్టేలా సింగూరు ప్రాజెక్టు కట్టడం వల్ల నిజాంసాగర్‌ పదేండ్లకు ఒకసారి నిండేది. ఇప్పుడు కొండపోచమ్మ నుంచి నీళ్లను తెచ్చి సింగూరు నింపుతున్నారు. మల్లన్నసాగర్‌ నుంచి నేరుగా నీటిని తెచ్చేందుకు మరో కాలువ తవ్విస్తున్నారు. గతంలో నీళ్లకోసం మేము పడ్డ బాధలను జ్ఞాపకం తెచ్చుకుంటుంటే కండ్లల్ల నీళ్లు వస్తున్నయి. ఇప్పుడు నిజాంసాగర్‌ల నీళ్లను చూస్తుంటే ఆనందంతో నీళ్లు దుంకుతున్నయి.

గతంలో నీళ్లకోసం ఏ కష్టాలు పడ్డారు?
నిజాంసాగర్‌ కింద రెండు పంటలకు నీళ్లు తీసుకురావడానికి 30 ఏండ్లుగా ఎన్నో కష్టాలు పడ్డాను. నాటి పాలకుల వద్ద భిక్షమెత్తుకునే పరిస్థితి ఉండేది. టీడీపీ హయాంలో నీళ్లు విడుదల చేయాలని పాలకుల ఇంటిముందు వారంపది రోజులు కూర్చోవాల్సి వచ్చేది. కాంగ్రెస్‌ హయాంలో ‘మేమే సింగూరు నుంచి నీళ్లు వదులుకుంటాం’ అని పోతే నాతోపాటు రైతులను అరెస్ట్‌చేశారు. నీళ్ల కోసం ఇంత కష్టపడాలా? ఇదేం ఖర్మ? అని ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తెలంగాణ వచ్చాక పరిస్థితి ఏంటి?
మొదట్లో ఒకటి రెండేండ్లు నిజాంసాగర్‌కు సింగూరు నుంచి నీళ్లు తేవాల్సిన పరిస్థితే వచ్చింది. ఆ సందర్భంలో సీఎం కేసీఆర్‌ నన్ను పిలిపించారు. ‘సీనన్నా.. సింగూరు నుంచి నీళ్లు కావాల్నట గదా? ఎందుకు ఆలస్యం చేస్తున్నవ్‌? పంటలను బతికించుకో’ అన్నారు. సింగూరు ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న నీళ్లను విడుదలచేయాలని అధికారులను ఆదేశించారు. దాంతో మూడు దఫాలుగా నీళ్లు విడుదలయ్యాయి. రైతుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.

నీళ్లు.. నాడు కండ్లల్లో నేడు ప్రాజెక్టుల్లో
మళ్లీ రోహిణి కార్తెలో నారుమళ్లు వేసుకునే రోజులు రాబోతున్నాయా?
మా చిన్నప్పుడు నిజాంసాగర్‌ ఏటా పొంగి పొర్లుతుండే. రోహిణి కార్తెలో (మే నెలలో) నారుమళ్లు పోసుకునేవాళ్లం. కొన్ని దశాబ్దాలుగా ఈ సంస్కృతి లేదు. ఇప్పుడు మళ్లీ పునర్వైభవం వచ్చింది. ఇకపై కాళేశ్వరం నీటితో ఆరుద్రలోపు నాట్లు పూర్తి చేసుకొంటాం. సాధారణంగా ఏప్రిల్‌లో అకాల వర్షాలు, వడగండ్లు పంటకు నష్టం చేస్తాయి. అలాకాకుండా పంట ముందుగానే చేతికందాలంటే మొదటి పంట రోహిణి కార్తెలో నారుమళ్లు పోసుకోవాలి. అక్టోబర్‌కు కోతలు పూర్తవుతాయి. నవంబర్‌లో రెండో పంట వేసుకుంటే.. మార్చి చివరికి కోత పూర్తవుతుంది. దీంతో ప్రకృతి వైపరీత్యాల నుంచి, అకాల వర్షాల నుంచి తప్పించుకోవచ్చు. ఇన్నేండ్ల నా అనుభవం ప్రకారం రోహిణిలో నారుమళ్లు పోసుకుంటే ఆ పంటలకు చీడపీడల బాధ తక్కువ. దీంతో ఉత్పత్తి పెరుగుతుంది.

ప్రతిపక్ష నేతలు ఏమంటున్నారు?
గతంలో చాలా విమర్శలు చేశారు. అర కిలోమీటర్‌ ఎత్తులోకి నీళ్లెలా ఎత్తిపోస్తారంటూ నవ్వారు. ఇప్పుడు అందరి నోళ్లు మూతపడ్డాయి. వాళ్లే..‘మీ సీఎంగారు మొండోళ్లు బై. గోదారమ్మను కొండపోచమ్మదాకా తీసుకొచ్చిన్రు. చెప్పినట్టే మంజీరలో, నిజాంసాగర్‌లో కలిపిన్రు’ అంటూ అభినందిస్తున్నారట.

రైతులకు ఎలాంటి మేలు కలుగనుంది?
ఒక ఎకరానికి ఏటా రెండు పంటలు వేస్తే.. సగటున 70 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. క్వింటా రూ.2 వేలు లెక్కన రూ.1.40 లక్షలు. ప్రభుత్వం ఇచ్చే రూ.10 వేలు రైతుబంధు కలిపితే ఏటా రాబడి రూ.1.50 లక్షలు. రెండు పంటలకు రూ.50 వేలు ఖర్చు మినహాయిస్తే ఒక్కో ఎకరం మీద రైతుకు లక్ష ఆదాయం వస్తుంది. గతంలో సీఎం కేసీఆర్‌ దగ్గర కూడా ఈ విషయాన్ని ప్రస్తావించా. సార్‌ మీరు ఇచ్చే నీళ్ల వల్ల ఎకరాకు రూ.లక్ష లాభం కలుగుతుందని చెప్పా.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.