Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నేతన్న బతుకులకు భరోసా!

-అండగా నిలిచిన మంత్రి శ్రీ కేటీఆర్ -ఏడాది పొడవునా పనికల్పిస్తున్న ప్రభుత్వం -రుణాలు మాఫీ.. ముడిసరుకుపైనా సబ్సిడీ -నెలకు కనీసం రూ.15-20 వేల వేతనం -ప్రత్యేకంగా రెండు కార్పొరేషన్ల ఏర్పాటు -ప్రభుత్వ శాఖలకు వస్ర్తాలన్నీ టెస్కో ద్వారా సరఫరా -దేశానికి ఆదర్శంగా నిలిచిన జియో ట్యాగింగ్

ఉమ్మడిరాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యల వార్తలే నిత్యం పత్రికల్లో పతాక శీర్షికలయ్యేవి. తెలంగాణ ఉద్యమ సమయంలో నేతన్నల ఆత్మహత్యలను చూసి కలత చెందిన సీఎం కేసీఆర్, బాధిత కుటుంబాలను అదుకోవడానికి జోలెపట్టి విరాళాలు అడిగారు. రూ.50 లక్షలు సేకరించి పోచంపల్లి చేనేత కార్మికులకు, సిరిసిల్లలోని మరమగ్గాల కార్మికులకు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కార్మికుల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో చేనేత కార్మికుల సంక్షేమానికి కనీవిని ఎరుగని రీతిలో రూ.1200 కోట్లు కేటాయించారు. మరమగ్గాల కార్మికులకు నెలకు రూ.15-20వేల ఆదాయం వచ్చేలా మరమగ్గ యాజమాన్యాలను సీఎం కేసీఆర్ ఒప్పించారు.

చేనేత, పవర్‌లూంలకు ప్రత్యేకంగా తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ పవర్‌లూంఅండ్ టెక్స్‌టైల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లను ఏర్పాటుచేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పథకాలకు అర్హులకే అందాలనే ఉద్దేశంతో చేనేత, మరమగ్గ కార్మికుల వివరాలను ప్రభుత్వం జియోట్యాగింగ్ చేయించింది. దీంతో అవకతవకలకు అస్కారంలేకుండా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో పథకాలకు సంబంధించిన సబ్సిడీ సొమ్ము జమవుతున్నది. ఈ విధానాన్ని కేంద్రం ప్రశంసించింది. దేశవ్యాప్తంగా అమలు చేస్తే సత్ఫలితాలు వస్తాయని కొనియాడింది. కార్మికులకు మేలుచేసే బాధ్యతను భుజాన వేసుకున్న చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్ అనేక పథకాలను రూపొందించారు.చేనేతకు అంబాసిడర్‌గా మారారు. మంత్రి పిలుపుతో ప్రతి సోమవారం అధికారులు, ప్రజాప్రతినిధులు చేనేత వస్ర్తాలను ధరించడం అలవాటు చేసుకొన్నారు.

నేతన్నకు చేయూత నేతన్నలకు సామాజిక భద్రత కల్పించడానికి నేతన్నకు చేయూత పథకాన్ని 2017 జూన్ 24న భూదాన్ పోచంపల్లిలో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గతంలో ఉన్న పథకం కింద చేనేత సహకార సంఘంలోని కార్మికులు నెలలో పొందే కూలీలో 8 శాతాన్ని బ్యాంకులో జమ చేస్తే ప్రభుత్వం మరో 8 శాతం జమచేసేది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మార్చేసి తన వాటాగా 16 శాతం జమచేస్తుస్తున్నది. ఇప్పటివరకు 15,466 మంది బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం రూ.12.14 కోట్లు జమ చేసిం ది. కార్మికులు తమ వాటాగా రూ.6.07 కోట్లు జమ చేశారు. మొత్తంగా కార్మికుల ఖాతాల్లో రూ.18కోట్లు జమయ్యాయి. సహకార సంఘాల్లో లేని కార్మికులకు కూడాఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు.

విద్యుత్‌చార్జిలో 50 శాతం సబ్సిడీ మరమగ్గాలపై విద్యుత్‌చార్జిలో 50 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుండడంతో వేల మంది వరకు లబ్ధిపొందుతున్నారు. దీని కోసం ప్రభుత్వం 2015-16లో రూ.782 లక్షలు, 2016-17లో రూ.869 లక్షలు, 2017-18లో రూ.1,375 లక్షలు భరించింది. ప్లెయిన్ పవర్‌లూంను ఆప్‌గ్రేడ్ చేయడంలో భాగంగా.. 5,393 మంది చేనేత కార్మికులకు లబ్ధిచేకూరింది. దీని కోసం రూ.5.39 కోట్లు విడుదల చేశారు. వర్కర్ టు ఓనర్ పథకంలో భాగంగా సిరిసిల్ల సమీపంలో 88 ఎకరాల్లో 1104 యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో యూనిట్‌లో నాలుగు మరమగ్గాలు ఉంటాయి. మౌలిక సదుపాయాలు, మగ్గాల వ్యయం రూ.386 కోట్లుగా అంచనాలు రూపొందించారు.

రుణ మాఫీ చేనేత కార్మికుల బ్యాంకు రుణాలను మాఫీచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 2010 ఏప్రిల్ 1 నుంచి 2017 మార్చి 31 వరకు ఉన్న చేనేత రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా 8,500 మంది చేనేత కార్మికులు రుణ విముక్తి పొందనున్నారు. వర్కింగ్ క్యాపిటల్ కోసం తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. దీనికి అవసరమైన నిధులను రూ. 50 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. బ్యాంకుల నుంచి పూర్తి వివరాలు అందగానే నిధులు జమ చేయనున్నారు. మగ్గాల అధునీకరణ కోసం 13 సహకార సంఘాలకు రూ. 175 లక్షలను విడుదల చేశారు. 39 సహకార సంఘాల్లో కామన్ ఫెసిలిటి సెంటర్ (సీఎఫ్‌సీ) నిర్మాణాల కోసం రూ. 8.17 కోట్లు విడుదల చేసింది.

చేనేత మిత్ర చేనేత కార్మికులను అదుకోవడానికి ప్రభుత్వం మరో పథకాన్ని రూపొందించింది. కార్మికులకు అవసరమైన నూలు, సిల్క్, ఉన్ని, డై, రసాయనాలు, యార్న్‌పై సబ్సిడీని పెంచాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం 20 శాతం మాత్రమే సబ్సిడీ ఇవ్వగా దానిని రెట్టింపు చేయాలని నిర్ణయించారు. సబ్సిడీని కార్మికుడి బ్యాంకు ఖాతాలో జమచేయనున్నారు. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వం పదిశాతం సబ్సిడీ ఇస్తుంది. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది.

చేతినిండా పని ఉమ్మడిరాష్ట్రంలో వంద కోట్ల రూపాయల లోపే ఉన్న టెస్కో టర్నోవర్ ప్రస్తుతం రూ.450 కోట్లకు చేరింది. ఏడాది పొడవునా పనిదొరికేలా చూడాలన్న మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అధికారులు వర్క్ క్యాలెండర్‌ను రూపొందించారు. రాష్ట్రంలో 20 లక్షల మందికిపైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం వస్ర్తాలను మరమగ్గాలపై తయారుచేయించి పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. వీటి విలువ రూ.70 కోట్ల వరకు ఉంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే యూనిఫాం, గురుకులాలు, వివిధ శాఖల ఉద్యోగులకు అవసరమైన యూనిఫాంలు, వైద్య ఆరోగ్యశాఖకు అవసరమైన బెడ్ మెటీరియల్ టెస్కో ద్వారా సరఫరా చేస్తున్నారు. బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్‌లకు ఇచ్చే వస్ర్తాలన్నింటినీ చేనేత, జౌళిశాఖ ద్వారా సరఫరా చేస్తున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా కోటి మంది మహిళలకు పంచే చీరలను సిరిసిల్లలోని కార్మికులతోనే నేయిస్తున్నారు. దీంతో దాదాపుగా ఆరు నెలలపాటు 20 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. గత ఏడాది రూ.220 కోట్ల పనులు చేయగా ఈ ఏడాది రూ.280 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు. రంజాన్‌కు 4.50 లక్షల గిఫ్ట్ ప్యాకెట్లను తయారుచేయించి ఇస్తున్నారు. సంక్షేమశాఖల నుంచే ఈ సంవత్సరం రూ.58 కోట్ల ఆర్డర్లను చేనేత, పవరలూం కార్మికులకు ఇచ్చారు. రంజాన్ గిఫ్ట్ ప్యాక్‌ల కోసం రూ.20 కోట్ల ఆర్డర్లు టెస్కోకు అందాయి. గత ఏడాది టెస్కోకు రూ.400 కోట్ల ఆర్డర్లు వచ్చాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.