-కిటకిటలాడుతున్న కంటివెలుగు శిబిరాలు -11 రోజుల్లో 12,93,525 మందికి కంటిపరీక్షలు -గురువారం ఒక్కరోజే 1,40,162 మందికి కంటిపరీక్షలు
కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన కంటి వైద్య శిబిరాలు కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 రోజుల్లో 826 గ్రామాల్లో కంటివైద్య పరీక్షలు పూర్తయ్యాయి. మరో 555 గ్రామా ల్లో కంటివైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. మొత్తం 47వార్డుల్లో కంటిపరీక్షలు పూర్తవ్వగా.. మరో 269 వార్డుల్లో కంటివైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య 12,93,525కి చేరింది.

కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన కంటివైద్యశిబిరాలు కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 826 గ్రామాల్లో కంటివైద్య పరీక్షలు పూర్తయ్యాయి. మరో 555 గ్రామాల్లో కంటివైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. మొత్తం 47వార్డుల్లో కంటిపరీక్షలు పూర్తవ్వగా.. మరో 269 వార్డుల్లో కంటివైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. 11 రోజుల్లో కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య 12,93,525కి చేరింది. వీరిలో 2,54,717 మందికి కండ్లద్దాలను అందజేశారు. మరో 3,37,389 మందికి ప్రత్యేక అద్దాలు ప్రతిపాదించారు. కాగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా 1,40,162 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా.. 25,147 మందికి కండ్లద్దాలను అందజేశారు. మరో 28,688 మందికి ప్రత్యేక అద్దాలను ప్రతిపాదించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో.. వనపర్తి, నమస్తే తెలంగాణ: వనపర్తి జిల్లాలో 11 రోజుల్లో 19,295 మందికి కంటిపరీక్షలు చేయగా, 2,802 మం దికి అద్దాలు అందజేశారు. 4,838 మందికి ప్రత్యేక అద్దా లు ఆర్డర్‌చేశారు. 2,298 మందిని శస్త్రచికిత్సల కోసం రిఫర్‌చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 29,731 మందికి కంటి పరీక్షలు నిర్వహించి.. 4,373 మందిని ఆపరేషన్లకు రిఫర్ చేశారు. 6,469 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 49,391 మందికి పరీక్షలు చేయగా.. 5,971 మందికి అద్దాలు అందజేశారు. 2,499 మందిని శస్త్రచిక్సితలకు రిఫర్ చేశారు. జోగుళాంబగద్వాల జిల్లాలో ఇప్పటివరకు 20,299 మందికి కంటిపరీక్షలు నిర్వహించగా 2,976 మందికి అద్దాలు పంపిణీచేశారు. 3,716 మందిని శస్త్ర చికిత్సలకు రిఫర్‌చేశారు.

గ్రేటర్ పరిధిలో.. హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్ హైదరాబాద్‌లోని 30 సర్కిళ్లలో గురువారం 28,435 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 7,296 మందికి కండ్లద్దాలు పంపిణీ చేయగా.. 3,438 మందిని శస్త్రచికిత్సల కోసం రిఫర్‌చేశారు.
నిర్మల్‌లో ఉత్సాహంగా.. నిర్మల్, నమస్తే తెలంగాణ: నిర్మల్ జిల్లాలో కంటివెలుగు శిబిరాలకు జనం ఉత్సాహంగా తరలివస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 26,067 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి.. 5,489 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 2,887 మందిని శస్త్ర చికిత్సలకు రిఫర్ చేశారు.
మంచిర్యాలలో ఒకేరోజు ఐదువేల మందికి పరీక్షలు మంచిర్యాల అగ్రికల్చర్: మంచిర్యాల జిల్లాలో గురువారం ఒక్కరోజే 5,029 మందికి కంటి పరీక్షలు చేసి.. 804 మందికి అద్దాలు అందజేశారు. మరో 1,271 మందికి ప్రత్యేక అద్దాలు ప్రతిపాదించారు. 436 మందిని శస్త్ర చికిత్సల కోసం రిఫర్‌చేశారు. ఇప్పటివరకు మొత్తం 43,076 మందికి కంటి పరీక్షలు చేసి 7,460 మందికి అద్దాలు అందజేశారు. మరో 11,054 మందికి ప్రత్యేక అద్దాలు ప్రతిపాదించారు. 6,375 మందిని శస్త్ర చికిత్సల కోసం రిఫర్ చేశారు.

ఆదిలాబాద్‌లో ఉదయం నుంచే క్యూ ఎదులాపురం: ఆదిలాబాద్ జిల్లాలో కంటివెలుగు శిబిరాల వద్ద ఉదయం నుంచే క్యూలు కనిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా పదకొండు రోజుల్లో 32,174 మందికి కంటిపరీక్షలు నిర్వహించి.. 6,998 మందికి అద్దాలు పంపిణీచేశారు. మరో 7,748 మందికి ప్రత్యేక అద్దాలు ప్రతిపాదించారు. 4,906 మందిని శస్త్ర చికిత్సలకు రిఫర్‌చేశారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో.. ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 25,024 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2,587 మందిని ఆపరేషన్ల కోసం రిఫర్‌చేశారు. 5,687 మందికి కంటి అద్దాలను అందజేశారు. గురువారం 1,788 మందికి పరీక్షలు నిర్వహించగా.. 110 మందిని ఆపరేషన్లకు రిఫర్ చేశారు. 396 మందికి కంటి అద్దాలు పంపిణీచేశారు.
ఖమ్మం జిల్లాలో.. ఖమ్మం, నమస్తే తెలంగాణ: ఖమ్మం జిల్లాలో 32 కేంద్రాల్లో ఇప్పటివరకు మొత్తం 48,663 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. వీరిలో 12,294 మందికి కండ్లద్దాలు పంపిణీచేశారు. ఆపరేషన్ల నిమిత్తం 7,931 మందిని రిఫర్‌చేశారు.

భద్రాద్రి కొత్తగూడెంలో 92 మందికి శస్త్రచికిత్సలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోనే అతిపెద్ద ఏజెన్సీ జిల్లాగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కంటి వెలుగు వైద్య శిబిరాలకు వృద్ధులు ఎక్కువ సంఖ్యలో తరలి వస్తున్నారు. జిల్లాలో గురువారం 3,956 మంది 27 కంటి వైద్య శిబిరాల్లో పరీక్షలు చేయించుకున్నారు. జిల్లాలో పదకొండు రోజుల్లో మొత్తం 44,813 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 92 మందికి ఎల్వీ ప్రసాద్ దవాఖానలో శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఇప్పటివరకు 10,913 మందికి కండ్లద్దాలు పంపిణీచేశారు.
కామారెడ్డిలో శతకం కామారెడ్డి, నమస్తే తెలంగాణ: కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు వంద గ్రామాల్లో 67,004 మందికి కంటిపరీక్షలు పూర్తిచేశారు. వీరిలో 3,865 మం దికి కండ్లద్దాలు పంపిణీచేశారు.దృష్టిలోపం ఎక్కువగా ఉన్న 4,689 మందికి ప్రత్యేక అద్దాల కోసం రిఫర్‌చేశారు. శస్త్ర చికిత్సల కోసం 3,978 మందిని గుర్తించారు.
సంగారెడ్డిలో 36 గ్రామాల్లో.. సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి జిల్లాలో 36 గ్రామాల్లో కంటివెలుగు శిబిరాలు ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు 53,373 మందికి కంటిపరీక్షలు నిర్వహించగా.. 13,446 మందికి కంటి అద్దాలు అందజేశారు. మరో 12,042 మందికి ప్రత్యేక అద్దాలు ప్రతిపాదించారు. 6,970 మందిని సర్జరీల కోసం రిఫర్‌చేశారు. గురువారం 5,566 మందికి పరీక్షలు నిర్వహించి 1,261 మందికి కండ్లద్దాలు పంపిణీచేశారు. 1,066 మందికి ప్రత్యేక అద్దాలు ప్రతిపాదించారు. 592 మందిని ఆపరేషన్ల కోసం రిఫర్‌చేశారు.
రాజన్నసిరిసిల్ల జిల్లాలో 24794 మందికి కంటి పరీక్షలు రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: గురువారం రాజన్నసిరిసిల్ల జిల్లాలోని 13 గ్రామాల్లో 2,521 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 308 మందికి అద్దాలు పంపిణీచేశారు. 94 మందిని ఆపరేషన్లకు రిఫర్‌చేశారు. జిల్లావ్యాప్తంగా 11 రోజుల్లో 24,794 మందికి కంటిపరీక్షలు చేయగా, 5,585 మందికి అద్దాలు పంపిణీచేశారు. 1,788 మందిని ఆపరేషన్ల కోసం రిఫర్ చేశారు.
వరంగల్ అర్బన్‌లో 23 కేంద్రాల్లో పరీక్షలు రెడ్డికాలనీ(వరంగల్): వరంగల్ అర్బన్ జిల్లాలో 23 కేంద్రాల్లో నేత్రవైద్య శిబిరాలు ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు మొత్తం 39,823 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. 9,595 మందికి కంటి అద్దాలు పంపిణీచేశారు. మరో 13,137 మందికి ప్రత్యేక కంటి అద్దాలు ప్రతిపాదించారు. ఆపరేషన్లు, ఇతర కంటి వైద్యసేవలకు 6,035 మందిని రిఫర్‌చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో.. భూపాలపల్లి టౌన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటుచేసిన 18 కంటివెలుగు కేంద్రాల్లో ఇప్పటివరకు 29,872 మంది కంటిపరీక్షలు చేయించుకున్నారు. 8,152 మందికి కండ్లద్దాల పంపిణీచేయగా, 4,298 మందిని శస్త్రచికిత్సల నిమిత్తం రిఫర్‌చేశారు.
రెండేండ్ల బాధ తప్పింది నాకు రెండేండ్లుగా కంటిచూపు సరిగా కనబడటం లేదు. డాక్టర్లకు చూపించుకుందామంటే డబ్బులు లేవు. ఇక్కడ నయాపైసా లేకుండా నాకు అద్దాలు ఇచ్చిండ్రు. కేసీఆర్‌సారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలి. -పంచపూల, బేల, ఆదిలాబాద్ జిల్లా
ఇప్పుడే మంచిగ కనపడతాంది నాకు కొంతకాలంగా కంటిచూపు సక్కగా కనిపించడం లేదు. మంచిర్యాలకు పోయి డాక్టర్‌కు చూపించుకుందామనుకున్నా. కానీ ఇంటికాడ పనులతో సమయం లేకుండా పోయింది. ఇక్కడ సార్లు మంచిగ చూసిన్రు. అద్దాలు ఇచ్చిన్రు. ఇప్పుడు మంచిగ కనపడతాంది. – జాడి జ్యోతిక, కౌటాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా
నా సమస్య తీరింది నాకు నాలుగైదేండ్ల నుంచి కండ్లు సరిగ్గా కనిపిస్తలేవు. తలనొప్పి వచ్చేది. క్యాంపులో కంటి పరీక్షలు చేయించుకున్న. ఉచితంగా అద్దాలు, మందులు ఇచ్చిండ్రు. ప్రైవేటులో పరీక్షలు చేయించుకోవాలంటే వేల రూపాయలయ్యేటివి. నయా పైసా లేకుండా నా సమస్య తీరింది. – ఆకోజు స్వప్న, ఎర్కలవాడ, గృహిణి
సీఎం కేసీఆర్ మేలు ఎప్పటికీ మరువను చాలా ఏండ్ల నుంచి నాకు కంటిచూపు సరిగా కనబడక పోయేది. ప్రభుత్వం పుణ్యమాని మా ఊర్లోనే కండ్లను చూపించుకున్నా. అద్దాలు ఇచ్చారు. ఇప్పుడు కంటిచూపు బాగా కనిపిస్తున్నది. సీఎం కేసీఆర్ మేలు ఎప్పటికీ మరువను. – ఈరమళ్ల రాములమ్మ, కనగల్, నల్లగొండ జిల్లా
పరీక్షలు మంచిగా చేస్తున్రు పెద్ద దవాఖాన్లకంటే ఇక్కడ పరీక్షలు మంచిగా చేస్తుండ్రు. చాలా రోజుల సంది కండ్లు కనిపిస్తలేవు. దగ్గరి చూపు, దూరపుచూపు కోసం పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చిండ్రు. అద్దాలు పెట్టుకున్నంక మంచిగా కనిపిస్తున్నది. – పోచమ్మ, వనపర్తి జిల్లా
డాక్లర్లు మంచిగా చూశారు నేను చిరుద్యోగిని. నిత్యం రికార్డులు రాస్తుంటా. గత రెండేళ్లుగాచిన్న అక్షరాలు సరిగ్గా కనబడుతలేవు. రాసేటప్పుడు అప్పుడప్పుడు తప్పులు దొర్లేవి. ఆఫీసుకు వచ్చేవారితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా. కంటివెలుగు శిబిరానికి వచ్చి చూయించుకున్నా. డాక్టర్లు మంచిగా పరీక్షలు చేసి కంటి అద్దాలు ఇచ్చారు. – ఎండీ ఖాజామైనొద్దీన్, వనపర్తి జిల్లా
కేసీఆర్ లాంటి సీఎంను చూడలేదు పేదల కోసం ఇంత ఆలోచన చేసే ముఖ్యమంత్రులు ఎక్క డ ఉండరు. కేసీఆర్‌కు ధన్యావాదాలు. నాకు కంటి సమస్యలు ఉండే. శిబిరంలోనే చూయించుకున్నా. అద్దాలు కూడా ఇచ్చారు. – అన్నదానం లక్ష్మి, వెల్దండ, నాగర్‌కర్నూల్ జిల్లా
కండ్లల్ల కెల్లి నీళ్లు కారుతుంటే అద్దాలిచ్చిండ్రు సాంచాలు నడుపుకొని పొట్టపోసుకుంట. రెండేండ్ల సంది కండ్లల్లకెల్లి నీళ్లు గారుతున్నయి. పోగులు కనవడక మస్తు అవస్థయితాంది. గప్పట్లోపారి ప్రైవేటు దవాఖన్లకు వోయి న. అద్దాలు పెట్టుకోవాలని చెప్పిండ్రు. పైసలు మూడు వేల దాకయితయన్నడు. ఇగ మల్ల దవాఖాన దిక్కు సూళ్లే. కేసీఆర్‌సార్ కంటివెలుగు పథకంలో ఉచితంగా పరీక్షలు చేసి అద్దాలిస్తండ్రని మా కొడుకు చెప్తే ఈడికొచ్చిన. మంచిగ చూసిండ్రు. అద్దాలిచ్చిండ్రు. – దీకొండ వెంకటేశం, నేత కార్మికుడు, సిరిసిల్ల
ఇలాంటివి సీఎం కేసీఆర్‌కే సాధ్యం పేదల కండ్లల్లో వెలుగులు నింపేందుకు కంటివెలుగు కార్యక్రమం ఏర్పాటుచేసిన సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. ఇలాంటి పథకాలు అందించడం ఒక్క కేసీఆర్ వల్లనే సాధ్యమవుతుంది. ప్రజలకు నేరుగా పథకాలు అందించే ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం మన అందరి అదృష్టం. -మరీదు శివలక్ష్మీ, వీయం బంజరు, ఖమ్మం జిల్లా