– క్రమశిక్షణతో మెలిగినవారికి నామినేటెడ్ పోస్టులు – జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తాం – మెదక్ జిల్లా కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు

నిర్మాణాత్మకమైన క్యాడర్ ఉండడంతోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందించడంలో విజయవంతమైంది. అందుకే దేశంలో ఏ ప్రభుత్వానికి రాని ఆదరణ టీఆర్‌ఎస్ సర్కారుకు వస్తున్నది అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. టీఆర్‌ఎస్ తొలినుంచి క్రమశిక్షణతో కూడిన ఉద్యమాన్నే నడిపిందని, ప్రస్తుతం అదే క్రమశిక్షణతో పరిపాలన అందిస్తున్నదన్నారు. క్రమశిక్షణతో మెలిగినవారిని నామినేటెడ్ పోస్టుల్లో నియమిస్తామన్నారు. మంగళవారం మెదక్ జిల్లా రామచంద్రాపురంలో నిర్వహించిన జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పార్టీలో క్రమశిక్షణతో మెలిగిన ప్రతి కార్యకర్తకు సముచితస్థానాన్ని కల్పిస్తామని, మార్కెట్, దేవాదాయశాఖ కమిటీల్లో అవకాశం కల్పిస్తామన్నారు. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల, మండలాల, మున్సిపాలిటీల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని.. సీఎం కేసీఆర్ నిర్దేశించినట్లుగానే ప్రణాళికబద్ధంగా ఈ కమిటీలు ఏర్పడుతున్నాయన్నారు. వచ్చేనెల 16లోపు అన్ని మండలాల, జిల్లాల కమిటీలను పూర్తిచేసి ఎన్నికల సంఘానికి అందిస్తామన్నారు. ఇప్పటికే సభ్యత్వనమోదు పూర్తయిందని, సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు గుర్తింపు కార్డులను, ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కలగజేస్తున్నామన్నారు. ఎవరూ ఊహించని విధంగా ప్రభుత్వ పాలన సాగుతున్నదన్నారు.
గత ప్రభుత్వాలు మార్చి నెల రాకముందే కరెంట్‌కోతలు విధించాయని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెప్పపాటు కరెంట్‌కోత లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నదని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, గ్రామ కమిటీల జిల్లా ఇన్‌చార్జి సామ్యూల్, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, బాబూమోహన్, మదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, రాములునాయక్, సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సోమిరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, అనిల్‌కుమార్, భూమారెడ్డి, మాణిక్‌రావు, అంజయ్య, దేవేందర్‌రెడ్డి, రాంరెడ్డి, నర్సారెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, వెంకటేశంగౌడ్, మాదాసు శ్రీనివాస్ పాల్గొన్నారు.