టీఆర్ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఊరూరా జోరుగా సాగుతున్నది. సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి భారీ స్పంద న వస్తుండటంతో పార్టీ శ్రేణులు ఇంటింటికీ తిరుగుతూ సభ్యత్వాలు అందజేస్తున్నాయి. గత ఏడాది కంటే రెట్టింపు సభ్యత్వాలు చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు శ్రమిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కార్యకర్తలకు వెన్నంటి ఉంటూ ప్రజలకు సభ్యత్వాలు అందజేస్తున్నారు. శనివారం గ్రేటర్ హైదరాబాద్‌లోని మలక్‌పేటలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్ పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అటవీశాఖ మంత్రి జోగు రామన్న ఆటో డ్రైవర్లకు పార్టీ సభ్యత్వాలు అందజేశారు.


గ్రేటర్ వరంగల్‌లో ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, ఆరూరి రమేశ్, వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్‌లో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, జనగామ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కరీంనగర్లో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, తిమ్మాపూర్‌లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదండి, జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఎమ్మెల్యే బొడిగ శోభ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంపీ వినోద్, పెద్దపల్లి జిల్లా మంథనిలో ఎమ్మెల్యే పుట్ట మధు సభ్యత్వాలు అందజేశారు.

