-కొనసాగుతున్న టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు -ఉత్సాహంగా చేరుతున్న ప్రజలు -ఆసక్తి చూపుతున్న యువత

టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు జోరుగా సాగుతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల ఇంచార్జులు, నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సబ్బండ వర్గాల ప్రజలు టీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. కేసీఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షుడు మహ్మద్ అమీర్ హైదరాబాద్‌లో హోంమంత్రి మహమూద్ అలీ చేతులమీదుగా పార్టీ సభ్యత్వం స్వీకరించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయిన్పల్లి, జయనగర్‌లో మంత్రి మల్లారెడ్డి సభ్యత్వ నమోదులో పాల్గొని సభ్యత్వాలు అందజేశారు. కంటోన్మెంట్‌బోర్డు సభ్యుడు మహేశ్వర్‌రెడ్డి, బోయిన్పల్లి మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవఅధ్యక్షుడు గంధం రాములు కొండాపూర్‌లో ఎమ్మెల్యే హరీశ్ రావు చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట బైపాస్‌లోని రామ్‌లీలా ఫంక్షన్హల్లో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి సభ్యత్వనమోదు కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విఫ్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి 65 శాతం సాధారణసభ్యత్వం, 35 శాతం క్రియాశీలక సభ్యత్వం ఇస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, నాయకులు మద్దినేని స్వర్ణకుమారికి, మరికంటి ధనలక్ష్మికి సభ్యత్వం అందజేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పలువురికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలను అందజేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీ 4వ వార్డులో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పర్యటించి పలువురికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలను అందించారు. ఇల్లెందు నియోజకవర్గం టేకులపల్లిలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య పలువురికి పార్టీ సభ్యత్వాలను అందజేశారు. భద్రాచలం నియోజకవర్గంలో భద్రాచలం పట్టణంలో నియోజకవర్గ ఇన్చార్జి తెల్లం వెంకట్రావ్ సభ్యత్వ నమోదు ప్రక్రియలో పాల్గొని పలువురికి పార్టీ సభ్యత్వాలను అందించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు గ్రామాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.

రాష్ట్రంలో అనతి కాలంలోనే టీఆర్ఎస్ బలమైన రాజకీయశక్తిగా ఎదిగిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చందర్‌తో కలిసి రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ సభ్యత్వ రసీదును అందజేశారు. నిజామాబాద్ జుక్కల్, బాన్సువాడ నియోజకర్గాల సభ్యత్వ నమోదు ఇన్చార్జి దాదన్నగారి విఠల్‌రావు ఆధ్వర్యంలో బిచ్కుంద మండలం పుల్కల్లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొన్నారు.

కరీంనగర్‌లోని 41,46, 47వ డివిజన్లలో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. గంగాధర మండలం బూర్గుపల్లిలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో సభ్యత్వాలు నమోదు చేశారు. అలాగే, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, సైదాపూర్, శంకరపట్నం మండలాల్లోని పలు గ్రామాల్లో కూడా స్థానిక టీఆర్ఎస్ నాయకులు సభ్యత్వాలు సేకరించారు. ఇంటింటికి వెళ్లి కొత్త సభ్యులను చేర్పించారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండల కేంద్రంతోపాటు కొండాపూర్, దాయపంతులపల్లి, బాలానగర్, రాజాపూర్‌లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లకా్ష్మరెడ్డి టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ బాధ్యుడు చాడ కిషన్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు, కొల్లాపూర్, పాన్‌గల్ మండలాల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరంగల్ 20వ డివిజన్లో సిద్దంరాజు ఆధ్వర్యంలో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.

క్రియాశీల సభ్యత్వాన్ని పొందిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని నిజామాబాద్ పార్లమెంటు మాజీ సభ్యురాలు కల్వకుంట్ల కవిత స్వీకరించారు. హైదరాబాద్‌లోని కవిత స్వగృహంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సభ్యత్వ రసీదును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిజామాబాద్ జి ల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చు రుగ్గా సాగుతున్నదని తెలిపారు. పార్టీ నిర్దేశించిన లక్ష్యాన్ని మించి సభ్యత్వ నమో దు అవుతుందన్నారు.
