Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఊరూరా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు

-ఉత్సాహంగా పాల్గొంటున్న పార్టీ శ్రేణులు
-సభ్యత్వాల సంబురం

Every activist must work like soldier

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఊరూరా సంబురంగా సాగుతున్నది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటుండగా ప్రజలు సైతం సభ్యత్వా లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎక్క డ చూసినా సభ్యత్వాల సందడి కన్పిస్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇంచార్జీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మం డలం గోపాల్‌రావుపేటలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తిచేసిన పార్టీ నాయకులను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువా రం అభినందించారు.

ఏఎంసీ వైస్ చైర్మన్ గూ డూ రి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ జనగామ లక్ష్మి, పార్టీ నాయకులు చింతల జగన్మోహన్‌రెడ్డి, జనగామ రాజయ్య తదితరులు కలిసి గ్రామంలో 200 సాధారణ, 100 క్రియాశీల సభ్యత్వ సేకర ణ పూర్తి చేసి రూ.16,750 నగదును మంత్రి కొప్పులకు ధర్మారంలో అందజేశారు. మిగతా గ్రామాల వారు కూడా సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి సూచించా రు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సర్పంచ్ జాము రవి తదితరులకు సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు.

mlc-naradasu

కరీంనగర్‌లో..
కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల ఇంచార్జి బస్వరాజ్ సారయ్య గురువారం సభ్యత్వ నమో దును పరిశీలించారు. కరీంనగర్‌లోని 5వ డివిజన్‌లో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సభ్య త్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. రామడుగు మండలం షానగర్‌లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, గన్నేరువరం మండ లం జంగపల్లిలో బెజ్జంకి జెడ్పీటీసీ సభ్యులు తన్నీరు శరత్‌రావు సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల బోయినపల్లిలో నిర్వహించిన సభ్యత్వ నమోదులో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్‌రావు, జోగినపల్లి ప్రేమ్ సాగర్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమ తదితరులకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పార్టీ సభ్యత్వాలను అందజేశారు.

ఉమ్మడి వరంగల్‌లో..
వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట చౌరస్తాలో సభ్యత్వ నమోదులో మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ పదో డివిజన్ చింతల్‌లో నిర్వహించిన సభ్యత్వ నమోదులో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. జనగామ జిల్లా జాఫర్‌ఘడ్‌లో మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్‌లో జెడ్పీ చైర్మన్ జగదీశ్వర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, వాజేడు లో ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

MALLAREDDY-trs

ఆదిలాబాద్‌లో..
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి పరిశీలించారు. ఇంద్రవెల్లిలో జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి, షట్‌పల్లి, పంగిడిసోమా రం, సర్వాయిపేట గ్రామాల్లో ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరాంపూర్ అరుణక్కనగర్‌లో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పలువురికి సభ్యత్వం అందజేశారు. కామారెడ్డి జిల్లా గాంధారిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మంలో..
ఖమ్మం జిల్లా వైరాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే రాములునాయక్, మధిరలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, ఖమ్మం లో పలువురు కార్పొరేటర్లు ఆధ్వర్యంలో సభ్య త్వ నమోదులో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా పాల్వంచలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మణుగూరులో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కార్యకర్తలకు సభ్యత్వ నమోదు రసీదులు అందజేశారు.

ramulu-naik

నల్లగొండ జిల్లాలో..
నల్లగొండ జిల్లా పీఏపల్లి మండల కేంద్రంలో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, నల్లగొండ పట్టణంలోని మూడోవార్డులో ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మునుగోడు, నాంపల్లి మండలాల్లో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్, అడ్డగూడూరు మండలాల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తుర్కపల్లిలో టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాజాపేటలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లకా్ష్మరెడ్డి నమోదులో పాల్గొన్నారు.

sheri-narayana-reddy

వికారాబాద్‌లో..
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్, పట్లోళ్ల నర్సిహులు, శ్రీనివాస్‌చారి, సంతోశ్‌కుమార్, రాజన్‌గౌడ్, రాజు, సాయిరెడ్డితోపాటు పలువురు కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం వీరికి టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు పరిశీలకులు గుట్టు రాంచందర్, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి సభ్యత్వాలను అందజేశారు. పరిగి పట్టణంలోని శాంతినగర్‌లో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, బొంరాస్‌పేట మండల కేంద్రంలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సభ్యత్వ నమోదు నిర్వహించారు. మెదక్ జిల్లా హవేళిఘన్‌పూర్ మండలం కూచన్‌పల్లిలో ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ హేమలత, ఎంపీపీ శేరి నారాయణరెడ్డి సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.