Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఊరూరూ మారాలె

-జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం
-పదిరోజులపాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుపాలి
-26న హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమావేశం
-రాష్ట్రంలో దళితుల ప్రగతికి 1000 కోట్లతో సీఎండీఈ
-రెండోదశలో 3.50 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ
-జనాల్ని భయపెట్టి సంపుతున్న మీడియా
-టీవీలకు సామాజిక బాధ్యత ఉండాలి: సీఎం కేసీఆర్‌

ఏడాదిన్నరలో వరంగల్‌ దవాఖాన నిర్మాణం అధ్యయనానికి త్వరలో కెనడాకు బృందం కెనడాను మించిన సదుపాయాలతో దవాఖాన 33 అంతస్తులు.. భవనంపై హెలిపాడ్‌ కరోనా కట్టడిలో ఏఎన్‌ఎం, ఆశలు గొప్పసేవ వరంగల్‌కు డెంటల్‌ కాలేజీ మంజూరు వరంగల్‌ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు భూమి పూజ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభోత్సవంకాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ భవనం ప్రారంభం

వరంగల్‌ అర్బన్‌ ఇక హన్మకొండ
వరంగల్‌, హన్మకొండ చారిత్రక నగరాలు. గతంలో వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ పేర్లతో జిల్లాలను ఏర్పాటు చేసుకొన్నాం. దీనిపై మొదటి నుంచీ విజ్ఞప్తులు వస్తున్నాయి. జిల్లా మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ రెండు చారిత్రక నగరాల పేర్లతో జిల్లాలు ఏర్పాటుచేయాలని కోరారు. ప్రజలూ ఇదే కోరుతున్నారు. ఇప్పుడున్న రెండు జిల్లాల సరిహద్దుల్లో కొన్ని మార్పులు చేసి వరంగల్‌, హన్మకొండ పేర్లతోని ఏర్పాటుచేద్దాం. ఆ పక్కన ఆటోనగర్‌ స్థలం కానీ, ఆజంజాహీ మిల్లు స్థలంలో కానీ.. ఇట్లాంటి కలెక్టరేటే అక్కడ కూడా బ్రహ్మాండంగా వస్తది. దాన్ని వరంగల్‌ కలెక్టరేట్‌గా వ్యవహరిస్తాం. దీన్ని హన్మకొండ కలెక్టరేట్‌గా వ్యవహరిస్తాం. తూర్పుభాగం పట్టణం కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి సాధిస్తది. రెండుమూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఆదేశిస్తున్నా.
– వరంగల్‌ సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌

రాష్ట్రంలో ప్రతి ఊరూ ప్రగతిబాటన పయనించాలని, అద్భుతమైన మార్పు రావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. గ్రామాలు, పట్టణాల సమగ్ర వికాసమే లక్ష్యంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. జూలై ఒకటి నుంచి పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు ఒకేసారి చేపట్టనున్నట్టు ప్రకటించారు. పది రోజులపాటు సంకల్పశుద్ధితో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం అవసరమైన స్థానిక సంస్థల నిధులను విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి ధ్యేయంగా, పేదరికాన్ని తగ్గించుడే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. దేశంలో ఎక్కడ చూసినా దళితులే ఎక్కువ పేదరికంలో ఉన్నారని, వీరి అభ్యున్నతికోసం రూ.వెయ్యి కోట్లతో సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నామని పేర్కొన్నారు. దళిత విద్యార్థులకోసం గురుకులాలను ఏర్పాటుచేశామని, అంబేద్కర్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పేరుతో విదేశాల్లో చదువుకోవడానికి రూ.20 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. జ్యోతిబా పూలే పేరుతో బీసీలకు ఇస్తున్నామని వివరించారు. దళిత్‌ ఎంపవర్‌మెంట్‌లో వరంగల్‌ అగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. పేదరికానికి కులం, మతం లేదని.. తెలంగాణలోని అన్నివర్గాలు బాగుండాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రైతులకోసం ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రపంచం శ్లాఘిస్తున్నదని చెప్పారు. రైతుబంధును ఐక్యరాజ్యసమితి ప్రశంసించిందని గుర్తుచేశారు. రైతుబీమా అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. యాదవులకు 7.5 లక్షల యూనిట్ల గొర్రెలు పంపిణీ చేయాలని అనుకున్నామని.. కరోనా వల్ల ఇవ్వలేకపోయిన 3.50 లక్షల యూనిట్లను రెండోదశలో త్వరలోనే ఇస్తామని ప్రకటించారు. నాయీబ్రాహ్మణులకు స్మార్ట్‌ సెలూన్లను ఏర్పాటుచేయిస్తున్నామని వెల్లడించారు. సోమవారం వరంగల్‌ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌.. జయశంకర్‌ వర్ధంతిని పురస్కరించుకుని హన్మకొండలోని స్మృతివనంలో ఆయన విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. వరంగల్‌ పాత సెంట్రల్‌ జైలుకు చెందిన 59 ఎకరాల్లో నిర్మించనున్న మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ కోసం భూమి పూజచేశారు. రూ.25 కోట్లతో నిర్మించిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ భవనం ముందు ఏర్పాటుచేసిన కాళో జీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం సమీకృత కార్యాలయా ల భవనంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యలను పరిష్కరించుకొందామని చెప్పారు. ముందు ప్రకటించినట్టు నాగార్జునసాగర్‌ నుంచి ఈ ప్రక్రియను మొదలుపెడతామని, ఏవైనా లోపాలుంటే సరిచేసుకొని రాష్ట్రవ్యాప్తంగా పూర్తి చేసుకొందామని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు అన్నీ జరగాలని సీఎం ఆకాక్షించారు. సర్కారుకు ప్రజల దీవెనలుండాలని కోరారు. సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

1 నుంచి పల్లె, పట్టణ ప్రగతి
గ్రామాలు, పట్టణాల సమగ్ర వికాసం లక్ష్యంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అమలుచేస్తున్నం. ఇప్పటికే చాలా మారింది. కొన్నిచోట్ల అనుకున్నంత అయిత లేదు. ప్రతి గ్రామం, ప్రతి పట్టణం బాగుపడాలనేదే సర్కారు లక్ష్యం. దీన్ని చాలా ముఖ్యమైనదిగానే భా వించాలి. వైకుంఠధామాల నిర్మాణం 98.6% పూర్తయ్యింది. ఇంట్లో ఎవరైనా చనిపోతే చివరి కార్యక్రమాలకు జాగ లేకపోతే ఆ పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు రావద్దనే వైకుంఠధామాలు. అంత్యక్రియలకోసం శవంతో 21 కిలోమీటర్లు పోయిన ఘటనలను పేపర్ల చూసినం. అందుకే ప్రతి ఊరిలో, పట్టణంలో అంతా పూర్తి కావాలి. ఇంకొంచెం జరగాలి. జూలై 1 నుంచి 10 వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కలిపి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్పంచ్‌ నుంచి సీఎం వరకు, చిన్న ఉద్యోగి నుంచి సీఎస్‌ వరకు అందరు పది రోజులపాటు దీంట్లోనే ఉండాలి. జూలై 1 నుంచి అమలుచేసే కార్యక్రమం ఏర్పాట్లపై ఈ నెల 26న మంత్రులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీవోలతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేస్తున్నం. స్థానిక సంస్థల నిధులను విడుదల చేస్తు న్నం. ఈ కార్యక్రమం అద్భుతంగా జరగాలి. నిరంతరం కొనసాగాలి.

సంస్కరణలతోనే ప్రజాస్వామ్యం పరిపుష్టి
పరిపాలనా సంస్కరణలు బాగా తెచ్చుకున్నం. అవన్నీ పరిపుష్టం కావాలి. అప్పుడే మనం అనుకున్న ఫలితాలన్నీ వస్తయి. అనుకున్న పద్ధతిలో అగో అంటే ఆర్నెల్లు కాకుండా ప్రభుత్వమంటెనే ప్రజలకొక యాష్ట అన్నట్టు కాకుండా పనులు చకచక జరగాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యస్ఫూర్తి.. అట్లా జరిగిన్నాడే ప్రజాస్వామ్యం పరిపక్వమైనట్టు లెక్క. అదే ప్రజాస్వామ్యంలోని మెచ్యూరిటీ. అట్ల పట్టుకొని.. తట్టుకొని.. పైరవీలు చేసి, గందరగోళమన్నది లేకుండా పోతే.. అది మనం సాధించగలిగితే పరిపాలనా సంస్కరణలకు అర్థం. దాన్ని సాధించేందుకు మన రాష్ట్రంలో ఒకప్రయత్నం జరుగుతున్నది. ధరణితో కొత్త విప్లవం వచ్చింది. ధరణితో ఒకరి భూమిని ఎవ రూ మార్చలేరు. సీఎం, సీఎస్‌, కలెక్టర్‌, వీఆర్వో ఎవరూ ఏమీ చేయలేరు. సమగ్ర భూసర్వేను త్వరలోనే పూర్తి చేసుకొందాం. సమగ్ర భూసర్వేలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రయత్నించాలి. కంటివెలుగు పథకం దేశంలో ఎక్కడాలేదు. రాష్ట్రంలో 50లక్షల మంది కి కండ్లద్దాలు ఇచ్చాం. కంటి ఆపరేషన్లు చేయించాలని అనుకొన్నాం. ప్రభుత్వం చేయించకముం దేఆపరేషన్లతో ఆరోగ్యం పాడైందని కొందరు దుష్ప్రచారం చేశారు. కంటివెలుగు ఆపరేషన్ల ప్ర క్రియను వరంగల్‌నుంచే మొదలు పెట్టుకొందాం.

ఒకటి నుంచి పల్లెప్రగతి
-10 రోజుల పాటు మూడో విడుత
-జిల్లాకు 25 లక్షల నిధులు విడుదల
గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా రూపుదిద్దుకున్న పల్లెప్రగతి కార్యక్రమం జూలై 1 నుంచి ప్రారంభం కానున్నది. పల్లెలను పచ్చగా, పరిశుభ్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం పది రోజుల పాటు కొనసాగనున్నది. ఇందుకోసం ప్రభు త్వం జిల్లాలవారీగా ముందుగానే నిధులు విడుదల చేసింది. హైదరాబాద్‌ మినహా మిగిలిన 32 జి ల్లాలకు జిల్లాకు రూ.25 లక్షల చొప్పున విడుదల చేస్తూ ప్రణాళికశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పల్లెప్రగతి 2019 సెప్టెంబర్‌ 6 ప్రారంభమైంది. తొలి విడుత 30 రోజులపాటు కొనసాగింది. రెండోవిడుత 2020 జనవరి 2 నుంచి 12 వరకు కొనసాగింది. రెండు విడుతల్లో చేపట్టిన కార్యక్రమాలతో పల్లెలు ప్రగతిబాట పట్టాయి. గతానికి భిన్నం గా ప్రభుత్వం పంచాయతీలకు అవసరమైన నిధులను ప్రతి నెలా ఠంచనుగా విడుదలచేస్తున్నది.

పల్లెప్రగతి లక్ష్యాలు
-పచ్చదనం, పరిశుభ్రత, ఆర్థిక స్వావలంభన, రోగాలు లేని పల్లెలు
-గ్రామానికి ఒక ట్రాక్టరు, వాటర్‌ ట్యాంకర్‌, ట్రాలీ అందజేత
-కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం పచ్చదనానికి 10 శాతం నిధులు
-గ్రామాలకు ప్రతి నెలా నిధుల బదలాయింపు
-పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డుల ఏర్పాటు
-ప్రతి గ్రామానికి నర్సరీ, ప్రతి ఇంటికీ ఐదారు మొక్కలు అందజేత
-అవసాన దశలో ఉన్న ఇండ్లు, బంగ్లాలను కూల్చివేసి, ఆయా వ్యర్థాలను పాడుబడిన బావుల్లో పోయటం ద్వారా వాటిని పూడ్చటం
-కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న విద్యుత్తు స్థంభాలు, కిందికి వేలాడుతున్న విద్యుత్తు తీగలను తొలగించి, కొత్తవి అమర్చటం
-అవసరమైనచోట్ల విద్యుత్తు స్తంభాలు, ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు
-ఖాళీ స్థలాల శుభ్రత , మొక్కలు నాటడం
-ఎవెన్యూ, కమ్యూనిటీ, ఇన్‌స్టిట్యూషన్‌ ప్లాంటేషన్‌ కోసం షెడ్ల నిర్మాణం
-ప్రతి ఊరిలో చెత్త సేకరణకు ట్రై సైకిళ్లు ఇవ్వటం
-తడి, పొడి చెత్త వేరువేరుగా సేకరించడం, వీటిని వేరు చేయడానికి సిగ్రగేషన్‌ షెడ్డు నిర్మాణం
-గ్రామస్తుల భాగస్వామ్యంతో శ్రమదానం
-నిరుపయోగ బోరు బావులను మూసివేయటం
-ఎత్తు పల్లాల భూములను చదును చేయటం.
-అపరిశుభ్రంగా ఉండే ఖాళీ స్థలాలకు అపరాధ రుసుం విధించటం

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.