Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఆర్డినెన్స్ తెలంగాణకు మరణశాసనం

-డిజైన్ మార్చకుండా పోలవరం నిర్మాణం అహంకారమే -తెలంగాణను ముంచేందుకు ఇద్దరు నాయుళ్ల కుట్ర -చంద్రబాబు చెప్పేవి నీతులు తీసేవి గోతులు -తెలంగాణలోనే ఉంటానంటూ.. తెలంగాణపై కుట్రలా? -టీ టీడీపీ నేతలు మహానాడులో ఆంధ్రోళ్ల అన్నం తిని నిద్రపోతున్నారా..? -బాబుకు కట్టుబానిసలుగా ఉంటే తెలంగాణ సమాజం క్షమించదు -తెలంగాణ బీజేపీ నేతలు కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలి -ముంపు ప్రాంతాల రక్షణ కోసం పోరాటాలు చేస్తూనే ఉంటాం -టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు

Harish Rao

పోలవరంపై కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స్ తెలంగాణకు మరణ శాసనమే. పోలవరం విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పూర్తిగా సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని 205 గ్రామాలను ఆంధ్రలో కలిపి ఆదివాసీలను ముంచటానికి చంద్రబాబునాయుడు, బీజేపీ నేత వెంకయ్య నాయుడితో కలిసి కుట్రపన్నారు. ఇద్దరు నాయుళ్లు తెలంగాణపై ఇంకా విషంచిమ్ముతూనే ఉన్నారు. తెలంగాణ సంపదను తరలించుకుపోయేందుకు చీకటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. గిరిజన ఆవాసాలను సమాధిచేసి పోలవరం పునాదులు నిర్మించాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం అమానుషం, దుర్మార్గం.

తెలంగాణలోని పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ తెలంగాణకు మరణశాసనంలాంటిదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఈ విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పూర్తిగా సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలోని 205 గ్రామాలను ఆంధ్రలో కలిపి ఆదివాసీలను ముంచటానికి బాబు పక్కా ప్రణాళిక వేశారని ఆరోపించారు.

బుధవారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రాజయ్య, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ స్వామిగౌడ్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ముంపునకు గురవుతున్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే ఆర్డినెన్స్‌ను కేంద్రం రూపొందించటం వెనుక ఉన్నది చంద్రబాబేనని విమర్శించారు. కుక్కునూరు, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, వేలేరుపాడుమొత్తం, బూర్గంపాడులో ఆరు గ్రామాలు మినహా, భద్రాచలం మండలంలో భద్రాచలం మినహా అన్ని గ్రామాలు ఆంధ్రలో కలుపటానికి చంద్రబాబునాయుడు, బీజేపీ నేత వెంకయ్య నాయుడితో కలిసి కుట్ర పన్నారని మండిపడ్డారు. ఇద్దరు నాయుళ్లు తెలంగాణపై ఇంకా విషం చిమ్ముతూనే ఉన్నారని ధ్వజమెత్తారు.

తాము తెలంగాణలోనే ఉంటామని గిరిజనులు స్థానిక ఎన్నికలను కూడా బహిష్కంచి నిరసన తెలిపారని ఆయన గుర్తు చేశారు. గిరిజన ఆవాసాలను సమాధి చేసి పోలవరం పునాదులు నిర్మించాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం అమానుషం, దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పేవి నీతులు తీసేవి గోతులని విమర్శించారు. తెలంగాణలోనే ఉంటానంటున్నావు.. ఉండి ఏం చేస్తున్నావు గోతులుతీస్తున్నావా? అని మండిపడ్డారు. తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే టీ టీడీపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రోళ్లు పెట్టిన అన్నం తిని, వారి ఉపన్యాసాలు విని నిద్రపోతున్నారా అని ఎద్దేవా చేశారు. మన గడ్డమీద కూర్చొని మనల్నే ముంచుతుంటే మీకు చీమకుట్టినట్లుగా కూడా ఎందుకు లేదు అని నిలదీశారు.

పోలవరం ప్రాజెక్టుకు టీఆర్‌ఎస్ వ్యతిరేకం కాదని, తాము డిజైన్ మార్చాలని మాత్రమే అడుగుతున్నామని తెలిపారు. తెలంగాణ టీడీపీ నేతల్లో పారుతున్నది తెలంగాణ రక్తమే అయితే చంద్రబాబుకు వ్యతిరేకంగా స్పందించాలని డిమాండ్ చేశారు. ఇంకా స్పందించకుండా భజన చేస్తామంటే తెలంగాణ సమాజం క్షమించదని హెచ్చరించారు. చాలా దేశాల్లో త్వరితగతిన నిర్ణయం తీసుకుని, ప్రజల పక్షాన పనిచేసేందుకు వార్‌రూంలలో భేటీలు జరుగుతాయని, కానీ చంద్రబాబు వార్‌రూం అంటే యుద్ధాలు చేస్తారా అని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. ఏడు మండలాలను సీమాధ్రలో కలపడానికి టీఆర్‌ఎస్ ఒప్పుకోదని, మా పోరాటం కొనసాగిస్తామని, కేంద్రం ఇదే రకంగా ముందుకు పోతే ప్రజాపోరాటాలు, న్యాయపోరాటాలు, ప్రభుత్వపరంగా పోరాటాలు చేస్తూనే ఉంటామన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.