Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పాలమూరుకు బాబు ద్రోహం

-దత్తత తీసుకుని వలసల జిల్లాగా మార్చిండు
-ఏం ముఖం పెట్టుకుని ఓటడగటానికి వస్తుండు?
-బాబుకు ఓటువేసి పాలమూరు ఆపుకుందామా?
-డిపాజిట్‌రాకుండా ఓడగొట్టి బుద్ధిచెప్తామా?
-ఈరోజు పాలమూరు ప్రజలు నిర్ణయం చేయాలి
-20 లక్షల ఎకరాలకు నీరందించే బాధ్యత నాది
-లకా్ష్మరెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలి
-జడ్జర్ల ఎన్నికల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్

పాలమూరును దత్తత తీసుకుని, వలసల జిల్లాగా మార్చిన చంద్రబాబు.. మళ్లీ ఏం ముఖం పెట్టుకుని ఓట్లడగటానికి వస్తున్నడు? అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. ఆంధ్రా చంద్రబాబు ఈ జిల్లాలో కొంతమందిని పోటీకి పెట్టాడు. మిమ్మల్ని వదల బొమ్మాళీ.. వదల అంటున్నడు. వదిలిపెట్టడట! మరి ఎలా వదలగొట్టాలో మీరే నిర్ణయం చేయాలి. నేనైతే నావంతుగా ఒకసారి తరిమికొట్టాను. ఇప్పుడు తరిమికొట్టే బాధ్యత మీదే అని చెప్పారు. బుధవారం జడ్చర్లలో నిర్వహించిన భారీ బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ఆయన మాటల్లోనే..

మహబూబ్‌నగర్‌కు చంద్రబాబు మోసం
చంద్రబాబు తొమ్మిదేండ్లు సీఎంగా ఉండి మహబూబ్‌నగర్‌ను దత్తత తీసుకున్నడు. జిల్లాను బాగుచేయడానికి తొమ్మిదేండ్లు సరిపోలేదా? నాలుగేండ్లలో మేము కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు పూర్తిచేయలేదా? ఎనిమిదిన్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదా? కోయిల్‌సాగర్ లిఫ్ట్ పూర్తిచేయలేదా? చెరువులు నింపుకొంటలేమా? పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం జరుగుతలేదా? కర్వెన, వట్టెంల, నార్లాపూర్ రిజర్వాయర్లు ముందే ఉన్నయి. షాద్‌నగర్ కొందుర్గు మండలంలో లక్ష్మీదేవిపల్లి నిర్మాణం కూడా జరుగబోతున్నది. ఇంత త్వరగా పూర్తిచేస్తున్నం. కొత్త రాష్ట్రం, అప్పులెంతో తెలియని పరిస్థితుల్లోనే ఒక్క పాలమూరు జిల్లాలోనే ఇన్ని వేలకోట్లు ఖర్చుపెట్టి చేయగలిగినం. మరి చంద్రబాబు తొమ్మిదేండ్లలో ఎందుకు చేయలేదు?

దెబ్బలు పడుదామా.. బుద్ధి చెప్దామా?
చంద్రబాబు, ఆంధ్రా సీఎంలు వేసిన పునాదిరాళ్లను తీసుకపోయి కృష్ణానదిలో అడ్డమేస్తే.. అదే ఒక పెద్ద డ్యాం అవుతుందని, మనకు నీళ్లు వస్తయని ఓ రోజు పాలమూరు సభలో చెప్పిన! ఇయ్యాల మీ పాలమూరు ప్రాజెక్టు కానివ్వము, మీకు నీళ్లు రానివ్వము.. అయినా మా సైకిల్ గుర్తుకే గుద్దు అంటరా! అంటే మనం గొర్రెలమా.. ఎడ్డోల్లమా.. పాలమూరు ప్రజలు ఆలోచన చేయాలి. ఎన్నికలు వస్తే ఆగమాగం కావద్దు. కూటమి పేరుతో చంద్రబాబు తెలంగాణల దూరిపోయి, మీ ఇంట్లకే వచ్చి మిమ్మల్ని కొట్టిపోతా అంటున్నడు. దెబ్బలు పడుదామా? చంద్రబాబుకు ఓటు వేసి పాలమూరు ఎత్తిపోతల ఆపుకుందామా? లేదంటే డిపాజిట్ రాకుండా ఓడగొట్టి బుద్ధి చెప్దామా? ప్రజలు నిర్ణయం చేయాలి. చంద్రబాబు వచ్చిననాడు కచ్చితంగా నిలదీసి అడగాలి. సిగ్గులేకుండా చంద్రబాబును భుజాల మీద ఎలా మోసుకువస్తున్నరో కాంగ్రెస్ నాయకులను అడగాలి. ప్రజాస్వామ్యంలో మనకు ఆ హక్కు ఉన్నది.

పాలమూరు జర్నలిస్టులు పాలమూరు బిడ్డల్లాగా ఆలోచించాలి. నేను చెప్పేది నిజమైతే విశ్లేషణలతో జిల్లా ప్రజలను చైతన్యంచేసేలా వార్తలు రాయాలి. నాగం జనార్దన్‌రెడ్డి అని ఇంకో మహాత్ముడు పాలమూరు పథకం మీద 35 కేసులు వేశారు. భూములు ఖరీదు చేద్దామంటే ఎకరాకు 50 లక్షలు రావాలె, 30 లక్షలు రావాలె.. అని ప్రజల్లో అనుమానాలు రేకెత్తించి భూములు ఇవ్వకుండా చేస్తరు. ఇదా వీళ్లు పని చేసే విధానం? వలసలు, కరువులతో సతమతమైన జిల్లా, ఊరూరుకు బొంబాయి బస్సున్న జిల్లా! ఈ జిల్లా దుఃఖం పోవాల్నా లేదా? ఎట్ల పోవాలే? 20 ఏండ్లయితంది నేను పోరాటం చేయవట్టి. ఇప్పుడు మీరుకూడా భుజం కలపాలి. పోరాటం ఇంక అయిపోలేదు. దుర్మార్గులు ఉడుముల లాగ జొచ్చి మన ప్రయోజనాలు దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నరు. అర్థమైకూడా అర్థంకానట్టు ఉంటే మన బతుకులు వ్యర్థమైతయి. అర్థమైనవాళ్లందరు కచ్చితంగా పిడికిలి బిగించాలి. అవసరమైనప్పుడు పోరాటం చేయాలె. తెలియని ప్రజలకు తెలియజెప్పాలి.

20 లక్షల ఎకరాలకు నీరిచ్చే బాధ్యత నాది
పాలమూరు ప్రాజెక్టుకు రూ.35వేల కోట్లు మంజూరుచేయాలని జితేందర్ ఎమ్మెల్యేలందరినీ వెంటేసుకొని వచ్చాడు. మాతో కొట్లాడి మంజూరు చేసుకున్నడు. ఈసారి 14 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేయండి.. మొత్తం 20లక్షల ఎకరాలకు నీరందించే బాధ్యత నేను తీసుకుంటా. ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ 90% పూర్తయ్యాయి. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలకు నీరు పారించుకోగలుగుతున్నం. వలసలు మాయమైపోయి, బొంబాయి బస్సులు బందైపోతున్నయి. పాలమూరు కరువు తీరాలి. అందుకు మీ నాయకుడు లక్ష్మారెడ్డి గెలువాలి. పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 లక్షల ఎకరాలు సాగులోకి రావాలి. ఒక్క జడ్చర్లలోనే లక్షన్నర ఎకరాల పైచిలుకు సాగులోకి రావాలి. ఈ లక్ష్యంకోసం లక్ష్మారెడ్డి పట్టుపట్టి ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నరు.

రైతు శ్రేయస్సుకోసం పథకాలు తెచ్చాం
పోయిన ఎలక్షన్లో ఇదే కాంగ్రెసోళ్లు రూ.200 పింఛన్ ఇస్తమంటే.. నేను రూ.వెయ్యి పింఛన్ ఇస్త అన్నా. ఈసారి గెలిపించండి రూ.2వేల పింఛన్ ఇస్త. వికలాంగుల పింఛన్ రూ.3వేలు ఇస్త. నిరుద్యోగ సోదరులకు నెలకు రూ.3వేలు భృతి కల్పిస్తం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఫ్రీ కరంటు ఇస్తున్నం. రైతులకు ఇబ్బందులు లేవు. రైతుబంధు కింద ఇచ్చే పంట సాయాన్ని ఎకరానికి రూ.5వేలకు పెంచుతం. దేశంలో ఎక్కడైనా ఉందా ఈ పరిస్థితి? 58 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఇవన్నీ జరుగుతయని కలలోనైనా ఊహించినమా? రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు పంటకాలనీలు, ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లతో అద్భుతమైన పథకం రచించాను.

కాంగ్రెస్ గెలిస్తే మళ్లా కరంటు గోస..
ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగపిలగాడు పుడితే రూ.12వేలతోటి బ్రహ్మాండంగా కేసీఆర్ కిట్టు ఇస్తు న్నం. గర్భిణులను అమ్మఒడి వాహనాల్లో ఇంటినుంచి దవాఖానలకు తీసుకువచ్చి.. ప్రసవం తర్వాత మళ్లా ఇంటి దగ్గర వదిలివస్తున్నం. ఇటువంటి స్కీం కాంగ్రెస్, టీడీపీవాళ్లు ఎందుకు చేయలేదు? వాళ్లకు మానవీయ కోణంలేదు. యాల్లకు రావాలే.. చీప్‌లిక్కర్ బాటిళ్లు పంచాలె.. ఓట్లు దొబ్బాలె.. అవతల పడాలె! ఇవ్వాళ తియ్యగపుల్లగ మాట్లాడుతున్నరు. మోసపోతే గోసపడుతం. కాంగ్రెస్ గెలిస్తే గ్యారెంటీగా మళ్లా కరంటు గందరగోళం అయితది.

హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తం
కంటివెలుగు ప్రోగ్రాంలో కండ్లకు పరీక్షలు చేస్తున్నరు. అవసరమైనోళ్లకు అద్దాలు ఇస్తున్నరు. జనవరి నుంచి కంటి ఆపరేషన్లు చేయిస్తరు. దీని తర్వాత ఈఎన్టీ, దంత వైద్యబృందాలు ఊర్లకు వస్తయి. చెవి, ముక్కు, గొంతు, పండ్లకు సంబంధించి పరీక్షలు చేస్తరు. దాని తర్వాత ప్రజలందరికీ రక్తపరీక్షలు నిర్వహిస్తం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యస్థితిపై రిపోర్టులను కంప్యూటర్ల నిక్షిప్తం చేస్తరు. ఒక బటన్ నొక్కితే ఫలానా ఊరిలో, ఫలానా బస్తీలో ఎవరికి ఏ బాధ ఉన్నదో అండ్ల ఉంటది. మొ త్తంగా రాష్ట్ర హెల్త్‌ప్రొఫైల్, హెల్త్ స్టేటస్ సంపూర్ణంగా ప్రభుత్వం చేతిలో ఉంటుంది.

లకా్ష్మరెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలి
లకా్ష్మరెడ్డి బ్రహ్మాండంగా పనిచేస్తున్నరు. నిజాయితీగా పనిచేసే వ్యక్తి. యువకుడు. లకా్ష్మరెడ్డి మొదటి నుంచి నాతోటి కుడిభుజంలా వెంట ఉండి ఉద్యమంలో పనిచేసినవాడు. ఎన్నికల్లో ఓటమిపాలైనా నిరాశ చెందలేదు. లకా్ష్మరెడ్డి కట్టించిన చెక్‌డ్యాంల విలువ ఆయనను ఓడించిన తర్వాత జడ్చర్ల ప్రజలకు తెలిసొచ్చింది.. ఆయన శాశ్వతమైన పనులు చేశాడని! ఇవాళ ఉద్ధండాపూర్ రిజర్వాయర్ పనులు అదే పద్ధతిన చేస్తున్నడు. జడ్చర్లలో ఈసారి కూడా లక్ష మెజార్టీతో లకా్ష్మరెడ్డిని గెలిపించాలి. ప్రతి పల్లె కు, తండాకు కూడా బీటీ రోడ్డు మం జూరుచేసే బాధ్యత నాది. లకా్ష్మరెడ్డికి మంచి భవిష్యత్తు ఉంది. ఉన్నతస్థాయిలోనే ఉంటాడు. మీ నియోజకవర్గానికి, జిల్లాకు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది నియోజకవర్గ సభలాగా లేదు. జిల్లా సభలాగా ఉంది. 50 నుంచి 60 వేల మంది ఒక్క నియోజకవర్గం నుంచే వచ్చిండ్రు అంటే లకా్ష్మరెడ్డి గెలు పు ఖాయమైనట్టే. ఆయనకు 76% ఓట్లు పడ్తయని సర్వే రిపోర్టులు వచ్చాయి. పనికిమాలిన పార్టీలు కొన్ని ఉన్నయి. వాటికి ఓటువేస్తే.. మోరీల పారేసినట్టే. ముస్లిం సోదరులందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు. ముస్లింల సంక్షేమానికి టీఆర్‌ఎస్ సర్కార్ ఏవిధమైన చర్యలు తీసుకుంటున్నదో మీ అందరికీ తెలుసు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.