Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పచ్చపచ్చని పల్లె ప్రగతి

కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా ప్రభుత్వం తన వద్ద ఉన్న అధికారాలను వదులుకొని కలెక్టర్లకు పూర్తి అధికారాలు అప్పగించింది. గ్రామ కార్యదర్శి నుంచి రాష్ట్రస్థాయి వరకు పంచాయతీరాజ్‌ శాఖలో ఖాళీలు భర్తీచేసింది. కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రతి నెలా రూ.308 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నది.

నాబాల్యం అంతా పల్లెల్లో గడిసింది. మా బాపు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పనిచేయడం వల్ల మేము జిల్లాలోని చాలా పల్లెలు చూసే అవకాశం కలిగింది. ప్రతి పల్లెలో మౌలిక సదుపాయాలైన రవాణా, విద్యుత్తు, ఆరోగ్య, నీరు, పరిశుభ్రత, విద్యావ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉండేవి. ముఖ్యంగా సెలవుల్లో మా ఊరైన ఇప్పటి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని చిన్న పల్లెటూరు ర్యాకలదేవ్‌పల్లెకు వెళ్ళేవాళ్ళం. ఊర్లో గడపడం ఎంత ఇష్టమో, ఆ ఊరికి పోవడం అంత కష్టంగ ఉండేది. మా ఊరికి బస్సులు లేకుండే. మా ఊరికి వెళ్లాలంటే ముందు నాన్న ఒక మనిషిని పంపి మేము వచ్చేరోజు మా పెదనాన్నకు కబురు పంపితే ఆ రోజు ఉదయాన్నే మా పెదనాన్న కచ్చురం కట్టుకొని సుల్తానాబాద్‌ బస్టాండుకు వచ్చి అక్కడే ఎడ్లను కట్టేసి గడ్డి వేసి మా కోసం ఉంటుండే. మేము వచ్చినంక అందరం కలిసి కచ్చురం బండ్లె చెరువు కట్ట, బురద రోడ్లు, వాగు, మత్తడిల దాటుకుంటూ మా ఊరుకు రాత్రికల్లా చేరుకునేటోల్లం. మా అమ్మమ్మ ఊరికి కూడా ఇట్లనే పోయేటోల్లం.

సెలవులు ఐపోయినంక మల్ల మా పెదనాన్న కచ్చురం బండి కట్టుకొని మమ్మల్ని సుల్తానాబాద్‌ల దిగబెట్టి ఊరికి వెళ్లిపోతుండే. ఊరు నుంచి సుల్తానాబాద్‌కు పది కిలోమీటర్లు, కానీ ఐదారు గంటలు పడుతుండే. అక్కడినుంచి బస్సుల మేము ఒక వంద కిలోమీటర్లు మూడు గంటలల్ల చేరుతుండే. అప్పుడు మా ఊరు, పక్క ఊరైన రావులపల్లె కలిపి ఒకే గ్రామపంచాయితీగ ఉండే. ఈ ఊరోడు సర్పంచ్‌ ఉంటే ఆ ఊరికి ఏం చెయ్యకపోతుండే, ఆ ఊరోడు సర్పంచ్‌ ఉంటె ఈ ఊరికి ఏం చెయ్యకపోతుండే. ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ. ప్రత్యేక పంచాయితీగ చేయాలని ప్రభుత్వాలకు ఎన్నోసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలే.

అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి రూ.ఐదు లక్షల కన్నా తక్కువ ఆదాయం కలిగిన పంచాయతీలకు ప్రభుత్వం అదనపు నిధులిచ్చి, గ్రామాల ఆదాయం ఐదు లక్షలకు చేరుకునేట్టు చేస్తున్నది. పంచాయతీలకు రూ.3,694 కోట్ల ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు, రూ.5,885 కోట్ల నరేగా నిధులు, రూ.337 కోట్ల సొంత ఆదాయం ఉన్నాయి. అంతా కలిపి ఏడాదికి రూ.9,916 కోట్లు సమకూరుతాయి. నాలుగేండ్లలో రూ.39,594 కోట్లు వస్తాయి.

నానమ్మ, తాతలు కాలం చెల్లినంక మేము పోవుడు కూడా తక్కువ చేసినం. అంతేకాకుండా మేము ముగ్గురన్నదమ్ముళ్ళం, ఉన్నత సదువులు, ఉపాధి కోసం విదేశాలకు వచ్చి స్థిరపడ్డం. మేం ప్రతి సంవత్సరం సెలవులకు వచ్చినప్పుడు మా ఉర్లోని మా ఇంటి ఇలవేల్పు అయిన నాగదేవత గుడికి పోయేటోల్లం. మా ఊరు గట్లనే ఉండే ఏం మార్పు లేదు. మన తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఇప్పుడు ర్యాకలదేవ్‌పల్లెను గ్రామపంచాయితీని చేసి మా పల్లెను అభివృద్ధి పథాన నడిపిండ్రు. ఇప్పుడు మా ఊరికి మెరిసే డాంబర్‌ రోడ్లు, ఊర్లో సీసీ రోడ్లు వచ్చినయి. సుల్తానాబాద్‌ నుంచి మా ఊరికి పోవాలంటే ఇప్పుడు పది నిమిషాలు. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత పరిస్థితిని పోల్చిచూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మార్పు కనిపిస్తున్నది. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పల్లెప్రగతి వల్ల గ్రామాల్లో పరిస్థితి మారింది. ఆశాజనకంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అధికార వికేంద్రీకరణలో భాగంగా ఎవరి మంచి చెడ్డలు వారే చేసుకునేలా ప్రతి గ్రామం ప్రగతిబాటలో నడువాలని, ఊర్లన్నీ బాగుపడాలని ఉద్దేశంతో కేసీఆర్‌ మొత్తం 4,383 తండాలు, పల్లెలను గ్రామపంచాయితీలుగా మార్చి రెండేండ్లు కావస్తున్నది.

పల్లెల ప్రగతి కోసం అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారాలు, కావాల్సినంత మంది అధికారులు, స్పష్టమైన విధానాలు, పాలనా సౌలభ్యం కల్పించిన నేపథ్యంలో గ్రామాలన్నీ అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయి. ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌, వైకుంఠధామం, నర్సరీ, డంప్‌యార్డు వంటి సౌకర్యాలున్నాయి. ఇలా దేశంలో ఎక్కడా లేవు. తెలంగాణలో మాత్రమే అవి సమకూరుతున్నాయి. ఇదొక విప్లవం. కేసీఆర్‌ సాధించిన అద్భుత విజయం. ఇప్పుడు అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ట్రాలీలు కూడా వచ్చినయి. ఇంకా వస్తున్నాయి. అన్ని గ్రామాల్లో నర్సరీలు నడుస్తున్నాయి. డంప్‌యార్డులు, వైకుంఠధామాల నిర్మాణం కోసం స్థలాల కేటాయింపు జరిగింది. అన్నీ నిర్మాణదశలో ఉన్నాయి. రెండునెలల్లో వైకుంఠధామాల నిర్మాణం పూర్తవుతుంది.

కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా ప్రభుత్వం తన వద్ద ఉన్న అధికారాలను వదులుకొని కలెక్టర్లకు పూర్తి అధికారాలు అప్పగించింది. గ్రామ కార్యదర్శి నుంచి రాష్ట్రస్థాయి వరకు పంచాయతీరాజ్‌ శాఖలో ఖాళీలు భర్తీచేసింది. కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రతి నెలా రూ. 308 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నది. అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి ఐదు లక్షల రూపాయల కన్నా తక్కువ ఆదాయం కలిగిన గ్రామపంచాయతీలకు ప్రభుత్వం అదనపు నిధులిచ్చి, గ్రామాల ఆదాయం ఐదు లక్షలకు చేరుకునేట్టు చేస్తున్నది ప్రభుత్వం. గ్రామపంచాయతీలకు రూ.3,694 కోట్ల ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు, రూ.5,885 కోట్ల నరేగా నిధులు, రూ.337 కోట్ల సొంత ఆదాయం ఉన్నాయి. అంతా కలిపితే ఏడాదికి రూ.9,916 కోట్లు సమకూరుతాయి. నాలుగేండ్లలో రూ.39,594 కోట్లు వస్తాయి. ఈ నిధులింకా పెరిగే అవకాశం కూడా ఉన్నది. కేసీఆర్‌ నాయకత్వంలో పల్లెలను ఇలాగే అభివృద్ధి పథంలో నడిపిస్తే ఊర్లన్నీ సస్యశ్యామలమవుతాయి. తద్వారా మన రాష్ట్రం అద్భుత ప్రగతిని, ఎనలేని కీర్తిని సాధిస్తుంది.

(వ్యాసకర్త: అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా)
కాసర్ల నాగేందర్ రెడ్డి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.