Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పచ్చపచ్చగా పాలమూరు

– 40 వేల నుంచి 6 లక్షల ఎకరాలకు పెరిగిన సాగునీటి వసతి – నాలుగేళ్లలో రూపుమారిన పాలమూరు – రివర్స్ వలసలు – రన్నింగ్‌గా మారిన పెండింగ్ ప్రాజెక్టులు – తెలంగాణ సోయి, సమష్టి కృషే కారణం

రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 47,300 ఎకరాలు. నాలుగేళ్లలో 6,00,000 ఎకరాలు. మహబూబ్‌నగర్ జిల్లాలో ని నాలుగు పెండింగ్ ప్రాజెక్టుల పరిధుల్లో తాజా గా సాగవుతున్న భూముల గణాంకాలివి. పాత మహబూబ్‌నగర్ జిల్లాలో గతంలో చేపట్టిన నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు ఏళ్ళ తరబడి సాగుతూనే ఉండేవి. నెట్టెంపాడులో 2,00,000 ఎకరాలు, భీమాలో 2,03,000, కోయిల్ సాగర్‌లో 52,250, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 4,25,000 ఎకరాలకు నీరివ్వడమే లక్షంగా ఆ ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయి. కానీ తెలంగాణ ఆవిర్భావం నాటికి ఈ ప్రాజెక్టుల నుంచి కనీసం 50,000 ఎకరాలకు కూడా నీరు పారలేదు. ఆవిర్భావం నాటికి నెట్టెంపాడు ప్రాజెక్టులో 2,300 ఎకరాలు, భీమా ఎత్తిపోతల పథకంలో 20,000 ఎకరాలు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ద్వారా 12,000 ఎకరాలు, కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి 13,000 ఎకరాలకు సాగునీరు పారేది. మొత్తంగా 47,300 ఎకరాలు మాత్రమే.సమైక్య పాలనలోని పెండింగ్ ప్రాజెక్టులు తెలంగాణ వచ్చాక రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని తరచూ ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానిస్తున్నట్లుగానే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ నాలుగేళ్లలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల సమస్యలను మళ్ళీ పట్టాలమీదికి ఎక్కించారు. నిరంతర సమీక్షలు, ప్రాజెక్టుల వద్దే నిద్ర, లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తుచేయడం, కాంట్రాక్టు ఏజెన్సీలకు క్రమం తప్పకుండా చెల్లింపులు చేయడం, పెరిగిన ధరలను వర్తింపచేస్తూ జీవో 146 ఇవ్వడం, తదితర కారణాలతో నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. ఫలితంగా నెట్టెంపాడులో గత సీజన్‌లో 1.4 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు రూపొందింది. ఇదేవిధంగా భీమాలో 1,70,000 ఎకరాలు, కల్వకుర్తి ఎత్తిపోతలలో 2,60,000 ఎకరాలు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతలలో 30,000 ఎకరాలకు సాగునీరు అందేలా ప్రధాన కాలువల వ్యవస్థ రూపుదిద్దుకుంది. ఫలితంగా, మైనర్, సబ్‌మైనర్ కాలువలు రూపొందించకపోయినా, ప్రధాన కాలువల్లో పారిన నీరు, చెరువులు, కుంటలు, వాగులు, వంకల్లో కూడా జలసిరి తెచ్చింది, భూగర్భ జలాలు పెరిగాయి. ఫలితంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయకట్టు భారీగా పెరిగింది. మొత్తం మీద సుమారుగా 6 లక్షల ఎకరాలకు పైగా కృష్ణా నీటి ద్వారా పాలమూరు జిల్లాల్లో సాగయ్యింది. ఏళ్ళ తరబడి వ్యవసాయం లేక పొలాలు బీళ్లుగా మారిన స్థితికి, ప్రస్తుత స్థితికి కొట్టొచ్చిన తేడా కనిపిస్తోంది. అప్పుడు పచ్చటి పొలాల స్థానంలో బీడు భూములు కనిపించేవి. ఇప్పుడు వెతుకుదామన్నా బీడు భూమి కనిపించడంలేదు. ప్రాజెక్టులు చివరి దశకు చేరడంతో పొలాలకు నీళ్లు వచ్చా యి. చెరువులు నిండాయి. గత సీజన్‌లో గరిష్టంగా వేరుశనగ ఉత్పత్తి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వచ్చేది. మరోవైపు యాసంగి సీజన్‌లో నీరివ్వకుండా, పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేయాలని తొలుత ప్రభుత్వం భావించింది. కానీ కల్వకుర్తి ఎత్తిపోతల ప్రధాన కాలువలో చివరి మైలు వరకు నీరు రావడం, చెరువులు నిండడం, ఈ నీరంతా పెద్దవాగుకు ఇరువైపులా చెరువుల అలుగు పారి దుందుభి నదికే జలకళ రావడంతో స్థానిక ప్రజల్లో వ్యవసాయంపై ఆశలు చిగురించాయి. దీనికి తోడు మిషన్ కాకతీయ పథకంలో భాగంగా కొన్ని చెరువులు బాగుచేయడం, వాటిక్కూడా ఈ నీటిని మళ్లించి, నింపడంతో కరువు జిల్లా ప్రజల్లో సాగుపై ఆశలు మొలకెత్తాయి. ఫలితంగా స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు రావడం, అదే సమయంలో శ్రీశైలంలో నీరు ఉండడంతో యాసంగిలో నీళ్లు ఇవ్వడానికి మంత్రి హరీశ్‌రావు పచ్చజెండా ఊపారు. గత మార్చి మాసం వరకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మూడు దశల్లో పంపులు పనిచేశాయి. రైతుల సంతోషాన్ని స్వ యంగా మంత్రి హరీశ్‌రావు పలుమార్లు చూడడం మూ లంగా పెండింగ్ పనుల పూర్తికి సమయం చిక్కదని ఇంజనీర్లు చెబుతున్నా, నీటి విడుదలకే మొగ్గుచూపారు. పాలమూ రులో తనకు ఎదురైన అనుభవాలను, రివర్స్ వలసలను, కరవు మాయమవుతున్న తీరును మంత్రి పలుమార్లు బహి రంగంగానే వ్యక్తపరిచారు. నాలుగేళ్లలో 47,300 ఎకరాల నుంచి 6 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా మారిన స్థితిగతులకు తెలంగాణ సోయి, సమిష్టి కృషే కారణమని అధికారులు చెబుతున్నారు.

సోర్స్ : మన తెలంగాణ దినపత్రిక

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.