Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పాలేరు గలగల

-రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం -ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ దేశానికే ఆదర్శం -జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ ధనయజ్ఞం చేసింది -రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు -ఏజెన్సీ అభివృద్ధికి కృషి చేస్తాం: మంత్రి తుమ్మల -పాలెంవాగు, కిన్నెరసాని కాల్వల ప్రారంభం -పాలేరు పాతకాల్వకు నీటి విడుదల -రికార్డు సమయంలో పూర్తయిన నిర్మాణాలు

రాష్ట్రంలో కోటి ఎకరాల మాగాణికి సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా రేయింబవళ్లు పనిచేస్తున్నామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని, ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముందుకు వెళ్తున్నారని అన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలిసి సోమవారం ఆయన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు పాతకాల్వకు నీటిని విడుదల చేయడంతోపాటు, పాలెంవాగు, కిన్నెరసాని ఎడమకాల్వలను ప్రారంభించారు. రికార్డు సమయంలో నిర్మాణాలు పూర్తిచేసిన ఈ ప్రాజెక్టులను ప్రారంభించడం పట్ల మంత్రి హరీశ్‌రావు ఆనందాన్ని వ్యక్తంచేశారు. కూసుమంచి మండలం పాలేరు పాతకాల్వ వద్ద ఏర్పాటుచేసిన 23.50 అడుగుల పైలాన్‌ను ఇద్దరు మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం స్విచ్ ఆన్‌చేసి పాలేరు పాతకాల్వకు నీటిని విడుదల చేశారు. అనంతరం స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో హరీశ్‌రావు మాట్లాడారు. భక్తరామదాసు ప్రాజెక్టును 9 నెలల్లో పూర్తిచేస్తే, అందులో సగమైన నాలుగున్నర నెలల్లోనే పాలేరు పాతకాల్వ లైనింగ్ పనులు పూర్తి చేసి నీటిని విడుదల చేయడం అద్భుతం అని అన్నారు. ఇదంతా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పట్టుదల, ఇరిగేషన్ అధికారుల శ్రమ ఫలితంగానే సాధ్యమైందని ఆయన చెప్పారు. ఈ కాల్వ ద్వారా 20వేల ఎకరాల సాగు పెరుగుతుందని ఆయన వివరించారు. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు.

జలయజ్ఞం పేరుతో దోచుకున్న కాంగ్రెస్ జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. గడిచిన పదేండ్లలో తెలంగాణ ప్రాంతంలో 34ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఒక్క ఎకరానికైనా నీళ్లివ్వలేదని ఆయన విమర్శించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రైతుల శ్రేయస్సు కోరే ప్రభుత్వంగా కోటి ఎకరాల మాగాణి భూములకు సాగునీటిని అందించేందుకు ముందుకు వెళ్తున్నామని వివరించారు.

పాలెంవాగు ప్రారంభం జయశంకర్‌భూపాలపల్లి జిల్లా వెంకటాపురం(నూగూరు) మండల పరిధిలోని రాచపల్లి, మల్లాపురం గ్రామాల సమీపంలో నిర్మించిన పాలెంవాగు ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల సాగునీటిని విడుదల చేశారు. పాలెంప్రాజెక్టును తమ ప్రభుత్వ హయాంలో పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించడం ఆనందంగా ఉందన్నారు. రూ.7500కోట్లతో మిషన్‌కాకతీయ చెరువు పనులను పూర్తిచేసి 5లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పాలెంవాగు ప్రాజెక్టు ద్వారా 10,331ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని గొల్లంపాడు, మట్టెడువాగు, ర్యాలీవాగు, ఖమ్మం జిల్లాలోని కిన్నెరసాని, జయశంకర్ జిల్లాలోని పాలెంవాగు, కరీంనగర్ జిల్లాలోని మంథని, మెదక్‌లోని సింగూరు ప్రాజెక్టులను పూర్తిచేసి 70వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని వీటితోపాటు మహబూబ్‌నగర్‌లోని కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు త్వరలోనే పూర్తి అవుతాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పెండింగ్‌లో ఉన్న 8ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరందించిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. వాజేడు మండలంలోని మోడికుంట ప్రాజెక్టుకు నిధులు మంజూరుచేసి 13వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆయన చెప్పారు.

కిన్నెరసాని కల సాకారం కిన్నెరసాని ప్రాజెక్టు ద్వారా పదివేల ఎకరాలకు సాగునీరు అం దించాలన్న కల సాకారమైందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామం వద్ద కిన్నెరసాని ప్రాజెక్టు ఎడమ కాల్వ డిస్ట్రిబ్యూటరీ నంబర్9కి నీటిని విడుదల చేశారు. మొత్తం ప్రాజెక్టు విలువ రూ.36.82 కోట్లు కాగా అత్యంత కీలకమైన ఎడమ కాల్వలోని ఒక డిస్ట్రిబ్యూటరీకి నీటిని విడుదల చేయడం ద్వారా ఈ పథకాన్ని జాతికి అంకితం చేశారు.

హరీశ్‌రావు హెలికాప్టర్ గాల్లో చక్కర్లు రాజధానిలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు ఇబ్బంది పడ్డారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను బేగంపేటలో ల్యాండ్ చేసేందుకు ఏటీసీ అనుమతించలేదు. దీంతో చాలాసేపు ఆయన హెలికాప్టర్ గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. చివరికి హకీంపేట ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.