Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పల్లెప్రగతికి శ్రీకారం

-నేడు సీఎం కేసీఆర్ సందేశంతో
-ప్రారంభంకానున్న 30 రోజుల ప్రణాళిక
-తొలిరోజు గ్రామాల్లో ప్రత్యేకాధికారుల సమావేశాలు
-ప్రాధాన్యక్రమంలో చేయాల్సిన పనుల గుర్తింపు
-పంచాయతీలకు ఈ ఏడాది భారీగా నిధులు
-ఉపాధిహామీ, స్వీయ ఆదాయంతో నెలకు లక్షవరకు..

రాష్ట్రంలో పల్లెల ప్రగతి ఆరంభమవుతున్నది. ఏండ్ల తరబడి వెనుకబడి, కంపుకొట్టే మురికికాల్వలు, గతుకుల రోడ్లతో ఉండే గ్రామాలకు మంచిరోజులు వచ్చాయి. పల్లెల ప్రగతికోసం సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న 30 రోజుల ప్రణాళిక శుక్రవారం అధికారికంగా మొదలుకానున్నది. ప్రతి గ్రామానికి నియమితులైన స్పెషలాఫీసర్లు ఉదయం గ్రామాల్లో సభ నిర్వహించి, సీఎం కేసీఆర్ సందేశాన్ని వినిపిస్తారు. అనంతరం ఊరంతా తిరిగి పనులను గుర్తించనున్నారు. వాటిపై నివేదిక సిద్ధంచేసి, నిబంధనల ప్రకారం గ్రామసభ నిర్వహించి, గుర్తించిన పనులు, ముందుగా చేయాల్సినవాటిని వివరిస్తారు.

శనివారం గ్రామాల్లో గ్రామకమిటీలు, కో ఆప్షన్ సభ్యుల ఎంపిక తర్వాత ఆదివారం లేదా సోమవారం నుంచి తొలి ప్రాధాన్యపనులను మొదలుపెట్టనున్నారు. మొత్తం ఐదారు నెలల్లో గ్రా మాలను సస్యశ్యామలంగా తీర్చిదిద్దనున్నారు. గ్రామాల్లో పబ్లిక్‌రోడ్లు, మురుగుకాల్వలు, అడవుల నిర్వహణ, మట్టికుప్పలు, శిథిలాలు, పిచ్చిమొక్కల తొలిగింపు, వీధిదీపాల నిర్వహణ వం టి అంశాలను ప్రాధాన్యక్రమంలో చేపడుతారు. మరోవైపు రాష్ట్రంలోని పంచాయతీలకు ఈ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 7312 కోట్లు రానున్నాయి. సగటున ఒక్కో పం చాయతీకి రూ.8 లక్షలు అందనున్నాయి. ఉపా ధి నిధులు కూడా ఈసారి ఎక్కువగానే వినియోగించుకునే అవకాశం ఉన్నది. అంతేకాకుండా స్వీయ ఆదాయం ద్వారా 500 జనాభా ఉన్న పంచాయతీలకు నెలకు లక్ష, పెద్ద పంచాయతీలకు రూ.4 నుంచి రూ.5 లక్షలు రానున్నాయి.

పది మొక్కలైనా… 85% బతుకాల్సిందే
గ్రామాల్లో నాటినవాటిలో 85 శాతం మొక్కలను సంరక్షించాల్సిందే. అయితే కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అధికారులపై వేటువేస్తారని, చర్యలు తీసుకుంటారని అర్థంలేని ప్రచారం చేస్తున్నారు. ఒక గ్రామంలో 10 మొక్కలైనా.. 100 మొక్కలైనా సరే.. వాటిలో 85 శాతం సంరక్షించాల్సిందేనని అధికారులు స్పష్టంచేస్తున్నారు. వెయ్యి మొక్కలు నాటి, పది మొక్కలను బతికించడంకాదని.. నాటే పది మొక్కలైనా బతికించాల్సిందేనని ప్రభుత్వం తేల్చిచెప్పింది.

KCR1

స్వీయ ఆదాయం తప్పనిసరి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే నిధులతోపాటు పంచాయతీలు స్వీయ ఆదాయాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రస్తుత లెక్కల ప్రకారం 500లోపు జనాభా ఉన్న పం చాయతీలకు కనీసం రూ.లక్ష స్వీయ ఆదా యం, మేజర్ పంచాయతీలకు రూ.4 నుంచి రూ. 5 లక్షల వరకు వస్తుందని తేల్చారు. గ్రామపంచాయతీ విధించే పన్నులు, ఇంటి పన్నులు, ప్రత్యేక పన్ను, ఫ్యాక్టరీలుంటే ప్రైవేట్ పన్నులు, వాటర్ ట్యాక్స్, జాతరలు, తీర్థయాత్రల పన్ను లు, వ్యాపార లైసెన్సులు వసూలుచేయాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలోని పంచాయతీలన్నింటికీ సగటున రూ.8 లక్షల వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వస్తాయని ప్రభుత్వం వివరిస్తున్నది. దీనిపై ఇప్పటికే మండలాలవారీగా లెక్కలను ప్రకటించారు.

మీ ఊరికి మీరే కథానాయకులు -మీ చేతుల్లోనే మీ గ్రామ భవిష్యత్..
-ఆదర్శగ్రామాలుగా తీర్చిదిద్దుకుందాం
-గ్రామసభలకు సీఎం కేసీఆర్ సందేశం

ప్రియమైన తెలంగాణ ప్రజలకు నమస్సుమాంజలులు..తెలంగాణ పల్లెసీమలు దేశంలోకెల్లా ఆదర్శగ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే ప్రధాన లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సమగ్ర గ్రామీణ విధానానికి రూపకల్పన చేసింది. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలని, నియంత్రిత పద్ధతిలో విస్తృత ప్రజాభాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి జరుగాలని కోరుకుంటున్నది. గ్రామపాలనలో గుణాత్మక మార్పు తీసుకొచ్చే బృహత్తర ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చింది. గ్రామపంచాయతీలకు కావాల్సిన అధికారాలు, విధులు, నిధులను ప్రభుత్వం అందించింది. పల్లెప్రగతికి మంచిమార్గం చేయడానికి నేటినుంచి 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలవుతున్నది.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంచేసే బాధ్యత ప్రజలమీదే ఉన్నదని మనవిచేస్తున్నాను. మీరంతా స్వచ్ఛందంగా భాగస్వాములై, మీ ఊరిని మీరే తీర్చిదిద్దుకోవాలని కోరుతున్నాను. అవసరమైనచోట ప్రజలే శ్రమదానంచేసి, చెమట చుక్కలను పెట్టుబడిగా అందివ్వాలని కోరుతున్నాను. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు బాధ్యతగా వ్యవహరించి, చేయిచేయి కలిపి సంయుక్తంగా ఆదర్శగ్రామాలను నిర్మించుకోవాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష. మీ గ్రామానికి మీరే కథానాయకులు. మీరే మార్గదర్శకులు. మీరే విధాతలు. మీ చేతుల్లోనే మీ గ్రామ భవిష్యత్తు ఉన్నది. మీరంతా ప్రభుత్వం అందించిన సహకారంతో మీ గ్రామాల్లో మార్పు తేవడంకోసం కదులాలని వినమ్రంగా పిలుపునిస్తున్నాను. 30 రోజుల తర్వాత కచ్చితంగా గ్రామాల్లో మార్పురావాలి. మీరంతా నిబద్ధతతో పనిచేసి, తెలంగాణ గ్రామాలను ఆదర్శగ్రామాలుగా తీర్చిదిద్దుతారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. -కే చంద్రశేఖర్‌రావు, ముఖ్యమంత్రి

ఇదీ కార్యాచరణ -ముఖ్యమంత్రి ప్రకటించిన కార్యాచరణ ఈ విధంగా ఉన్నది.
-సెప్టెంబర్ 6 నుంచి నెలపాటు ప్రత్యేక కార్యాచరణ అమలుచేయాలి.
-ప్రతి గ్రామానికి ఒక మండలస్థాయి అధికారిని పర్యవేక్షకుడిగా నియమించాలి.
-జిల్లాస్థాయిలో కలెక్టర్, మండలస్థాయిలో మండల పంచాయతీ అధికారి, గ్రామస్థాయిలో ప్రత్యేక అధికారి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు.
-ప్రజలను చైతన్యపరచడానికి గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రతపై నినాదాలు రాయాలి.
-మొదటిరోజు గ్రామసభ నిర్వహించాలి. గ్రామసభలో సీఎం కేసీఆర్ సందేశాన్ని చదివి వినిపించాలి. కార్యక్రమ ఉద్దేశాలను ప్రజలకు వివరించాలి.
-రెండోరోజు కో ఆప్షన్ సభ్యులను ఎంపికచేయాలి. స్టాండింగ్ కమిటీలను నియమించాలి.
-సర్పంచ్‌ల కుటుంబసభ్యులను కోఆప్షన్ సభ్యులుగా నియమించవద్దని ప్రభుత్వం నిబంధన పెట్టింది. కోఆప్షన్, స్టాండింగ్‌కమిటీ సభ్యులుగా ఎంపిక విషయంలో చట్టంలో నిబంధనలను, ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలి.
-స్టాండింగ్‌కమిటీల్లో సగంమంది మహిళలుండాలి.
-సర్పంచ్, గ్రామ కార్యదర్శి, గ్రామ ప్రత్యేకాధికారి, గ్రామపంచాయతీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, స్టాండింగ్‌కమిటీ సభ్యులు గ్రామంలో పాదయాత్ర నిర్వహించాలి.
-ఏయేపనులు చేయాలో రాసుకోవాలి. దానిప్రకారం గ్రామప్రణాళిక తయారుచేయాలి. గ్రామప్రణాళిక రూపకల్పనలో ప్రజల నుంచి సూచనలను ఆహ్వానించాలి. వార్షిక, పంచవర్ష ప్రణాళికలు తయారుచేయాలి. ప్రతీ గ్రామప్రణాళిక మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ముఖ్య ప్రజాప్రతినిధులు, అధికారుల వద్ద ఉండాలి.
-30 రోజుల్లో ఒకరోజు పూర్తిగా మహిళలకు కేటాయించాలి. మహిళాసంఘాల ఆధ్వర్యంలో మహిళలు గ్రామంలో పచ్చదనం, పారిశుద్ధ్యం కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలి

పారిశుద్ధ్య విధులు : -గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ గ్రామపంచాయతీలపై ఉన్న ప్రధాన బాధ్యత.
-కూలిపోయిన ఇండ్లు, పాడుబడిన పశువుల కొట్టాల శిథిలాలు తొలిగించాలి.
-సర్కారుతుమ్మ, జిల్లేడు, వయ్యారిభామ లాంటి పిచ్చిచెట్లను తొలిగించాలి.
-పాడుబడిన బావులను, వాడకంలోలేని బోర్లను, లోతట్టు ప్రాంతాల్లోని నీటిగుంతలను పూడ్చివేయాలి.
-ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకునేలా, వాటిని ఉపయోగించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలి.
-దోమల మందు పిచికారీచేయాలి.
-డ్రైనేజీలను శుభ్రంచేయాలి. మురికికాల్వల్లో ఇరుక్కుపోయిన చెత్తాచెదారం తొలిగించాలి.
-రోడ్లపై గుంతలను పూడ్చాలి.
-పాఠశాలలు, దవాఖానలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్య పనులు గ్రామపంచాయతీ చేయాలి.
-సంతలు, మార్కెట్ ప్రదేశాలను శుభ్రపరచాలి.
-ప్రతీ ఇంట్లో చెత్తబుట్ట ఉండేలా ప్రజలను ప్రోత్సహించాలి.
-చెత్తను ఎత్తి, డంపింగ్ యార్డులో వేసి, ఆ చెత్తను కంపోస్టు ఎరువుగా వినియోగించేలా బాధ్యత తీసుకోవాలి.
-అవకాశం ఉన్నచోట బందెలదొడ్డి ఏర్పాటుచేయాలి.
-సఫాయీ కర్మచారులకు జీతాలు పెంచినందున, వారిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి.
-ఎవరైనా రోడ్డుపై చెత్తవేస్తే రూ.500 జరిమానా విధించే నిబంధన కూడా చట్టంలో ఉన్నది. దీన్ని గ్రామపంచాయతీలు వినియోగించుకుని, ప్రజల్లో చైతన్యం కలిగించి, గ్రామాలను అద్దంలా తీర్చిదిద్దాలి.
-దహనవాటికలు, ఖననవాటికలు (వైకుంఠధామం), డంపింగ్ యార్డులకు కావాల్సిన స్థలం ఎంపికచేయాలి.
-దహనవాటికలకు ప్రభుత్వస్థలం లేకుంటే గ్రామపంచాయతీ నిధులతో స్థలం కొనుగోలుచేయాలి. దాతల విరాళాలద్వారా కూడా స్థలం కొనుగోలుకు ప్రయత్నించాలి.

ఆర్థికపరమైన విధులు -వార్షిక, పంచవర్ష ప్రణాళికలను రూపొందించాలి. వాటికి గ్రామసభ ఆమోదం తీసుకోవాలి.
-ఈ ప్రణాళికలకు అనుగుణంగానే బడ్జెట్ రూపొందించాలి.
-అప్పులు, జీతాల చెల్లింపు, కరంట్ బిల్లుల చెల్లింపు తదితర ఖర్చులను తప్పనిసరిగా చేయాల్సిన వ్యయం (చార్జ్‌డ్‌అకౌంట్)లో చేర్చాలి.
-ప్రతీ ఇంటికీ, ప్రతీ ఆస్తికి సరైన విలువ కట్టాలి. క్రమంతప్పకుండా ఆస్తుల విలువ మదింపుచేయాలి.
-పన్నులు క్రమంతప్పకుండా వసూలుచేయాలి. పన్నులు వందశాతం వసూలుచేయని గ్రామ కార్యదర్శిపై చర్యలుంటాయి.
-మొక్కలు నాటడం, శ్మశానవాటిక నిర్మాణం, డంపు యార్డు నిర్మాణం తదితర పనులకు నరేగా నిధులు వినియోగించాలి.

పచ్చదనం పెంచే విధులు -ఇంటి దగ్గర నాటడానికి అవసరమైన మొక్కల ఇండెంట్‌ను గ్రామపంచాయతీ సేకరించాలి. ప్రతీ ఇంటికి వేపమొక్క సహా ఆరు మొక్కలు పంపిణీచేయాలి.
-వ్యవసాయ భూములు, వ్యవసాయ బావుల వద్ద పెంచడానికి అనువైన మొక్కలను రైతులకు అందివ్వాలి. మండల వ్యవసాయాధికారి సహకారంతో రైతుల నుంచి ఇండెంట్లు తీసుకోవాలి. చింత, అల్లనేరేడు, ఇతర మొక్కలు పంపిణీచేయాలి.
-ఇండెంట్ కన్నా ఎక్కువ మొక్కలను అందుబాటులో ఉంచుకోవాలి. చనిపోయిన మొక్కలస్థానంలో కొత్త మొక్కలు నాటాలి.
-గ్రామ విస్తీర్ణానికి అనుగుణంగా, శాస్త్రీయంగా అంచనావేసి అవసరమైన మొక్కలను సిద్ధంచేయడానికి గ్రామపంచాయతీల ఆధ్వర్యంలోనే నర్సరీలు ఏర్పాటుచేయాలి. శాశ్వత ప్రాతిపదికన నర్సరీలు నిర్వహించడానికి అనువైన స్థలం ఎంపికచేయాలి.
-నర్సరీలను పెంచడానికి ఫారెస్ట్ రేంజ్ అధికారి గ్రామపంచాయతీలకు సాంకేతిక సహకారం అందించాలి.
-గ్రామపంచాయతీ లోపల నాటడానికి అందుబాటులో ఉన్న భూములను, పంచాయతీ సరిహద్దుల్లో ఉన్న భూములు, రహదారులను కూడా గ్రామపంచాయతీ గుర్తించాలి.
-ఊరు బయట అడవులు, కంచెలు, గుట్టలు, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా పండ్ల మొక్కలు పెంచడంద్వారా కోతుల బెడదను తీర్చవచ్చు.
-గ్రామ గ్రీన్‌ప్లాన్ (హరిత ప్రణాళిక)ను సిద్ధంచేయాలి. అన్ని గ్రామాల గ్రీన్‌ప్లాన్‌కు అనుగుణంగా జిల్లా గ్రీన్‌కమిటీ ఆధ్వర్యంలో జిల్లా గ్రీన్‌ప్లాన్ తయారుచేయాలి.
-మొక్కల రక్షణకు గ్రామపంచాయతీ ఏర్పాట్లు చేయాలి.
-గ్రామ బడ్జెట్లో 10 శాతం నిధులు పచ్చదనం పెంచడానికి వినియోగించాలి.
-ప్రతి గ్రామపంచాయతీ విధిగా ట్రాక్టర్ సమకూర్చుకోవాలి.
-చెత్త సేకరణకు, చెట్లకు నీళ్లు పోయడానికి ట్రాక్టర్ వినియోగించాలి.
-నాటిన మొక్కల్లో 85 శాతం చెట్లనన్నా రక్షించకుంటే, గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శిపై చర్యలుంటాయి.

విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారానికి పవర్‌వీక్ నిర్వహించాలి -గ్రామంలో పవర్ వీక్ నిర్వహించాలి. విద్యుత్‌శాఖ సిబ్బంది గ్రామంలోనే ఉండి సహకరిస్తారు.
-వేలాడుతున్న, వదులుగా ఉండే కరంట్ వైర్లు, విద్యుత్ స్తంభాలను సరిచేయాలి.
-వంగిన స్తంభాలను సరిచేయాలి. తుప్పుపట్టిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటుచేయాలి.
-ఎల్‌ఈడీ లైట్లను అమర్చాలి.
-వీధిదీపాల సమర్థ నిర్వహణకు థర్డ్‌వైర్, సపరేట్ మీటర్, స్విచ్చులు బిగించాలి.
-పగలు వీధిలైట్లు వెలుగకుండా చూడాలి. చలికాలంలో సాయంత్రం 6 గంటలనుంచి ఉదయం 6.30 వరకు, ఇతర సమయాల్లో సాయంత్రం 7 గంటలనుంచి ఉదయం 5.30 వరకు వీధి లైట్లు వేయాలి.

నిధుల సమీకరణ మార్గాలు -రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు వస్తాయి.
-ఫైనాన్స్ కమిషన్ నిధులు సమకూరుతాయి.
-నరేగా నిధులు వస్తాయి.
-గ్రామ పంచాయతీ సాధారణ నిధులు అందుబాటులో ఉంటాయి.
-ప్రజల శ్రమదానంతో పనులు నిర్వహించాలి.
-సీఎస్సార్ నిధులను సమకూర్చుకోవాలి.
-దాతల నుంచి విరాళాలు సేకరించాలి.

రాష్ట్రవ్యాప్తంగా 100 ఫ్లయింగ్ స్క్వాడ్లు -ప్రభుత్వం సీనియర్ అధికారుల నేతృత్వంలో 100 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటుచేస్తుంది.
-30 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు తర్వాత ఈ బృందాలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తాయి.
-లక్ష్యాలు సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు అందుతాయి.
-అజాగ్రత్త, అలసత్వం ప్రదర్శించినవారిపై చర్యలుంటాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.