Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పల్లెలు గులాబీమయం

-టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచార హోరు
-కారు గుర్తుకు వెల్లువెత్తుతున్న మద్దతు..
-బైక్ ర్యాలీలతో ఘన స్వాగతాలు
-టీఆర్‌ఎస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు

ప్రచారంలో టీఆర్‌ఎస్ పరుగులు పెడుతున్నది. ప్రతి పల్లె గులాబీమయం గా మారుతున్నది. ఇంటింటికీ తిరుగుతున్న గులాబీ పార్టీ అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ర్యాలీలు, మంగళహారతులతో ఘన స్వాగతం లభిస్తున్నది. వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి పెద్దఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. మంగళవారం మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. వెయ్యిబైక్‌లతో భారీర్యాలీ తీశారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్యతో కలిసి గుర్రంపోడు మండలం కొప్పోలులో ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్‌లో సీఎం అభ్యర్థి కేసీఆర్ ఒక్కరేనని కానీ, కాంగ్రెస్‌లో మాత్రం 40 మంది సీఎం అభ్యర్థులున్నారని ఎద్దేవాచేశారు. చింతపల్లి మండలంలో దేవరకొండ అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్, దామరచర్ల మండలంలో మిర్యాలగూడ అభ్యర్థి నలమోతు భాస్కర్‌రావు, నల్లగొండ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి, నకిరేకల్ పట్టణం, మండలంలో నకిరేకల్ అభ్యర్థి వేముల వీరేశం, మునుగోడు మండలంలో అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు.

కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌లో ర్వహించిన మహిళా సమ్మేళనంలో ఎంపీ వినోద్‌కుమార్, అభ్యర్థి గంగుల కమలాకర్ మాట్లాడారు. అనంతరం జెడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో 3 వేల మందితో బైక్ ర్యాలీ తీశారు. అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్ ఇంచార్జి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, అభ్యర్థి అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి, మొగలిచర్ల గ్రామాల ప్రజలు టీఆర్‌ఎస్‌తోనే ఉంటామని డోర్నకల్ అభ్యర్థి రెడ్యానాయక్‌కు మద్దతు తెలిపారు. జనగామలో టీఆర్‌ఎస్వీ కార్యకర్తల సమావేశంలో అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో అభ్యర్థి నిరంజన్‌రెడ్డి ప్రచారంచేశారు. నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తా నగరంలో పాదయాత్ర చేశారు. అభ్యర్థి రసమయికి మద్దతుగా మానకొండూర్ మండలంలో టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నాయకులు ప్రచారం చేశారు. భూపాలపల్లి జిల్లా ములుగులో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్‌తో కలిసి ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీలు ఏండ్లపాటు రాష్ర్టాన్ని పాలించి తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశాయని మండిపడ్డారు. ములుగు అభ్యర్థి చందూలాల్‌ను గెలిపించాలని కోరారు. గ్రేటర్ వరంగల్‌లోని మునిపల్లిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో వర్ధన్నపేట అభ్యర్థి అరూరి రమేశ్ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో చెన్నూర్ అభ్యర్థి, ఎంపీ బాల్కసుమన్ ప్రచారం చేశారు.

ఖమ్మం జిల్లాలో..
ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మం నగరంలో, రఘునాథపాలెం మండలంలో, మధిర టీఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజు ఎంపీ పొంగులేటితో కలిసి ముదిగొండ, మధిర, ఎర్రుపాలెంలో, వైరా అభ్యర్థి మధన్‌లాల్ మండలం గరికపాడులో ప్రచారం చేశారు. సత్తుపల్లి అభ్యర్థి పిడమర్తి రవి కల్లూరు మండలంలో టైలర్లు ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో..
మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ బండమీదిపల్లి, హనుమాన్‌పుర తదితర ప్రాంతా ల్లో, ఆయన సతీమణి శారద, కుమార్తె శ్రీహిత హన్వాడ మండలంలో ప్రచారం చేశారు. దేవరకద్ర టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అడ్డాకుల, మూసాపేట మండలాల్లో ప్రచారం నిర్వహించారు. కోయిలకొండలో నారాయణపేట అభ్యర్థి రాజేందర్‌రెడ్డి, చేవెళ్ల టీఆర్‌ఎస్ అభ్యర్థి కాలె యాద య్య శంకర్‌పల్లి మండలంలో ప్రచారం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో..
కొత్తగూడెం అభ్యర్థి జలగం వెంకటరావు పాల్వంచలో, వెంకటరావు భద్రాచలం పట్టణంలో, ఇల్లెందు అభ్యర్థి కోరం కనకయ్య మాణిక్యారంలో, పినపాక అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు మణుగూరు మండలంలో విస్తృత ప్రచారం నిర్వహించారు.

వినయ్‌భాస్కర్‌కు రూ.25,016 విరాళం
వరంగల్ పశ్చిమ అభ్యర్థి వినయ్‌భాస్కర్‌కు ఎన్నికల ఖర్చు కోసం హన్మకొండ లోని 41వ డివిజన్‌కు చెందిన సిరిమల్లె సదానందం రూ.25,016 అందజేశారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పసునూరులో ప్రచారం నిర్వహించిన తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి గాదరి కిశోర్‌కుమార్‌కు పలువురు విరాళాలు అందజేశారు.

గౌడ కులస్థులకు ప్రత్యేక కార్పొరేషన్: ఎంపీ బూర
ఆత్మకూరు(ఎం): అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ సహకారంతో గౌడ కులస్థులకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటుచేస్తామని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)లో జరిగిన ఆలేరు నియోజకవర్గస్థాయి గౌడన్నల ఆశీర్వాదసభలో ఆయన మాట్లాడుతూ.. గౌడ కులస్థుల సంక్షేమ కోసం సీఎం కేసీఆర్ ఎన్నో మానవీయ నిర్ణయాలు ప్రకటించారని, గీత కార్మికులకు ఇచ్చే పింఛన్‌ను రూ.200 నుంచి 1000కి పెంచారన్నారు. లైసెన్స్‌ల రెన్యూవల్ గడువును ఐదేండ్ల నుంచి పదేండ్లకు పెంచామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆలేరు టీఆర్‌ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డికి గౌడన్నలందరూ ఓట్లేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, మహబూబ్‌నగర్, ఆలేరు తాజా మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

మళ్లీ టీఆర్‌ఎస్‌దే అధికారం: ఓయూ జేఏసీ
వేములవాడ/హన్మకొండ, నమస్తే తెలంగాణ: మళ్లీ టీఆర్‌ఎస్‌దే అధికారమని ఓయూ జేఏసీ, ఉస్మానియా, టీఎస్, జాక్ నేతలు ధీమావ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వంద సీట్లకుపైగా గెలుపొంది, మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఓయూ జేఏసీ సభ్యులతో కలిసి అధ్యక్షుడు గదరాజు చందు మంగళవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని వేడుకున్నారు. అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబుకు మద్దతు ప్రకటించారు. మరోవైపు బస్సుయాత్రలో భాగంగా ఆదిలాబాద్ నుంచి వరంగల్‌కు చేరుకున్న ఉస్మానియా, టీఎస్, జాక్ చైర్మన్ పల్లా ప్రవీణ్‌రెడ్డి హన్మకొండలోని టీఆర్‌ఎస్ అర్బన్ పార్టీ కార్యాలయంలో, తొర్రూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఓయూ జేఏసీ అధికార ప్రతినిధి మంద సురేశ్ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ను గద్దెదించేందుకు చంద్రబాబు డైరెక్షన్‌లో కూటమి ఏర్పాటై కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

కూటమిని తరిమికొట్టండి: కోలేటి దామోదర్
రామగుండంరూరల్: మహాకూటమి పేరుతో ఏర్పడ్డ మాయాకూటమిని తరిమికొట్టాలని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మరోసారి టీఆర్‌ఎస్ పార్టీదే అధికారమని ధీమా వ్యక్తంచేశారు. మంగళవారం రామగుండం పట్టణంలోని ప్రధాన రహదారిపై దుకాణాల సముదాయాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్ బడుగు బలహీనవర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, నాలుగేండ్లలోనే సీఎం కేసీఆర్ రైతు బాంధవుడయ్యారని పేర్కొన్నారు. రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి సోమారపు సత్యనారాయణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం పెద్దపల్లిలో అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. ఈ సదర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేండ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.

ప్రాజెక్టులకు కాంగ్రెస్, టీడీపీలే అడ్డు: మంత్రి లకా్ష్మరెడ్డి
జడ్చర్ల, నమస్తే తెలంగాణ: ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్, టీడీపీలు అడ్డంకిగా మారాయని మంత్రి సీ లకా్ష్మరెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో.. ప్రాజెక్టుల నిర్మాణాలపై కాంగ్రెస్, టీడీపీలు అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలపై ఆయన విరుచుకుపడ్డారు. పాలమూరు ఎత్తిపోతలపై కేసులు వేయడంతోపాటు గ్రీన్ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించిన ఘనత కాంగ్రెస్ నాయకులది కాదా అని ప్రశ్నించారు. కాళేశ్వరాన్ని అడ్డుకునేందుకు చేసిన కుట్రలు భగ్నం కావడంతో కాంగ్రెస్ కపట రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆరోపించారు.

సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: మంత్రి జూపల్లి
వీపనగండ్ల: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమకు అండాదండలు అని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని వల్లభాపురం, నాగర్లబండ తండాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ధూంధాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం సాధించుకున్నందునే 500 జనాభా ఉన్న వల్లభాపురం తండా, నాగర్లబండ తండా వంటి చిన్న గ్రామాలు పంచాయతీలుగా రూపుదిద్దుకొని స్వయం పరిపాలన దిశగా ముందుకు సాగుతున్నాయన్నారు.

శాశ్వత హక్కు గంగపుత్రులకే: మంత్రి పోచారం
కమ్మర్‌పల్లి,నమస్తే తెలంగాణ/వేల్పూర్: చెరువుల్లో చేపలు పట్టుకునే శాశ్వత హక్కు గంగపుత్రులదేనని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కోరలో మంగళవారం నిర్వహించిన బాల్కొండ నియోజకవర్గ గంగపుత్ర ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ.. జీవో నం.6 పునఃపరిశీలన కోసం సీఎం కేసీఆర్‌కు విన్నపిస్తామన్నారు. మత్స్యకారుల హక్కులను కాపాడుతామని బాల్కొండ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో గంగపుత్రుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కావూరు వెంకటేశ్ పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.