ఏ పంటకైనా స్థిరమైన ధర ఉంటే వాటి విస్తీర్ణం పెరుగుతుంది. అందుకు సప్లయి డిమాండ్ సూత్రం అన్వయింపబడుతుంది. కేంద్రం ప్రకటిస్తున్న మద్దతు ధరలు వరి, గోధుమ పంటలకే ఉంటున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏటా వందశాతం ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నది.
భారతదేశం 1960 దశకంలో ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించింది. శాస్త్రీయ పద్ధతులు అనుసరించటం కారణంగా వరి, గోధుమ పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. వరిసాగులో అధిక దిగుబడినిచ్చే స్వల్పకాలిక రకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఎరువులు, విత్తనాలపై ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలు, వివిధ పథకాల రూపంలో ఆర్థిక చేయూత వల్ల ఎక్కువమంది రైతులు వరి, గోధుమ సాగువైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత సహజంగానే పంటల సాగు సరళి మారింది. ఫలితంగా ఆహార ధాన్యాల్లో దేశానికి స్వయం సమృద్ధి సిద్ధించింది.
తెలంగాణ అవతరించిన తర్వాత అనతి కాలం లోనే నేడు రాష్ట్ర ప్రభుత్వం అదే శాస్త్రీయ విధానా లను అనుసరించి వరి ఉత్పత్తిలో విజయం సాధించింది. వలస పాలనలో ఆరు దశాబ్దాలు అరిగోస పడిన తెలంగాణ, ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత మూలంగా ఆరేండ్లలోనే దేశానికి అన్నపూర్ణగా ఎదిగింది. తెలంగాణను కోటి ఎకరాల మాగాణం గా మార్చడానికి సీఎం కేసీఆర్ మెట్ట భూముల్లో జలసిరులు దొరలించి సస్యశ్యామలం చేస్తున్నారు.
రాష్ర్టావతరణ తర్వాత మొదటి బడ్జెట్ నుంచి ప్రతిసారి సాగునీటి రంగానికి సగటున రూ.25 వేల కోట్లు కేటాయించటం జరుగుతున్నది. పెండింగ్ ప్రాజెక్టులతో పాటు, కొత్తగా కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టునూ శరవేగంగా పూర్తిచేసింది. దీంతో లక్షల ఎకరాలకు సాగునీటి వసతి ఏర్పడిం ది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే ఈ ఏడాది కొత్త గా దాదాపు 35 లక్షల ఎకరాల కు సాగునీరందింది. వచ్చే ఏడా ది సుమారు 70 లక్షల ఎకరాల కు సాగు నీరందుతుందని స్వయంగా కేసీఆర్ తెలిపారు. దశాబ్దాలుగా తెలంగాణను ఎడా రి చేసి తరలిపోతున్న గోదావరి గతిని మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే.
మిషన్ కాకతీయ (చెరువుల పునరుద్ధరణ) ద్వారా 198.22 మిలియన్ క్యూసెక్కుల నీటి నిల్వ అదనంగా పెరిగింది. చెరువుల కింద వరి ఉత్పాదకత 19 శాతం పెరిగింది. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు అందుబాటులో ఉండటం పెద్ద వనరు అయ్యింది. 2014-15, 20 17-18 మధ్యకాలంలో వ్యవసాయానికి వాడే కరెంటు వినియోగం హెక్టారుకు సగటున 1.98 కిలోవాట్ల నుంచి 3.3 5 కిలోవాట్లకు పెరిగింది. తెలంగాణలో వరి సాగు పెరుగటం ప్రభుత్వం ఆచరణలో చూపించిన చిత్తశుద్ధికి నిదర్శనం.
ఏ పంటకైనా స్థిరమైన ధర ఉంటే వాటి విస్తీర్ణం పెరుగుతుంది. అందుకు సప్లయి డిమాండ్ సూత్రం అన్వయింపబడుతుంది. కేంద్రం ప్రకటిస్తున్న మద్ద తు ధరలు వరి, గోధుమ పంటలకే ఉంటున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏటా వంద శాతం ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నది. గత వానకాలం సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం 41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. ఈ యాసంగిలో కోటి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసింది. అందుకు అదనంగా 7,0 77 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 5,618 కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నది. ప్రస్తుత మద్దతు ధర ప్రకా రం యాసంగిలో కొనుగోలు చేయబోయే వడ్ల విలువ రూ.25 వేల కోట్లుగా అంచనా. దానికోసం పౌరసరఫరాల శాఖకు నిధులు సమకూర్చి పెట్టింది. ఈ లెక్కన సాగునీటి ప్రాజెక్టులకు పెట్టిన పెట్టుబడి నాలుగైదేండ్లలో కచ్చితంగా తీరుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తు న్న పథకం రైతుబంధు. ఈ పథకం అందుతున్న రైతుల్లో 91 శాతం చిన్న, సన్నకారు రైతులే. వీరిది వాణిజ్యసాగు కాదు. అంటే జీవన, కుటుంబపోష ణ సాగు. వీరు తమకు అవసరమయ్యే ఆహార ధాన్యాలనే ఎక్కువగా సాగుచేస్తారు. సాగునీరు అం దుబాటులోకి రావడం, ఉచిత కరంటు, రైతుబం ధు, రైతు బీమా పథకాలు, వంద శాతం ప్రభుత్వం కొనుగోళ్లు రైతుల్లో ఆత్మవిశ్వాసం పెం చాయి. ప్రభుత్వ భరోసాతో వరిసాగు వైపు మొగ్గుచూపి ధాన్యం ఉత్పత్తిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.
తెలంగాణలో గడిచిన ఐదేండ్లలో ధాన్యం ఉత్పత్తి 700 శాతం పెరిగిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేయటం మనం సాధించిన విజయానికి సంకేతం. కేసీఆర్ ముందుచూపు, చిత్తశుద్ధి, స్పష్టమైన ప్రణాళిక ఫలితంగా తెలంగాణ నేడు దేశానికి అన్నపూర్ణగా మారిందనటంలో సందేహం లేదు.
-సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి