Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

-సుస్థిరపాలన కేసీఆర్‌తోనే సాధ్యం
-కులం, మతం, ప్రాంతం వివక్షలేని పాలన మాది
-నాలున్నరేండ్లలో నాలుగు సెకన్లు కూడా కర్ఫ్యూ పెట్టలేదు
-హైదరాబాద్‌లో ఐటీని తూర్పునకు తీసుకువచ్చే బాధ్యత నాదే
-ఉప్పల్ రూపురేఖలు మారుస్తాం : గ్రేటర్ రోడ్‌షోలలో మంత్రి కేటీఆర్

నాలుగున్నరేండ్ల పాలనలో హైదరాబాద్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామని, ఎక్కడా కుల, మత, ప్రాం తీయ వివక్ష ప్రదర్శించలేదని రాష్ట్ర, ఐటీ పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, పరీక్ష ఎదురైనప్పుడు అండగా ఉండాలని కోరారు. హైదరాబాద్ పశ్చిమానికే పరిమితమైన ఐటీసెక్టార్‌ను తూర్పునకు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని హామీఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని ఉప్పల్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించారు. తొలుత ఉప్పల్ నియోజకవర్గ అభ్యర్థి బేతి సుభాష్‌రెడ్డి తరపున ఉప్పల్‌క్రాస్‌రోడ్, మల్లాపూర్ శివహోటల్, ఈసీఐఎల్ క్రాస్‌రోడ్ వద్ద ప్రజలనుద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. అనంతరం కంటోన్మెంట్ అభ్యర్థి సాయన్నతో కలిసి రసూల్‌పుర, అన్నానగర్‌చౌరస్తా, తాడ్‌బండ్ సెంటర్‌పాయింట్, బాపూజీనగర్‌చౌరస్తా, బోయిన్‌పల్లి మార్కెట్ డైమాండ్‌పాయింట్, పికెట్, అల్లాడి పెంటయ్యనగర్ వద్ద ప్రసంగించారు.

నాలుగున్నరేండ్లలో నాలుగు సెకన్లు కూడా కర్ఫ్యూ విధించలేదన్నారు. ప్రభుత్వం మతసామరస్యాన్ని కాపాడుతున్నదని.. మతకల్లోలాలు, శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాలేదని చెప్పారు. హైదరాబాద్ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నదని, మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే ప్రగతి కొనసాగుతుందని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేని చెప్పారు. రోడ్లు, డ్రైనేజీలను బాగుచేయించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.

ఏప్రిల్ వరకు లక్ష డబుల్ బెడ్‌రూం ఇండ్లు
హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్‌రూం ఇండ్లు వచ్చే ఏప్రిల్ వరకు పూర్తవుతాయని, వీటిని పేదలకు అం దించే బాధ్యత తనదేనని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చా రు. హైదరాబాద్‌లో 90 శాతం సమస్యలు పరిష్కరించామని చెప్పారు. దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా ఉంచేవిధంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, సుస్థిరపాలన కొనసాగాలంటే కారు ఆగొద్దు.. డ్రైవరు మారొద్దని అన్నారు. ఐటీహబ్, మూసీ సుందరీకరణ జరుగాలంటే కారుగుర్తుకు ఓటు వేయాలన్నారు. ఈసీఐఎల్‌లో ఎక్కువ శాతం ఉద్యమకారులు ఉన్నారని, వీరందరికీ టీఆర్‌ఎస్ అండగా ఉంటుందని అన్నారు.

పరిశ్రమలకు 24 గంటలు కరంట్ ఇస్తున్నాం
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల కరంటు పరిశ్రమలకు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో పారిశ్రామికవాడల్లో కరంటు కోతలుండేవని, పారిశ్రామికవేత్తలు ధర్నాచేసే దుస్థితి ఉండేదని, కరంట్ అడిగితే కాల్చి చంపేవారని మంత్రి గుర్తుచేశారు. ఉప్పల్‌కు సమృద్ధిగా నీటి సరఫరా చేస్తున్నామని, నాచారంలో ట్రాఫిక్ సమస్య తీర్చడానికి కల్వర్టు నిర్మాణం చేపట్టామని చెప్పారు. నగరంలో మెట్రోరైలుతోపాటు, ఎంఎంటీఎస్ రెండోదశ విస్తరణ చేపట్టినట్టు తెలిపారు. నగరానికి త్వరలోనే నాలుగువేల ఎలక్ట్రిక్ వాహనాలు వస్తాయన్నారు. భవిష్యత్‌లో నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఎల్బీనగర్ నుంచి ఫలక్‌నుమాకు మెట్రోరైలును కలుపుతామని, అక్కడి నుంచి విమానాశ్రయానికి మెట్రోరైలు అందుబాటులోకి తెస్తామని వివరించారు.

ఐటీహబ్‌గా ఉప్పల్
కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాలకు దీటుగా తూర్పుప్రాంతాన్ని ఐటీకీ కేరాఫ్ అడ్రస్‌గా తయారుచేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఉప్పల్‌లోని మల్లాపూర్, నాచారం, చర్లపల్లి ప్రాంతా ల్లో ఉన్న 300 ఎకరాల్లో ఐటీ పరిశ్రమలు తీసుకువస్తామని, ఉప్పల్ ఐటీహబ్‌గా మారుతుందని అన్నారు. ఉప్పల్‌లో ఇప్పటికే రూ. 2,184 కోట్లతో అభివృద్ధి చేశామని, శేరిలింగంపల్లి మాదిరిగా ఉప్పల్‌ను అభివృద్ధి చేసి నియోజకవర్గ దశదిశ మారుస్తామన్నారు.

పేదల సంక్షేమానికి ప్రాధాన్యం
పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతి రూపాయిలో 43 పైసలు పేదవారికి ఖర్చుపెడుతున్నామన్నారు. బస్తీదవాఖానాలు, కేసీఆర్ కిట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని.. గత ప్రభుత్వాలు ఇటువంటి పథకాలు ఇచ్చాయా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, బండారు లకా్ష్మరెడ్డి, తాడూరి శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.

సమస్యలు తీర్చే సత్తా ఉన్న నాయకుడు సాయన్న
కంటోన్మెంట్ ఎక్కువ శాతం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది. ఢిఫెన్స్ భూముల్లో పేదలకు పట్టాలు రాకపోవడానికి బీజేపీ కారణం. కంటోన్మెంట్ సమస్యలు తీర్చే సత్తా ఉన్న నాయకుడు సాయన్న. ఆయనకు వేసే ప్రతిఓటు కేసీఆర్‌కు వేసినట్లేనని కేటీఆర్ పేర్కొన్నారు.

ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ
-శాంతిభద్రతల వల్లనే హైదరాబాద్‌కు పెట్టుబడులు వస్తున్నాయి -నాలుగున్నరేండ్ల పాలన చూసి గెలిపించండి -మన హైదరాబాద్- మన అందరి హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్

మేడ్చల్ రూరల్: సీఎం కేసీఆర్ తెలంగాణను ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చిదిద్దారని, నాలుగున్నరేండ్ల పాలనచూసి మళ్లీ టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు కోరారు. డిసెంబర్ ఏడున జరిగే పోలింగ్‌లో యువత అధికసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితంచేసే రాజకీయాలకు యువత దూరంగా ఉండ టం సరికాదన్నారు. పట్టణాల్లో పోలింగ్ శాతం తక్కువ ఉంటున్నదని, ఇది శ్రేయస్కరం కాదని చెప్పారు. మేడ్చల్ మండలం మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో గురువారం మన హైదరాబాద్-మన అందరి హైదరాబాద్ పేరుతో నిర్వహించిన యువజన సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఉన్న అపోహలన్నింటినీ సీఎం కేసీఆర్ పాలన పటాపంచలుచేసిందన్నారు. కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా అందిరికీ ఒకే రకమైన హక్కులు, భద్రత, విశ్వాసం కల్పించిన ప్రగతిశీలరాష్ట్రంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారని వివరించారు. 2014లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.26 వేలు కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.లక్ష కోట్లకు చేరాయని చెప్పారు. నాలుగున్నరేండ్లలో పటిష్టమైన శాంతిభద్రతలను నెలకొల్పడం వల్లే హైదరాబాద్‌కు పెట్టుబడులు తరలివస్తున్నాయని వివరించారు. షీ టీమ్స్ వచ్చిన తర్వాత మహిళలకు భద్రతా పెరిగిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

సంస్కరణలతో సర్వతోముఖాభివృద్ధి
సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంస్కరణలతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీహబ్‌తోపాటు, మహిళలకు ప్రత్యేకంగా వీహబ్‌ను స్థాపించి, ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తున్నామని, విద్యార్థులకు టాస్క్ ద్వారా సాంకేతిక శిక్షణను అందిస్తున్నామని పేర్కొన్నారు. మేడ్చల్, కుత్బుల్లాపూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రోడ్లు అభివృద్ధి చెందాలన్నా, మెట్రో మేడ్చల్‌కు రావాలన్నా, కొంపల్లికి ఐటీ హబ్ రావాల న్నా.. నమ్మకమైన ప్రభుత్వం, పరిపాలన కావాలన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, మేడ్చల్ ఎంపీ మల్లారెడ్డి, కూకట్‌పల్లి అభ్యర్థి మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, జెడ్పీటీసీ సభ్యురాలు శైలజ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్‌యాదవ్, జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ నందారెడ్డి, నాయకులు జహంగీర్, రాజమల్లారెడ్డితోపాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.