Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పనిచేసే సర్కారును దీవించండి

-సీఎం కేసీఆర్‌ను బలపరిస్తే అభివృద్ధిని కోరుకున్నట్టే -అభివృద్ధిని అడ్డుకుంటున్నది కాంగ్రెస్సే: మంత్రి హరీశ్‌రావు

Harish Rao press meet

సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చడమంటే అభివృద్ధిని కోరుకున్నట్టే. మంచిగా పనిచేసే ప్రభుత్వాన్ని నారాయణఖేడ్ ప్రజలు దీవించాలి. రాష్ట్రంలో 60 ఏండ్లలో కాంగ్రెస్ చేయని అభివృద్ధిని 60 రోజుల్లో చేసి చూపించాం అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శనివారం మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలంలో పలు సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా ఉన్న దామోదర రాజనర్సింహ, సునీతాలక్ష్మారెడ్డిలు ఖేడ్‌ను అభివృద్ధి చేయకపోగా, టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకసారి ఎమ్మెల్యే, మరోసారి ఎంపీగా పోటీ చేయాలని స్టాంప్‌పేపర్లపై మరీ రాసుకున్న చరిత్ర సురేష్‌శెట్కార్, దివంగత ఎమ్యెల్యే కిష్టారెడ్డిదన్నారు.

కాంగ్రెస్ నేతల నిర్లక్ష్యంతో ఖేడ్ నియోజకవర్గంలో మార్కెట్‌యార్డు కూడాలేకపోవడంతో రైతులు అడ్డికి పావుశేరుకు దళారులకు అమ్మి నష్టపోయారన్నారు. కాంగ్రెస్ హయాంలో మార్కెటింగ్‌శాఖ మంత్రిగా ఉన్న దామోదర రాజనర్సింహ తన అందోల్ నియోజకవర్గంలో మూడు మార్కెట్‌యార్డులు నిర్మించి ఖేడ్‌లో ఒక్కటీ ఏర్పాటు చేయలేదన్నారు. పోలీస్ కేసులు, వలసల్లో మాత్రం ఖేడ్‌ను ముందుంచారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్లే నారాయణఖేడ్ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన టీఆర్‌ఎస్ బలోపేతమవుతున్నదన్నారు.

గ్రేటర్ ఓట్లు అడిగేందుకు టీఆర్‌ఎస్‌కు వంద కారణాలు సంగారెడ్డి, నమస్తేతెలంగాణ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండడానికి ప్రతిపక్ష పార్టీల నేతలు ఒప్పుకున్నారు. టీఆర్‌ఎస్ మాత్రమే హైదరాబాద్ తెలంగాణ గుండెకాయని, పట్నంతో కూడిన ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడి సాధించింది అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. హైదరాబాద్‌లేని తెలంగాణ కావాలంటే పదేండ్ల క్రితమే వచ్చేదని, కేసీఆర్ ప్రాణాలను లెక్కచేయకుండా ఉద్యమించి హైదరాబాద్‌తో కూడిన రాష్ర్టాన్ని సాధించారన్నారు. టీఆర్‌ఎస్‌కే గ్రేటర్‌లో ఓట్లు అడిగే హక్కుందన్నారు. ప్రతిపక్షాలు ఏముఖం పెట్టుకుని ఓట్లడుగుతాయని నిలదీశారు. నగరంలో మతకల్లోలాలు సృష్టించి సీఎంలను ఎలా దించాలనే కుట్రలు చేయడంపై కాంగ్రెస్ దృష్టి పెట్టిందని, నగరాన్ని రియల్టర్ల అడ్డాగా టీడీపీ మార్చిందన్నారు. ఓట్లు అడగడానికి టీఆర్‌ఎస్‌కు వంద కారణాలున్నాయని, ప్రతిపక్షాలకు ఒక్క కారణమైన ఉన్నదా అని ప్రశ్నించారు. శనివారం పటాన్‌చెరు,రామచంద్రాపురం,భారతీనగర్ డివిజన్లలో మంత్రి పర్యటించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.