-ఇంటింటికీ నల్లా నీళ్లు.. ప్రతి ఎకరాకు సాగునీరు
-వరంగల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు
-వరంగల్‌కు పెద్దపీట: డిప్యూటీ సీఎం కడియం
-పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించండి: మంత్రి ఈటల
-టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి: డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రులు ఈటల, తుమ్మల
-విపక్షాలకు ఓటడిగే హక్కు లేదు: మంత్రి జూపల్లి

గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్నది. ఏన్నడూలేనివిధంగా ఒక్క నిమిషం కూడా కరెంట్ పోతలేదు. ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు,ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుపోతున్నది. పేదలకు డబుల్ బెడ్‌రూం ఇల్లు కట్టిస్తున్నాం. సీఎం కేసీఆర్ వరంగల్ లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సైనిక్ స్కూల్, హెల్త్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ, ఔటర్‌రింగ్ రోడ్డు, పోలీస్ కమిషనరేట్, ఐటీ పార్కు వంటివి ఎన్నో ఇచ్చారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు ఇచ్చే క్వార్టర్ సీసా, రూ.వెయ్యితో నే బతకలేం. పనిచేసే ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో పట్టంకట్టండి అని వరంగల్ ఓటర్లకు భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హన్మకొండలో అమృత థియేటర్ జంక్షన్, రెడ్డికాలనీ, హసన్‌పర్తి, నయీంనగర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. వరంగల్‌లో ఆరు నెలల్లో ఇంటింటా నల్లాల్లో గోదావరి నీళ్లు పారించే దమ్ము సీఎం కేసీఆర్‌కు ఉన్నదన్నారు.
వరంగల్‌కు బడ్జెట్‌లో ఏటా రూ.300 కేటాయిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. బుధవారం కాజీపేట దర్గాచౌరస్తా, సోమిడి, కడిపికొండలో సభల్లో ఆయన మాట్లాడారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కో రారు. ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత ఓరుగల్లుకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. తమది పనిచేసే ప్రభుత్వమని, ప్రజలు అండగా నిలువాలని కోరారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఇంటింటికీ తాగునీరు ఇవ్వకపోతే మళ్లీ ఓట్లు అడగనని చెప్పిన సీఎం కేసీఆర్ ఒక్కరేనన్నా రు. వరంగల్ తూర్పు డివిజన్‌లో మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రచారంలో మంత్రి పద్మారావు, ఎమ్మెల్సీలు కొండా మురళీ, కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, ఆరూరి రమేశ్, బాబుమోహన్, గంగుల కమలాకర్, గాదరి కిషోర్, జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మేయర్ పీఠం కట్టబెడితే ప్రత్యేక నిధులు: డిఫ్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రులు ఈటల, తుమ్మల
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో 50 డివిజన్లలో గెలుపు తమదేనని డిఫ్యూటీ సీఎం మహమూద్ అలీ పేర్కొన్నారు. బుధవారం పలుచోట్ల ఆయన ప్రచారం చేశారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి టీఆర్‌ఎస్ గెలుపుతోనే సాధ్యమన్నారు. మేయర్ పీఠం టీఆర్‌ఎస్‌కు కట్టబెడితే, సీఎం కేసీఆర్ ప్రత్యేకనిధులు కేటాయించి నగరాన్ని హైదరాబాద్ తరహాలో తీర్చిదిద్దుతారన్నారు. ఆర్థిక మంత్రి ఈటల మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి నాందిపలకాలని పిలుపునిచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో నగరాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ప్రచారంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పురాణం సతీశ్, ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గణేశ్ గుప్తా, మదన్‌లాల్, కోరం కనక య్య, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్‌బీ బేగ్, పాల్గొన్నారు.