Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పరిశుభ్ర గ్రామాలు

-గ్రామపంచాయతీల సమగ్రాభివృద్ధికి మూడునెలల్లో కార్యాచరణ ప్రణాళిక -వివాహం, జనన, మరణాల ధ్రువీకరణతోపాటు పంచాయతీలకు మరిన్ని బాధ్యతలు -సిబ్బందికి వేతనాలు పెంచాల్సి ఉంది -ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ -మొదటి నెలంతా ఇదేపని.. పంద్రాగస్టు నుంచి ప్రారంభించండి: సీఎం కేసీఆర్

స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15 నుంచి గ్రామాలను పరిశుభ్రంచేసే కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. మొదటి నెలంతా ఈ పనికే ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో గ్రామపంచాయతీలను తీర్చిదిద్దాలని, ఇందుకోసం మూసపద్ధతిలో కాకుండా వినూత్నంగా ఆలోచించి వ్యూహం ఖరారుచేయాలని స్పష్టం చేశారు. రాబోయే మూడునెలల్లో గ్రామపంచాయతీల సమగ్రాభివృద్ధికి ఏమి చేయాలనే విషయంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకునే క్రమంలో గ్రామపంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి.. మరీ ముఖ్యంగా శానిటేషన్ సిబ్బందికి వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. వివాహ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీచేయడంతోపాటు మరికొన్ని బాధ్యతలు కూడా పంచాయతీలకు అప్పగించాలన్నారు. పంచాయతీలను పచ్చగా, పరిశుభ్రంగా మార్చే కార్యాచరణ ఖరారు చేయడానికి సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సీనియర్ అధికారులు నర్సింగ్‌రావు, శాంతికుమారి, పీకే ఝా, వికాస్‌రాజ్, నీతూప్రసాద్, స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, ప్రియాంకవర్గీస్, ఎన్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవంనాడు గ్రామాలను పరిశుభ్రం చేసేపనిని ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. నాటినుంచి నెలరోజుల్లో చేయాల్సిన పనులపై మార్గనిర్దేశనం చేశారు.

గ్రామాల పరిశుభ్రతకు సీఎం కేసీఆర్ చేసిన సూచనలు -గుంతలు, పాడుబడ్డ బావులను పూడ్చేయాలి. -పిచ్చిమొక్కలు, సర్కారు తుమ్మలు, జిల్లేడు చెట్లను పూర్తిగా తొలిగించాలి. -కూలినఇండ్లు, భవన శిథిలాలు తొలిగించాలి. -మురికికాల్వల్లో పూడిక తీసి అన్ని కాల్వలను పరిశుభ్రం చేయాలి. మురికినీరు సాఫీగా పోయేలా కాల్వలను తీర్చిదిద్దాలి. -గ్రామాల్లోని అంతర్గత రోడ్లపై గుంతలు పూడ్చాలి. గుంతల్లో మొరం పోయాలి. వర్షపు నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా చూడాలి. -దోమలు వ్యాప్తిచెందకుండా విరివిగా తులసిమొక్కలు, కృష్ణ తులసి మొక్కలు పెంచాలి. -గ్రామంలో ఉత్పత్తి అయ్యే చెత్త ఎంతో నిర్ధారించాలి. డంప్‌యార్డ్ కోసం స్థలం సేకరించాలి. -గ్రామానికి ఒక శ్మశానవాటిక నిర్మించాలి. -గ్రామాలకు నియమితులైన ప్రత్యేకాధికారులు గ్రామస్థులను చైతన్యపరిచి, వారానికోసారి శ్రమదానం చేయించాలి. -గ్రామపెద్దలతో కలిసి ప్రత్యేకాధికారి, గ్రామ కార్యదర్శి గ్రామంలో ర్యాలీ నిర్వహించి, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా ప్రజలను చైతన్యపరచాలి.

గ్రామాల్లో పచ్చదనం పెంచడానికి చేపట్టాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ సూచనలు -రాష్ట్రంలో 12,751 గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటుచేయాలి. -గ్రామంలో రైతులు, ఇంటి యజమానులతో మాట్లాడి వారు ఎలాంటి మొక్కలు పెంచుతారో తెలుసుకొని, ఆ మేరకు ఇండెంట్ తయారుచేసి సర్సరీల్లో మొక్కలు పెంచాలి. -దోమలు, ఈగలు, ఇతర క్రిమికీటకాలు రాని మొక్కలు ఉన్నాయి. వాటిపై ప్రజలకు అవగాహన కల్పించి, ఆ మొక్కలను అందుబాటులో ఉంచాలి. వాటిని పెంచేలా ప్రోత్సహించాలి. -రైతులు పొలం గట్లమీద, బావుల దగ్గర మొక్కలు పెంచే విధంగా ప్రోత్సహించాలి. -గ్రామసమీపంలో ఏవైనా అడవులు ఉంటే వాటిలో కూడా మొక్కలు పెంచాలి. -గ్రామ పరిధిలో నదులు, ఉపనదులు, కాల్వలు, చెరువుల గట్లపై మొక్కలు నాటాలి. -అన్ని విద్యాసంస్థల అధ్యాపకులతో సమావేశం నిర్వహించి, వారి ప్రాంగణాల్లో విరివిగా మొక్కలు నాటే విధంగా కృషి చేయాలి. ఈ విషయంలో డీఈవోలకు లేఖలు రాయాలి.

ప్రత్యేకాధికారులు ప్రతి గ్రామానికి సంబంధించి సేకరించాల్సిన వివరాలు -గ్రామ పరిధిలో అన్ని రకాల రోడ్లు కలిపి ఎన్ని కిలోమీటర్లున్నాయి? అవి ఎలా ఉన్నాయి? -గ్రామంలో శ్మశానవాటిక ఉందా? ఉంటే నిర్వహణ ఉందా? లేకుంటే స్థలం సేకరించాలి. -గ్రామంలో దోబీఘాట్లు ఉన్నాయా? ఉంటే ఏ స్థితిలో ఉన్నాయి? లేకుంటే ఏర్పాటుచేయాలి. – గ్రామంలో విద్యుత్ వీధిదీపాల పరిస్థితి ఎలా ఉంది? అన్ని వీధుల్లో స్తంభాలున్నాయా? -కామన్ డంప్ యార్డు ఉందా? ఉంటే ఏ పరిస్థితిలో ఉంది? లేకుంటే స్థలం సేకరించాలి. -గ్రామపంచాయతీలో సిబ్బంది ఎంతమంది? వారికి జీతాలు ఎలా అందుతున్నాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.