Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పరిశ్రమలకు స్వర్ణయుగం

-ప్రపంచానికే ఆదర్శంగా టీఎస్‌ఐపాస్
-అన్నిరంగాలకు ప్రత్యేక పారిశ్రామిక పార్కులు
-ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణకు ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు

ఒకప్పుడు పరిశ్రమలు నిలుస్తాయో లేదోనన్న అనుమానం! ఇప్పుడు విదేశాల నుంచి సైతం వెల్లువలా తరలివస్తున్న పెట్టుబడులు! ఆనాడు పరిశ్రమలు స్థాపించాలనుకునే ఔత్సాహికులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగాల్సిన దుస్థితి! నేడు.. టీఎస్‌ఐపాస్‌తో.. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా వచ్చి పడుతున్న అనుమతులు! కరంటు అందుబాటులో లేక పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఇచ్చుకున్నచోట.. నేడు నిత్యం తిరిగే యంత్రాల శబ్దాల హోరు! నాలుగున్నరేండ్ల వ్యవధిలోనే తెలంగాణ ప్రభుత్వం సాధించిన అద్భుతం ఇది! వేలల్లో పరిశ్రమలు.. లక్షల కోట్ల పెట్టుబడులు.. లక్షల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. సులభవాణిజ్య విధానంలో నంబర్ వన్ ర్యాంక్! వెరసి.. ఇప్పుడు తెలంగాణలో పారిశ్రామిక ప్రభ వెలిగిపోతున్నది. పరిశ్రమలరంగానికి స్వర్ణయుగం నడుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనావిధానంతో విప్లవాత్మక ఫలితాలు తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలుపుతున్నాయి.

రాష్ట్రం ఏర్పడేనాటికి అస్తవ్యస్తంగా ఉన్న పారిశ్రామికరంగం.. శరవేగంతో పురోగమిస్తున్నది. ఈ రోజు సులభవాణిజ్య విధానంలో దేశంలోనే నంబర్‌వన్ ర్యాంకు పొందిందంటే.. పరిశ్రమల రంగానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యమే కారణం. కేవలం మాటలకే పరిమితం కాకుండా.. ఆచరణలో ఆ రంగానికి పూర్తి జవసత్వాలు నింపారు సీఎం. ఇందులో టీఎస్‌ఐపాస్ విధానం కీలకంగా మారింది. ఒకవైపు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కృషిచేస్తూనే.. మరోవైపు మూతపడే స్థితిలో ఉన్న పరిశ్రమలను నిలబెట్టేందుకు, ఖాయిలా పడిన పరిశ్రమలను తెరిపించడానికి దేశంలోనే తొలిసారిగా ఇండస్ట్రియల్ హెల్త్‌క్లినిక్‌ను ఏర్పాటుచేశారు.

విప్లవాత్మకం టీఎస్‌ఐపాస్
పారిశ్రామికరంగాన్ని గాడిలో పెట్టడానికి సీఎం కేసీఆర్ టీఎస్‌ఐపాస్ పేరిట నూతన విధానానికి రూపకల్పన చేశారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా పదిహేను రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. 15 రోజుల్లో అనుమతి రాని పక్షంలో పదహారవ రోజున అనుమతి ఇచ్చినట్టే భావించే నిబంధనలు పొందుపర్చారు. గతంలో పరిశ్రమల అనుమతులకు ప్రభుత్వ కార్యాలయాలు, దళారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన పారిశ్రామికవేత్తలు కొత్త విధానంతో పెద్ద ఊరట పొందారు. అగ్రగామి పారిశ్రామికవేత్తలతోపాటు.. వివిధదేశాల పారిశ్రామిక ప్రతినిధులు సైతం ఈ విధానాన్ని విప్లవాత్మకంగా అభివర్ణించారు. టీఎస్‌ఐపాస్ అమల్లోకి తెచ్చిన తర్వాత వేలల్లో పరిశ్రమలు.. లక్షల కోట్లలో పెట్టుబడులు వచ్చాయి. ఇతర రా ష్ర్టాల్లో యూనిట్ నెలకొల్పేందుకు నెలలకొద్దీ సమయం పట్టేదని, కానీ.. తెలంగాణలో 15 రోజుల్లోనే అనుమతులు వచ్చాయంటూ పలువురు పారిశ్రామికవేత్తలు కీలక వేదికలపై తమ సంతోషం వ్యక్తంచేసిన సందర్భాలు ఉన్నాయి.

వనరులన్నీ సిద్ధం
పరిశ్రమలకు అనుమతులిచ్చి చేతులు దులుపుకోకుండా.. అవసరమైన భూమి, నీరు, కరం టు, మానవవనరులు, రాయితీలు.. తదితరాలన్నింటినీ ప్రభుత్వం సిద్ధంచేస్తున్నది. ప్రత్యేకించి పరిశ్రమల కోసం 1.50లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్‌ను టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో ఉంచింది. మిషన్ భగీరథలో పదిశాతం నీటిని పరిశ్రమల అవసరాలు తీర్చేందుకు రిజర్వ్‌చేసింది. మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతను టీఎస్‌ఐఐసీకి అప్పగించింది. మానవ వనరులను సిద్ధంచేసేందుకు టాస్క్ పేరుతో ఒక సంస్థను స్థాపించి శిక్షణ ఇప్పిస్తున్నారు. మరో కీలకమైన అంశం కరంటు. ఉమ్మడి రాష్ట్రంలో జనమేకాదు.. పరిశ్రమలుసైతం విద్యుత్‌కోతలతో విలవిల్లాడాయి. పరిశ్రమలకు కరంటు సరఫరా చేయాలంటూ పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్క్ వద్ద ధర్నాలు, ఆందోళనలు చేశారు. వారానికి రెండ్రోజులు పవర్ హాలిడేలు ఉండటంతో కార్మికుల ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సకాలంలో పనిపూర్తిచేయకపోవడంతో ఆర్డర్లు వెనక్కుపోయి.. పరిశ్రమలు మూతపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీలు తమ విస్తరణ ఆలోచనలను విరమించుకుని, ఇతర రాష్ర్టాలవైపు చూశాయి. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కేవలం ఆరునెలల్లోనే పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంద్వారా పారిశ్రామికవేత్తల మనసు చూరగొన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇది పరిశ్రమలకు కొత్త ఊపిరిపోసింది. కొత్త పరిశ్రమల ప్రవేశానికి బాటలు వేసింది.

రికార్డుస్థాయిలో పెరిగిన గనుల ఆదాయం
రాష్ట్ర ప్రభుత్వ పారదర్శక విధానాలతో గత ఐదేండ్లలో గనులశాఖ ఆదాయం రెట్టింపైంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.4060.03 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్ణయించగా.. డిసెంబర్ చివరినాటికే రూ.2957.11కోట్ల ఆదాయం వచ్చింది. మైనర్ మినరల్స్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1015.05 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా.. డిసెంబర్ చివరినాటికి రూ.690.24 కోట్లు రావాల్సి ఉంటే.. ఏకంగా రూ.949.59 కోట్లు (138% అధికం) వచ్చిందని గనులశాఖ అధికారుల లెక్కలు చెప్తున్నాయి. ఇది గత సంవత్సరానికి కంటే రూ.362 కోట్లు అదనం. ఆర్థిక సంవత్సరం చివరినాటికి గనులశాఖ ఆదాయం పెంపులో మైనర్ మినరల్స్‌ది కీలకపాత్ర ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మేజర్ మినరల్స్ ద్వారా రూ.185 కోట్లు లక్ష్యం కాగా రూ. 168కోట్లు ఆదాయం వచ్చింది. సింగరేణి బొగ్గు గనుల ద్వారా రూ.1553కోట్ల ఆదా యం వచ్చింది. ఇసుక ద్వా రా రూ.468 కోట్ల లక్ష్యం కాగా రూ.446 కోట్ల లక్ష్యాన్ని చేరుకున్నారు. ఇలా అన్ని రకాల గనుల ద్వారా రూ.4వేల కోట్ల ఆదాయ లక్ష్యాన్ని సాధిస్తామని అధికారులు అంచనా వేస్తున్నారు.

సంస్కరణలతో సత్ఫలితాలు
తెలంగాణ ఏర్పాటయ్యాక గనుల తవ్వకాలు, లీజులు, రాయల్టీ వసూళ్లు, నిఘా వ్యవస్థను పటిష్ఠపర్చడం, పారదర్శక విధానాలు, అధునిక టెక్నాలజీ వినియోగం వంటి విషయాలపై అప్పటి గనులశాఖ మంత్రి కే తారక రామారావు విశేష కృషిచేశారు. ఒకేచోట పాతుకుపోయిన అధికారులను భారీ ఎత్తున బదిలీచేశారు. మంచి పనితీరు కనపర్చిన అధికారులు, ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందించారు. అనుమతులు, లీజులకు ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ సంస్కరణలు సత్ఫలితాలనిచ్చాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో గనులశాఖ ద్వారా సర్కారుకు రూ.1968 కోట్ల ఆదాయం రాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.4వేల కోట్లు వస్తుందని అంచనా. డిసెంబర్ చివరినాటికే మూడు వేలకోట్ల ఆదాయం లభించింది.

ప్రతి రంగానికీ ప్రత్యేక పారిశ్రామిక పార్కులు
రాష్ట్రంలో పారిశ్రామికరంగాన్ని ప్రోత్సహించడానికి ఒక్కో రంగానికి ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటుచేశారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించడానికి ప్ర త్యేకంగా మూడు పార్కులు ఏర్పాటుచేశారు. మెడికల్ డివైజెస్ పార్క్, ఎల్‌ఈడీ పార్క్, ఫుడ్ పార్క్, టెక్స్‌టైల్ పార్క్, ఎమ్మెస్‌ఎంఈ పార్క్, ఏరోస్పేస్ పార్క్, స్పైస్ పార్క్, ప్లాస్టిక్ పార్క్, ఫైబర్‌గ్లాస్ పార్క్, సీడ్ పార్క్ ఇలా పెద్ద ఎత్తున ప్రత్యేక పార్కులను నెలకొల్పారు. వీటితోపాటు ఫార్మారంగానికి ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లాలో నిమ్జ్ ఏర్పాటుచేస్తున్నారు.

టీఎస్‌ఐపాస్‌తో 2.74 లక్షల మందికి ఉపాధి
రాష్ట్రంలో టీఎస్‌ఐపాస్ ప్రారంభమయ్యాక ఇప్పటివరకు మొత్తం 9,395 పరిశ్రమలు అనుమతులు పొందాయి. వీటిద్వారా రూ. 1.58 లక్షల కోట్ల పెట్టబడులు వచ్చాయి, పరిశ్రమలన్నీ ప్రారంభమైతే ఉపాధి పొందేవారి సంఖ్య 15.28 లక్షలకు చేరనున్నది. ఇప్పటికే 6272 పరిశ్రమలు ఉత్పత్తి మొదలుపెట్టాయి. ఫలితంగా 2.74 లక్షల మంది ఉపాధి అవకాశాలు పొందారు. త్వరలో ప్రారంభానికి సిద్ధమైన పరిశ్రమల ద్వారా మరో ఐదు లక్షల మందికి ఉపాధి లభించనున్నది. ఇంకా 1,872 పరిశ్రమల నిర్మాణ పనులు ప్రారంభించాల్సి ఉంది. అవికూడా సిద్ధమైతే మరో 7.44 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. రాష్ట్రంలో మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 2,432 పరిశ్రమలకు అనుమతులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా 796 పరిశ్రమలతో రెండోస్థానంలో, సంగారెడ్డి జిల్లా 773 పరిశ్రమలతో మూడో స్థానంలో నిలి చాయి. పెట్టుబడులపరంగా చూస్తే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రూ.40,038 కోట్లు రాగా, నల్లగొండ జిల్లాలో రూ.26,849 కో ట్లు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రూ. 20, 925 కోట్లు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 6.12 లక్షల మందికి, ఆదిలాబాద్ జిల్లాలో 4.01 లక్షల మందికి, వరంగల్ రూరల్ జిల్లాలో 1.89 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలైన గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్, మెక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు అమెరికా తరువాత అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్‌లోనే ఏర్పాటుచేశాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.