Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పెద్దపల్లిని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతా

-ప్రజాసేవ కోసమే ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి..
-విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమంలో ఉన్నా
-టీఆర్‌ఎస్ పార్టీ పెద్దపల్లి అభ్యర్థి
-బోర్లకుంట వెంకటేశ్‌నేతతో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ..

ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వ ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. 2007లో గ్రూప్-1 అధికారిగా ప్రభుత్వ ఉద్యోగం సాధించినా. గ్రూప్-1 అధికారుల సంఘం ఏర్పాటులో కీలక భూమిక పోషించినా. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులను భాగస్వాములను చేశా. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు, టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవ, మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతోపాటు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని శాసనసభ్యులు, నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ శ్రేణుల సహకారంలో ఎన్నికల్లో విజయం సాధిస్తా. గెలుపొందిన తర్వాత పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతా అంటున్న టీఆర్‌ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్ నేతతో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ ..

మీ రాజకీయ ప్రవేశం ఎలా ఉన్నది.?
ప్రజలకు ప్రత్యక్షంగా సేవచేయాలనే సంకల్పంతో ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చాను. ఉద్యోగంలో ఉన్న సమయంలో తెలంగాణ గ్రూప్-1 అధికారుల కేంద్ర సంఘాన్ని స్థాపించాం. ఉద్యోగుల సమస్యలు, సామాజిక సమస్యలపైన అనేక కార్యక్రమాలు నిర్వహించాం. రాజకీయాల్లోకి వచ్చిన సంకల్పం నేరవేరినందుకు సంతోషం గా ఉన్నది. పేద కుటుంబంలో జన్మిం చా. విద్యార్థ్ధి దశ నుం చే తెలంగాణ ఉద్యమంలో పాల్గొ న్న. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో, ట్రిసీడ్ చారిట్రబుల్ ట్రస్ట్‌ను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేప ట్టా. అవన్నీ విజయవంతం అయ్యాయి. వీటిని ప్రజలు అమితంగా ఆదరించారు. వారి ఆదరాభిమానాలు చూసిన తరువాత సేవలను విస్తృతం చేయడానికి రాజకీయాల్లో వచ్చాను.

ప్రచారంలో ప్రజల నుంచి స్పందన ఎలా ఉన్నది.?
పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాదాభివందనాలు తెలుపుకుంటున్నా. పెద్దపల్లి టికెట్ ఇవ్వడానికి సహకరించిన టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లల్లో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యుల సహకారంతోపాటు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లతోపాటు గ్రామస్థాయి నుంచి మంత్రిస్థాయి వరకు ప్రతి ఒక్కరి సహకారంతో నియోజకవర్గస్థాయి సమావేశాలు పూర్తిచేశాం. ఇప్పుడు ఏడు నియోజకవర్గాల్లో మండలస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నాం. సింగరేణి కార్మికులతో గేట్ మీటింగ్‌లు పెట్టినం. ఎక్కడికి వెళ్లినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దేవుడిగా భావిస్తున్నారు. తనను సొంత బిడ్డలా అక్కున చేర్చుకొని ఆశీర్వదిస్తున్నారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు.

తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏమిటి?
టీఆర్‌ఎస్ పార్టీలో ఇటీవల చేరినప్పటికీ, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి దశ నుంచి పాల్గొన్నాను. 2001 నుంచే తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ (న్యాయశాస్త్రం) చదువుతున్న సమయంలో అప్పటి విద్యార్థి ఉద్యమ నేత, ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యేతో అనుబంధం ఉండటం వలన వారితో పాటు నేను సైతం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నావంతు పాత్ర పోషించాను. 2007లో గ్రూప్-1 అధికారిగా ఎంపికైన తరువాత డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉద్యోగ సంఘాలతో, ఉద్యోగ సంఘాల నాయకులతో ఉద్యమానికి సబంధించిన చర్చల్లో పాల్గొన్నాను. స్వామిగౌడ్‌తో పాటు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రస్తుత రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాద్‌తోపాటు టీఎన్జీవో నేతలు కారం రవీందర్‌రెడ్డి, రాజేందర్ వంటి వారితో ప్రత్యక్షంగా అనుబంధం ఉన్నది. వీరితో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అనేక అంశాలు చర్చించే అవకాశం కలిగింది. తెలంగాణ ఉద్యమానికి దగ్గరయ్యాను.

16 ఎంపీ స్థానాలు గెలిస్తే ఏం చేస్తారు?
తెలంగాణలో మరింత అభివృద్ధి జరుగాలంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు రావాలంటే 16పార్లమెంట్ స్థానాలు గెలువాల్సి ఉన్నది. ప్రస్తుతం భారత రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీలకు స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలను కూడగట్టి హంగ్ పార్లమెంట్‌లో కింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారు. చరిత్ర తిరుగరాయడం, చరిత్ర సృష్టించడం ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యం. 2001లో గుప్పెడు మందితో టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించినప్పుడు తెలంగాణ వస్తది అంటే ఎవ్వరూ నమ్మలేదు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉన్నది. కొన్ని పథకాలను ఇతర రాష్ర్టాలు అమలు చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టింది. వివిధ రాష్ర్టాల మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు చూడటానికి వస్తున్నారు.

నియోజకవర్గం అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపడుతారు?
పెద్దపల్లి నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తా. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సమస్యలకు పరిష్కారం చూపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు, ఆదేశాల మేరకు శాసనసభ్యులను సమన్వయం చేసుకుంటూ దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తా. వ్యవసాయ కుటుంబంలో పుట్టడం వలన వ్యవసాయంపై అవగాహన ఉన్నది. రైతుల కష్టాలు తెలుసు. ఎంకాం, ఎల్‌ఎల్‌బీ, పీఎచ్‌డీ పూర్తి చేసి గ్రూప్-1 ఉద్యోగం సాధించాను. న్యాయశాస్త్రం చదివిన. పారిశ్రామిక విధానం గురించి, కార్మిక, కర్షకుల గురించి, చట్టాల గురించి, వారి హక్కుల గురించి పూర్తి అవగాహన ఉన్నది. అందరి సమస్యలకు పరిష్కారం చూపుతా. అన్నలా అండగా నిలబడుతా.

-ప్రచారానికి అనూహ్య స్పందన వస్తున్నది
-కేసీఆర్ ఆశీస్సులు, టీఆర్‌ఎస్ శ్రేణుల సహకారంతో విజయం సాధిస్తా

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.