Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పేదల బస్తీలను మారుస్తాం

– పేదరికాన్ని పారదోలటమే ప్రభుత్వ లక్ష్యం – ప్రభుత్వమే ఉచితంగా ఇండ్లు కట్టిస్తుంది – రూపాయి లంచమడిగినా నాకు చెప్పండి – రాష్ర్టానికి ఆదర్శవంతంగా ఐడీహెచ్ కాలనీ: సీఎం కేసీఆర్ – బస్తీలో తిరిగి.. కాలనీవాసులతో మాట్లాడిన ముఖ్యమంత్రి

KCR-08 దళితవాడల్లో దారిద్య్రాన్ని, పేదరికాన్ని పారదోలడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. జంటనగరాల్లో నివసించే పేదల బస్తీల రూపురేఖలను మారుస్తామని హామీ ఇచ్చారు. ఐడీహెచ్ కాలనీలో ఏ క్షణాన్నైనా కూలిపోయేలా నిర్మాణాలు ఉన్నాయని స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ సీఎంను ఆయన క్యాంప్ కార్యాలయంలో బస్తీవాసులతో కలిసి విన్నవించారు. శిథిలావస్థకు చేరుకున్న ఇండ్ల ఫొటోలను సీఎంకు చూపించారు. దీనిపై స్పందించిన సీఎం.. ఫొటోలు చూడటంకాదని, స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. సాయంత్రం సికింద్రాబాద్ బోయిగూడలోని ఐడీహెచ్ కాలనీకి వచ్చి.. ఈ ప్రాంతంలోని ఆరు కాలనీల్లో నడుచుకుంటూ పరిశీలించారు.

కాలనీవాసుల ఇబ్బందులను చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిథిల భవనాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో కోటీశ్వరులు ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తే గత ప్రభుత్వాలు వాటిని క్రమబద్ధీకరించి కాపాడాయని, పేదలు ఎక్కడైనా నివాసముంటే బుల్‌డోజర్లు పెట్టి కూల్చివేశారని గత ప్రభుత్వాలనుద్దేశించి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంలో ఇకపై అలాంటి పరిస్థితి ఉండదని చెప్పారు. ఐడీహెచ్ కాలనీలో నివాసముంటున్న ప్రతి ఒక్కరికీ రూపాయి ఖర్చు లేకుండా ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఐదు నెలల్లో 60 గజాల స్థలంతో ఇంటి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.

శిథిలావస్థలో ఉన్న భవనంలో నివసించేవారు వెంటనే వాటిని ఖాళీ చేయాలని కోరారు. భవిష్యత్తులో సమస్యలు లేకుండా నెట్ వైరింగ్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, మంచినీటి సౌకర్యం, కాలనీవాసులకు పార్క్, దేవాలయం, మార్కెట్, దుకాణాలతో నిర్మాణం చేస్తామన్నారు. ఈ కాలనీ రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఇండ్లల్లో నివాసముంటున్న వారి వివరాలు, ఫొటోలతోసహా తీసుకొని, వారికి మాత్రమే ఇండ్లను కేటాయిస్తామన్నారు. ఏ అధికారైనా ఒక్క రూపాయి లంచం అడిగినా నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు సూచించారు.

KCR-07

ముఖ్యమంత్రితో తలసాని భేటీ బోయిగూడ ఐడీహెచ్ కాలనీవాసులతో కలిసి సీఎంను సోమవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో తలసాని శ్రీనివాస్‌యాదవ్ కలిశారు. కొంతకాలంగా తలసాని టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. కాలనీలో ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నందున, ప్రభుత్వపరంగా పక్కా గృహాలు నిర్మించాలంటూ కాలనీవాసులు బ్యానర్లతో వచ్చారు.

వారి సమస్యలను సీఎం దృష్టికి తలసాని తీసుకువెళ్లారు. దీంతో కేసీఆర్ కార్యాలయంనుంచి బయటికి వచ్చి, బాధితులతో మాట్లాడారు. నాలుగైదు నెలల్లో పక్కా గృహాలు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. పరిస్థితులు తెలుసుకోవడానికి సాయంత్రం కాలనీని సందర్శిస్తానని చెప్పారు. కాలనీవాసులు వెళ్లిన అనంతరం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌తో మరో అరగంటపాటు తలసాని భేటీ అయ్యారు. ఈ కాలనీ సమస్యపై సీఎంను కలిశానేగానీ, రాజకీయ ప్రాధాన్యమేమీలేదని తలసాని టీ మీడియాకు చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.