Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పేదరికంపై యుద్ధం

ప్రజల జీవన ప్రమాణాలు పెంచటమే బంగారు తెలంగాణ ప్రతి పేద కుటుంబాన్ని తట్టి లేపుతాం: ముఖ్యమంత్రి కేసీఆర్ -2024 నాటికి 5 లక్షల కోట్ల బడ్జెట్ -వచ్చే ఏడాదికి 90 శాతం మిషన్ భగీరథ పూర్తి -2018 కల్లా కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ ప్రాజెక్టులు పూర్తి -2022 వరకు కోటి ఎకరాలకు ప్రాజెక్టుల నీరు -కృష్ణా, గోదావరిలో తెలంగాణ వాటా వదిలేది లేదు -ఈ ఖరీఫ్‌కే కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ , కొమురం భీం, భక్తరామదాసు, ఎల్లంపల్లి, కడెం చివరి ఆయకట్టు, మంథని లిఫ్టు ఇరిగేషన్ స్కీంలకు పాక్షికంగా నీరు -జూలైలో హరితహారం కార్యక్రమం -15 లక్షల జనాభాకు ఒక జిల్లా ఏర్పాటు -కిందిస్థాయి అవినీతిని అరికట్టేందుకు సిస్టమ్స్ -ప్రజల్లో ఇది మన ప్రభుత్వం అన్న భావన -కల్యాణలక్ష్మితో బాల్యవివాహాలకు అడ్డుకట్ట -ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ ఉత్పత్తి -ఆర్టీసీని ప్రైవేటీకరించేది లేదు -రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు -ప్రతి ఒక్కరిలోనూ ఇది మా ప్రభుత్వమనే భావన -సుపరిపాలన దిశగా తెలంగాణ సర్కారు నిర్ణయాలు -2018 నాటికి కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ ప్రాజెక్టులు పూర్తి -దసరా నాటికి రాష్ట్రంలో కొత్త జిల్లాలు -తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

CM_KCR

రాష్ట్రంలో పేదరికంపై యుద్ధం ప్రకటించామని, రానున్న నాలుగైదేండ్లలో మౌలిక సదుపాయాల కల్పన పూర్తిచేసి, ప్రతి పేద కుటుంబాన్ని తట్టిలేపి ధనవంతులుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. 2018 నాటికి కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీరు అందిస్తామని తెలిపారు. ఎవరు సహకరించినా సహకరించకపోయినా కృష్ణా, గోదావరి నదుల్లో చుక్కనీరుకూడా వదలకుండా తెలంగాణ వాటా సాధిం చి తీరుతామన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ద్వితీయ వార్షికోత్సవాల సందర్భంగా గురువారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రధాన కార్యక్రమంతోపాటు హెచ్‌ఐసీసీలో వివిధ రంగాలలో నిష్ణాతులతో నిర్వహించి న విశిష్ట సభలోనూ ముఖ్యమంత్రి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం బాలారిష్టాలన్నీ అధిగమించి లక్ష్యం దిశగా వేగంగా సాగుతున్నదని సీఎం ఈ సందర్భంగా చెప్పారు.

రాష్ట్ర ఆర్థిక ప్రగతి అద్భుతంగా ఉందని, 2020 నాటికి రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లకు, 2024 నాటికి రూ. 5 లక్షల కోట్లకు చేరుతుందని చెప్పారు. దుర్భర దారిద్య్రంలో ఉన్న పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రథమదశలో సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చామని, అదే సమయంలో రాష్ట్ర పురోభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలపై భారీగా నిధులు వెచ్చించి పటిష్ఠ పునాదులు వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని, 2018కల్లా మంచినీటి కొరత కూడా ఉండబోదని చెప్పారు. 2022 తరువాత కరువు రక్కసి తెలంగాణ వైపు చూడటానికే భయపడుతుందని, వర్షాలు కురిసినా, కురువకపోయినా తెలంగాణలో కరువు కాలుమోపదని అన్నారు. త్వరలోనే 15 లక్షల జనాభాకు ఒక జిల్లాను ఏర్పాటు చేస్తామని చెప్పారు. CM_KCR విద్యుత్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను అనుమతించబోమని, ఆర్టీసీని కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటు వారి చేతిలో పెట్టబోమని చెప్పారు. గత రెండేండ్లలో రాజకీయ అవినీతిని నిర్మూలించామని, కిందిస్థాయి అవినీతిని సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి అరికడుతామని తెలిపారు. తెలంగాణలో లోక కల్యాణం జరుగుతున్నది. మనం ఏమి కలలు కన్నా మో అవి నిజమయ్యేలా ఆర్థిక పురోగతి ఉన్నది. ఇది మన ప్రభుత్వం అన్న భావన ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడిలో పాదుకొన్నది అని సీఎం చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలను ఉన్నతస్థాయికి చేరుస్తామని.. బంగారు తెలంగాణ అర్థం, పరమార్థం అదేనని సీఎం చెప్పారు. అన్నివర్గాల ప్రజలను వికాసపు దారుల వైపు నడిపించి వారి జీవన ప్రమాణాలు ఉన్నతస్థాయికి చేరుస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ సమాజానికి భరోసా ఇచ్చారు. ప్రజలు ప్రభుత్వం చిత్తశుద్ధిని గుర్తించారని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి చర్యలతో సత్పలితాలు వస్తాయని విశ్వసిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గురువారం సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సమైక్య పాలనలో తెలంగాణ గోసను స్పృశిస్తూ… రాష్ట్ర సాధన ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ… రెండేండ్లలో స్వీయ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణ వైపు వేసిన అడుగులను ప్రజల ముందుంచారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలను నెరవేర్చేందుకు చేపట్టిన పథకాలను తద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను విడమరిచి చెప్పారు. ప్రధానంగా కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణకు ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా వెనకడుగు వేసేది లేదని… ఇక ఎవరి ఆటలు సాగవంటూ కాళ్లల్లో కట్టె పెడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ వేదిక నుంచి హెచ్చరించారు. ఈ దసరా పండుగ నుండే కొత్త జిల్లాలు కొలువు తీరుతాయి. జిల్లాలతో పాటు కొత్త రెవిన్యూ డివిజన్లు, కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి.

మూస విధానాలకు స్వస్తి..: కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఏయే అవరోధాలను ఎదుర్కొందో, ఏయే బాలారిష్టాలను అధిగమించిందో గతంలో నేను ఎన్నోసార్లు వివరించాను. మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేస్తూనే.. ప్రజల అవసరాలను గుర్తించి ప్రకటించని ప్రజోపయోగ కార్యక్రమాలు కూడా అమలు చేసుకుంటున్నాం. దీంతో ఇది మన ప్రభుత్వం అన్న భావన ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడిలా పాదుకొన్నది. అందుకే మూస విధానాలను సమూలంగా మార్చి, ప్రజలకు పారదర్శకంగా, న్యాయబద్ధంగా సుపరిపాలన అందించే దిశగా నిర్ణయాలు జరుగుతున్నయి.

సంక్షేమమే కాదు… సామాజిక సంస్కరణ..: సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కనీస అవసరాల కోసం కూడా కొట్టుమిట్టాడాల్సిన దుస్థితి సంభవించింది. ఈ పరిస్థితిని రూపుమాపేందుకు ప్రభుత్వం సంక్షేమ రంగానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఆసరా, వృద్ధాప్య, వితంతువులు, వికలాం గుల పింఛ న్లు అందిస్తున్నది. పేదింటి ఆడపిల్ల పెండ్లి భారాన్ని పంచుకోవాలని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కార్యక్రమాల్ని ప్రవేశపెట్టింది.

కడుపునిండా తిండి..: మనుషులు తిండిలేక మరణిస్తే అది సమాజానికి అత్యంత అవమానకరం. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలికి అలమటించవద్దని, ప్రభుత్వం కుటుంబం ఆహార అవసరాలకు సరిపోయినంత బియ్యం అందించేందుకు రేషన్ బియ్యం కోటా పెంచింది. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి ఆరు కిలోల చొప్పున 2.82 కోట్ల మందికి 1.77 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందిస్తున్నది. ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల తోపాటు కాలేజీలు, యూనివర్సిటీ హాస్టళ్లకు కూడా సన్నబియ్యం సరఫరా చేస్తున్నాం. పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకు చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నది. జర్నలిస్టు సోదరుల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక కాలనీ నిర్మించాలని నిర్ణయించాం. దశలవారీగా మిగతా చోట్ల కూడా నిర్మిస్తాం. జర్నలిస్టులు, హోంగార్డులు, భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లకు రూ.ఐదు లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. వ్యవసాయాధారిత దళిత కుటుంబాలకు మూడెకరాల భూ పంపిణీలాంటి కార్యక్రమాలెన్నో అమలు చేస్తూ సంక్షేమ రంగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. parade-grounds2 రాష్ట్రం ఏర్పడిన ఐదవ నెల నుంచే కోతల్లేని విద్యుత్ అందిస్తున్నాం. వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటల కరెంటు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 598 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందిస్తున్నాం. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు 2017 వరకు వంద శాతం పూర్తవుతాయి. 2018 నాటికి కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ, ప్రాణహిత ద్వారా నీళ్లు వస్తాయి. ఇక రాష్ట్రంలో 250 రెసిడెన్షియల్ స్కూళ్లను ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నం. కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానాన్ని అమలుపరిచే దిశలో ఇది తొలి అడుగు. టీఎస్-ఐపాస్ విధానానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద సంస్థల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఇప్పటికే 1798 పరిశ్రమలు రూ.24,698 కోట్ల పెట్టుబడులు మన రాష్ర్టానికి తరలివచ్చినయి. ఐటీ రంగంలో తెలంగాణ సంచలనాలు సృష్టిస్తున్నది. టీ-హబ్ ఇతర రాష్ర్టాలకు మార్గదర్శకంగా నిలిచింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడాదికి 40 లక్షల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 40 కోట్ల మొక్కలు నాటాలని, హైదరాబాద్ నగరంలో మరో 10 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం బక్క రైతులకు బంగారు కానుకను ఇచ్చింది. భూ పరిపాలనలో సంస్కరణలు తీసుకువచ్చి సాదాబైనామాల మీద జరిగిన భూమి అమ్మకాలు, కొనుగోళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈరోజు నుంచి జూన్ పదో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నా.

సమైక్య విష వలయాన్ని ఛేదించాం… ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌గారు పేర్కొన్నట్లు తెలంగాణ ఉద్యమం నీళ్లలో పుట్టిన నిప్పు. ఉమ్మడి రాష్ట్రంలో నదీజలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కలేదు. జీవనదులు.. ఉపనదులు.. గొలుసుకట్టు చెరువులు.. ఇలాఎన్ని ఉన్నా ఏమీలేని గతిని తెలంగాణ అనుభవించింది. తెలంగాణ ప్రాజెక్టులను కాగితాలకే పరిమితం చేశారు. ప్రాజెక్టులు ఉద్దేశపూర్వకంగా వివాదాల్లో చిక్కుకునేలా డిజైన్లు చేశారు. అందుకే ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టాం. ప్రాజెక్టుల తీరుతెన్నులు ప్రజలకు స్పష్టపరచాలని నేను శాసనసభలో స్వయంగా పవర్‌పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చాను. అది టీవీల ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు ఉత్సాహంగా వీక్షించి.. ప్రభుత్వ దీక్షాదక్షతలను అభినందించినరు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.