Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పేదోడే టీఆర్‌ఎస్‌కు పునాది

-వాళ్ల బతుకులు బాగుపడడమే పార్టీ లక్ష్యం -బంగారు తెలంగాణ నిర్మిద్దాం: మంత్రి ఈటెల

Eetela Rajendar in District president election in Mahabubnagar

తెలంగాణ అంటే బుగ్గకార్లు, ఏసీ కార్లు కాదు. తెలంగాణ అంటే పేదల బతుకులు బాగుపడాలి. పేదోడే మా పార్టీకి పునాది. అందరూ ఏకమై ఉద్యమం నిర్వహించిన సోయితోనే రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా నిర్మించుకుందాం. పదవి అంటే అలంకారం, హోదా కోసం కాకూడదు. పాత జాగీరుల మాదిరిగా దోచుకునే పద్ధతి ఎక్కడా ఉండొద్దు. రాబోయేకాలంలో టీఆర్‌ఎస్ అజేయ శక్తిగా నిర్మాణమవుతుంది. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా కడుపు కట్టుకుని.. కళ్లు నెత్తికెక్కకుండా తెలంగాణ కోసం శ్రేణులు పనిచేయాలి. అప్పుడే రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌లో టీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

గులాబీ జెండా పట్టుకున్నప్పుడు ఎన్నో అవమానాలు భరించాం.. స్వరాష్ర్టాన్ని సాధించాం. అదే సోయితో ఇప్పుడు బంగారు తెలంగాణ నిర్మించుకుందాం. కార్యకర్తలు బాధ్యతగా మెలగాలి పిలుపునిచ్చారు. అనంతరం టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిగా బాద్మి శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శివకుమార్ పేరును మాజీ అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్య ప్రతిపాదించగా జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ బలపరిచారు. పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈటెల ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, జిల్లా సభ్యత్వ ఇన్‌చార్జి జెల్లా మార్కండేయ, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వ ల బాలరాజు, మాజీ ఎంపీ జగన్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు స్వర్ణాసుధాకర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, గుర్నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.