Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పెట్టుబడులతో తరలిరండి

రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ఫార్మా పారిశ్రామికవేత్తలకు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. ఫార్మారంగానికి దేశంలో హైదరాబాదే కేంద్రమని ఆయన అన్నారు. దేశంలో ఫార్మా ఉత్పత్తుల్లో 33% ఇక్కడే తయారవుతున్నాయని గుర్తు చేశారు. రెండేండ్లుగా మందకొడిగా ఉన్న ఫార్మారంగాన్ని ఉరకలెత్తించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని, ఈ దిశగా 11 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ నిర్మాణానికి నడుం కట్టారని చెప్పారు.

IT-Minister-KTR

-పక్షం రోజుల్లో అనుమతులిస్తాం -ఫార్మాకు హైదరాబాదే రాజధాని -రాష్ర్టానికి ఉజ్వల భవిష్యత్ -ఫార్మా కాంగ్రెస్‌లో మంత్రి కేటీఆర్ శుక్రవారం హైటెక్స్‌లో జరిగిన 66వ జాతీయ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్‌లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఫార్మాకు హైదరాబాద్ ఎంతో అనుకూలమని..ఇక్కడి నుంచే 5 బిలియన్ డాలర్ల ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. డాక్టర్ రెడ్డీస్, నాట్కో, హెటిరో, అరబిందో లాంటి సుప్రసిద్ధ కంపెనీలు ఇక్కడ ఉన్నాయని గుర్తు చేశారు.

15 రోజుల్లో అనుమతులు..: సీఎం కేసీఆర్ నేతృత్వంలో విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చామని కేటీఆర్ చెప్పారు. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి 15 రోజుల్లో అన్నిరకాల అనుమతులు ఇస్తామని తెలిపారు. ఎవరికైనా ఈ లోపుగా అనుమతులు రాకపోయినా సెల్ఫ్ సర్టిఫికెట్ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చునని వివరించారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చెర్ల వద్ద ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఫార్మాసిటీ ఉద్యోగుల కోసం అక్కడే స్మార్ట్‌సిటీకూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

విమానాశ్రయంనుంచి కేవలం 20 నిమిషాల్లో ఫార్మాసిటీ చేరుకునేలా మార్గంలో ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తామని చెప్పారు. ఈ రంగానికి అవసరమైన మానవ వనరులను తయారు చేసుకోవడానికి ప్రపంచస్థాయి యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా టీఎస్-ఐపాస్ లాంటి తదితర విధానాలున్నాయని అన్నారు. నిక్కచ్చిగా, నిబద్ధతతో పని చేసే ప్రదీప్‌చంద్ర వంటి అధికారి ఉన్నారని చెప్పారు. రాష్ర్టానికి ఉజ్వల భవిష్యత్ ఉంది.. పెట్టుబడులతో ముందుకు రావాలని కోరారు.

పారిశ్రామికాభివృద్ధే సీఎం లక్ష్యం..: పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఫార్మా పరిశ్రమను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని హామీ ఇచ్చారు. పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఈ క్రమంలో పెట్టుబడులతో వచ్చే పారిశ్రామిక వేత్తలకు రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలుకుతామని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మాట్లాడుతూ దేశంతో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్‌లో మూడవ వంతు హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అవుతున్నదని తెలిపారు. పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల ఏర్పాటుతో పాటు పరిశోధనా కేంద్రాలను కూడా అభివృద్ధి చేయాలని కోరారు.

వాతావరణ పరంగా హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యుత్తమమైందని అన్నారు. సీఎం కేసీఆర్ మిషన్, విజన్‌తో పరిశ్రమలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. శుక్రవారం ప్రారంభమైన ఈ సదస్సు ఈనెల 25వరకు జరుగుతుంది. హైటెక్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రాష్ర్టాల ప్రతినిధులతో పాటు కాంబోడియా, ఫ్రాన్స్, హంగేరి, మాల్దోవా, నైజీరియా, రుమేనియా, యునైటెడ్ కింగ్ డమ్, జాంబియా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొనాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయారు.

ఫార్మా రంగంలో ప్రతిభ కనపరిచిన వారికి ఈ సదస్సులో మెమొంటోలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ పార్మాస్యుటికల్ వరల్డ్ ప్రసిడెంట్ వెంకట్ జాస్తి రవి, 66వ ఇండియన్ పార్మాసుటికల్ కాంగ్రెస్ చైర్మన్ ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 67వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్‌ను మైసూర్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.