-లోక్‌సభ టీఆర్ఎస్ పక్ష నేత నామా -సభ నుంచి టీఆర్ఎస్ సభ్యుల బాయ్‌కాట్

దేశ సరిహద్దుల్లో జవాన్లు పోరాడుతున్నారని, మరో వైపు రైతులు సమస్యల పరిషారం కోసం రోడ్డెక్కి పోరాటం చేస్తున్నారని లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు అన్నారు. మంగళవారం సభ ప్రారంభంకాగానే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులపై చర్చ ప్రారంభం సందర్భంగా.. వ్యవసాయబిల్లులపై నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయన వ్యాఖ్యానించారు. జై జవాన్, జై కిసాన్ మన నినాదమని, కానీ వారిద్దరు కూడా పోరాటంలో ఉన్నారని గుర్తుచేశారు. అనంతరం కేంద్రం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా టీఆర్ఎస్ సభ్యులు సభను బాయ్‌కాట్ చేశారు.