Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఆశీర్వదించండి

-సీఎం కేసీఆర్ ఆశయాలకు అండగా నిలువాలి: మంత్రి హరీశ్‌రావు -కేసీఆర్ నాటి పాదయాత్ర ఫలితమే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం -ఏడు నెలల్లో పూర్తి.. వానకాలంలో నీరు -సమైక్యంలో జరిగిన అన్యాయాలకు ఆర్డీఎస్ నిదర్శనం -అధికారంలో ఉన్నప్పుడు చుక్క నీరు కూడా ఇవ్వని కాంగ్రెస్ -ఫిబ్రవరికల్లా ఏదుల రిజర్వాయర్ పూర్తి -తుమ్మిళ్ల ఎత్తిపోతల శంకుస్థాపనలో నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు

రాష్ట్రంలో ప్రతి ఎకరాకూ నీరందివ్వాలన్న లక్ష్యంతో రేయింబవళ్లు శ్రమిస్తూ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తున్నామని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న టీఆర్‌ఎస్ సర్కార్‌ను, సీఎం కేసీఆర్‌ను ప్రజలు నిండుమనసుతో ఆశీర్వదించాలని కోరారు. రైతులకు సాగునీటిని అందించి శాశ్వతంగా బాధల నుంచి విముక్తి చేయాలన్న సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు ప్రజలంతా అండగా నిలవాల్సిన అవసరముందని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. రైతులను అప్పుల ఊబి నుంచి బయట పడేసేందుకు వచ్చే వానకాలం సీజన్ నుంచి రెండు పంటలకు ఎకరాకు రూ.8వేల పెట్టుబడిని అందిస్తామని చెప్పారు. ఆర్డీఎస్ రైతులకు జరుగుతున్న అన్యాయంపై నాటి ఉద్యమనేతగా 2002 జూలై 23న కేసీఆర్ ఐదురోజులపాటు చేపట్టిన పాదయాత్ర ఫలితమే నేటి తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం స్వరూపమని తెలిపారు. దశాబ్దాలుగా నీటికోసం వేచిచూస్తున్న ఆర్డీఎస్ రైతులకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ఏడు నెలల్లో పూర్తిచేసి వానకాలంనాటికి నీళ్లందిస్తామని ప్రకటించారు. సమైక్య రాష్ట్రంలో సాగునీటిపరంగా తెలంగాణకు జరిగిన అన్యాయానికి ఆర్డీఎస్ నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం తుమ్మిళ్లలో రూ.783 కోట్ల రూపాయలతో చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం మొదటిదశ పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. అంతకుముందు వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలో నిర్మితమవుతున్న ఏదుల రిజర్వాయర్ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా తుమ్మిళ్ల వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఆర్డీఎస్ పరిధిలోని 87,500 ఎకరాలకు కచ్చితంగా సాగునీరందించి తీరుతామని స్పష్టంచేశారు. ఆర్డీఎస్ నుంచి 17.09 టీఎంసీల నీటి కేటాయింపులున్నా కేవలం ఐదు టీఎంసీలు కూడా సమైక్యపాలకులు పారించలేదని విమర్శించారు. ఆర్డీఎస్ గురించి ఇటీవలే కర్ణాటక ప్రభుత్వంతోనూ చర్చించామని, పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తిచేసేందుకు కర్ణాటక ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు గతంలో పదేండ్లపాటు తమ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల పనులు చేశామని చెప్పినా ఏ ఒక్క ప్రాజెక్టు నుంచి కూడా చుక్కనీరు పారించలేదని ఎద్దేవా చేశారు. ఇందుకు ఉమ్మడి పాలమూరులోని ఎంజీకేఎల్‌ఐ, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలే నిదర్శనమని వివరించారు.

ప్రతి ఎకరాకు సాగునీరు రాష్ట్రంలోని ప్రతి ఎకరానికీ సాగునీరందించాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేస్తున్నామని తెలిపారు. తుమ్మిళ్ల ఎత్తిపోతలను కేవలం ఏడు నెలల్లోనే పూర్తిచేసి చూపిస్తామని పేర్కొన్నారు. వచ్చే వానకాలం నాటికి తుమ్మిళ్ల ద్వారా సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన విడుతలవారీ కరంటు.. రైతులకు చుక్కలు చూయించిందన్నారు. నేడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంతరాయంగా త్రీఫేస్ కరంటును అందిస్తూ, దేశంలోనే రాష్ర్టాన్ని అభివృద్ధిలో నంబర్‌వన్‌గా నిలిపిందని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ఏదుల రిజర్వాయర్ పనులు వచ్చే నెలాఖరుకల్లా పనులు పూర్తి అవుతున్నాయని.. వచ్చే సీజన్‌లో ఈ రిజర్వాయర్‌లో సాగునీటిని నిలువ చేసి ఉమ్మడి పాలమూరు సాగుబడులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, ఇక్కడి కాంగ్రెస్ నాయకులు కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నాలు చేయడం పాలమూరు రైతుల దురదృష్టకరమని వెల్లడించారు. రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న వారికి పూర్తి స్థాయిలో ఇండ్లు నిర్మించి ఇస్తామని భరోసా ఇచ్చారు.

ఇన్నాళ్లు ఏం చేశారు: మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టుల్లో 90శాతం పనులు పూర్తయ్యాయని చెప్పుకొంటున్న నేతలు అధికారంలో ఉన్నప్పుడు సాగునీటిని ఎందుకు పారించలేదని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులతో పచ్చబడ్డ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని తెలిపారు. వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి  మాట్లాడుతూ తుమ్మిళ్ల ద్వారా ఆర్డీఎస్ రైతుల కష్టాలు గట్టెక్కుతున్నాయని తెలిపారు. నడిగడ్డ రైతుల కష్టాలను స్వయంగా చూసిన సీఎం కేసీఆర్ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత రైతులకు గొప్ప మేలు చేశారని పేర్కొన్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు చొరవ కారణంగా తుమ్మిళ్ల పనులు వేగవంతంగా పూర్తి అవుతాయని చెప్పారు. ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించి దశాబ్దాల తరబడి పనులు చేస్తే.. నేడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన రోజే ప్రాజెక్టును ఎప్పుడు ప్రారంభిస్తామో చెప్పడం సీఎం కేసీఆర్ ఘనత అని అభివర్ణించారు. ఆర్డీఎస్‌కు చివరలోని తాండ్రపాడు, సింధనూరులతో పాటు మరో 8 గ్రామాలకు జనవరిలో నీటి ఇబ్బందులున్నాయని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లగా, నెట్టెంపాడు ద్వారా అదనపు వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారని వివరించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ హయాంలోనే సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ మందా జగన్నాథం అధ్యక్షత వహించగా, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మార్కెట్ చైర్మన్లు విష్ణువర్దన్‌రెడ్డి, బండ్ల విజయలక్ష్మి, టీఆర్‌ఎస్ నాయకులు కృష్ణమోహన్‌రెడ్డి, మంద శ్రీనాథ్, గట్టు తిమ్మప్పపాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.