Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రచార హోరు.. టీఆర్‌ఎస్ జోరు..

గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న గులాబీ దళాలు
ప్రభుత్వం చేపట్టిన పథకాలను గడపగడపకూ వివరిస్తూ ప్రచారం
కూటమి పార్టీల తీరుపై ఆగ్రహం.. ఓటుతో బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి
మళ్లీ ఆశీర్వదిస్తే అండగా ఉంటామని టీఆర్‌ఎస్ అభ్యర్థుల భరోసా

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో గులాబీ పార్టీ అభ్యర్థులు ప్ర చారంలో జోరు పెంచారు. నియోజకవర్గాల్లోని గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ నాలుగున్నరేండ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృ ద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ వివరి స్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మహాకూటమి రూ పంలో వస్తున్న మాయాకూటమిని నమ్మి మోసపోవద్దని, సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలకు వివరిస్తున్నారు. శనివారం బాన్సువాడ టీఆర్‌ఎ స్ అభ్యర్థి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కోటగిరి మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులందరికీ డబుల్‌బెడ్‌రూం ఇండ్లు క ట్టిస్తామని, ఒకే విడుతలో రూ. లక్ష పంట రు ణాన్ని మాఫీ చేస్తామని చెప్పారు. ఈ సందర్భం గా ఎన్నికల ఖర్చు కోసం మంత్రికి పలు సంఘా లు విరాళాలు అందజేశాయి. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మరోసారి ఆదరించాలని జడ్చర్ల టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి లకా్ష్మరెడ్డి కోరారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఉమ్మడి మిడ్జిల్, ఊర్కొండ మండలా ల్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభు త్వం రావాలని, సీఎం కేసీఆర్ మరోసారి అధికారం చేపట్టేలా ప్రజలు ఆశీర్వదించాలని కోరా రు. ఉద్యమించి సాధించుకున్న రాష్ట్రం సుభిక్షం గా ఉండాలంటే కేసీఆరే సీఎం కావాలని నిర్మల్ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నిర్మల్ మండలంలోని పలుగ్రామా ల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడానికి ఆం ధ్రాబాబు చంద్రబాబుతో కలిసి కూటమి ప్రజ ల ముందుకు వస్తున్నదని, వారి మాటలు నమ్మవద్దని హితవు పలికారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో..

భూపాలపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి, స్పీకర్ మధుసూదనాచారి వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలంలో ప్రచారం చేశారు. తెలంగాణ సర్కార్ అమలుచేస్తున్న పథకాలను కాంగ్రెస్ పా లిత రాష్ర్టాల్లో ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. మహాకూటమి మాటలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. స్టేషన్‌ఘన్‌పూర్ అ భ్యర్థి తాటికొండ రాజయ్య లింగాలఘనపురం మండలం పటేలుగూడెంలో ఇంటింటికి వెళ్లి ఓ ట్లను అభ్యర్థించారు. జుక్కల్ అభ్యర్థి హన్మంత్‌షిండే మద్నూర్ మండలంలో ప్రచారం చేశారు. మహబూబ్‌నగర్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ బొక్కలగడ్డ, జెమిస్తాపూర్‌లో, నారాయణపేట అభ్యర్థి రాజేందర్‌రెడ్డి పేట మండలంలో, వనపర్తి అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అడ్డాకుల, పెద్దమందడి మండలాల్లో ప్రచారం చేశారు. నాగర్‌కర్నూల్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో, అచ్చంపేట అభ్యర్థి గువ్వల బాలరాజ్ బల్మూరు, అమ్రాబాద్, లింగాల మండలాల్లో ప్రచారం నిర్వహించారు.

నల్లగొండ జిల్లాలో..
నల్లగొండ టీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డితో కలిసి తిప్పర్తి మండలంలో, మిర్యాలగూడ అభ్య ర్థి నల్లమోతు భాస్కర్‌రావు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి పట్టణంలో, మునుగోడు అభ్య ర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నాంపల్లిలో, వేము ల వీరేశం నకిరేకల్ పట్టణంలో, సాగర్ అభ్యర్థి నోముల నర్సింహయ్య ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. దేవరకొం డ అభ్యర్థి రవీంద్రకుమార్ నేరేడుగొమ్మ మండలంలో విస్తృతంగా పర్యటించారు. హుజూర్‌నగర్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి హుజూర్‌నగర్, గరిడేపల్లి మండలాల్లో, తుంగతుర్తి అభ్యర్థి గాద రి కిశోర్ నాగారం మండలంలో, కోదాడ అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్ అనంతగిరి మండలంలో ప్రచారం చేపట్టారు.

కరీంనగర్ జిల్లాలో..
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అభ్యర్థి, మంత్రి ఈటల రాజేందర్ గెలుపును కాంక్షిస్తూ ఆయన సతీమణి జమున వీణవంకలో, కరీంనగర్ అ భ్యర్థి గంగుల కమలాకర్ గెలుపును అభ్యర్థిస్తూ ఆయన సతీమణి రజిత తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్‌లో ప్రచారం చేశారు. హుస్నాబాద్ అభ్యర్థి వొడితల సతీశ్‌కుమార్‌ను గెలిపించాలని కోరు తూ హుస్నాబాద్, అక్కన్నపేటలో కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ సతీమణి డాక్టర్ మాధవి, ఎమ్మెల్సీ నారదాసు సతీమణి హర్ష, జెడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ ప్రచారంలో పాల్గొన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కొత్తగూడెం అభ్యర్థి జలగం వెంకట్రావ్, రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి నూకల నరేశ్‌రెడ్డితో కలిసి మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయని తెలిపారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని కాంగ్రెస్ నా యకులు అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ఆ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగానే మైండ్‌గే మ్ ఆడుతున్నారన్నారు. ఖమ్మం టీఆర్‌ఎస్ అభ్యర్థి అజయ్‌కుమార్ నగరంలో, మధిర అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి నియోజకవర్గంలో, సత్తుపల్లి అభ్యర్థి పిడమర్తి రవి కల్లూరు మండలంలో, వైరా అభ్యర్థి మదన్‌లాల్ కారేపల్లి మండలంలో, ఇల్లెందు అభ్యర్థి కోరం కనకయ్య కామేపల్లి మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

కూటమికి బుద్ధి చెప్పాలి: మంత్రి జూపల్లి

నాలుగున్నరేండ్ల టీఆర్‌ఎస్ పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందిందని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కొల్లాపూర్ మండలం చుక్కాయపల్లిలో జూపల్లి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ర్టాభివృద్ధిని చూసి ఓర్వలేని పార్టీలు కూటమి రూపంలో ముందుకు వస్తున్నాయన్నారు. మాయాకూటమి మాటలు నమ్మకుండా వాటిని మట్టి కరిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి నిరోధక పార్టీలుగా మారిన కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పాలని కోరారు.

సస్యశ్యామలంగా కరువు మండలాలు: మంత్రి తుమ్మల

తిరుమలాయపాలెం: కోనసీమ కంటే పాలేరు నియోజకవర్గమే మిన్నగా మారింద ని పాలేరు టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరువు ప్రాంతాలైన తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాల్లోని గ్రామాల్లో పచ్చని పైర్లను చూస్తుంటే గుండె నిండిపోతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆ ర్ సహకారంతో చేపట్టిన భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతాల్లో బీడు భూములు సస్యశ్యామలంగా మారాయన్నారు. పాలేరును ఎంతో అభివృద్ధి చేశానని, మళ్లీ ఆదరించి భారీమెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రా ప్రయోజనాలనే సోనియా వల్లెవేశారు: ఎంపీ కొత్త

మేడ్చల్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో ఆంధ్రా ప్రయోజనా ల గురించి సోనియా మాట్లాడినా.. కూటమి నాయకులు ఎందుకు నోరు మెదపలేదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డితో కలిసి మీ డియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని మరిచిపోయిన సోనియాగాంధీ పూర్తిగా ఏపీ ప్రయోజనాల గురించే మాట్లాడారన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణలో పరిశ్రమలు మూతపడుతాయని, ఉపాధి అవకాశాలు పోతాయని కూటమి నాయకులకు తెల్వదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో అనేక పథకాలు ప్రవేశపెట్టారని అవన్నీ సోనియా దృష్టికి రాకపోవడం విచారకరమన్నారు. గజ్వేల్ కూటమి అభ్యర్థి ప్రతాప్‌రెడ్డికి గత ఎన్నికల్లో జరిగిన పరాభవమే ఈ సారి ఎదురవుతుందన్నారు.

సీఎం కేసీఆర్ తల్లిదండ్రుల పాత్రలు పోషించారు: ఎంపీ గుత్తా

సీఎం కేసీఆర్ తల్లిదండ్రుల పాత్రలు పోషించి అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ర్టాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దారని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మిర్యాలగూడలోని తన నివాసంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. మేడ్చల్‌లో జరిగిన కాంగ్రెస్ బహిరంగసభలో నేతలు సోనియాతో తప్పుడు స్క్రిప్ట్ చదివించారని, పరిస్థితులకు భిన్నంగా మాట్లాడటం ఆ పార్టీనేతల దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. 60 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో తెలంగాణ నిధులు, వనరులు దోపిడీకి గురయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణకు అన్యాయం చేసిన టీడీపీ నాయకులతో కోదండరాం వేదికలు పంచుకోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని సమాధి చేస్తారో ఎదురుచూడు అంటూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

సోనియా తెలంగాణ ప్రజలను అవమానపర్చారు

డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
సుబేదారి(వరంగల్ అర్బన్)/పరకాల, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని మేడ్చల్ సభలో సోనియాగాంధీ ప్రకటించడం ఇక్కడి ప్రజలను అవమానించడమేనని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండ సుబేదారి ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల మైదానంలో, పరకాలలో సోమవారం జరిగే సీఎం బహిరంగ సభల ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ నాన్చుడు ధోరణి అవలంబించడం వల్లే 1200 మంది తెలంగాణ బిడ్డలు అమరులయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ హోదా గురించి సోనియాకు వివరించడంలో ఆ పార్టీ నాయకు లు విఫలమయ్యారని ఆరోపించారు. మేడ్చల్ కాంగ్రెస్ సభలో కుర్చీలు దూరంగా వేసి ప్రజలు భారీగా హాజరయ్యారని చూపించారని ఎద్దేవా చేశారు.

మాయాకూటమిని ఓడించండి: మంత్రి ఈటల

కమలాపూర్: కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే వారు పాలిస్తున్న రాష్ర్టాల్లో 24 గంటల నిరంతర విద్యుత్ అందించాలని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ టీఆర్‌ఎస్ అ భ్యర్థి, మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. శనివారం వరంగల్ అర్బన్ జి ల్లా కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి, గోపాల్‌పూర్, శనిగరం, మాధన్నపేట తదితర గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలు 60 ఏండ్లు పాలించి తెలంగాణ రాష్ర్టాన్ని కరువుకు నిలయంగా మార్చాయని మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీలే ప్రాజెక్టులకు అడ్డుపడ్డాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పడి, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కార్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. మాయమాటలతో వస్తున్న కూటమిని ఓడించాలని, కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలకు సూచించారు.

చంద్రబాబు ఎత్తుగడ ఫలించింది: మంత్రి జగదీశ్‌రెడ్డి

మేడ్చల్‌లో జరిగిన సోనియాగాంధీ సభతో చంద్రబాబు ఎత్తుగడ ఫలించిందని, ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరిగిందని సూర్యాపేట టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో ఆంధ్రాలో జరుగనున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపుకోసం తెలంగాణ కాంగ్రెస్‌ను చంద్రబాబు తన విషకౌగిలిలో బంధించారన్నారు. ఇంత జరుగుతున్నా బాబును ఎత్తుకుని ఊరేగుతున్న కాంగ్రెస్ నేతలకు అసలు పౌరుషం ఉందా? అని ప్రశ్నించారు. ప్రచార సభలో బాబు పంపిన స్క్రిప్ట్‌ను చదవడం, ప్రత్యేక హోదా గురించి సోనియాగాంధీ ప్రస్తావించడంతో వేదిక మీద ఉన్న కాంగ్రెస్ నాయకులే అవాక్కయ్యారని చెప్పారు. కాంగ్రెస్‌లో సత్తాఉన్న నాయకులే లేరని, జిల్లాను కూడా సక్రమంగా నడిపించగల నాయకత్వమే లేదని ఎద్దేవా చేశారు.

టీఆర్‌ఎస్‌తోనే కులవృత్తులకు పూర్వవైభవం

మంత్రి జోగు రామన్న
నాలుగున్నరేండ్ల టీఆర్‌ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చారని ఆదిలాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం బేల మండలం సాంగిడి, బెదోడ, మాగ్లూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవృత్తులపై ఆధారపడిన వారి ఉపాధి మెరుగుపర్చేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేసిందన్నారు. ప్రజలు కూటమి నాయకుల మాట లు నమ్మే పరిస్థితిలో లేరని, టీఆర్‌ఎస్‌కు ఓటేసేందుకు నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు. భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.