-నియోజకవర్గాల్లో జోరుగా టీఆర్ఎస్ అభ్యర్థుల పర్యటనలు
-ప్రభుత్వ పథకాలతో ముందుకు..
-ఆశీర్వాదాలు.. ఆత్మీయ సమావేశాలలో టీఆర్ఎస్కు వివిధవర్గాల మద్దతు
ప్రభుత్వం చేసిన అభివృద్ధే నినాదంగా.. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే శ్రీరామరక్షగా.. టీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ప్రజలు సైతం గులాబీ అభ్యర్థులకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ.. నేడు అదే పార్టీతో పొత్తుపెట్టుకోవడం అనైతికమని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అభ్యర్థి, మంత్రి ఈటల రాజేందర్ పలు ఆశీర్వాదసభల్లో పాల్గొన్నారు. అన్నివర్గాలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని, నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ అభ్యర్థి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని విశ్వబ్రాహ్మణ సంఘం, ముదిరాజ్ సంఘ నాయకులు కలిసి మద్దతు ప్రకటించారు.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి లకా్ష్మరెడ్డి.. సీఎం కేసీఆర్ చెప్పినట్టు వంద స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలో జరిగిన ధూంధాంలో పాల్గొన్న మంత్రి జూపల్లి.. మహాకూటమి నేతల మాయ మాటలను ప్రజలు విశ్వసించబోరన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. కూటమి పేరుతో ప్రజల ముందుకు వస్తున్నవారి ముక్కుదూలాలు పగులగొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా లక్ష్మీతండా, రాజునాయక్ తండావాసులు మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిసి ప్రభుత్వం నుంచి ఎంతో లబ్ధిపొందామని ఆనందం వ్యక్తంచేశారు. టీఆర్ఎస్కు మద్దతుగా ఉంటామని చెప్పారు. ఆదిలాబాద్ పట్టణంలో మంత్రి జోగు రామన్న, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బౌద్ధనగర్ డివిజన్లో మంత్రి పద్మారావు, రాజేంద్రనగర్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. అన్నివర్గాల ప్రజలను క లుస్తూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్ర భుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ వివరిస్తున్నారు. ఆదివారం ఆదిలాబాద్ అభ్యర్థి, మంత్రి జోగు రామన్న పట్టణంలోని షాద్‌నగర్, రాంనగర్లో ప్రచారం చే శారు. అభివృద్ధికి ఆటంకంగా మారిన కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని ప్రజలను కోరారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ అభ్యర్థి బా ల్క సుమన్, ప్రభుత్వ సలహాదారు గడ్డం వివేక్ తో కలిసి క్యాతనపల్లి, రామకృష్ణాపూర్లో ఇం టింటా ప్రచారం చేశారు. దొంగ కూటమిని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజల కు సూచించారు. ఈ సందర్భంగా నాగార్జున కా లనీకి చెందిన మాసుపెద్ది అంజలీదేవి ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ. 5,016 అంజేశారు.

డప్పుకొట్టి.. ప్రచారం చేసి. మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్, జడ్చర్ల మం డలాల్లో మంత్రి లకా్ష్మరెడ్డి విస్తృతంగా పర్యటించారు. డప్పు కొట్టి ప్రచారం చేశారు. జిల్లా కేం ద్రంలో శ్రీనివాస్‌గౌడ్ పలు వార్డుల్లో ప్రచారం చేశారు. కోయిలకొండ, ధన్వాడ మండలాల్లో నారాయణపేట అభ్యర్థి రాజేందర్‌రెడ్డి, మక్తల్ ని యోజకవర్గంలో చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆయ న సతీమణి సుచరిత, కుమారుడు చాణక్యరెడ్డి ప్రచారం చేశారు. దేవరకద్ర అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి మద్దతుగా కార్యకర్తలు ప్రచారం చే శారు. కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ శా తవాహన యూనివర్సిటీలో వాకర్స్‌ను కలిసి ప్ర చారం చేశారు. నగరంలో జరిగిన పలు ఆశీర్వా ద సభల్లో పాల్గొన్నారు. కొత్తపల్లి మండలం క మాన్పూర్ గ్రామస్థులు గంగుల గెలుపును కాం క్షిస్తూ వేములవాడకు పాదయాత్ర చేపట్టారు.
జెండా పండుగలో.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన జెండా పండుగకు రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు హాజరయ్యారు. గంభీరావుపేట మండలం మ ల్లుపల్లి గ్రామస్థులు, ఎల్లారెడ్డిపేట మండలం రా జన్నపేట ముదిరాజ్‌లు, వనపల్లిలో బీసీ సం ఘం సభ్యులు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించా రు. వేములవాడ మండలం తిప్పాపూర్‌లో అ భ్యర్థి రమేశ్‌బాబు విస్తృత ప్రచారం చేశారు. మానకొండూర్ అభ్యర్థి రసమయి బాలకిషన్ ఇల్లంతకుంటలో జరిగిన దళిత గర్జన సభలో పా ల్గొన్నారు. కెల్లేడులో ఇంటింటా ప్రచారం చేశా రు. చొప్పదండి మండలంలో టీఆర్ఎస్ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్ ప్రచారం చేశారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఆర్ఎంపీ, పీఎంపీ ఆధ్వర్యంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆశీర్వాదసభలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి తేజావత్ రాంచంద్రునాయక్ పా ల్గొన్నారు.
వరంగల్‌లో దాస్యం.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ నగరంలోని 47, 48, 49, 51 డివిజన్లలో ప్రజాఆశీర్వాద యాత్ర పేరుతో ఇం టింటి ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అభ్యర్థి డీఎస్ రెడ్యానాయ క్ కురవి మండలంలో ప్రచారం చేశారు. మహబూబాబాద్ అభ్యర్థి బానోత్ శంకర్‌నాయక్ పట్టణంలో బస్తీబాట నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ప్ర చారం చేశారు. స్టేషన్ ఘన్పూర్ అభ్యర్థి తాటికొండ రాజయ్య జనగామ జిల్లా చిల్పూరు మం డలంలో ప్రచారం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి అభ్యర్థి, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి ఆటోడ్రైవర్లు, ఓనర్ల యూనియన్ మద్దతు ప్రకటించారు. 350 ఆటోలతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిరికొండ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూసుమంచి మండలంలో ప్రచారం చేశారు. ఖ మ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ నగరంలోని 31వ డివిజన్లో ప్రచారం చేశారు. మధిర అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ మధిర పట్టణంలో, సత్తుపల్లి అభ్యర్థి పిడమర్తి రవి సత్తుపల్లి పట్టణంలో ప్రచారం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంజయ్‌నగర్‌లో కొత్తగూడెం అభ్యర్థి జల గం వెంకట్రావ్, టేకులపల్లి మండలం మద్రాసుతండాలో ఇల్లెందు టీఆర్ఎస్ అభ్యర్థి కోరం కనకయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

నిజామాబాద్‌లో.. నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తా అసద్‌బాబానగర్ రాజీవ్ స్వగృహ కాలనీలో ప్ర చారం చేశారు. మైనార్టీలు ఏర్పాటుచేసిన సభ లో పాల్గొని టీఆర్ఎస్కు ఓటేయాలని అభ్యర్థించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ అభ్యర్థి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని బాన్సువాడ విశ్వబ్రాహ్మణ సంఘంనాయకలు, ముదిరాజ్ లు కలిసి మద్దతు ప్రకటించారు. జుక్కల్ అభ్యర్థి హన్మంత్‌షిండే బిచ్కుంద మండలంలో ప్రచా రం చేశారు. నల్లగొండ జిల్లా దేవరకొండ అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్ చింతపల్లి మండలం లో, మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో కలిసి మర్రిగూడ, లెంకలపల్లిలో, నకిరేకల్ అభ్యర్థి వేముల వీరేశం నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లి మండలా ల్లో, కంచర్ల భూపాల్‌రెడ్డి నల్లగొండ పట్టణంలో, మిర్యాలగూడ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు అడవిదేవులపల్లి మండలంలో ప్రచారం చేశారు. భువనగిరిలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బహర్పేట, హౌసింగ్‌బోర్డు కాలనీలో ప్రచారం చేశారు. రాజాపేటలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మే డ్చల్ జిల్లా శేరిలింగంపల్లి దివ్యాంగుల పట్టణ స మాఖ్య ఆధ్వర్యంలో చందానగర్‌లో జరిగిన స మావేశానికి టీఆర్ఎస్ అభ్యర్థి అరెకపూడి గాంధీ హాజరయ్యారు. వికారాబాద్ జిల్లా తాండూరులో టీఎస్‌జేఏసీ, ఓయూజేఏసీ నాయకులు నియోజకవర్గంలోని విద్యార్థి సంఘాల నేతలతో సమావేశమయ్యాయరు.
పొత్తు అనైతికం: డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్, టీడీపీల పొత్తు అనైతికమని డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ ధ్వజమెత్తారు. మెదక్‌లో ఆదివారం జరిగిన మైనార్టీల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి క్యాం పు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ని స్థాపించారని.. నేడు అదే తెలుగుదేశం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం విడ్డూరంగా ఉన్నదని ధ్వజమెత్తారు. తెలంగాణ ద్రోహులు మళ్లీ మోసం చేసేందుకు కూటమితో ముందుకు వస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, మైనార్టీల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. రైతుబంధు, రైతుబీమా, భూరికార్డుల ప్రక్షాళన ముఖ్యమంత్రి ధైర్యానికి నిదర్శనాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

నిరుపేదల సంక్షేమమే టీఆర్ఎస్ ధ్యేయం: మంత్రి ఈటల హుజూరాబాద్, నమస్తే తెలంగాణ/జమ్మికుంట: నిరుపేదల సంక్షేమమే టీ ఆర్ఎస్ ధ్యేయమని హుజూరాబాద్ అభ్యర్థి, మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో సింధు కళాకారులు, తోకలపల్లిలో కుమ్మరి, దళి త, పద్మశాలీ, జమ్మికుంటలో గొల్ల కురుమ, యాదవ, పట్టణ ఫొటోగ్రాఫర్ల సంఘాల ఆధ్వర్యంలో ఆశీర్వా ద సభలు జరిగాయి. ఆయా కార్యక్రమాలకు హాజరైన మంత్రి మాట్లాడుతూ.. కాలగర్భంలో కలిసిపోతున్న కులవృత్తులను ఆదుకునేందుకు తగిన సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే చాలా కులాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో సహాయం చేసిందని, మిగతా కులాలకు కూడా రాబోయే రోజుల్లో చేయూతనందిస్తామని చెప్పారు. ఐదుసార్లు గెలిపించిన్రు. మరోసారి మీ రుణం తీర్చుకుండా. గుండె నిండా ఆశీర్వదించండి. ఆత్మగౌరవంతో పనిచేస్తా. మానుకోట ఉద్యమ ద్రోహులను దరికి రానీయకండి. అని మంత్రి ఉద్వేగంగా మాట్లాడారు. వచ్చే ఏడాదినుంచి కరువంటే ఏమిటో తెలియకుండా చేస్తామని పేర్కొన్నారు. గులాబీ పార్టీని ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మోసపూరిత మాటలు నమ్మొద్దు: మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట రూరల్: ఎన్నికల సమయంలో వివిధ పార్టీల నేతలు ప్రలోభాలకు గురిచేస్తారని, వారి మోసపూరిత మాట లు నమ్మవద్దని మంత్రి జగదీశ్‌రెడ్డి సూచించారు. ఆదివారం సూర్యాపేట మండల పరిధిలోని లక్ష్మీతండాలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భం గా లక్ష్మీతండా, రాజునాయక్తండావాసులు మంత్రి వద్దకు వచ్చి ప్రభుత్వం ద్వారా తాము పొందిన లబ్ధిని వివరించి ఆనందం వ్యక్తం చేశారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందడంతో తామంతా సంతోషంగా ఉన్నామని వెల్లడించారు. దాదాపు 500 మంది గ్రామస్థులు రావడంతో అక్కడికక్కడే రచ్చబండ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాయాకూటముల రూపంలో మహామాయగాళ్లు వస్తున్నారని, వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. ఈ సందర్భంగా రెండుతండాలకు చెందిన వారు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించి మంత్రి జగదీశ్‌రెడ్డిని సన్మానించారు.
ఎన్నికలు ఏకపక్షమే: మంత్రి లకా్ష్మరెడ్డి మంత్రి లకా్ష్మరెడ్డి ధీమా వ్యక్తంచేశారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టుగా వందస్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమన్నారు. అధికారం కోసం మహాకూటమి నాయకులు దొంగనాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణపై పెత్తనం కోసం చంద్రబాబు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మహాకూటమికి ప్రతిపక్ష స్థానం దక్కడం కూడా అనుమానంగా ఉన్నదన్నారు.
సీఎం కేసీఆర్ మొనగాడు: మంత్రి తలసాని అమీర్‌పేట్/మణికొండ: రైతుల కోసం ఆలోచించి నిరంతర విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలుచేసిన ఏకైక మొనగాడు సీఎం కేసీఆర్ అని మంత్రి త లసాని శ్రీనివాస్‌యాదవ్ కొనియాడారు. గ్రేటర్ పరిధిలోని రాజేంద్రనగర్, సనత్ నగర్ నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ .. తెలంగాణ సిద్ధించాక కేసీఆర్ సీఎం అయ్యాకే ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందన్నారు. సిద్ధాంతాలు లేని మహాకూటమి నాయకులు కొత్త బిచ్చగాళ్లలా వస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ మహాకూటమిగా జట్టు కట్టడం సిగ్గుచేటన్నారు. ఆ మహాముఠాకు ఏపీ సీఎం చంద్రబాబు నాయకుడు కావడం వారి అధికార దాహానికి నిదర్శనమని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు శ్రేణులు కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు.

అన్నివర్గాలకు సమాన ప్రాధాన్యం: మంత్రి తుమ్మల వైరా, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్ నాలుగేండ్ల హయాంలో అన్నివర్గాలకు సమ ప్రాధాన్యం దక్కిందని, ముఖ్యమంత్రి అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలోని కమ్మవారి కల్యాణ మండలంలో ఆదివారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా ఉండి మహాకూటమి పేరుతో వస్తున్న మాయాకూటమి ముక్కుదూలాలు పగులగొట్టాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వైరా అభ్యర్థి బానోత్ మదన్‌లాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు కుయుక్తులతోనే కూటమి ఏర్పాటు: మంత్రి జూపల్లి చిన్నంబావి: చంద్రబాబు కుయుక్తులతోనే మహాకూటమి ఏర్పడిందని, కూటమికి ఓటేస్తే ఆంధ్రోళ్ల చేతుల్లోకి అధికారం వెళుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అ న్నారు. ఆదివారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలోని రత్నగిరి కాలనీలో ఏర్పాటుచేసిన ధూంధాం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న చంద్రబాబుతో కాం గ్రెస్, టీజేఎస్ పొత్తుపెట్టుకోవడం ప్రజలను కించపరచడమేనన్నారు. 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు రాష్ర్టాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఓర్వలేకనే టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నదని, ప్రజలు ఆ పార్టీ నాయకుల మాటలు నమ్మబోరన్నారు. మహాకూటమి నేతలు ఎన్ని మాయమాటలు చెప్పినా.. ప్రజలు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ వైవే ఉన్నారని ధీమా వ్యక్తంచేశారు.
అభివృద్ధిని చూసి పట్టంకట్టండి: మంత్రి పద్మారావు

సికింద్రాబాద్/సీతాఫల్మండి: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంచేసిన అభివృద్ధిని చూసి పట్టం కట్టాలని సికింద్రాబాద్ అభ్యర్థి, మంత్రి పద్మారావు ప్రజలకు సూచిం చారు. బౌద్ధనగర్ డివిజన్ పార్సీగుట్టలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో ఆ యన మాట్లాడుతూ.. సీమాంధ్ర పాలకుల హయాంలో మట్టిని నమ్ముకున్న రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే.. తెలంగాణలో అదే రైతులు ఇప్పుడు ఆస్తులు కూడబెడుతున్నారన్నారు. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీతో కాంగ్రెస్ చేతులు కలిపి తెలంగాణపై విషం చిమ్మడానికి కూటమిగా ఏర్పడ్డాయని దుయ్యబట్టారు. ప్రజలే ఆ కూటమికి బుద్ధి చెప్పాలని సూచించారు. సీఎం కేసీఆర్ సారధ్యంలోనే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి, కూటమి అభ్యర్థులను పారదోలాలన్నారు.